నాలుగో రోజూ జోరు- రియల్టీ, మెటల్‌ అప్‌ | Market up 4th consecutive day- Realty shares zoom | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ జోరు- రియల్టీ, మెటల్‌ అప్‌

Published Wed, Oct 21 2020 4:22 PM | Last Updated on Wed, Oct 21 2020 4:25 PM

Market up 4th consecutive day- Realty shares zoom - Sakshi

భారీ ప్యాకేజీపై అంచనాలతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు బలపడగా.. వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్లు పుంజుకుని 40,707 వద్ద నిలవగా.. నిఫ్టీ 41 పాయింట్లు జమ చేసుకుని 11,938 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. తొలుత సెన్సెక్స్‌ క్వాడ్రపుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేయడం ద్వారా సాంకేతికంగా కీలకమైన 12,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,976 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,151 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,019- 11,776  పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని, దీంతో మిడ్‌ సెషన్‌కల్లా మార్కెట్లు లాభాలు పోగొట్టుకుని నష్టాల బారినపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. 

బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ 4.4 శాతం, మెటల్‌ 2.25 శాతం చొప్పున జంప్‌ చేయగా.. బ్యాంక్‌ నిఫ్టీ 1.3 శాతం లాభపడింది. అయితే ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఐటీ, ఆటో రంగాలు 1-0.25 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్‌, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, గెయిల్‌, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే బ్రిటానియా, టీసీఎస్‌, ఎస్‌బీఐ లైఫ్‌, హీరో మోటో, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌ 4.3-0.7 శాతం మధ్య నీరసించాయి.

రియల్టీ అప్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, అపోలో టైర్‌, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, హెచ్‌పీసీఎల్‌, బీఈఎల్‌, డీఎల్‌ఎఫ్‌, వేదాంతా, కంకార్‌, పెట్రోనెట్‌ 11-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్‌, డాబర్‌, అపోలో హాస్పిటల్స్‌, టాటా కన్జూమర్‌, కోఫోర్జ్‌, ఐసీఐసీఐ ప్రు, కాల్గేట్‌, పిడిలైట్‌, మారికో, పేజ్‌ 5-2 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్స్‌ 0.25 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,365 లాభపడగా.. 1,297 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,585 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,622 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement