Simplilearn
-
బ్లాక్‌స్టోన్ చేతికి సింప్లిలెర్న్
న్యూఢిల్లీ: ఆధునిక తరం డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసే సింప్లిలెర్న్ సొల్యూషన్స్‌లో పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ విలువ 25 కోట్ల డాలర్లు(రూ. 1,860 కోట్లు)కాగా.. ఎడ్యుటెక్ కంపెనీ సింప్లిలెర్న్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన కలారి క్యాపిటల్, హెలియన్ వెంచర్ పార్ట్నర్స్, మేఫీల్డ్ ఫండ్ ఉమ్మడిగా 60 శాతం వాటాను విక్రయించనున్నాయి. అంతేకాకుండా మరో 10 శాతం వాటాను ప్రమోటర్లు, ఇతర యాజమాన్య వ్యక్తులు విక్రయించనున్నారు. వెరసి కంపెనీ విలువను 40 కోట్ల డాలర్ల(రూ. 2,976 కోట్లు)కు చేరింది. పలు కంపెనీలలో దేశీయంగా బ్లాక్స్టోన్గ్రూప్ ఇప్పటికే బైజూస్, ఆకాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అసెండ్ లెర్నింగ్, ఎల్యుషియన్ అండ్ ఆర్టిక్యులేట్లలో ఇన్వెస్ట్ చేసింది. అయితే తొలిసారి సింప్లిలెర్న్‌లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా యాజమాన్య నియంత్రణను చేపడుతోంది. కాగా.. కంపెనీ నిర్వహణ బాధ్యతను కొనసాగించనున్నట్లు సింప్లిలెర్న్ సీఈ వో కృష్ణ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. లాభాలతో.. 2010లో ప్రారంభమైన సింప్లిలెర్న్ గత నాలుగేళ్లుగా లాభాలను ఆర్జిస్తోంది. తొలి దశ నుంచి మధ్యస్థాయి వృత్తి నిపుణుల వరకూ 100 రకాల ప్రోగ్రామ్స్‌ను కంపెనీ అందిస్తోంది. తద్వారా కొత్త తరం డిజిటల్ నైపుణ్యాల మెరుగులో సహకరిస్తోంది. దీనిలో భాగంగా క్లౌడ్, డెవాప్స్, డేటా సైన్స్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ తదితర శిక్షణను సమకూర్చుతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వృత్తి నిపుణులు సింప్లిలెర్న్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంటున్నారు. పలు దేశ, విదేశీ యూనివర్శిటీలతో కంపెనీ సహకార ఒప్పందాలను కలిగి ఉంది. -
ఈ ఐటీ జాబ్స్ త్వరలో కనుమరుగు
ఆటోమేషన్ దెబ్బ ఐటీ ఇండస్ట్రీకి భారీగానే తగలబోతుంది. ఆటోమేషన్ ముప్పు, కొత్త డిజిటల్ టెక్నాలజీలోకి మరలే క్రమంలో ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంటూ పోతున్నాయి. అంతేకాక కొత్త నియామకాల జోరునూ తగ్గించి, ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అమెరికాకు చెందిన బిజినెస్ అడ్వయిజరీ సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ అంచనాల ప్రకారం ఆటోమేషన్ ప్రభావంతో దేశీయ ఐటీ వర్క్‌ఫోర్స్ 14 శాతం తగ్గిపోనుందని తెలిపింది. అంటే 2021 వరకు నలభై లక్షల మంది ఉద్యోగులు ప్రమాదంలో పడబోతున్నారట. అదేవిధంగా బీపీఓ రంగంలోని సంప్రదాయబద్ధమైన హ్యుమన్ రోల్స్, అన్ని ఐటీ ఉద్యోగాలకు సమానం ఉండవని, ఆటోమేషన్ ప్రభావంతో ఇతర రంగాలతో పోలిస్తే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎక్కువ ప్రభావితం కానుందని రీసెర్చ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాక కొన్ని ఐటీ ఉద్యోగాలు ఇక మనకు కనిపించకుండా కూడా పోతాయని తెలుస్తోంది. ఆన్లైన్ ప్రొఫిషనల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ సింప్లిలెర్న్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం వచ్చే ఐదేళ్లలో కొన్ని ఉద్యోగాలు భారీగా పడిపోతున్నాయట. అవి ఏమిటో ఓసారి చూద్దాం.. మాన్యువల్ టెస్టింగ్: దీనిలో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, క్యూఏ ఇంజనీర్, మాన్యువల్ టెస్టర్ ప్రభావితం కానున్నాయి. ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ మేనేజ్మెంట్ : సిస్టమ్ ఇంజనీర్, ఐటీ ఆపరేషన్స్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బీపీఓ : డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ సర్వీసు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్టు సిస్టమ్ మైంటెనెన్స్ : సర్వర్ మైంటెనెన్స్, మైంటెనెన్స్ ఇంజనీర్ -
ఐటీ జాబ్ పోయిందా? మీకో గుడ్‌న్యూస్
ఉద్యోగం కోల్పోయిన టెకీలకు నిజంగా ఇది శుభవార్తే ఐటీ రంగంలోనెలకొన్ని సంక్షోభం, అమెరికా వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్ వేర్ నిపుణుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఇలాంటి వారికోసం బెంగళూరుకుచెందిన సింప్లీలెర్న్ అనే ఆన్లైన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపెనీ ఇలాంటి వారికి ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది. భారతీయ ఐటీ రంగం పలు రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇండస్ట్రీ పలుసార్లు నిరంతరాయంగా ఉద్యోగాల కోత ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, వివిధ సంస్థలచే భారీగా ఉద్యోగాల తొలగింపు నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉద్యోగాలను కోల్పోయిన ఐటి ఉద్యోగులకు సహాయపడటానికి "బౌన్స్ బ్యాక్" స్కాలర్షిప్లను అందిస్తోంది. బాధిత ఐటీ నిపుణులకు సంబంధిత కోర్సులు , శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందించనుంది. తద్వారా తమని తాము రీ స్కిల్ చేసుకునేందుకు సహాయం చేస్తుంది. భారతీయ పౌరులకు మాత్రమే లభించే ఈ స్కాలర్ షిప్ లో ఆధునిక టెక్నాలజీలలో ఉచిత శిక్షణ ఇచ్చి, భవిష్యత్ ఉద్యోగాలు కోసం సిద్ధం చేస్తాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, పెద్ద డేటా మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి కోరిన డొమైన్స్‌లో అత్యుత్తమ కోర్సుల్లో ట్రైనింగ్ ఉచితం అయితే దీనికోసం దరఖాస్తు చేసుకునే నాటి 60 రోజుల లోపు ఉద్యోగాన్ని కోల్పోయిన వారై అయి వుండాలి. అలాగే ఒక అభ్యర్థి ఒక్క కోర్సును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. బౌన్స్ బ్యాక్ స్కాలర్షిప్ పరిధిలో రూ. 8,999 నుండి రూ. 20వేల విలువైన కోర్సులను ఉచితంగా అందించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 31 కి ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఆటోమేషన్, ఆధునిక టెక్నాలజీ తదితర అంశాల కారణంగా సంస్థల వ్యాపారం, ఉద్యోగాల ఎంపిక వ్యూహాలను అనివార్యంగా మార్చుకోవాల్సి వస్తోందని , ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్హులైన అభ్యర్థులను ఆదు కోవడమే తమ లక్ష్యమని సింప్లీలెర్న్ సీఈవో కృష్ణకుమార్ చెప్పారు. -
టెక్కీలు ఇవిచేస్తే.. 50 శాతం ఎక్కువ జీతం
బెంగళూరు : టెక్ ఇండస్ట్రీలో ఓ వైపు నుంచి ట్రంప్ షాక్ లు.. మరోవైపు ఆటోమేషన్ ముప్పు అసలు ఉద్యోగాలు వస్తాయో ఊడతాయో అర్థంకాని పరిస్థితుల్లో ఉద్యోగులు సతమతమవుతున్నారు. కానీ కొన్ని స్కిల్స్ ను నేర్చుకున్న టెక్కీలకు ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ ఉంటుందట. డేటా విజులైజేషన్, డేటా సైన్సు, మిషన్ లెర్నింగ్ ప్రస్తుతం అత్యంత విలువైన టెక్నాలజీ రిక్రూటర్లుగా ఉన్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ డేటా ఎక్కువగా జనరేట్ అవుతున్న క్రమంలో ఈ స్కిల్స్ నేర్చుకున్న టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. చాలామంది వర్కింగ్ ప్రొఫిషనల్స్ కూడా ఈ స్పెషల్ కోర్సులను నేర్చుకుంటున్నారని తెలిసింది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి 20 శాతం నుంచి 50 శాతం మధ్యలో వేతనాల పెంపు కూడా ఉంటుందని ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ సింప్లిలెర్న్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసిక్ దలాల్ చెప్పారు. గత మూడేళ్లుగా బిగ్ డేటా, అనాలిటిక్స్ కోర్సులకు మంచి వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. డేటా సైన్సు కూడా ఎక్కడా తగ్గకుండా పాపులర్ చెందుతుందని తెలిపారు. గత ఆరునెలలుగా మిషన్ లెర్నింగ్, విజులైజేషన్ టూల్స్ కోర్సులు అత్యంత ఆకర్షణీయమైనవిగా ఉన్నాయని చెప్పారు. 25 శాతం సింప్లిలెర్న్ అప్లికెంట్లు మిషన్ లెర్నింగ్ ను ఎంపికచేసుకున్నారని వెల్లడించారు. కాగ ఈ కోర్సుల వ్యవధి 4 నుంచి 9 నెలలు. మొత్తం ఈ కోర్సులకు అయ్యే ఖర్చు ఒక్కో మోడ్యుల్ బట్టి రూ.25వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిసింది.