టెక్కీలు ఇవిచేస్తే.. 50 శాతం ఎక్కువ జీతం
టెక్కీలు ఇవిచేస్తే.. 50 శాతం ఎక్కువ జీతం
Published Mon, Apr 10 2017 12:54 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
బెంగళూరు : టెక్ ఇండస్ట్రీలో ఓ వైపు నుంచి ట్రంప్ షాక్ లు.. మరోవైపు ఆటోమేషన్ ముప్పు అసలు ఉద్యోగాలు వస్తాయో ఊడతాయో అర్థంకాని పరిస్థితుల్లో ఉద్యోగులు సతమతమవుతున్నారు. కానీ కొన్ని స్కిల్స్ ను నేర్చుకున్న టెక్కీలకు ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ ఉంటుందట. డేటా విజులైజేషన్, డేటా సైన్సు, మిషన్ లెర్నింగ్ ప్రస్తుతం అత్యంత విలువైన టెక్నాలజీ రిక్రూటర్లుగా ఉన్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ డేటా ఎక్కువగా జనరేట్ అవుతున్న క్రమంలో ఈ స్కిల్స్ నేర్చుకున్న టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. చాలామంది వర్కింగ్ ప్రొఫిషనల్స్ కూడా ఈ స్పెషల్ కోర్సులను నేర్చుకుంటున్నారని తెలిసింది.
ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి 20 శాతం నుంచి 50 శాతం మధ్యలో వేతనాల పెంపు కూడా ఉంటుందని ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ సింప్లిలెర్న్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసిక్ దలాల్ చెప్పారు. గత మూడేళ్లుగా బిగ్ డేటా, అనాలిటిక్స్ కోర్సులకు మంచి వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. డేటా సైన్సు కూడా ఎక్కడా తగ్గకుండా పాపులర్ చెందుతుందని తెలిపారు. గత ఆరునెలలుగా మిషన్ లెర్నింగ్, విజులైజేషన్ టూల్స్ కోర్సులు అత్యంత ఆకర్షణీయమైనవిగా ఉన్నాయని చెప్పారు. 25 శాతం సింప్లిలెర్న్ అప్లికెంట్లు మిషన్ లెర్నింగ్ ను ఎంపికచేసుకున్నారని వెల్లడించారు. కాగ ఈ కోర్సుల వ్యవధి 4 నుంచి 9 నెలలు. మొత్తం ఈ కోర్సులకు అయ్యే ఖర్చు ఒక్కో మోడ్యుల్ బట్టి రూ.25వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిసింది.
Advertisement
Advertisement