Bounce back
-
Stock market: మార్కెట్ యూటర్న్..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఖరారు కావడంతో నేలక్కొట్టిన బంతిలా దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రా డేలో 2,456 పాయింట్ల ‘పోల్’వాల్ట్ చేసింది. నిఫ్టీ సైతం 786 పాయింట్లు జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ తిరిగి 74,530 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 22,670ను దాటేసింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 13 లక్షల కోట్లకుపైగా బలపడింది! ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున గత నాలుగేళ్లలోనే అత్యధిక స్థాయి పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టే వీలుండటంతో సెంటిమెంటు బలపడింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉపక్రమించడంతో ఇండెక్సులు లాభాల పరుగు అందుకున్నాయి. సెన్సెక్స్ 2,303 పాయింట్లు జంప్‌చేసి 74,382 వద్ద నిలిచింది. నిఫ్టీ 736 పాయింట్లు పురోగమించి 22,620 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్కు రూ. 13.22 లక్షల కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 408 లక్షల కోట్ల(4.89 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది!ఎఫ్‌పీఐ అమ్మకాలు బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 4.4%, 3% చొప్పున ఎగశా యి. కాగా.. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తాజాగా రూ. 5,656 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 4,555 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 12,436 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 3,319 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. దీంతో బీఎస్ఈ మా ర్కెట్ విలువలో రూ. 31 లక్షల కోట్లకుపైగా తగ్గింది. బ్లూ చిప్స్ దన్ను...ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 6–2 శాతం మధ్య ఎగశాయంటే కొనుగోళ్ల జోరును అర్ధం చేసుకోవచ్చు! ప్రధానంగా మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ 4 శాతంపైగా బలపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాలలో దాదాపు అన్ని షేర్లూ లాభపడ్డాయి. అదానీ షేర్లు అప్మార్కెట్ల బౌన్స్‌బ్యాక్‌తో ఒక్క అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మినహా (–2.6%) అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అత్యధికం మళ్లీ లాభపడ్డాయి. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 15.57 లక్షల కోట్లను అధిగమించింది. మేలో ‘సేవలు’ పేలవంన్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మేనెల్లో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ నెల్లో 60.8 వద్ద ఉన్న హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మే లో 60.2కు తగ్గింది. కాగా, కొత్త ఎగుమతుల ఆర్డర్లు 10 సంవత్సరాల గరిష్టానికి చేరడం హర్షణీయ పరిణామం. -
చివర్లో బౌన్స్‌బ్యాక్
ముంబై: రోజంతా నష్టాల మధ్యే కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లో బౌన్స్‌బ్యాక్ సాధించాయి. వెరసి సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 61,873 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు బలపడి 18,321 వద్ద స్థిరపడింది. మే నెల డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో తొలి నుంచీ మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 61,934 వద్ద గరిష్టాన్ని, 61,485 దిగువన కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ 18,338–18,202 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ప్రధానంగా చివరి అర్ధగంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు నష్టాలను వీడి లాభాల్లో నిలిచాయి. రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, ఎఫ్ఎంసీజీ, కన్సూ్యమర్ డ్యూరబుల్స్ 1–0.5 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 0.5 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఆటో, అదానీ ఎంటర్, ఎయిర్టెల్, ఐటీసీ, దివీస్, ఐషర్, టాటా కన్సూ్యమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్ 3–1% మధ్య ఎగశాయి. అయితే విప్రో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్, యూపీఎల్, హిందాల్కో, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా 1.2–0.5 శాతం మధ్య డీలా పడ్డాయి. చిన్న షేర్లు ఓకే బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,802 లాభపడితే.. 1,687 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 589 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 338 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత 3 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 2,291 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1.2 శాతం క్షీణించి 77.47 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 7 పైసలు తగ్గి 82.75ను తాకింది. ఎల్ఐసీ జూమ్ క్యూ4లో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన ఎల్ఐసీ షేరు 2 శాతం వృద్ధితో రూ. 604 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 616వరకూ ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 6,357 కోట్లు బలపడి రూ. 3,81,777 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 55.4 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
ఆటుపోట్ల మధ్య మార్కెట్ల దూకుడు
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. సెన్సెక్స్ 432 పాయింట్లు జంప్‌చేసి 44,260 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు ఎగసి 12,987 వద్ద స్థిరపడింది. అయితే మిడ్‌సెషన్ వరకూ ఒడిదొడుకుల మధ్య కదిలాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,582 వద్ద కనిష్టాన్ని తాకింది. తదుపరి మిడ్‌సెషన్ నుంచీ జోరందుకుని 44,362 వరకూ ఎగసింది. ఇదేవిధంగా నిఫ్టీ సైతం 13,108 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,790 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. నేడు నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు ఆటుపోట్లకు లోనైనట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్స్ 4 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్ 2 శాతం, ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, హిందాల్కో, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఐషర్, మారుఈ, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. చిన్న షేర్లు ఓకే డెరివేటివ్ కౌంటర్లలో సీమెన్స్ 12.4 శాతం జంప్‌చేయగా.. సెయిల్, జిందాల్ స్టీల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఎల్అండ్టీ ఫైనాన్స్, నాల్కో, బీవోబీ, టాటా కెమికల్స్ 8.3-4.6 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఇండిగో, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, హావెల్స్, ఎస్ఆర్ఎఫ్, ఎస్కార్ట్స్ 2.6-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,765 లాభపడగా.. 994 మాత్రమే నష్టాలతో ముగిశాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్ల బౌన్స్‌బ్యాక్- ప్రయివేట్ బ్యాంక్స్ స్పీడ్
ముందురోజు నమోదైన భారీ నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. తొలుత కొంతమేర ఆటుపోట్లను చవిచూసినప్పటికీ తదుపరి దశలో జోరందుకున్నాయి. చివరివరకూ లాభాల బాటలో సాగాయి. సెన్సెక్స్ 377 పాయింట్లు జంప్‌చేసి 40,522 వద్ద నిలవగా.. నిఫ్టీ 122 పాయింట్లు జమ చేసుకుని 11,889 వద్ద స్థిరపడింది. అయితే తొలుత 39,978 వరకూ నీరసించిన సెన్సెక్స్ ఒక దశలో 40,556 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,899- 11,723 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా సోమవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో పతనంకావడంతో తొలుత ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు నవంబర్ సిరీస్‌కు ఎఫ్‌అండ్‌వో పొజిషన్లను రోలోవర్ చేసుకోవడం కూడా ప్రభావం చూపినట్లు తెలియజేశారు. మీడియా సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్ 3.2 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఆటో 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ 1.2-0.7 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్ 12 శాతం దూసుకెళ్లగా.. నెస్లే, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, దివీస్, సిప్లా, ఎల్అండ్టీ, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6-2 శాతం మధ్య పురోగమించాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, విప్రో, గెయిల్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, ఐటీసీ, సన్ ఫార్మా 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ఎంఆర్ఎఫ్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఎంఆర్ఎఫ్, ఏసీసీ, శ్రీరామ్ ట్రాన్స్, కాల్గేట్, జీ, టాటా కన్జూమర్, ముత్తూట్ ఫైనాన్స్, ఐజీఎల్, అంబుజా, అశోక్ లేలాండ్, ఆర్ఈసీ, రామ్‌కో, దివీస్, పిడిలైట్, అమరరాజా, కంకార్ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీవీఆర్, సెయిల్, యూబీఎల్, భారత్ ఫోర్జ్, ఐడియా, ఇండిగో, టొరంట్ ఫార్మా, ఐబీ హౌసింగ్ 4-1.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7-0.6 శాతంమధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,282 లాభపడగా.. 1,372 నష్టాలతో నిలిచాయి. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 119.4 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 907 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 892 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
పతనానికి చెక్ -యూఎస్ బౌన్స్‌బ్యాక్
మూడు రోజుల భారీ నష్టాలకు బుధవారం తెరపడింది. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో యూఎస్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వెరసి డోజోన్స్ జులై 14 తదుపరి అత్యధికంగా లాభపడింది. 440 పాయింట్లు(1.6%) పుంజుకుని 27,940 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ జూన్ 5 తరువాత 67 పాయింట్లు(2%) ఎగసి 3,399 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 294 పాయింట్లు(2.7%) జంప్‌చేసి 11,142 వద్ద స్థిరపడింది. తద్వారా ఏప్రిల్ 29 తరువాత సింగిల్ డేలో అధిక లాభాలు ఆర్జించింది. షార్ట్ కవరింగ్.. ఇటీవల వెల్లువెత్తిన అమ్మకాలతో మూడు ట్రేడింగ్ సెషన్లలోనే నాస్డాక్ ఇండెక్స్ 10 శాతం కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్ చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా మార్కెట్లు రీబౌండ్ అయినట్లు తెలియజేశారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్ కుదుర్చుకోకుండానే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్) అంచనాల నేపథ్యంలో గత మూడు రోజులుగా మార్కెట్లు పతన బాటలో సాగుతూ వచ్చిన విషయం విదితమే. వీటికి జతగా టెక్నాలజీ దిగ్గజాల కౌంటర్లలో సాఫ్ట్‌బ్యాంక్ భారీ స్థాయిలో డెరివేటివ్ పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన వార్తలు కూడా ఒక్కసారిగా అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. జోరు తీరు ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ 4 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఈ బాటలో గూగుల్ 1.6 శాతం, ఫేస్బుక్ 1 శాతం చొప్పున ఎగశాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్.. 11 శాతం దూసుకెళ్లింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 4 శాతం పెరిగింది. క్లినికల్ పరీక్షలను తిరిగి వచ్చేవారం ప్రారంభించగలదన్న అంచనాలున్నప్పటికీ ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం క్షీణించింది. 16 బిలియన్ డాలర్లతో చేపట్టదలచిన టేకోవర్‌ను విరమించుకోనున్నట్లు లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ వెల్లడించడంతో జ్యువెలరీ కంపెనీ టిఫనీ అండ్ కో 6.5 శాతం పతనమైంది. -
లాభాలతో షురూ- బ్యాంకింగ్ జోరు
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 265 పాయింట్లు జంప్‌చేసి 38,459 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 73 పాయింట్లు ఎగసి 11,351కు చేరింది. మూడు రోజుల పతనానికి బుధవారం చెక్ పెడుతూ యూఎస్ మార్కెట్లు హైజంప్ చేశాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా నష్టాలకు చెక్ పడినట్లు తెలియజేశారు. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్ చేపట్టడంతో అటు యూఎస్, ఇటు దేశీ మార్కెట్లు రీబౌండ్ అయినట్లు వివరించారు. ఫార్మా మాత్రమే ఎన్ఎస్ఈలో ఫార్మా 0.15 శాతం బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ, మీడియా, ఆటో, ఐటీ 1-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, టాటా మోటార్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, యాక్సిస్, గెయిల్, ఐసీఐసీఐ, ఎంఅండ్ఎం 3.4-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్, ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా 1-0.25 శాతం మధ్య నీరసించాయి. ఫైనాన్స్ భేష్ డెరివేటివ్ కౌంటర్లలో ఆర్బీఎల్ బ్యాంక్, ఐడిఎఫ్సీ ఫస్ట్, ఎల్ఐసీ హౌసింగ్, కెనరా బ్యాంక్, నాల్కో, మణప్పురం, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఐడియా 3-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మ్యాక్స్ ఫైనాన్స్, ఎస్కార్ట్స్, కంకార్, భారత్ ఫోర్జ్, కేడిలా హెల్త్ 1.2-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.6 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1228 లాభాలతోనూ, 237 నష్టాలతోనూ కదులుతున్నాయి. -
నష్టాల నుంచి నేడు తొలుత రీబౌండ్?!
వరుస నష్టాల నుంచి నేడు(10న) దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 14 పాయింట్లు పుంజుకుని 11,321 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,307 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలలో మూడు రోజుల భారీ అమ్మకాలకు బుధవారం చెక్ పడింది. దీంతో యూఎస్ మార్కెట్లు జంప్‌చేశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఇటీవల ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్ అవుతున్న మార్కెట్లు నేడు హుషారుగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చైనాతో సరిహద్దు వివాదాలు వంటి అంశాలు కొంతమేర సెంటిమెంటును దెబ్బతీయవచ్చని అభిప్రాయపడ్డారు. మళ్లీ నష్టాలు బుధవారం రోజంతా నేలచూపులకే పరిమితమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 171 పాయింట్లు క్షీణించి 38,194 వద్ద నిలవగా.. నిఫ్టీ 39 పాయింట్లు తక్కువగా 11,278 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ మిడ్‌సెషన్‌కల్లా 37,935 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆపై కొంతమేర కోలుకుంటూ వచ్చి చివర్లో 38,253కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,298-11,185 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,209 పాయింట్ల వద్ద, తదుపరి 11,141 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,322 పాయింట్ల వద్ద, ఆపై 11,367 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,047 పాయింట్ల వద్ద, తదుపరి 21,826 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,521 పాయింట్ల వద్ద, తదుపరి 22,775 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. అమ్మకాల బాటలో నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 959 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 264 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
పతనం నుంచి నేడు బౌన్స్‌బ్యాక్?!
చైనాతో తిరిగి సైనిక వివాదం తలెత్తిన వార్తలతో ముందురోజు కుప్పకూలిన దేశీ స్టాక్ మార్కెట్లు నేడు (1న) బౌన్స్‌బ్యాక్ అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 71 పాయింట్లు ఎగసి 11,431 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,360 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్-19 దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ క్యూ1(ఏప్రిల్-జూన్)లో దాదాపు 24 శాతం పతనంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే రెండో క్వార్టర్నుంచీ జీడీపీ పుంజుకోనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. కాగా.. సోమవారం యూఎస్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల నుంచి డీలాపడగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా నేడు కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమ్మకాల షాక్ చైనా సైనిక బలగాలు తిరిగి 'హద్దు' మీరినట్లు వెలువడిన వార్తలు సోమవారం దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బ తీశాయి. సెన్సెక్స్ 839 పాయింట్లు పతనమై 38,628 వద్ద నిలవగా.. నిఫ్టీ 195 పాయింట్లు కోల్పోయి 11,452 వద్ద ముగిసింది. అయితే తొలుత సెన్సెక్స్ 540 పాయింట్లకుపైగా జంప్‌చేసి 40,010 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ స్థాయి నుంచి అమ్మకాలు వెల్లువెత్తడంతో 38,396 దిగువకు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,794 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,326 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,211 పాయింట్ల వద్ద, తదుపరి 11,034 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,679 పాయింట్ల వద్ద, ఆపై 11,971 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,016 పాయింట్ల వద్ద, తదుపరి 22,277 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,863 పాయింట్ల వద్ద, తదుపరి 25,971 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1004 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 544 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఐటీ జాబ్ పోయిందా? మీకో గుడ్‌న్యూస్
ఉద్యోగం కోల్పోయిన టెకీలకు నిజంగా ఇది శుభవార్తే ఐటీ రంగంలోనెలకొన్ని సంక్షోభం, అమెరికా వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్ వేర్ నిపుణుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఇలాంటి వారికోసం బెంగళూరుకుచెందిన సింప్లీలెర్న్ అనే ఆన్లైన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపెనీ ఇలాంటి వారికి ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది. భారతీయ ఐటీ రంగం పలు రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇండస్ట్రీ పలుసార్లు నిరంతరాయంగా ఉద్యోగాల కోత ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, వివిధ సంస్థలచే భారీగా ఉద్యోగాల తొలగింపు నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉద్యోగాలను కోల్పోయిన ఐటి ఉద్యోగులకు సహాయపడటానికి "బౌన్స్ బ్యాక్" స్కాలర్షిప్లను అందిస్తోంది. బాధిత ఐటీ నిపుణులకు సంబంధిత కోర్సులు , శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందించనుంది. తద్వారా తమని తాము రీ స్కిల్ చేసుకునేందుకు సహాయం చేస్తుంది. భారతీయ పౌరులకు మాత్రమే లభించే ఈ స్కాలర్ షిప్ లో ఆధునిక టెక్నాలజీలలో ఉచిత శిక్షణ ఇచ్చి, భవిష్యత్ ఉద్యోగాలు కోసం సిద్ధం చేస్తాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, పెద్ద డేటా మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి కోరిన డొమైన్స్‌లో అత్యుత్తమ కోర్సుల్లో ట్రైనింగ్ ఉచితం అయితే దీనికోసం దరఖాస్తు చేసుకునే నాటి 60 రోజుల లోపు ఉద్యోగాన్ని కోల్పోయిన వారై అయి వుండాలి. అలాగే ఒక అభ్యర్థి ఒక్క కోర్సును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. బౌన్స్ బ్యాక్ స్కాలర్షిప్ పరిధిలో రూ. 8,999 నుండి రూ. 20వేల విలువైన కోర్సులను ఉచితంగా అందించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 31 కి ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఆటోమేషన్, ఆధునిక టెక్నాలజీ తదితర అంశాల కారణంగా సంస్థల వ్యాపారం, ఉద్యోగాల ఎంపిక వ్యూహాలను అనివార్యంగా మార్చుకోవాల్సి వస్తోందని , ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్హులైన అభ్యర్థులను ఆదు కోవడమే తమ లక్ష్యమని సింప్లీలెర్న్ సీఈవో కృష్ణకుమార్ చెప్పారు. -
పారిశ్రామికోత్పత్తి డేటాపై దృష్టి
విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి,రూపాయి కదలికలు కూడా... - భారీ క్షీణత నేపథ్యంలో బౌన్స్‌బ్యాక్‌కు అవకాశం - ఈ వారం మార్కెట్‌పై నిపుణులు... న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా భారీ నష్టాలతో గుబులు పుట్టిస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లలో కొంత బౌన్స్‌బ్యాక్‌కు అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాం కాలు, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయని వారు పేర్కొన్నారు. ఈ నెల 11న ఐఐపీ డేటా విడుదల కానుంది. కాగా, గత వారం కూడా మార్కెట్ భారీ కుదుపులకు గురైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా. ‘దేశీయంగా ఈ వారం ఒక్క ఐఐపీ డేటా తప్ప చెప్పుకోదగ్గ గణాంకాలు, పరిణామాలేవీ కనబడటం లేదు. అయితే, పతనావస్థలో ఉన్న ఈక్విటీ మార్కెట్ స్థిరీకరణ కోసం ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి ఆశ్చర్యకరమైన సానుకూల చర్యలేవైనా ఉంటాయన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో నెలకొంది. మరోపక్క, చైనా, అమెరికా ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిణామాలు, వార్తలను కూడా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తుంటారు’ అని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. ఫెడ్ పాలసీ నేపథ్యంలో... ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇన్వెస్టర్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై ఉత్కంఠతో ఉన్నారు. ప్రధానంగా గత వారంలో వెలువడిన ఉద్యోగ గణాంకాలతో ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందా లేదా అన్న ఆసక్తి మరింత పెరిగేలా చేసింది. ఆగస్టులో నిరుద్యోగం 5.1 శాతానికి దిగిరాగా, కొత్త ఉద్యోగాలు అంచనాల కంటే తక్కువగా నమోదవ్వడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16-17న పాలసీ సమీక్ష సందర్భంగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచకపోవచ్చని కొందరు.. పెంచుతుందని మరికొందరు నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ మెరుగ్గా ఉండటాన్ని పెంపునకు కారణంగా చూపుతున్నారు. స్వల్పకాలానికి ప్రపంచ మార్కెట్ల కదలికలన్నింటినీ ఫెడ్ పాలసీయే నిర్దేశించనుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో తాజా నివేదికలో పేర్కొంది. రేట్ల పెంపునకు సంబంధించి ఎదో ఒక సంకేతం వెలువడేవరకూ తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. ‘ఫెడ్ పాలసీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్ ఇతరత్రా రిస్కీ పెట్టుబడి సాధనాల నుంచి నిధులను ఉపసంహరించుకోవచ్చన్న ఆందోళనలతో వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లు కుదుపులకు గురవుతున్నాయి. బేరిష్ సెంటిమెంట్ తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ వారం మార్కెట్ బౌన్స్‌బ్యాక్‌కు అవకాశాలు కనబడుతున్నాయి’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ ఫౌండర్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. గత వారం మార్కెట్... అమెరికా ఉద్యోగ గణాంకాలు... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాల ప్రభావంతో గతవారం దేశీ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. వారం మొత్తంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,190 పాయింట్లు(4.51%) క్షీణించి 25,202 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 347 పాయింట్లు(4.33%) దిగజారి 7,655 పాయింట్ల వద్ద స్థిరపడింది. 4 రోజుల్లో రూ.4,000 కోట్లు ఔట్! విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత్ స్టాక్ మార్కెట్ల నుంచి వేగంగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా దాదాపు రూ.4,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. గత నెల(ఆగస్టు)లో రికార్డు స్థాయిలో రూ.17,428 కోట్ల పెట్టుబడులను నికరంగా స్టాక్స్ నుంచి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ ఏడాది క్యూ1లో బలహీన జీడీపీ గణాంకాలు(వృద్ధి 7%), అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఫెడ్ పాలసీ రేట్ల పెంపు భయాలు దీనికి కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.