ఐటీ జాబ్ పోయిందా? మీకో గుడ్‌న్యూస్
ఉద్యోగం కోల్పోయిన టెకీలకు నిజంగా ఇది శుభవార్తే ఐటీ రంగంలోనెలకొన్ని సంక్షోభం, అమెరికా వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్ వేర్ నిపుణుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఇలాంటి వారికోసం బెంగళూరుకుచెందిన సింప్లీలెర్న్ అనే ఆన్‌లైన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపెనీ ఇలాంటి వారికి ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది.
భారతీయ ఐటీ రంగం పలు రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇండస్ట్రీ పలుసార్లు నిరంతరాయంగా ఉద్యోగాల కోత ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, వివిధ సంస్థలచే భారీగా ఉద్యోగాల తొలగింపు నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉద్యోగాలను కోల్పోయిన ఐటి ఉద్యోగులకు సహాయపడటానికి "బౌన్స్ బ్యాక్" స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. బాధిత ఐటీ నిపుణులకు సంబంధిత కోర్సులు , శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందించనుంది. తద్వారా తమని తాము రీ స్కిల్ చేసుకునేందుకు సహాయం చేస్తుంది.
భారతీయ పౌరులకు మాత్రమే లభించే ఈ స్కాలర్ షిప్ లో ఆధునిక టెక్నాలజీలలో ఉచిత శిక్షణ ఇచ్చి, భవిష్యత్ ఉద్యోగాలు కోసం సిద్ధం చేస్తాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, పెద్ద డేటా మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి కోరిన డొమైన్స్‌లో అత్యుత్తమ కోర్సుల్లో ట్రైనింగ్ ఉచితం అయితే దీనికోసం దరఖాస్తు చేసుకునే నాటి 60 రోజుల లోపు ఉద్యోగాన్ని కోల్పోయిన వారై అయి వుండాలి. అలాగే ఒక అభ్యర్థి ఒక్క కోర్సును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. బౌన్స్ బ్యాక్ స్కాలర్షిప్ పరిధిలో రూ. 8,999 నుండి రూ. 20వేల విలువైన కోర్సులను ఉచితంగా అందించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 31 కి ముందు దరఖాస్తు చేసుకోవాలి.
ఆటోమేషన్, ఆధునిక టెక్నాలజీ తదితర అంశాల కారణంగా సంస్థల వ్యాపారం, ఉద్యోగాల ఎంపిక వ్యూహాలను అనివార్యంగా మార్చుకోవాల్సి వస్తోందని , ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్హులైన అభ్యర్థులను ఆదు కోవడమే తమ లక్ష్యమని సింప్లీలెర్న్ సీఈవో కృష‍్ణకుమార్ చెప్పారు.