ఆటుపోట్ల మధ్య మార్కెట్ల దూకుడు | Market bounce back from losses- Metal shares zoom | Sakshi
Sakshi News home page

ఆటుపోట్ల మధ్య మార్కెట్ల దూకుడు

Published Thu, Nov 26 2020 3:53 PM | Last Updated on Thu, Nov 26 2020 4:05 PM

Market bounce back from losses- Metal shares zoom - Sakshi

ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనం నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. సెన్సెక్స్‌ 432 పాయింట్లు జంప్‌చేసి 44,260 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు ఎగసి 12,987 వద్ద స్థిరపడింది. అయితే మిడ్‌సెషన్‌ వరకూ ఒడిదొడుకుల మధ్య కదిలాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 43,582 వద్ద కనిష్టాన్ని తాకింది. తదుపరి మిడ్‌సెషన్‌ నుంచీ జోరందుకుని 44,362 వరకూ ఎగసింది. ఇదేవిధంగా నిఫ్టీ సైతం 13,108 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,790 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. నేడు నవంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్‌ చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు ఆటుపోట్లకు లోనైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో రికార్డుల ర్యాలీకి బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వ బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్స్‌ 4 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2 శాతం, ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీ సిమెంట్‌, బజాజ్‌ ఆటో, హిందాల్కో, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఐషర్‌, మారుఈ, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

చిన్న షేర్లు ఓకే
డెరివేటివ్‌ కౌంటర్లలో సీమెన్స్‌ 12.4 శాతం జంప్‌చేయగా.. సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, నాల్కో, బీవోబీ, టాటా కెమికల్స్‌ 8.3-4.6 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఇండిగో, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, హావెల్స్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఎస్కార్ట్స్‌ 2.6-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,765 లాభపడగా.. 994 మాత్రమే నష్టాలతో ముగిశాయి.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 2,522 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement