కొనుగోళ్ల వేవ్‌- మార్కెట్లు గెలాప్‌ | Market high jumps on Private banks support | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల వేవ్‌- మార్కెట్లు గెలాప్‌

Published Tue, Oct 6 2020 3:58 PM | Last Updated on Tue, Oct 6 2020 4:01 PM

Market high jumps on Private banks support - Sakshi

రెండు రోజులుగా కనిపిస్తున్న దూకుడును మరోసారి ప్రదర్శిస్తూ దేశీ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ దౌడు తీశాయి. సెన్సెక్స్‌ 601 పాయింట్లు దూసుకెళ్లి 39,575 వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్లు జమ చేసుకుని 11,662 వద్ద స్థిరపడింది. ప్రోత్సాహకర ప్రపంచ సంకేతాలతో రెండో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సమయం గడిచేకొద్దీ మరింత జోరందుకున్నాయి. వెరసి ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు నిలిచాయి. 39,624 వద్ద సెన్సెక్స్‌, 11,680 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలకు చేరాయి.

మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.7-0.1 శాతం మధ్య నీరసించగా..  ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ 2.4 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ 8-1.25 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బ్రిటానియా, కోల్‌ ఇండియా, విప్రొ, హిందాల్కో, టాటా స్టీల్‌, ఐషర్, నెస్లే, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్, ఐవోసీ, సన్‌ ఫార్మా, ఎల్‌అండ్‌టీ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఫైనాన్స్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎల్‌ఐసీ హౌసింగ్‌, బంధన్‌ బ్యాంక్‌, జీ, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, చోళమండలం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, ముత్తూట్‌, కోఫోర్జ్‌, హావెల్స్‌ 5.2-2.7 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క సెయిల్‌, మారికో, ఐడియా, కమిన్స్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, జిందాల్‌ స్టీల్‌, కాల్గేట్‌ పామోలివ్‌, గోద్రెజ్‌ సీపీ, గ్లెన్‌మార్క్‌, అమరరాజా, నాల్కో, టాటా కెమికల్స్‌, 2.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,508 లాభపడగా..  1,189 నష్టాలతో నిలిచాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 237 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 472 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. కాగా.. గత గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,632 కోట్లు, డీఐఐలు రూ. 259 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement