టెక్కీ.. వెయిటెక్కీ | Chinese woman gains 20 kgs in one year because of work | Sakshi
Sakshi News home page

టెక్కీ.. వెయిటెక్కీ

Published Sun, Sep 15 2024 5:56 AM | Last Updated on Sun, Sep 15 2024 5:56 AM

Chinese woman gains 20 kgs in one year because of work

గంటలకొద్దీ పని.. కేజీల కొద్దీ బరువు

ఎక్కువ పనివేళలు టెకీలను ఊబకాయులుగా మారుస్తున్నాయా?! అనే సందేహానికి ‘అవును’ అనే సమాధానం సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి వస్తోంది. ఈ విషయంపైన ‘చైనీస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ జియాహోంగ్షులో వా΄ోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద’ని  సౌత్‌ చైనా మార్నింగ్‌ ΄ోస్ట్‌ వెల్లడి చేసింది.   టెకీ ఉద్యోగçస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు  అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటున్నాయి.  ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచన లు ΄ాటిద్దాం..

చైనాలోని ఓయాంగ్‌ వెన్జింగ్‌ అనే 24 ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గత ఏడాది కాలంలో 20 కేజీల బరువు పెరిగిందని సౌత్‌ చైనా మార్నింగ్‌ ΄ోస్ట్‌ వెల్లడించింది. ‘నా శారీరక, మానసిక ఆరోగ్యానికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఒక విపత్తుగా మారింది. ఎక్కువ పని గంటలు, మారుతూ ఉండే షిప్ట్‌ వేళల కారణంగా ఆహారం తీసుకోవడంలో అపసవ్యత చోటు చేసుకునేది. 

దీంతో ఏడాది కాలంలో 60 కేజీల నుంచి 80 కేజీల బరువు పెరిగాను. ఇలా అయితే నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో అని జూన్‌లో ఉద్యోగం మానేశాను. అప్పటి నుంచి నా ఆరోగ్యంలో మెరుగైన మార్పులు వచ్చాయి’ అని ఇన్‌స్టాలో ΄ోస్ట్‌ చేసింది ఓయాంగ్‌. ఆమె ఇప్పుడు ఫ్రీలాన్స్‌ వెయిట్‌లాస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. తన ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, ్ర΄ోటీన్లను చేర్చుతూ 6 కిలోల బరువు తగ్గానని తెలిపింది. ఓయాంగ్‌ అనుభవం చెప్పడంతో ఆమెలాంటి వ్యక్తులు తమ పని కష్టాలను  పంచుకోవడానికి ముందుకు వచ్చారు. చైనాలోనే కాదు ఏ దేశంలోనైనా సాఫ్ట్‌వేర్‌ ప్రపంచంలో పనిచేసే టెకీలందరికీ ఇది వర్తిస్తుంది. 

మానసికమైన అలసట
 ‘పని ఒత్తిడి కారణంగా డిజర్ట్‌లను అతిగా తినడం వల్ల నెల రోజుల్లోనే 3 కిలోల బరువు పెరిగాను’ అని తన అనుభవాన్ని ఇన్‌స్టా ద్వారా పంచుకుంది మరో టెక్‌ ఉద్యోగిని 33 ఏళ్ల షాంఘై.. 

అతిగా ఆకలి
ఎక్కువ గంటలు పనిచేయడం అనేది పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ పరిస్థితి సందడిగా ఉండే నగరాల్లో ఆందోళనకరమైన ధోరణిగా మారుతోంది. వర్క్‌ షిప్ట్‌ వల్ల సరైన నిద్ర వేళలు ఉండవు. దీంతో కార్టిజోల్‌ హార్మోన్‌ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే మెలటోనిన్‌ తగ్గి΄ోతుంది. లేట్‌నైట్స్‌ మేల్కొని ఉండటం వల్ల ఆకలి పెరగడంతో ఫుడ్‌ తెప్పించుకుని తింటారు. దీంతో కదలికలు ఉండవు. ఇక వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ వచ్చాక పడుకొని వర్క్‌ చేసే వారున్నారు. దీంతో వారి శరీరంలో ఏ ఆర్గాన్‌ అయితే బలహీనంగా ఉంటుందో దానిపైన త్వరగా ప్రభావం పడుతుంది. 

తినే వేళలు సరి చేసుకోవాలి
చైనాలో పని సంస్కృతి ముఖ్యంగా టెక్‌ పరిశ్రమలో వారానికి ఆరు రోజుల ΄ాటు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. న్యూట్రిషన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ జువో జియోక్సియా హెల్త్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ ‘ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, నిద్రలేమి, ‘అధిక పని ఊబకాయానికి దారితీస్తుందని చె΄్పారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువ కూరగాయలు, తక్కువ మాంసాహారం తీసుకోవాలి. అంతేకాదు, తినే వేళలను సక్రమంగా ΄ాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి’ అని సూచిస్తోంది. ఈ సమాచారం టెకీలందరికీ వర్తిస్తుంది.

అరకేజీ ఫ్రూట్‌ –వెజ్‌ సలాడ్‌
వయసులో ఉన్నప్పుడు పని, జీతం అన్నీ బాగానే అనిపిస్తాయి. అయితే, సరైన జీవన శైలి ΄ాటించక΄ోతే నలభై దాటిన దగ్గర నుంచి ప్రతి ఐదేళ్లకు ఆరోగ్యం  దెబ్బతింటూ ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ చూస్తుంటాం. లుక్‌ కోసం అవసరం లేని కాస్మటిక్‌ ట్రీట్‌మెంట్లు చేయించుకుంటారు. లుక్‌ కాదు ఆరోగ్యమే ప్రధానమని గుర్తించాలి. పని  ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్‌ ఔషధంలా పనిచేస్తుంది. 

∙నిద్ర వేళలు సరిగ్గా చూసుకోవాలి. 6–8 గంటలు నిద్రకు కేటాయించుకోవాలి. 
∙వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. 
∙టైమ్‌కి ఆహారం తీసుకోవాలి. దీంతో΄ాటు ఫ్రూట్‌ సలాడ్, వెజ్‌ సలాడ్‌ రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల కొవ్వు పెరగదు. అతిగా ఆకలి అవడం ఉండదు. 
– డాక్టర్‌ జానకి, ΄ోషకాహార నిపుణులు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement