private banks
-
బాబ్బాబు ఇక్కడే ఉండు..!
న్యూఢిల్లీ: బడా ప్రైవేటు బ్యాంక్‌లు అధిక ఉద్యోగ వలసలకు (అట్రిషన్) కొంత అడ్డుకట్ట వేయగలిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే తగ్గినట్టు డేటా తెలియజేస్తోంది. ఉద్యోగులు సంస్థతోనే కొనసాగేందుకు వీలుగా బ్యాంక్‌ల యాజమాన్యాలు పలు చర్యలను ఆచరణలో పెట్టడం ఫలితాలనిస్తోంది. మేనేజర్లను జవాబుదారీ చేయడం, అధిక ప్రోత్సాహకాలు తదితర చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. బీఎఫ్ఎస్ఐ రంగంలో ఇతర సంస్థల మాదిరే బ్యాంక్‌లు సైతం నైపుణ్య మానవ వనరుల పరంగా ఆటుపోట్లను చూస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ తెలిపారు. 2022–23లో ఉద్యోగుల వలసలు బ్యాంక్‌తోపాటు పరిశ్రమకు సైతం ఆందోళన కలిగించినట్టు చెప్పారు. 30 ఏళ్లలోపు వారే ఎక్కువ.. ‘‘2023–24లో వలసలను అడ్డుకునేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సంస్థను వీడేందుకు గల కారణాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయిలో టాస్‌్కఫోర్స్‌ను సైతం ఏర్పాటు చేశాం’’అని జగదీశన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అట్రిషన్ రేటు 7 శాతం మేర తగ్గి, 27 శాతంగా ఉంది. అదే మహిళా ఉద్యోగుల వలసలు 28 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఇలా సంస్థను వీడి వెళ్లే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారుంటుంటే, ఆ తర్వాత 30–50 ఏళ్ల వయసులోని వారున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల అనుభవం మెరుగుపడేందుకు వీలుగా తాము ఇన్వెస్ట్ చేసినట్టు జగదీశన్ వెల్లడించారు. బ్యాంక్‌కు చెందిన లెరి్నంగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎంపవర్’ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఉద్యోగుల మనోగతం, వారి అభిప్రాయాలను తెలుసుకునే కార్యాచరణను అమలు చేసినట్టు తెలిపారు. 2 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్టు వివరించారు. 2023–24లో 6 లక్షల గంటల అభ్యసనను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నమోదు చేసింది. ఇతర బ్యాంకుల్లోనూ.. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనూ అట్రిషన్ రేటు గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం మేర తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 25 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 29 శాతం, కోటక్ బ్యాంక్‌లో 40 శాతం చొప్పున నమోదైంది. ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో ఉద్యోగ వలసల రేటు 14 శాతం తగ్గి 37 శాతానికి, యస్ బ్యాంక్‌లో 5 శాతం తగ్గి 38 శాతానికి పరిమితమైంది. పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనే ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో చర్యలు చేపట్టింది. శాఖల వారీగా, రిలేషన్షిప్ మేనేజర్లు, అసిస్టెంట్ ఏరియా మేనేజర్లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది. కొన్ని విభాగాల్లో వేతనాలు, ప్రయోజనాల పరంగా ఆగు నెలల కాలానికి స్థిరమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. బ్రాంచ్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లకు ప్రోత్సాహకాలు పెంచింది. పోటాపోటీగా వేతన, ప్రోత్సాహక ప్యాకేజీలతో ఉద్యోగులను కాపాడుకునేందుకు, ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంక్‌లు చర్యలు అమలు చేస్తున్నట్టు హంట్ పార్ట్నర్స్కు చెందిన వికమ్ర్ గుప్తా తెలిపారు. -
సెన్సెక్స్ @ 78,000
ముంబై: ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 78 వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ ఈ ఏడాదిలో 34వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 823 పాయింట్లు ఎగసి 78,165 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 78,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు బలపడి 23,754 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 183 పాయింట్లు బలపడి 23,721 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ రియలీ్ట, విద్యుత్, వినిమయ, మెటల్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రికార్డుల ర్యాలీకి కారణాలు ⇒ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికల అమలుపై మంత్రిత్వ శాఖలు దృష్టి సారించడంతో ట్రేడర్లు ఎఫ్అండ్ఓలపై బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నిఫ్టీ జూలై సిరీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోకి పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఎఫ్అండ్ఓ గణాంకాలు సూచిస్తున్నాయి. ⇒ ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. యాక్సిస్ బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.32% కోటక్ బ్యాంక్ అరశాతం మేర రాణించాయి. అలాగే పీఎస్‌యూ ఎస్బీఐ బ్యాంకు షేరూ ఒకశాతానికి పైగా లాభపడింది. ⇒ మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవరింగ్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచి్చన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. స్టాన్లీ లైఫ్‌స్టైల్ ఐపీవో సక్సెస్ 96 రెట్లు అధిక స్పందనలగ్జరీ ఫరీ్నచర్ బ్రాండ్(కంపెనీ) స్టాన్లీ లైఫ్‌స్టైల్ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 96 రెట్లు సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. కంపెనీ 1.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 98.57 కోట్ల షేర్లకు స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 18 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 351–369 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 537 కోట్లు సమీకరించింది.⇒ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేరు 19% పెరిగి రూ.1,647 వద్ద ముగిసింది. లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు స్లొవేకియా సంస్థ జీఐబీ ఎనర్జీఎక్స్తో ఈ సంస్థ లైసెన్సింగ్ డీల్ కుదుర్చుకోవడం ఇందుకు కారణం.⇒ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు 2.5% పెరిగి రూ.1199 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల (రూ.8.43 లక్షల కోట్లు) వద్ద ముగిసింది. -
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
అలెర్ట్, దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె.. బ్యాంక్ సేవలపై ఎఫెక్ట్!
బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్. డిసెంబర్, జనవరిలో అత్యవసరమైన బ్యాంక్ పనులున్నాయా? ఉంటే ఇప్పుడే చూసుకోండి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్ 4 నుంచి జనవరి 20 వరకు దేశ వ్యాప్తంగా సమ్మె చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్‌కి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు డిసెంబర్ 4 నుంచి స్ట్రైక్ చేయనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి పలకాలన్న ప్రధాన డిమాండ్లతో బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘అన్ని బ్యాంకులలో తగినంత సిబ్బందిని నియమించాలి. బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాల ఔట్సోర్సింగ్ లేదా, అవుట్ సోర్సింగ్‌కు సంబంధించిన బీపీ సెటిల్మెంట్ నిబంధనల ఉల్లంఘనను ఆపాలి’ అని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మెలో ప్రైవేట్ బ్యాంకులు సైతం ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులు సైతం సమ్మెలో పాలు పంచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 11న సమ్మెకు దిగనుండగా.. జనవరి 19, 20 తేదీలలో స్ట్రైక్ చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడనుంది. డిసెంబర్ 4 నుంచి సమ్మె ప్రారంభం డిసెంబరు 4న ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ల సమ్మెలతో అఖిల భారత సమ్మె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5, 6, 7, 8, 11 తేదీల్లో వివిధ బ్యాంకులు మూసివేయబడతాయి. రాష్ట్రాల వారీగా బ్యాంకుల సమ్మె అయితే, జనవరి 2 నుండి సమ్మె ఆయా రాష్ట్రాల వారీగా కొనసాగుతుంది. జనవరి 2తో ప్రారంభమైన ఈ స్ట్రైక్‌లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్, లక్ష్వదీప్‌లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు. జనవరి 3, 4, 5, 6 తేదీల్లో రాష్ట్రాల వారీగా సమ్మె నిర్వహించనున్నారు. యూపీ, ఢిల్లీ బ్యాంకుల సమ్మె ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలోని బ్యాంకులు వరుసగా జనవరి 4, 5 తేదీలలో మూసివేయబడతాయి. రెండు రోజుల సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను!
ముంబై: దేశంలోని కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల వద్ద అట్రిషన్ (ఉద్యోగ వలసలు) ఎక్కువగా కనిపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఈ సమస్యను ‘నిశితంగా‘ గమనిస్తోందని తెలిపారు. బిజినెస్ స్టాండర్డ్ ఇక్కడ నిర్వహించిన వార్షిక బీఎఫ్ఎస్ఐ ఇన్సైట్ సదస్సులో దాస్ మాట్లాడుతూ, నియంత్రణ పర్యవేక్షణ విధానాల్లో భాగంగా ఆర్బీఐ ఈ సమస్యను పరిశీలిస్తోందని చెప్పారు. కొన్ని దిగ్గజ బ్యాంకుల్లో 30 శాతం కంటే ఎక్కువ అట్రిషన్ రేటు ఉందన్న వార్తల నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తరహా సమస్యల పరిష్కారానికి ప్రతి బ్యాంకు కోర్ టీమ్‌ను రూపొందించాలని అన్నారు. ‘‘ఉద్యోగ మార్పిడిపై యువత దృక్పథం మారింది. ఈ అంశంపై భిన్నంగా ఆలోచిస్తున్నారు’’ అని ఈ సందర్భంగా అన్నారు. అంతర్జాతీయ అనిశ్చితిలోనూ భారత్ ఎకానమీ పటిష్ట బాటన పయనిస్తున్నట్లు వెల్లడించారు. -
కనీసం ఇద్దరు.. ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం
ముంబై: బోర్డులో ఎండీ, సీఈవోతోపాటు ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల సబ్సిడరీలను ఆర్బీఐ కోరింది. వారసత్వ బదిలీకి వీలుగా ఈ సూచన చేసింది. బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న సంక్లిష్టతల నేపథ్యంలో ప్రస్తుత, భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సమర్థవంతమైన సీనియర్ మేనేజ్మెంట్ బృందం అవసరమని గుర్తు చేసింది. ‘‘ఇలాంటి సమర్థవంతమైన బృందాన్ని ఏర్పాటు చేయడం వల్ల నాయకత్వ బదిలీకి కూడా సాయపడుతుంది. ఎండీ, సీఈవోలకు సంబంధించి గరిష్ట వయసు నిబంధనల అమలుకు వీలు కల్పిస్తుంది’’అని ఆర్బీఐ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. కార్యకలాపాల స్థాయి, వ్యాపారం, సంక్లిష్టతలు, ఇతర అంశాల ఆధారంగా బోర్డులో గరిష్టంగా ఎంత మంది హోల్‌టైమ్ డైరెక్టర్లు ఉండాలనే అంశాన్ని బ్యాంక్‌ల బోర్డులు నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. హోల్‌టైమ్ డైరెక్టర్లకు సంబంధించి ప్రస్తుత బ్యాంక్ బోర్డులు కనీస అవసరాలకు అనుగుణంగా లేవంటూ.. ఇక్కడి నుంచి నాలుగు నెలల్లోగా హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకం విషయమై ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. -
బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు!
అంతటా డిజిటలీకరణ ధోరణి పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల ఉద్యోగుల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేసే జూనియర్ స్థాయి సిబ్బందిలో ఈ క్షీణత పెరుగుతోంది. జాబ్ మార్కెట్లో పోటీతత్వం పెరగడంతో నైపుణ్యం కలిగిన ప్రతిభకు డిమాండ్ సరఫరాను మించిపోయింది. టాప్ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అట్రిషన్ రేట్లు (ఉద్యోగుల సంఖ్య క్షీణత) క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఈ ధోరణికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల దృక్పథంలో వచ్చిన మార్పు ఓ కారణమైతే.. ప్రతిభను నిలుపుకోవడంలో వైఫల్యం కూడా మరో కారణంగా నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 34.2 శాతం కోవిడ్ పరిస్థితుల అనంతరం సేల్స్ సిబ్బందితో సహా కింది స్థాయి ఉద్యోగుల లక్ష్యాల్లో వచ్చిన మార్పు అట్రిషన్ పెరగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీషన్ పేర్కొన్నారు. ఈ ధోరణి అన్ని రంగాలకు విస్తరించిందని, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మరింత పెరిగిందని వివరించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొత్తం అట్రిషన్ రేటు 34.2 శాతం ఉండగా అత్యధికంగా జూనియర్ సిబ్బందిలో 39 శాతం ఉంది. అయాన్ కన్సల్టింగ్ ప్రకారం.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ రంగంలో మొత్తం అట్రిషన్ రేటు 24.7 శాతంగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 35 శాతం ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో తాము 33 నుంచి 35 శాతం క్షీణతను చూస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు. అయితే, సీనియర్ స్థాయి సిబ్బందిలో, కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగుల్లో అట్రిషన్ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, ఈ స్థాయి అట్రిషన్ సాధారణమే ఆయన వివరించారు. యస్ బ్యాంక్ 43 శాతం ఇక యస్ బ్యాంక్ సిబ్బందిలో అట్రిషన్ దాదాపు 43 శాతం ఉంది. ఇది ఎక్కువగా సేల్స్ విభాగంలోనే ఉందని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అట్రిషన్ రేట్లను 25 నుంచి 30 శాతానికి తగ్గించేలా కార్యాచరణ చేపడతామని యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో అధిక అట్రిషన్ రేట్లు పెరగడానికి ముఖ్యమైన కారణాలలో ఆటోమేషన్ ఒకటి అని ప్రముఖ మానవ వనరుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా ప్రొఫెషనల్ సెర్చ్,సెలక్షన్ డైరెక్టర్ సంజయ్ శెట్టి చెబుతున్నారు. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే బ్యాంకుల్లో ఖాళీలు 40 నుంచి 45 శాతం పెరిగాయని, అలాగే నియామకాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 12 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ Myntra LayOffs 2023: మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్ కరుణిస్తేనే.. -
ప్రైవేటు బ్యాంకర్లతో కేంద్ర పథకాలపై సమీక్ష
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకుని రావడానికి సంబంధించిన పథకాలు, సామాజిక భద్రతకు ఉద్దేశించిన కార్యక్రమాల్లో ప్రైవేటు బ్యాంకింగ్ సాధించిన పురోగతిని ఆర్థికశాఖ మంగళవారం సమీక్షించింది. ఈ మేరకు ప్రైవేటు బ్యాంకర్లతో సీనియర్ ఆర్థికశాఖ అధికారులు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థికశాఖ సేవల కార్యదర్శి (డీఎఫ్ఎస్) డాక్టర్ వివేక్ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రైవేటు రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం సేవానిధి వంటి పథకాల పురోగతి సమీక్షలో ప్రధాన అంశంగా ఉందని డీఎఫ్ఎస్ ఒక ట్వీట్లో పేర్కొంది. ఇదే అంశంపై గత వారం జోషి ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
జనవరిలో 15 రోజులు పని చేయని బ్యాంకులు, సెలవుల జాబితా ఇదే!
2023 జనవరికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు జనవరి 2023లో 15 రోజుల వరకు పని చేయవు( ఆ తేదిలలో బ్యాంకులకు సెలవు). ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు కూడా ఉన్నాయి. కనుక కస్టమర్లు జనవరిలో ఏవైనా బ్యాంకు పనులుంటే దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. జనవరి 2023లో దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజులు మూసివేసి ఉంటాయి. ప్రతి నెల రెండు, నాలుగు మినహాయిస్తే తొలి, మూడవ శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. సెలవుల్లో కొన్ని బ్యాంకులకు ప్రాంతీయ సెలవులుంటే..మరికొన్ని బ్యాంకులకు జాతీయ సెలవులున్నాయి. జనవరిలో ఏ తేదిన ఉన్నాయో ఓ లుక్కేద్దాం! సెలవుల జాబితా ఇదే 1 జనవరి 2023 ఆదివారం న్యూ ఇయర్ 2 జనవరి 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు 3 జనవరి 2023 ఇంఫాల్‌లో సెలవు 4 జనవరి 2023 ఇంఫాల్‌లో గణ ఎన్గయీ సందర్భంగా సెలవు 8 జనవరి 2023 ఆదివారం 12 జనవరి 2023 స్వామి వివేకానంద జన్మదినం (కోల్‌కతాలో బ్యాంకులు పని చేయవు) 14 జనవరి 2023 రెండో శనివారం 15 జనవరి 2023 ఆదివారం 16 జనవరి 2023 తిరువల్లూర్ దినోత్సవం (చెన్నైలో సెలవు) 17 జనవరి 2023 ఉజ్ఞావార్ తిరునాళ్లు సందర్భంగా చెన్నైలో సెలవు 22 జనవరి 2023 ఆదివారం 23 జనవరి 2023 నేతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో సెలవు 26 జనవరి 2023 రిపబ్లిక్ డే (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు) 28 జనవరి 2023 నాలుగో శనివారం 29 జనవరి 2023 ఆదివారం -
దేశంలో భారీగా తగ్గిన బ్యాంక్ మోసాలు.. కారణాలివేనా?
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) బ్యాంకింగ్ రంగంలో భారీ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ. 100 కోట్లకుపైబడిన మోసాల విలువ రూ. 41,000 కోట్లకు పరిమితమమైంది. అంతక్రితం ఏడాది(2020–21)లో ఇవి ఏకంగా రూ. 1.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం అటు ప్రయివేట్, ఇటు పబ్లిక్ బ్యాంకులలో కుంభకోణాల కేసులు 118కు తగ్గాయి. 2020–21లో ఇవి 265గా నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లను తీసుకుంటే రూ.100 కోట్లకుపైబడిన మోసాలకు సంబంధించిన కేసుల సంఖ్య 167 నుంచి 80కు క్షీణించింది. ప్రయివేట్ రంగంలోనూ ఇవి 98 నుంచి 38కు దిగివచ్చాయి. విలువరీత్యా చూస్తే గతేడాది పీఎస్బీలలో వంచన కేసుల విలువ రూ. 65,900 కోట్ల నుంచి రూ. 28,000 కోట్లకు తగ్గింది. ఇక ప్రయివేట్ బ్యాంకుల్లోనూ ఈ విలువ రూ. 39,900 కోట్ల నుంచి రూ. 13,000 కోట్లకు వెనకడుగు వేసింది. బ్యాంకింగ్ రంగ మోసాలకు చెక్ పెట్టే బాటలో రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. తొలినాళ్లలోనే హెచ్చరించే వ్యవస్థ(ఈడబ్ల్యూఎస్) మార్గదర్శకాలను మెరుగుపరచడం, ఫ్రాడ్ గవర్నెన్స్, స్పందన వ్యవస్థను పటిష్టపరచడం,లావాదేవీల పర్యవేక్షణ, గణాంకాల విశ్లేషణ, మోసాలను పసిగట్టేందుకు ప్రత్యేకించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు తదితరాలకు ఆర్బీఐ తెరతీసింది. మోసాల తీరిలా ఈ ఏడాది మొదట్లో స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) దేశంలోనే అతిపెద్ద మోసానికి నెలవైంది. ఏబీజీ షిప్‌యార్డ్, కంపెనీ ప్రమోటర్లకు సంబంధించి రూ. 22,842 కోట్ల కుంభకోణం నమోదైంది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్ల మోసం చేసిన నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ కేసుకంటే పెద్దదికావడం గమనార్హం! ఇక గత నెలలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్), కంపెనీ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్ తదితరులపై రూ. 34,615 కోట్ల ఫ్రాడ్ కేసును సీబీఐ బుక్ చేసిన విషయం విదితమే. -
అన్ని ప్రైవేటు బ్యాంకులకు ప్రభుత్వ ‘విధులు’!
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇక అన్ని బ్యాంకులకూ అనుమతి లభించనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ప్రకటించారు. బ్యాంకులు అన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలు, మార్గదర్శకా లకు అనుగుణంగానే కొత్త బ్యాంకులకు ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఆర్బీఐకీ ప్రభుత్వం ఇదే అంశాన్ని స్పష్టం చేసినట్లు వివరించారు. పన్నుల వసూళ్లు, పెన్షన్ చెల్లింపులు, చిన్న పొదుపు పథకాల నిర్వహణ వంటి కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రైవేటు దిగ్గజ బ్యాంకులు ఆయా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఆర్థికమంత్రి తాజా ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే... ►ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా పలు బ్యాంకులకు ఇప్పటికే అనుమతి నివ్వడం జరిగింది. ఇలాంటి అనుమతులకోసం ఆర్బీఐని సంప్రదించే కొత్త బ్యాంకులూ ఇందుకు సంబంధించి ప్రస్తుత నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రెగ్యులేటర్‌గా ఆర్బీఐ ఇప్పటికే ఇందుకు సంబంధించి పటిష్ట నియమ నిబంధనలను అమలుచేస్తోంది. ►ఇటువంటి అనుమతులను ప్రైవేటు బ్యాంకులకు మంజూరు చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రతికూల ప్రభావం ఏమీ ఉండబోదు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులూ ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ సేవల విషయంలో కొందరు కస్టమర్లు ప్రైవేటు బ్యాంకుల నుంచీ సేవలను పొందుతున్నారు. ►ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. వ్యాపారాలు పెరుగుతున్నాయి. కొందరు కస్టమర్లు కేవలం ప్రైవేటు బ్యాంకులనే సంప్రదించే పరిస్థితి నెలకొంటోంది. వ్యాపార నిర్వహణలో ఎటువంటి అడ్డంకులూ ఏర్పడకుండా చూడ్డం ఇక్కడ ప్రధానాశం. కస్టమర్లు అందరికీ అన్ని బ్యాంకుల్లో అన్ని సేవలూ లభించాలి. సమ్మె నేపథ్యంలో ప్రకటన! బ్యాంకింగ్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, ఒకపక్క సమ్మె జరుగుతున్న తరుణంలోనే ప్రభుత్వం నుంచి తాజా ప్రకటన వెలువడ్డం గమనార్హం. ఐడీబీఐ బ్యాంక్ కాకుండా మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. రూ.1.75 లక్షల కోట్ల సమీకరణకు ఉద్దేశించి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది కేంద్రం 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేసింది. పలు విలీన చర్యల నేపథ్యంలో 2017 మార్చిలో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 12కు పడిపోయింది. 2019లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసింది. దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు అనుబంధ బ్యాంకులను అలాగే భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో విలీనం చేసింది. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌తో విలీనంకాగా, అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌తో కలిసిపోయింది. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. పెరుగుతున్న ప్రైవేటు బ్యాంకింగ్ ప్రాధాన్యత: ఠాకూర్ రాజ్యసభలో అడిగిన మరో ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానమిస్తూ, బ్యాంకులు రెండు రకాల వ్యాపారాలను నిర్వహిస్తాయని తెలిపారు. ఇందులో ఏజెన్సీ కమిషన్‌కు సంబంధించినది ఒకటని వివరించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆదాయపన్ను వసూళ్లు, చెల్లింపులు అలాగే పెన్షన్ చెల్లింపులు ఈ పరిధిలోకి వస్తాయని వివరించారు. ఇక ఆర్బీఐ నిర్దేశించిన కార్యకలాపాల నిర్వహణ బ్యాంకింగ్ నిర్వహించే వ్యాపార కార్యకలాపాల్లో మరొకటని తెలిపారు. బ్యాంక్ గ్యారెంటీలు, బ్యాంకింగ్ బిజినెస్ వంటి ఏజెన్సీ కమిషన్ పరిధిలోకి రాని అంశాలని ఈ సందర్భంగా వివరించారు. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్ గణనీయంగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. 2000లో మొత్తం డిపాజిట్లలో ప్రైవేటు రంగం వాటా 12.63 శాతంగా ఉండేదని, ఇప్పుడు ఈ వాటా 30.35 శాతానికి చేరిందని వివరించారు. ఇక ఇదే సమయంలో రుణాల విషయంలోనూ ప్రైవేటు రంగం బ్యాంక్ వాటా 12.56% నుంచి 36 శాతానికి చేరిందని తెలిపారు. ఇక ప్రాధాన్యతా రంగానికి రుణాల విషయానికి వస్తే ప్రైవేటు రంగ బ్యాంకింగ్ వాటా రూ.12.72 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్న ఠాకూర్, ఈ విభాగానికి మొత్తం రుణాల్లో ఇది దాదాపు 50 శాతానికి చేరువలో ఉందని వివరించారు. ఇక కోవిడ్–19 సమయంలో ప్రభుత్వ అత్యవసర రుణ హామీ పథకంలో ప్రైవేటు బ్యాంకింగ్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ మంజూరీలు రూ.95,261 కోట్లని ఆయన తెలిపారు. పథకం కింద మొత్తం రుణ మంజూరీలో ఇది 38.22 శాతంగా వివరించారు. కాగా ప్రైవేటు రంగ బ్యాంకింగ్ వాటా 51.5 శాత మని పేర్కొన్న మంత్రి ఈ విలువను రూ.1,28, 297 కోట్లుగా వివరించారు. ప్రైవేటు రంగం ప్రాధాన్యత ఏ స్థాయికి పెరిగిందన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, వ్యాపార నిర్వహణలో అడ్డంకులు లేకుండా చూడ్డం, సమాన అవకాశాల కల్పన వంటి కారణాలతోనే ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలకు అన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీనివల్ల పోటీతత్వం మరింత పెరుగుతుందన్నారు. -
ప్రైవేటు బ్యాంకులకు సై
న్యూఢిల్లీ: ఇంతకాలం ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లు తదితర వ్యాపారం ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని దిగ్గజ ప్రైవేటు బ్యాంకులకే సొంతం కాగా.. ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ ఇందుకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. పన్నుల వసూళ్లు, పెన్షన్ చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు పథకాల సేవలు సహా అన్ని రకాల ప్రభుత్వాల వ్యాపార లావాదేవీల నిర్వహణకు అన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం కస్టమర్లకు సేవల పరంగా సౌకర్యాన్నిస్తుందని, పోటీని, సేవల్లో సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖా పేర్కొంది. ‘ప్రభుత్వ వ్యాపారం ప్రైవేటు బ్యాంకులు నిర్వహించే విషయమై ఉన్న ఆంక్షలను తొలగించాము. ఇప్పుడు అన్ని బ్యాంకులు పాల్గొనొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రైవేటు బ్యాంకులూ సమాన భాగస్వాములు’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆంక్షలు తొలగించడంతో ప్రైవేటు బ్యాంకులనూ ప్రభుత్వ వ్యాపారం, ప్రభుత్వ ఏజెన్సీ వ్యాపార నిర్వహణకు.. ప్రభుత్వరంగ బ్యాంకులతో సమానంగా గుర్తించేందుకు ఆర్బీఐకి అధికారాలు లభించినట్టు అయింది. -
బ్యాంకింగ్ రేస్‌లో... టాటా, బిర్లా, బజాజ్!
ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక రంగం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో బ్యాంకింగ్ రంగం బలహీనంగానే ఉంది. మన బ్యాంకింగ్ రంగంలో అధిక ప్రభావం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండిబకాయిల భారంతో కునారిల్లుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదకత రంగాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరిన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. భారీ కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించడం, రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్‌లుగా మారే వెసులుబాటును ఇవ్వడం, ప్రమోటర్ వాటాను 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలు వాటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి మరో మూడు నెలలు పట్టవచ్చు. ముందు వరుసలో భారీ ఎన్బీఎఫ్సీలు... బ్యాంక్ లైసెన్స్‌లు పొందడానికి టాటా, బిర్లా, బజాజ్, పిరమళ్ సంస్థలు రేసులో ఉన్నాయి. ఈ దిగ్గజ సంస్థలకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(ఎన్బీఎఫ్సీ) సంస్థలున్నాయి. రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్‌లుగా మార్చుకునే వెసులుబాటు ఉండటం ఈ సంస్థలకు కలసివస్తోంది. టాటా గ్రూప్‌నకు చెందిన టాటా క్యాపిటల్ ఆస్తులు రూ.83,280 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ ఆస్తులు రూ.46,807 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఆసక్తిగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రతిపాదనలే వెలువడ్డాయని, ఈ దశలో తమ బ్యాంకింగ్ ప్రణాళికలను వివరించడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్పష్టత వచ్చాక ఈ విషయమై పరిశీలన జరుపుతామని వివరించారు. 2012లో కూడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లు ఇస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పుడు టాటా గ్రూప్ కూడా దరఖాస్తు చేసింది. అయితే నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయంటూ 2013లో తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఇక బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆస్తులు రూ.70,015 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఈ సంస్థ కూడా రేసులో ఉంటుందని నిపుణులంటున్నారు. మరోవైపు పిరమళ్ గ్రూప్ కూడా బ్యాంక్ లైసెన్స్ రేసులో ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రూప్ ఎన్బీఎఫ్సీ ఆస్తులు రూ.50,000 కోట్ల మేర ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో పిరమళ్ గ్రూప్‌నకు మంచి అనుభవం ఉంది. అయితే ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్స్పోజర్ బాగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని కొంతమంది నిపుణులంటున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తే, పిరమళ్ గ్రూప్‌నకు నిలకడైన క్యాష్ ఫ్లోస్ ఉంటాయని వారంటున్నారు. బ్యాంక్ లైసెన్స్‌ల కోసం 2012లోనే బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్‌లకు మాత్రమే అప్పుడు లైసెన్స్‌లు లభించాయి. తాజా ప్రతిపాదనల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ తదితర సంస్థలు తమ ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చని నిపుణులంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్...! కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చే దిశగా ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సూచనలు చేసింది. అయితే ఈ కమిటీలో ఒక్క వ్యక్తి మినహా మిగిలిన వారందరూ కార్పొరేట్లకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇవ్వొద్దనే సూచించారు. అయితే బ్యాంకింగ్ చట్ట సవరణ అంశాన్ని ఈ కమిటీ ప్రభుత్వ అభీష్టానికే వదిలేసింది. కాగా ఇవి సాహసోపేత ప్రతిపాదనలని నిపుణులంటున్నారు. అయితే కార్పొరేట్ హౌజ్‌లకు బ్యాంక్ లైసెన్స్‌లు లభించడం కష్టమేనని మాక్వెరీ క్యాపిటల్ పేర్కొంది. అంతే కాకుండా యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల సంక్షోభం నేపథ్యంలో ఉదారంగా బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని వివరించింది. కాగా కార్పొరేట్ హౌజ్‌లకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇవ్వడం ప్రమాదకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు సరికాదు..! రేటింగ్ దిగ్గజం ఎస్ అండ్ పీ ప్రకటన బడా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. భారత్ కార్పొరేట్ పాలన బలహీనంగా ఉందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందుతున్నాయని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తుందని తెలిపింది. కొత్తగా బ్యాంకులను నెలకొల్పడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన ఒక నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయానికి ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఎస్అండ్పీ ప్రకటనలో ముఖ్యాంశాలు ... ► కార్పొరేట్లే బ్యాంకింగ్ నిర్వహించే అంశంలో పలు క్లిష్టతలు ఉంటాయి. అంతర్గత గ్రూప్‌లకు రుణం, నిధుల మళ్లింపు, పరస్పర ప్రయోజనాల కోణంలో ప్రశ్నలు, ఆర్థిక స్థిరత్వం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. రుణ బకాయిల చెల్లింపుల్లో కార్పొరేట్ల వైఫల్యాల వల్ల ఫైనాన్షియల్ వ్యవస్థలో నెలకొనే ప్రతికూలతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలూ ఉంటాయి. ► 2020 మార్చి నాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో దాదాపు 13% మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారడం ఇప్పుడు చర్చనీయాంశం. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎన్పీఏల సమస్య తీవ్రంగా ఉంది. ► అయితే రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 సంవత్సరాలకు పైగా చక్కటి వ్యాపార నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులగా మార్చే ప్రతిపాదన మంచిదే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. అది పిడుగుపాటే..! కార్పొరేట్ బ్యాంకింగ్‌పై రఘురామ్ రాజన్, విరాల్ ఆచార్య ఆర్బీఐ మాజీ గరవ్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యలు కూడా ఈ అంశంపై తీవ్ర ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని అమలుచేస్తే, అది బ్యాంకింగ్‌పై పిడుగుపాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు సంయుక్తంగా రాసిన ఒక ఆర్టికల్ సోమవారం రాజన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పోస్ట్ అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ సంస్థల జోక్యం ఎంతమాత్రం సమంజసం కాదని ఆర్టికల్ పేర్కొంది. ఇలాంటి క్లిష్ట రుణదాత–గ్రహీత అనుసంధాన వ్యవస్థ సజావుగా మనుగడ సాగించిన చరిత్ర ఏదీ లేదనీ పేర్కొంది. రుణ గ్రహీతే యజమానిగా ఉన్న ఒక బ్యాంక్ మంచి వ్యాపారం ఎలా చేయగలుగుతుందని ఆర్టికల్ రచయితలు ప్రశ్నించారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట జరిగే ‘పేలవ రుణ తీరు’ను ప్రతిసారీ కట్టడి చేయడం సాధ్యంకాదని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువయ్యిందని ఆర్టికల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్ ప్రతిపాదన మంచిదికాదని స్పష్టం చేసింది. ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ‘‘అసలు ఇప్పుడు ఈ అవసరం ఏమి వచ్చింది...’’ అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోందని ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ అధికారాల పెంపు అవశ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాలను మరింత పెంచాలన్న సూచించిన ఆర్టికల్, ఈ పరిస్థితి ఉన్నట్లయితే, మొండిబకాయిల సమస్య ఇంతలా పెరిగేది కాదనీ స్పష్టం చేసింది. ఆర్బీఐకి మరిన్ని అధికారాలు, మొండిబకాయల తగ్గింపునకు ఆర్బీఐ వర్కింగ్ కమిటీ చేసిన పలు ప్రతిపాదనలను తొలుత అమలు చేయాలని, ‘కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్’ను ప్రస్తుతం పక్కనపడేయాలనీ తమ ఆర్టికల్‌లో ఆర్థిక నిపుణులు సూచించారు. ప్రపంచంలో పలు దేశాల తరహాలోనే భారత్‌లో కూడా బ్యాంకింగ్ వైఫల్యం వల్ల ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి ఉండదని వారు అన్నారు. ఇందుకు యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంకులను ప్రస్తావించారు. అందువల్ల బ్యాంకుల్లో తమ డబ్బుకు భద్రత ఉంటుందని డిపాజిటర్లు భావిస్తారని పేర్కొన్నారు. అందువల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున డిపాజిట్లను సమీకరించగలుగుతున్నాయని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం రాజన్, ఆచార్యలు ఇరువురూ అమెరికాలో ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రొఫెసర్‌గా రాజన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, స్టెర్న్ స్కూల్ ప్రొఫెసర్‌గా ఆచార్య పనిచేస్తున్నారు. -
మార్కెట్ల బౌన్స్‌బ్యాక్- ప్రయివేట్ బ్యాంక్స్ స్పీడ్
ముందురోజు నమోదైన భారీ నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. తొలుత కొంతమేర ఆటుపోట్లను చవిచూసినప్పటికీ తదుపరి దశలో జోరందుకున్నాయి. చివరివరకూ లాభాల బాటలో సాగాయి. సెన్సెక్స్ 377 పాయింట్లు జంప్‌చేసి 40,522 వద్ద నిలవగా.. నిఫ్టీ 122 పాయింట్లు జమ చేసుకుని 11,889 వద్ద స్థిరపడింది. అయితే తొలుత 39,978 వరకూ నీరసించిన సెన్సెక్స్ ఒక దశలో 40,556 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,899- 11,723 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా సోమవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో పతనంకావడంతో తొలుత ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు నవంబర్ సిరీస్‌కు ఎఫ్‌అండ్‌వో పొజిషన్లను రోలోవర్ చేసుకోవడం కూడా ప్రభావం చూపినట్లు తెలియజేశారు. మీడియా సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్ 3.2 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఆటో 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ 1.2-0.7 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్ 12 శాతం దూసుకెళ్లగా.. నెస్లే, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, దివీస్, సిప్లా, ఎల్అండ్టీ, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6-2 శాతం మధ్య పురోగమించాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, విప్రో, గెయిల్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, ఐటీసీ, సన్ ఫార్మా 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ఎంఆర్ఎఫ్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఎంఆర్ఎఫ్, ఏసీసీ, శ్రీరామ్ ట్రాన్స్, కాల్గేట్, జీ, టాటా కన్జూమర్, ముత్తూట్ ఫైనాన్స్, ఐజీఎల్, అంబుజా, అశోక్ లేలాండ్, ఆర్ఈసీ, రామ్‌కో, దివీస్, పిడిలైట్, అమరరాజా, కంకార్ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీవీఆర్, సెయిల్, యూబీఎల్, భారత్ ఫోర్జ్, ఐడియా, ఇండిగో, టొరంట్ ఫార్మా, ఐబీ హౌసింగ్ 4-1.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7-0.6 శాతంమధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,282 లాభపడగా.. 1,372 నష్టాలతో నిలిచాయి. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 119.4 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 907 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 892 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
కొనుగోళ్ల వేవ్- మార్కెట్లు గెలాప్
రెండు రోజులుగా కనిపిస్తున్న దూకుడును మరోసారి ప్రదర్శిస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ దౌడు తీశాయి. సెన్సెక్స్ 601 పాయింట్లు దూసుకెళ్లి 39,575 వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్లు జమ చేసుకుని 11,662 వద్ద స్థిరపడింది. ప్రోత్సాహకర ప్రపంచ సంకేతాలతో రెండో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సమయం గడిచేకొద్దీ మరింత జోరందుకున్నాయి. వెరసి ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు నిలిచాయి. 39,624 వద్ద సెన్సెక్స్, 11,680 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలకు చేరాయి. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా 0.7-0.1 శాతం మధ్య నీరసించగా.. ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ 2.4 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, కొటక్ బ్యాంక్, యాక్సిస్ 8-1.25 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బ్రిటానియా, కోల్ ఇండియా, విప్రొ, హిందాల్కో, టాటా స్టీల్, ఐషర్, నెస్లే, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, ఐవోసీ, సన్ ఫార్మా, ఎల్అండ్టీ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎల్ఐసీ హౌసింగ్, బంధన్ బ్యాంక్, జీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, చోళమండలం, ఆర్బీఎల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్, ముత్తూట్, కోఫోర్జ్, హావెల్స్ 5.2-2.7 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క సెయిల్, మారికో, ఐడియా, కమిన్స్, జూబిలెంట్ ఫుడ్, జిందాల్ స్టీల్, కాల్గేట్ పామోలివ్, గోద్రెజ్ సీపీ, గ్లెన్‌మార్క్, అమరరాజా, నాల్కో, టాటా కెమికల్స్, 2.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,508 లాభపడగా.. 1,189 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 237 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 472 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. కాగా.. గత గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,632 కోట్లు, డీఐఐలు రూ. 259 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
మార్కెట్ల హైజంప్- ప్రైవేట్ బ్యాంక్స్ హవా
రెండు రోజుల కన్సాలిడేషన్ నుంచి బయటపడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు దూసుకెళ్లి 38,697 వద్ద నిలవగా.. నిఫ్టీ 170 పాయింట్లు జమ చేసుకుని 11,417 వద్ద ముగిసింది. సానుకూల ప్రపంచ సంకేతాలకుతోడు జీడీపీకి దన్నుగా నిలుస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన భరోసా నేపథ్యంలో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడ్డారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,739వరకూ జంప్‌చేయగా.. నిఫ్టీ 11,429 వరకూ ఎగసింది. ఇండస్ఇండ్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ప్రయివేట్ బ్యాంక్స్ 4.2 శాతం, మీడియా 2.8 శాతం చొప్పున పురోగమించాయి. ఈ బాటలో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ 1.8-0.6 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్ 12.5 శాతం దూసుకెళ్లగా.. యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సన్ ఫార్మా 5-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. కేవలం డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఎన్టీపీసీ, టైటన్, హిందాల్కో అదికూడా 1.3-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. పీవీఆర్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, మణప్పురం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, అదానీ ఎంటర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎంజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐజీఎల్, జీఎంఆర్, అరబిందో, పిరమల్, ఆర్ఈసీ, చోళమండలం 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, హెచ్‌పీసీఎల్, ఎస్కార్ట్స్, కంకార్, అపోలో హాస్పిటల్స్, పీఎన్బీ, హావెల్స్, టొరంట్ పవర్, అమరరాజా, ఎక్సైడ్, నౌకరీ, రామ్‌కో సిమెంట్ 3.7-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,547 లాభపడగా.. 1,124 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 712 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 409 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,457 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 577 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
ప్రైవేటు బ్యాంకింగ్ మరింత బలోపేతం
న్యూఢిల్లీ: నష్టాలను సర్దుబాటు చేసుకోతగినంత నగదు నిల్వలు కలిగిన ప్రైవేటు బ్యాంకులు.. అదే సమయంలో నష్టాలను తట్టుకోగల సామర్థ్యం తక్కువగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ‘‘తగినన్ని నిధులున్న బ్యాంకులు ముందుగానే నష్టాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోగలవు. ఈ క్రమంలో పెద్దగా ఇబ్బంది పడకుండానే మార్కెట్ వాటాను పెంచుకోగలవు’’ అని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అయితే, బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి (రుణాలకు డిమాండ్) స్తబ్దుగా ఉన్నందున తక్షణమే మార్కెట్ వాటాను పెంచుకుంటాయని భావించడం లేదని, కరోనా సమసిపోయిన తర్వాత స్థిరమైన వృద్ధిని చూపిస్తాయని తెలిపింది. ప్రైవేటు బ్యాంకులు 14.4% మార్కెట్ వాటాను.. ఆస్తులు, రుణాల పరంగా 18.5% వాటాను ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి కైవసం చేసుకున్నాయని, ఇందులో అధిక శాతం వాటా గత ఐదేళ్ల కాలంలో సంపాదించుకున్నదేనని వివరించింది. ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం వాటి మార్కెట్ స్థానాన్ని స్థిరీకరించుకునేందుకు గత కొన్నేళ్లలో సాయపడిందని.. కానీ, భవిష్యత్తులో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకునేందుకు, వృద్ధికి అవసరమైన నిధులను అవి సమీకరించుకోకపోతే మాత్రం వాటి మార్కెట్ వాటాను మరింత కోల్పోతాయని విశ్లేషించింది. ఆర్బీఐ సూచనల మేరకు కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తాజా నిధులను సమీకరించినప్పటికీ.. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే చాలా పరిమితమేనని పేర్కొంది. ‘‘కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తాజా మూలధన నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించాయి. ఎప్పటిలోపు సమీకరించేదీ ప్రకటించలేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఈ తరహా అస్పష్ట పరిస్థితి వెంటనే మెరుగుపడాల్సి ఉంది’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. -
ఆదిత్యకు రూ.19 కోట్లు- రజనీష్‌కు రూ.0.3 కోట్లు
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రయివేట్, పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజాల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అందుకున్న వేతనాలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురీ గతేడాది రూ. 18.9 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే మరోపక్క ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ గతేడాది రూ. 31.2 లక్షల వేతనాన్ని పొందారు. ఈ వివరాలను ఓవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మరోపక్క ఎస్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలు పేర్కొన్నాయి. వివరాలు చూద్దాం.. 38 శాతం ప్లస్ గతేడాది ఆదిత్య పురీ రూ. 18.9 కోట్ల జీతాన్ని అందుకున్నారు. ఇది అంతక్రితం ఏడాది(2018-19) అందుకున్న రూ. 13.7 కోట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఇది 38 శాతం అధికం. వీటిలో రూ. 2.1 కోట్లమేర బోనస్‌లు తదితరాలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇవి కాకుండా కొన్నేళ్లుగా పొందుతూ వచ్చిన స్టాక్ ఆప్షన్లను విక్రయించడం ద్వారా గతేడాది రూ. 161 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.బారుచా 2020లో రూ. 8.6 కోట్ల వేతనాన్ని పొందారు. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం ఇది 2019తో పోలిస్తే 48 శాతం వృద్ధి. వేతనంలో రూ. 80 లక్షల పెర్క్‌లు కలసి ఉన్నట్లు తెలుస్తోంది. బారుచా సైతం కొన్నేళ్లుగా అందుకున్న స్టాక్ ఆప్షన్లను వినియోగించుకోవడం ద్వారా రూ. 31.6 కోట్లు సముపార్జించినట్లు తెలుస్తోంది. వెరసి గతేడాదిలో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వేతన రూపంలో బ్యాంక్ రూ. 27.5 కోట్లు చెల్లించింది. కాగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాథ్ రూ. 64 లక్షలు అందుకున్నారు. సిటింగ్ ఫీజు కింద లభించిన రూ. 29 లక్షలు దీనిలో కలసి ఉంది. ఎస్బీఐ ఇలా పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గతేడాది రూ. 31.2 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నారు. బేసిక్ శాలరీ రూ. 27 లక్షలతోపాటు.. డీఏగా రూ. 4.2 లక్షలు జమ అయినట్లు బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ గుప్తా రూ. 41.3 లక్షలు సంపాదించారు. దీనిలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద పొందిన రూ. 11 లక్షలు కలసి ఉన్నాయి. మరో ఇద్దరు ఎస్బీఐ ఎండీలలో దినేష్ కుమార్ ఖారా రూ. 29.4 లక్షలు, ఆర్జిత్ బసు రూ. 28.5 లక్షలు చొప్పున జీతాలు అందుకున్నారు. అయితే పలు కారణాలరీత్యా ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల వేతనాలను పోల్చతగదని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బ్యాంకింగ్ రంగంలోనేకాకుండా పలు ఇతర పరిశ్రమలలోనూ సాధారణంగా కనిపిస్తుందని తెలియజేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఇంతక్రితం 2016 ఆగస్ట్‌లో ఆర్బీఐసహా ప్రభుత్వ రంగంలోని సంస్థలలో జీతాలు అంతర్జాతీయ ప్రమాణాలకంటే తక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడిన విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు -
బిజినెస్ కరోనా..
సాక్షి, హైదరాబాద్: దేశమంతా లాక్‌డౌన్‌తో షట్‌డౌన్ అయింది. ఎక్కడివారక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. కొందరు ఉద్యోగులు ఇళ్లనుంచే పనిచేస్తున్నారు. ఇంకొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు.. ఇలా అత్యవసర సేవల కేటగిరీల్లోని వారు విధిగా విధులకు హాజరవుతున్నారు. బ్యాంకులూ అందులో భాగమే. అందుకే బ్యాంకులు తెరిచే ఉంటున్నాయి. కరోనా విస్తరిస్తున్న వేళ భయంగానే ఆఫీసులకు వెళ్లి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ.. ‘కరోనా’పట్టింపు లేకుండా, అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలను పట్టించు కోకుండా కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగులకు ‘టార్గెట్’విధిస్తూ బిజినెస్ పెంచాలని ఒత్తిడి తెస్తు న్నాయి. సాధారణంగా బ్యాంకులకు ఆర్థిక సంవ త్సరం ప్రారంభంతోనే పని ఒత్తిడి మొదలవు తుంది. క్రితం ఏడాది ఎంత బిజినెస్ జరిగిందో అంతకు ఒకటిన్నర రెట్లు కొత్త సంవత్సరంలో జరగా లని లక్ష్యం నిర్ధారించి యాజమాన్యాలు పరుగు పెట్టిస్తాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై మూడు రోజులైంది. దీంతో నాలుగైదు రోజులుగా నిత్యం కాన్ఫరెన్స్, వీడియోకాల్స్ ద్వారా సమావేశాలు ఏర్పాటుచేస్తూ కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. వాటిని సాధించాలని ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా వైరస్ విస్తరిస్తూ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ టార్గెట్లపై ఉద్యోగులు విస్తుపోతున్నారు. రోజూ రూ.3 కోట్ల వ్యాపారం ప్రస్తుతం కొన్ని ప్రధాన ప్రైవేటు బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ ఉంది. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో శాఖలు తెరుస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఓ ప్రైవేటు బ్యాంకు శాఖను ప్రారంభించగానే, అదే ప్రాంతంలో మరో పోటీ బ్యాంకు బ్రాంచీ ప్రారంభిస్తోంది. ఇలా ప్రధానంగా మూడు ప్రైవేటు బ్యాంకులు పోటీపడుతున్నాయి. తాజాగా ఇవి నాలుగు రోజులుగా కాన్ఫరెన్స్, వీడియో కాల్స్ రూపంలో సమావేశాలు ఏర్పాటుచేస్తూ ఉద్యోగులకు బిజినెస్ అప్పగిస్తున్నారు. కొత్తగా ప్రారంభమైన బ్రాంచీల్లో నెలకు కనీసం రూ.3 కోట్ల వ్యాపారం చేయాలని టార్గెట్ విధిస్తున్నారు. అప్పటికే ప్రారంభమై కనీసం ఏడాదైన బ్రాంచీలకు గతేడాది చేసిన బిజినెస్ మొత్తంలో అదనంగా 50 శాతం, పెద్ద బ్రాంచీలైతే ఒకటిన్నర రెట్లు వ్యాపారం చేయాలని లక్ష్యం విధించేశారు. కాస్త అటూఇటూగా ఈ పోటీ బ్యాంకులు కొత్త టార్గెట్లతో ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నాయి. కొత్త ఖాతాలు, బీమా పాలసీలు, ఫారెక్స్ కార్డులు.. బ్యాంకు ఉద్యోగులకు తొలి టార్గెట్ కొత్త ఖాతాలే. సేవింగ్స్, కరెంటు ఖాతాలతోపాటు, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు పెంచటం తదుపరి టార్గెట్. ప్రస్తుతం అన్ని వాణిజ్య బ్యాంకులు బీమా కంపెనీలతో టైఅప్ కుదుర్చుకున్నాయి. కొన్నింటికి సొంత బీమా సంస్థలున్నాయి. ఖాతాలు తెరిచే వారితో ఏదోఒక బీమా పాలసీ కూడా తీసుకునేలా చేస్తున్నాయి. జీవిత, వాహన, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని ఖాతాదారులను ఒత్తిడి చేస్తుంటారు. వీటికి తోడు గృహ, వ్యాపార, విద్యారుణాలు.. ఇలా ఏదోఒక లోన్ తీసుకునేలా ఒప్పిస్తుంటారు. ఈ టార్గెట్లను సులభంగా సాధించేందుకు బ్యాంకులు తెలివిగా రుణాలతో బీమా పాలసీలను అనుసంధానిస్తున్నాయి. వీటన్నింటికి సంబంధించి విడివిడిగా టార్గెట్లను ఫిక్స్ చేసి బ్రాంచీల ముందుంచారు. కరోనా భయం, లాక్డౌన్ నిబంధనలతో అసలు బ్యాంకులకు ఖాతాదారులు రావటమే తగ్గింది. ఈ తరుణంలో టార్గెట్లను ఎలా సాధించాలని ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. పదోన్నతులతో ముడిపెడుతూ.. బ్యాంకుల్లో పదోన్నతి రావాలన్నా, జీతం పెరగాలన్నా వ్యక్తిగత టార్గెట్లను సాధించడంపైనే ఆధారపడి ఉంటుంది. టార్గెట్లపై ఏమరుపాటుగా ఉంటే దాని ఫలితం ప్రమోషన్లు, జీతాల పెరుగుదలపై ఉంటుందని పరోక్ష హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో రెండ్రోజులుగా బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు సంబంధించిన బ్యాంకు అంతర్గత పనులు చూస్తూనే బిజినెస్ పెంచుకునే కసరత్తు ప్రారంభించారు. ఎక్కువ మంది ఫోన్లలో ఖాతాదారులతో మాట్లాడుతూ ఏదో ఓ పాలసీ తీసుకునేలా, ఖాతాలో డిపాజిట్లను పెంచేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లాక్డౌన్ వల్ల వేతనాల్లో కోతపడే పరిస్థితి ఉందని, ఇప్పుడు ఇటువంటివి తలకెత్తుకోలేమని ఖాతాదారులు చెబుతుండటంతో బ్యాంకు ఉద్యోగులకు దిక్కుతోచడం లేదు. ‘పీఎం కేర్స్’భారం కవరింగ్ కోసం.. చాలా బ్యాంకులు ప్రస్తుతం పీఎం కేర్స్ ఫండ్ కు భారీగా విరాళాలిస్తున్నాయి. ఇది అభినందించాల్సిన విషయమే. మరోపక్క వాటికిది అదనపు ఖర్చు కూడా. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం బిజినెస్‌ను మరింత పెంచుకోవటం ద్వారా ఈ భారాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా ఈ భారం కూడా వినియోగదారులపై పడనుంది. టార్గెట్లు.. ఆప్షన్లు ►బ్యాంకు సిబ్బందిలో ప్రతి ఒక్కరు రోజూ కనీసం ఆరుకు తగ్గకుండా లావాదేవీలు చేయాలని ఓ ప్రధాన వాణిజ్యబ్యాంకు టార్గెట్ పెట్టింది. కొత్త ఖాతాలు, కొత్త డిపాజిట్లు, డిపాజిట్ల మొత్తం పెంపు, బీమా పాలసీలు.. వీటిలో ఏవైనా ఆరు చేయాలి. ►రుణాలకు సంబంధించి ప్రత్యేకంగా పాయింట్స్ విధానం ఉంటుంది. పంట, గృహ, విద్య, విదేశీ రుణాలు... ఇలా ఆయా రుణాలకు సంబంధించి నెలకు 600 పాయింట్లకు తగ్గకుండా సాధించాలని మరో బ్యాంకులో లక్ష్యం విధించారు. ►ఎన్ఆర్ఐలు పంపే డబ్బులను ఒడిసిపట్టుకునే (ఫారిన్ రెమిటెన్స్) విషయంలోనూ టార్గెట్లున్నాయి. వీరు ఇండియాలో ఉండే తమవారికి పంపే డబ్బును తమ బ్యాంకులో ఖాతా తెరిచి జమ చేసేలా చేయటం అన్నమాట. -
డిసెంబర్ ఆఖరుకల్లా నిధుల సమీకరణ
ముంబై: నిధుల వేటలో ఉన్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్.. ప్రతిపాదిత రూ. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,462 కోట్లు) పెట్టుబడుల సమీకరణ ప్రక్రియను డిసెంబర్ ఆఖరునాటికల్లా పూర్తి చేయనుంది. అలాగే, కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో కూడా స్థానం కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 21,156 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారని యస్ బ్యాంక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నార్త్ అమెరికన్ ఫ్యామిలీ ఆఫీస్’ ఇప్పటికే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆఫర్ ఇచి్చంది. దీనిపై నవంబర్ ఆఖరులోగా ఆ సంస్థకు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంటుందని విలేకరులకు యస్ బ్యాంక్ సీఈవో రవ్నీత్ గిల్ తెలిపారు. ఆ సంస్థ నుంచి లేదా పలువురు ఇన్వెస్టర్లందరి నుంచి కలిపి డిసెంబర్ ఆఖరు నాటికి నిధుల సమీకరణ జరపగలమని పేర్కొన్నారు. రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవాలని నిర్దేశించుకున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్ల అవసరాలకు ఈ నిధులు సరిపోగలవని గిల్ చెప్పారు. మరోవైపు, సింగపూర్ సంస్థ డీబీఎస్.. తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉందంటూ వచి్చన వార్తలను గిల్ కొట్టిపారేశారు. అటు డీబీఎస్ కూడా ఈ వార్తలను ఖండించింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 266 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.266 కోట్ల నికర లాభం సాధించింది. కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటం, ఇతర ఆదాయం పెరగడంతో ఈ స్థాయి లాభం నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.10,800 కోట్ల నుంచి రూ.11,986 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.27% నుంచి 2.99%కి పెరిగింది. ఇది 18 క్వార్టర్ల గరిష్ట స్థాయి. గత క్యూ2లో 16.36%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.31%కి తగ్గాయి. నికర మొండి బకాయిలు 7.64% నుంచి 5.77%కి చేరాయి. -
స్టాక్స్..రాకెట్స్!
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం, వాణిజ్య యుద్ధ భయాలు, జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల డౌన్‌గ్రేడింగ్ వంటి గడ్డు పరిస్థితుల్లోనూ నిఫ్టీ గతేడాది దీపావళి (2018 నవంబర్ 7) నుంచి ఈ ఏడాది అక్టోబర్ 15 దాకా సుమారు 11% రాబడులిచ్చింది. కానీ మిడ్‌క్యాప్ సూచీ 6%, స్మాల్‌క్యాప్ సూచీ 10% మేర క్షీణించాయి. అయితే, రియల్టీ 14%, బ్యాంకెక్స్ 13%, ఆయిల్ అండ్ గ్యాస్ 13% పెరిగాయి. ఇక సంవత్ 2076లో ఆశావహ పరిస్థితులే కనిపిస్తున్నాయన్నది బ్రోకరేజీ సంస్థల మాట. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22 శాతానికి తగ్గించడం, తయారీ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడం సెంటిమెంటును మెరుగుపరుస్తాయన్నది వారి అంచనా. ఈ నేపథ్యంలో నిఫ్టీ 14,000 పాయింట్లకు , సెన్సెక్స్ 46,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. ‘సంవత్ 2076’లో ఐటీ, మెటల్, ఫార్మా, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లకు దూరంగా ఉండటమే మంచిదన్నది బ్రోకరేజీ సంస్థల సూచన. ప్రైవేట్ బ్యాంకులు, బీమా సంస్థలు, ఎఫ్ఎంసీజీ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నాయి. ఆ సిఫారసుల వివరాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... బ్రోకరేజి సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 469 టార్గెట్ ధర రూ. 550 ఇతరత్రా సవాళ్లు, కొత్తగా బయటికొస్తున్న మొండిపద్దులకు సంబంధించి మిగతా బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంకు పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆదాయాలను మెరుగుపర్చుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. రుణ వితరణకు సంబంధించి వార్షిక ప్రాతిపదికన 2019–21లో 17 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చు. హెచ్‌యూఎల్ ప్రస్తుత ధర రూ. 2,143 టార్గెట్ ధర రూ. 2,265 మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వేగంగా మార్పులు, చేర్పులు చేసుకోగల సామర్థ్యాలు, ప్రీమియమైజేషన్ ట్రెండు పటిష్టంగా ఉండటం, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవటం వంటివి ఈ సంస్థకు సానుకూలాంశాలు. లార్జ్ క్యాప్ కన్జూ మర్ సంస్థల్లో హెచ్‌యూఎల్ ఆదాయాలు మరింత మెరుగ్గా నమోదయ్యే అవకాశాలున్నాయి. టైటాన్ ప్రస్తుత ధర రూ. 1,334 టార్గెట్ ధర రూ. 1,435 సొంతంగా అమలు చేస్తున్న వ్యూహాలు, నియంత్రణ వ్యవస్థ పరంగా సానుకూలాంశాలు టైటాన్ వృద్ధికి దోహదపడనున్నాయి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రూప్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) అమ్మకాల వృద్ధిలో జ్యుయలరీ విభాగం వాటా 60% పైగా ఉంది. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎస్బీఐ ప్రస్తుత ధర రూ. 282 టార్గెట్ ధర రూ. 350 నిర్వహణ పనితీరు స్థిరంగా ఉంది. ఆదాయాలు మెరుగుపడతాయి. అలాగే, ఎన్సీఎల్టీకి చేరిన మొండిపద్దుల నుంచి కూడా భారీ రికవరీలకు గణనీయమైన అవకాశాలున్నాయి. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత ధర రూ. 2,103 టార్గెట్ ధర రూ. 2,600 లిక్విడిటీ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ.. తక్కువ వ్యయాలతో నిధులు సమీకరించుకోగలగడం, మార్కెట్ షేరు పెంచుకోగలగడం దీనికి సానుకూల అంశాలు. 2019–2022 మధ్య ఏయూఎం వృద్ధి వార్షిక ప్రాతిపదికన 14 శాతం స్థాయిలో ఉండొచ్చని, నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ: రెలిగేర్ బ్రోకింగ్ హావెల్స్ ఇండియా ప్రస్తుత ధర రూ. 665 టార్గెట్ ధర రూ. 795 కొంగొత్త ఉత్పత్తులతో పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంఈజీ రంగంలో అత్యధికంగా మార్కెట్ వాటా, పటిష్టమైన నెట్వర్క్ దీనికి లాభించే అంశాలు. పండుగ సీజన్ డిమాండ్‌తో రాబోయే రోజుల్లో పనితీరు మరింత మెరుగుపడవచ్చు. రుణభారం తక్కువగా ఉండటం, రాబడులు మెరుగ్గా ఉండటం కలిసొస్తాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ధర రూ. 578 టార్గెట్ ధర రూ. 695 ఆటో పరిశ్రమలో మందగమ నం కారణంగా ఏడాది కాలంగా ఈ షేరు కరెక్షన్కు లోనయ్యింది. వర్షపాతం బాగుండటం, ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉండటం, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు ట్రాక్టర్ పరిశ్రమ రికవరీకి తోడ్పడగలవని అంచనా. ఫోర్డ్ ఇండియాతో జట్టు కట్టడం .. ఎంఅండ్ఎం పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టపర్చుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడానికి, భారత్ నుంచి ఎగుమతులు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. మారికో ప్రస్తుత ధర రూ. 393 టార్గెట్ ధర రూ. 451 సమీప భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీకి సవాళ్లు ఉన్నప్పటికీ.. క్రమంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవచ్చు. సానుకూల అంచనాల కారణంగా 13–15 శాతం మేర ఆదాయ వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది. కొత్త ఉత్పత్తులు, కొన్ని విభాగాల్లో అగ్రస్థానం ఉండటంతో పాటు కొబ్బరి ధరలు తగ్గుతుండటం.. కంపెనీ మార్జిన్లపరంగా సానుకూల అంశాలు. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 699 టార్గెట్ ధర రూ. 780 పెరిగే డిమాండ్‌కు తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త ఉత్పత్తులు, నెట్వర్క్ పటిష్టపర్చుకోవడం సానుకూల అంశాలు. మున్ముందు రూమ్ ఏసీలు, ఎయిర్ కూలర్లకు డిమాండ్‌తో వోల్టాస్ విక్రయాలు గణనీయంగా పెరగవచ్చు. తీవ్ర పోటీ ఉన్నా రూమ్ ఏసీల విభాగంలో వోల్టాస్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. బ్రోకరేజి సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుప్రీం ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,173 టార్గెట్ ధర రూ. 1,420 దేశీయంగా అతి పెద్ద ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఒకటి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, అన్ని ప్రాంతాల్లో తాగు నీటి వసతి కల్పించడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపర్చడం వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పైపుల రంగానికి .. తద్వారా ఈ సంస్థకు సానుకూల అంశాలు. 2019–21 మధ్య కాలంలో కంపెనీ ఆదాయాలు 13 శాతం పైగా వృద్ధి చెందగలవని అంచనా. యునైటెడ్ బ్రూవరీస్ ప్రస్తుత ధర రూ. 1,337 టార్గెట్ ధర రూ. 1,620 దేశీ బీరు మార్కెట్లో 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. పటిష్టమైన బ్రాండ్స్, విస్తృతమైన నెట్వర్క్ దీనికి బలం. ఇతర ఉత్పత్తుల రేట్ల పెంపుతో పాటు ప్రీమియం బ్రాండ్స్ విక్రయాలు మెరుగుపడనుండటం సంస్థకు సానుకూలం. కొత్తగా క్రాఫ్ట్ బీరు, నాన్–ఆల్కహాల్ బెవరేజెస్ వ్యాపారాలు కూడా సంస్థకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కాన్సాయ్ నెరోలాక్ ప్రస్తుత ధర రూ. 545 టార్గెట్ ధర రూ. 620 దేశీయంగా అతి పెద్ద ఇండస్ట్రియల్ పెయింట్ కంపెనీ. ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగంలో 35 శాతం, మొత్తం పెయింట్స్ మార్కెట్లో 14 శాతం వాటా ఉంది. పట్టణీకరణ, రీపెయింటింగ్కు డిమాండ్‌తో పాటు మెరుగైన వర్షపాతం, అందరికీ ఇళ్ల పథకాలు మొదలైనవి పెయింట్ పరిశ్రమకు, ఈ సంస్థకు సానుకూల అంశాలు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు కోత కూడా కంపెనీకి లాభిస్తుంది. డాబర్ ఇండియా ప్రస్తుత ధర రూ. 465 టార్గెట్ ధర రూ. 550 పలు రకాల ఉత్పత్తులతో.. వివిధ విభాగాల్లోకి కంపెనీ విస్తరించింది. మూడు బ్రాండ్స్ (రియల్, వాటికా, ఆమ్లా) టర్నోవరు రూ. 1,000 కోట్ల పైగా ఉంటుండగా, రూ. 100 కోట్ల పైగా టర్నోవరుండే బ్రాండ్స్ 16 దాకా ఉన్నాయి. పతంజలి నుంచి పోటీ తగ్గి గత కొద్ది త్రైమాసికాలుగా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తోంది. జేకే సిమెంట్ ప్రస్తుత ధర రూ. 1,117 టార్గెట్ ధర రూ. 1,260 గ్రే సిమెంట్ విభాగంలో టాప్ సంస్థల్లో ఇదొకటి. వైట్ సిమెంట్‌లో మార్కెట్ లీడరు. ఉత్తర, దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. వైట్ సిమెంటు విభాగంలో అగ్రస్థానంలో ఉండటం, కార్పొరేట్ ట్యాక్స్ కోత దీనికి లాభించగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ : ఏంజిల్ బ్రోకింగ్ మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 7,469 టార్గెట్ ధర రూ. 8,552 ప్యాసింజర్ వాహనాల విభాగంలో 52 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ ప్రీమియం కస్టమర్లను కూడా ఆకర్షిస్తోంది. ఆటోమొబైల్ రంగం రికవర్ అయ్యే క్రమంలో ముందుగా అవకాశాలను అందిపుచ్చుకునే సత్తా ఉండటం దీనికి సానుకూలం. జీఎంఎం ఫాడ్లర్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా తదితర రంగాల్లో రసాయనాల ప్రాసెసింగ్‌కు ఉపయోగించే గ్లాస్ లైన్డ్ (జీఎల్) స్టీల్ పరికరాల ఉత్పత్తిలో దేశీయంగా అగ్రస్థానంలో ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలకు సరిపోయేలా ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. మధ్యకాలికంగా జీఎల్యేతర వ్యాపారాలను కూడా మెరుగుపర్చుకుంటోంది. లార్సన్ అండ్ టూబ్రో ప్రస్తుత ధర రూ. 1,425 టార్గెట్ ధర రూ. 1,850 ఇన్ఫ్రా, హైడ్రోకార్బన్, సర్వీసుల విభాగాలతో దేశీయంగా అతి పెద్ద ఈపీసీ కంపెనీ. వివిధ అనుబంధ సంస్థల ద్వారా ఐటీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. దేశ, విదేశాల్లో రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఆర్డర్లతో పటిష్టంగా ఉంది. ప్రభుత్వం ఇన్ఫ్రాపై దృష్టి, కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు వంటివి సంస్థకు లాభించేవి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,229 టార్గెట్ ధర రూ. 1,390 డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతోంది. నగరాలు కానిచోట కొత్త శాఖల సంఖ్యను మరింతగా పెంచుకోవడం, పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను 4 రెట్లు పెంపు, వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ క్లయింట్స్ సంఖ్య రెట్టింపు వంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది. మెరుగైన మార్జిన్లు నమోదు చేయగలుగుతోంది. బ్లూ స్టార్ ప్రస్తుత ధర రూ. 795 టార్గెట్ ధర రూ. 867 భారత్‌లో ఏసీలు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఒకటి. రూమ్ ఏసీల మార్కెట్లో ప్రతి ఏడాది తన మార్కెట్ వాటాను పెంచుకుంటూనే ఉంది. ఫలితంగా కంపెనీ మొత్తం ఆదాయంలో కూలింగ్ ప్రొడక్ట్స్ డివిజన్ వాటా పదేళ్లలో రెట్టింపైంది. ఇదే జోరు భవిష్యత్తులో కూడా కొనసాగనున్నది. రెండేళ్లలో ఆదాయం 11 శాతం చొప్పున వృద్ధి చెందగలదని అంచనా. మార్జిన్లు వచ్చే ఏడాది 7%కి పెరగవచ్చు. గోల్డ్ రన్.. రూ. 41,500కు చేరే అవకాశం అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత దీపావళి నుంచి చూస్తే ఈక్విటీలపై 10 శాతం మేర రాబడులు రాగా.. పసిడి 21 శాతం దాకా లాభాన్నిచ్చింది. అయితే, ధరతో పాటు దిగుమతి సుంకాలూ పెరిగిపోవటం పసిడికి కొంత ప్రతికూలమే. 2019లో దిగుమతులు 12 శాతం తగ్గగా.. పండుగ సీజన్లో కూడా డిమాండ్ ఒక మోస్తరుగానే ఉంది. వాణిజ్య యుద్ధభయాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. వేగం తగ్గినా.. పసిడి పరుగు కొనసాగుతుందనే అంచనాలున్నాయి. ప్రధాన ఎకానమీల్లో మందగమనం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు, సెంట్రల్ బ్యాంకులు ఉదార విధానాలు కొనసాగించనుండటం పసిడి ధరకు మద్దతుగా నిలవవచ్చు. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాలు తగ్గిపోతే పసిడి కొంత కరెక్షన్కు లోనైనా.. రూ.35,500 మద్దతును నిలబెట్టుకోగలిగితే మళ్లీ గత గరిష్ట స్థాయి రూ.39,500ను తాకవచ్చు.. ఆ పైన వచ్చే 12 నెలల్లో రూ. 41,500కి కూడా చేరవచ్చు. -
బ్యాంకుల ‘ఫిజిటల్’ మంత్రం!
సాక్షి, బిజినెస్ విభాగం: డిజిటల్ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటున్నప్పటికీ.. బ్యాంకులు సంప్రదాయ బ్రాంచి బ్యాంకింగ్‌ను కూడా మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇటు మొబైల్, డిజిటల్ అటు బ్రాంచీల సాయంతో మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధానాన్నే ముద్దుగా ఫిజిటల్గా (ఫిజికల్+డిజిటల్) వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ తొలుత చేసిన ఈ పదప్రయోగం.. నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడటం, నెట్ అందుబాటులోకి రావడం వల్ల 2011 నుంచి మొబైల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే, వీటితో పాటు శాఖలు కూడా కంటి ముందు కనిపిస్తుంటే ఖాతాదారులకు బ్యాంకుపై భరోసా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా పోటాపోటీగా శాఖలు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. సాధారణంగా అన్ని వర్గాలకూ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యతతో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇపుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, డిపాజిట్లను పెంచుకునేందుకు శాఖలను పెంచుకుంటున్నాయి. డిజిటల్‌తో వినూత్న ప్రయోగాలు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా మరింత వినూత్నమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఖాతాదారుల నుంచి సానుకూల స్పందన కూడా వస్తోంది. అదే సమయంలో డిజిటల్‌కు సమానంగా ఫిజికల్ (భౌతికంగా) శాఖలూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం బ్యాంకింగ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘బ్రాంచీలు ప్రధానంగా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. శాఖలపరంగా భారీ నెట్వర్క్ ఉంటే కస్టమర్లకు భరోసా ఉంటుంది. ఇక శాఖల నెట్‌వర్క్‌కు డిజిటల్ చానల్స్ అనుబంధంగా పనిచేస్తాయి. మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు, ఇంకొంత మంది కొత్త కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఉపయోగపడతాయి. ఫెడరల్ బ్యాంక్ విషయం తీసుకుంటే శాఖల్లో జరిగే 75 శాతం పైగా లావాదేవీలు ప్రస్తుతం డిజిటల్ చానల్స్ ద్వారా జరుగుతున్నాయి. మాకు దేశవ్యాప్తంగా పటిష్టమైన శాఖల నెట్వర్క్ ఉంది. గడిచిన మూడేళ్లలో కొత్త శాఖలేమీ ప్రారంభించలేదు కానీ.. ఈ ఏడాదిలో దీనిపై మళ్లీ కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇటు డిజిటల్‌తో పాటు అటు బ్రాంచీల తోడ్పాటుతో ఫిజిటల్ సేవలు కొనసాగిస్తాం‘ అని ఫెడరల్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్ హెడ్) జితేష్ పీవీ తెలిపారు. శాఖల్లో ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం.. డిజిటల్, మొబైల్ మాధ్యమాలు ఉన్నప్పటికీ.. ఖాతాదారులకు ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వటంలో బ్యాంకుల శాఖలు ముందుంటాయని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ ప్రకాష్ సుందరం చెప్పారు. ‘‘సెల్ఫ్ సర్వీస్ డిజిటల్ కావొచ్చు.. అసిస్టెడ్ డిజిటల్ విధానం (బ్యాంకింగ్ సిబ్బంది సహాయంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవడం) కావొచ్చు.. శాఖ తీరు బాగుంటేనే ఆ బ్యాంకుతో లావాదేవీలు నిర్వహించేందుకు కస్టమరు ఇష్టపడతారు. కాబట్టి పరిమాణంలో చిన్నవైనా సరే శాఖల ప్రాధాన్యం తగ్గదు’’ అని ప్రకాష్ సుందరం చెప్పారు. యువతరం ఎక్కువగా మొబైల్, ఆన్లైన్ బ్యాంకింగ్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ.. కొంత పాత తరం 45–50 ఏళ్ల వాళ్లు ఇప్పటికీ బ్యాంకు శాఖల ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేకంగా లాకరు సదుపాయం, వ్యక్తిగత ఆర్థిక సేవలు కోరుకునే సంపన్న వర్గాలకు కూడా బ్యాంకు శాఖలు అవసరమని ప్రకాష్ చెప్పారు. యాక్సిస్ ఏటా 400 శాఖలు.. వినూత్న డిజిటల్ సేవలు ఆవిష్కరించడంతో పాటు మరిన్ని శాఖల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి చెప్పారు. ఏటా 400 శాఖలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం శాఖల సంఖ్య 5,500కు చేరే దాకా ఇదే విధానం కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్సిస్ ఈ ఏడాది మార్చిలో తమ 4,000వ శాఖను ఏర్పాటు చేసింది. ఆర్బీఎల్ వంటి చిన్న బ్యాంకులు కూడా శాఖలను పెంచుకుంటున్నాయి. 2018 మార్చి ఆఖరు నాటికి 265గా ఉన్న ఆర్బీఎల్ బ్రాంచీల సంఖ్య 2019 మార్చి 31 నాటికి 324కి పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల ఫిబ్రవరిలోనే తమ 5,000వ బ్రాంచీని ప్రారంభించింది. అయితే, బ్రాంచీల నెట్‌వర్క్‌పరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్బీ) ఆధిపత్యం ఉంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది జూన్ ఆఖరు నాటికి పీఎస్బీ శాఖల సంఖ్య 90,821గా ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకుల శాఖల సంఖ్య 28,805కి పరిమితమైంది. -
సమ్మెతో స్తంభించిన బ్యాంకింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక్క రోజు సమ్మెతో బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులతో పాటు కొన్ని విదేశీ బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే, కొత్త తరం ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెతో బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్సులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల జారీ వంటి బ్యాంకింగ్ సేవలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల విలువ చేసే చెక్కుల లావాదేవీలు నిల్చిపోయినట్లు వివరించాయి. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 7,000 శాఖల్లో సర్వీసులు స్తంభించాయని యూఎఫ్‌బీయూ మధ్యప్రదేశ్ యూనిట్ కో–ఆర్డినేటర్ ఎంకే శుక్లా తెలిపారు. తమ డిమాండ్లు న్యాయమైనవేనని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం సమ్మె సందర్భంగా చెప్పారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి.. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ, వేతనాల పెంపు కోరుతూ బ్యాంకు ఉద్యోగులు గత వారం రోజుల్లో సమ్మెకు దిగడం ఇది రెండోసారి. గత శుక్రవారం (డిసెంబర్ 21న) ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 3.20 లక్షల మంది అధికారులు ఒక్క రోజు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, చాలామటుకు బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగినట్లు సీనియర్ బ్యాంకర్లు తెలిపారు. ‘కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని చెక్ క్లియరింగ్ సెంటర్స్‌లో బాధ్యతలను సీనియర్ అధికారులకు అప్పగించడం జరిగింది. ట్రెజరీ వంటి మిగతా కార్యకలాపాలు కూడా య«థావిధిగానే కొనసాగాయి‘ అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీవోబీలో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ప్రకటించింది. ఈ మూడింటి కలయికతో ఏర్పడే విలీన బ్యాంకు రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా ఎస్బీఐ, ఐసీఐసీఐల తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా ఏర్పడనుంది. కానీ దీనివల్ల ఇటు ఆ బ్యాంకులకు గానీ ఖాతాదారులకు గానీ ఒనగూరే ప్రయోజనాలేమీ లేవని బ్యాంకు ఉద్యోగ యూనియన్లు చెబుతున్నాయి. విలీనం వల్ల పలు శాఖలు మూతబడతాయని, కస్టమర్లకు సమస్యలు పెరుగుతాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూఎఫ్‌బీయూ బుధవారం సమ్మె చేపట్టింది. ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కేంద్ర ఆర్థిక శాఖ గతవారం విలీన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదముద్ర కూడా వేసింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఏఐబీఈఏ, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్వోబీడబ్ల్యూ) తదితర 9 యూనియన్లు యూఎఫ్‌బీయూలో భాగంగా ఉన్నాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకులు య«థావిధిగా పనిచేయగా.. ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు మూతబడ్డాయి. సమ్మె నేపథ్యంలో చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ కాగా.. ప్రైవేట్ బ్యాంకుల చెక్ క్లియరెన్సులు కూడా నిల్చిపోయాయి. గురువారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయి. విలీనాల వంటి దుస్సాహసాలకు దిగకుండా బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మొండిబాకీల సంక్షోభానికి గల కారణాలను అన్వేషించడం, పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా వ్యాఖ్యానించారు. కేవలం పెద్ద బ్యాంకులు మాత్రమే పటిష్టంగా, సమర్ధంగా పనిచేస్తాయనడానికి దాఖలాలేమీ లేవని వెంకటాచలం పేర్కొన్నారు. -
చిన్న సంస్థలకు రుణాల్లో ప్రైవేట్ బ్యాంకుల జోరు
ముంబై: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మార్కెట్ వాటాను ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కొల్లగొడుతున్నాయి. 2016 లో ఈ విభాగానికి సంబంధించి 59.4 శాతంగా ఉన్న 21 పీఎస్‌బీల వాటా 2017 జూన్ నాటికి 55.8 శాతానికి తగ్గింది. తాజాగా 2018 జూన్ నాటికి ఇది 50.7 శాతానికి పడిపోయింది. ఆర్థిక సేవల సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్, సిడ్బి రూపొందించిన త్రైమాసిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాదిలో జూన్ దాకా ఎంఎస్ఎంఈ విభాగానికి రుణాలు 16.1 శాతం మేర పెరిగాయి. ఈ విభాగానికి పీఎస్‌బీల రుణాల వృద్ధి 5.5 శాతం, ప్రైవేట్ బ్యాంకుల వృద్ధి 23.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద ఈ విభాగానికి రుణాల విషయంలో 2017 జూన్‌లో 28.1 శాతంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకుల మార్కెట్ వాటా ఈ ఏడాది జూన్ నాటికి 29.9 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 9.6 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగింది. ఎంఎస్ఎంఈలకు దూకుడుగా రుణాలిస్తున్నప్పటికీ.. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ నాణ్యత మెరుగ్గానే కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ విభాగంలో పీఎస్‌బీల మొండిబాకీలు 14.5 శాతం నుంచి 15.2 శాతానికి పెరగ్గా, ప్రైవేట్ బ్యాంకులవి స్వల్పంగా 4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. రుణ మంజూరుకు సంబంధించి దరఖాస్తు ప్రాసెసింగ్‌కి పట్టే టర్నెరౌండ్ సమయం (టీఏటీ) గణనీయంగా తగ్గింది. -
ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు బెటర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల తరుణం, ముడిచమురు ధరల పెరుగుదల తదితర అంశాల నేపథ్యంలో ఈ ఏడాది స్టాక్‌మార్కెట్లలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని పరాగ్ పారిఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్(పీపీఎఫ్ఏఎస్) చైర్మన్ నీల్ పారిఖ్ తెలిపారు. మిyŠ , స్మాల్ క్యాప్ స్టాక్స్ గణనీయంగా పతనమైనప్పటికీ.. ఇప్పటికీ ఈ విభాగాల్లో కొన్ని మెరుగైన స్టాక్స్ కూడా ఉన్నాయని చెప్పారు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పీపీఎఫ్ఏఎస్ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) రూ. 1,150 కోట్లుగా ఉండగా, లిక్విడ్ ఫండ్స్‌లో రూ. 85 కోట్లు ఉన్నాయి. త్వరలో ఈఎల్ఎస్ఎస్.. ప్రస్తుతం ప్రధాన ఫండ్‌తో పాటు లిక్విడ్ ఫండ్‌ను కూడా ప్రారంభించామని, త్వరలో ప్రారంభించబోయే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కి ఇది తోడ్పడగలదని పారిఖ్ చెప్పారు. ఫండ్స్ వర్గీకరణపై సెబీ నిబంధనల నేపథ్యంలో తమ ఫండ్ పేరును మల్టీ క్యాప్ ఫండ్ కింద మార్చినట్లు, దీనితో ప్రత్యేకంగా ఒక్కో విభాగానికి ఒక్కో ఫండ్ అవసరం లేకుండా ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘అంతర్జాతీయ స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు మా ఫండ్‌లో ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో విదేశీ స్టాక్స్ వల్ల అవి పెరిగినప్పుడు, ఇటు కరెన్సీ విలువ తగ్గినట్లయితే.. ప్రయోజనం రెండిందాల లభించినట్లవుతుంది. ప్రత్యేకంగా పరిమితులు లేకుండా నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకోవడమన్నది మా వ్యూహం. దేశీయంగా మారుతీ వేల్యుయేషన్స్ కొంత ఎక్కువగా ఉండగా .. మాతృసంస్థ సుజుకీ తక్కువగానే ఉంది. ఎలాగూ మారుతీ రాబడుల ప్రయోజనాలు సుజుకీకి కూడా లభిస్తాయి కాబట్టి.. ఆ సంస్థ షేర్లను మా పోర్ట్‌ఫోలియోలో చేర్చాం. ఇలాంటి వైవిధ్యమైన కూర్పుతో అందిస్తున్నాం’’ అని పారిఖ్ వివరించారు. కార్యకలాపాల విస్తరణ.. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో సుమారు వెయ్యి మంది దాకా క్లయింట్స్ ఉన్నారని, విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బెంగళూరు, న్యూఢిల్లీలో కార్యాలయాలు ప్రారంభించనున్నామని పారిఖ్ చెప్పారు. ప్రస్తుతం మొత్తం 25,000 మంది ఇన్వెస్టర్లు ఉండగా, ఈ సంఖ్యను లక్ష దాకా పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. అయితే, రాశి కన్నా వాసికి ప్రాధాన్యమిస్తూ.. ఇన్వెస్టర్ల సంఖ్యను ఎకాయెకిన పెంచుకోవడం కన్నా మెరుగైన సేవల ద్వారా క్రమానుగతంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను పెంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నామని పారిఖ్ పేర్కొన్నారు. -
టీటీడీపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తిరుమల, తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) చెందిన రూ.1000 కోట్ల నిధులను ప్రైవేటు బ్యాంకు ఇండస్ ఇండ్లో డిపాజిట్ చేయడంపై హైకోర్టు మంగళవారం టీటీడీ ఈవోను వివరణ కోరింది. జాతీయ బ్యాంకులు ఉండగా, ఓ ప్రైవేటు బ్యాంకులో ఎందుకు ఆ వెయ్యి కోట్ల రూపాయలను జమ చేశారో చెప్పాలంటూ టీటీడీ ఈవో, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, తిరుపతి ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీకి చెందిన రూ.1000 కోట్ల నిధులను ప్రైవేటు బ్యాంకు ఇండస్ ఇండ్లో జమ చేయడాన్ని సవాలు చేస్తూ తిరుపతికి చెందిన పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జక్కుల శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఓ ప్రైవేటు బ్యాంకులో వేయడం పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ కూడా టీటీడీ నిధులను ప్రైవేటు వ్యక్తులు జమ చేయలేదన్నారు. నిధుల జమ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవని, అందువల్లే టీటీడీ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రూ.1000 కోట్ల నిధులను ఇండస్ ఇండ్లో జమ చేసే విషయంలో టీటీడీ ఈవో ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, జాతీయ బ్యాంకులు ఉండగా, ఎందుకు ఓ ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేశారో చెప్పాలని టీటీడీ, దేవాదాయశాఖ అధికారులను ఆదేశించింది. -
గృహ, వాహన రుణాలు ఇక భారమే!
సాక్షి, ముంబై: హోంలోన్లు, వెహికల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి. దీనికి రుణగ్రహీతలు సిద్ధంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు తమ కీలక లెండింగ్ రేట్లను పెంచేసిన నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటను అనుసరించనున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో గృహ, కార్లకోసం రుణాలు మరింత భారం కానున్నాయని భావిస్తున్నారు. ముఖ్య ప్రయివేటు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర, ఇందస్ ఇండ్, ఎస్ బ్యాంకు తమ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించాయి. ఈ పెంపు జనవరినుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేశాయి. 2016, ఏప్రిల్ లో కొత్త ఎంసీఎల్ ఆర్ విధానంలోకి ప్రవేశించిన తరువాత ఇదే మొదటి పెంపు అని బ్యాంకులు వివరించాయి. ముఖ్యంగా డిపాజిట్లపై ఎక్కువ వడ్డీరేట్లు చెల్లిస్తున్న ఈ నేపథ్యంలో ఈ పెంపు తప్పలేదని పేర్కొన్నాయి. ఆర్బీఐ సంకేతాల మేరకు ఎంసీఎల్ఆర్ రేటు ఇంతకంటే కిందిగి దిగివచ్చే అవకాశం లేదని కోటక్ మహీంద్ర జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా వెల్లడించారు. కాగా యాక్సిస్బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటును 5శాతం పెంచగా, కోటక్‌మహీంద్ర 5-10శాతం, ఎస్‌బ్యాంక్, ఇందస్ బ్యాంకు 10శాతం పెంచాయి. -
కాస్ట్లీగా మారబోతున్న ఏటీఎం లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ : సామాన్య ప్రజలపై మరో భారం పడబోతుంది. ఏటీఎం ఆపరేటర్లు, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం లావాదేవీల ఇంటర్-బ్యాంకు ఛార్జీలను పెంచాలని నిర్ణయిస్తున్నాయి. ఓ వైపు డిమానిటైజేషన్, మరోవైపు నిర్వహణ వ్యయాలు పెరుగడంతో, ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు పేర్కొన్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ విషయంపై వేరువేరుగా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దీనిపై చర్చించినట్టు తెలిసింది. ఇంటర్ బ్యాంక్ ఛార్జీని ఓ బ్యాంకు కస్టమర్ వేరే బ్యాంకు ఏటీఎంలను వాడుకున్నందుకు ఆ బ్యాంకుకు విధిస్తారు. దీంతో చిన్న ఏటీఎం నెట్వర్క్స్ కలిగి ఉన్న బ్యాంకులకు భారంగా మారుతోంది. వ్యయాల భారం పెరిగిపోతుంది. దీంతో బ్యాంకులు వ్యయాల్లో కొంత భాగాన్ని వినియోగదారులకు తరలించాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇంటర్-బ్యాంకు ఫీజులను పెంచాలని కోరుతుండగా.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే తమ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ ఇంకా వీటిని పెంచితే, తమ కట్టుబాట్లను కోల్పోతామని పేర్కొంటున్నాయి. ఫీజుల పెంపుకు మరో కారణం, ఏటీఎం కంపెనీలు ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతుండటం అని కూడా తెలుస్తోంది. డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగి, ఏటీఎం వాడకం భారీగా తగ్గిపోయింది. దీంతో ఏటీఎం కంపెనీలు ఒత్తిడిలో పడిపోయాయి. -
పాతతరం ప్రైవేటు బ్యాంకులకు మంచి రోజులు
ముంబై: దక్షిణాదికి చెందిన వెనుకటి తరం ప్రైవేటు బ్యాంకులకు మంచి రోజులు ముందున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంటోంది. ఆస్తుల నాణ్యత మెరుగు పడటంతో ఆదాయార్జన అవకాశాలు పెరిగాయని, కొన్నేళ్ల పాటు వరుసగా రుణాల్లో వృద్ధి లేకపోగా, అది మళ్లీ పుంజుకోనుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలియజేసింది. ఫెడరల్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు తామున్న ప్రాంతాల్లో బలమైన స్థితి కారణంగా వేగంగా వృద్ధి చెందనున్నట్టు నివేదికలో పొందుపరించింది. ‘‘అత్యధిక ఆదాయ వృద్ధి అవకాశాలతోపాటు స్థిరమైన నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం), నిలకడైన ఆస్తుల నాణ్యత, తగినంత నిధులు కలిగిన బ్యాంకులకే మా ప్రాధాన్యం. ఈ ఐదు బ్యాంకులు వచ్చే రెండేళ్ల కాలంలో రుణాల్లో 11–22%, ఆదాయాల్లో 12–25% మధ్యలో కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటును సాధించగలవు’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఫెడరల్, సిటీ యూనియన్ బ్యాంకులను కొనుగోలు చేయవచ్చని, మిగిలిన వాటిని హోల్డ్ చేయవచ్చంటూ సిఫారసు చేసింది. -
కొత్త నోట్లు వచ్చేవరకు పాతవి ఉంచాలి
- బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ - తమపై అజమారుుషీ చేసే హక్కు చంద్రబాబుకు లేదని బ్యాంకర్ల ధ్వజం సాక్షి, హైదరాబాద్: కొత్త కరెన్సీ నోట్లు వచ్చే వరకు రద్దు చేసిన పాత రూ. 500, రూ. వెయ్యి నోట్లను చెలామణిలో ఉంచాలని భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బెఫీ) డిమాండ్ చేసింది. బెఫీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స నిర్వహించారు. బెఫీ ప్రధాన కార్యదర్శి వెంకట్రామయ్య మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగు లు సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడు తున్నారని... తమపై అజమారుుషీ చేసే హక్కు ఆయనకు లేదని ధ్వజమెత్తారు. తామంతా రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్నామన్నారు. బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు బ్యాంకు ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని వెంకట్రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి 25 రోజులైనా బ్యాంకులకు పూర్తిస్థారుులో నగదు సరఫరా కావడంలేదని...పైగా ముద్రించిన నగదులో ఎక్కువ భాగం ప్రైవేటు బ్యాంకులకు సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖాతాలు ఎక్కువగా ఉన్న బ్యాంకులకు అధికంగా నగదు సరఫరా చేయాలని, బ్యాంకులు, సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ విధుల నిర్వహణలో ఇప్పటివరకు 11 మంది బ్యాంకు ఉద్యోగులు, నగదు కోసం క్యూలలో నిరీక్షిస్తూ 80 మంది పౌరులు కన్నుమూశారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చే వరకు పాత పెద్ద నోట్లను చెలామణిలోనే ఉంచాలని కోరారు. బ్యాంకులకు చేసిన కొత్త కరెన్సీ సరఫరా వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచిన వారిని వదిలేసి సామాన్యులపై కేంద్రం ప్రతాపం చూపుతోందని సీఐటీయూ నేత సారుుబాబా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ప్రజల వద్ద ఉన్న డబ్బును బయటకు తీసుకొచ్చి విదేశీ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సమావేశంలో ఐఎన్టీయూసీ నేత ప్రకాష్‌గౌడ్, ఏఐటీయూసీ నేతలు సుధీర్, వెంకటేశం, ఇఫ్టూ నేత ఎస్.ఎల్. పద్మ ప్రసంగించారు. -
బ్యాంకుల్లో రూ.450 కోట్లు 'నల్ల'బాట!
-
రూ.450 కోట్లు 'నల్ల'బాట!
భారీగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన రిజర్వుబ్యాంకు ఇందులో పోస్టాఫీసులు, సహకార బ్యాంకులదే ప్రధాన పాత్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మేనేజర్ల చేతివాటం.. ప్రైవేట్ బ్యాంకులపైనా అనుమానాలు బ్యాంకుల్లో నగదు లావాదేవీల పరిశీలనకు ప్రత్యేక బృందాలు రిజర్వుబ్యాంకు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ సాక్షి, హైదరాబాద్ మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన దగ్గర రూ.2 కోట్ల విలువైన పాత రూ.500, 1,000 నోట్లు ఉన్నాయని, ప్రత్యామ్నాయ నగదు ఇస్తే 25 శాతం కమీషన్ ఇస్తానని ఈ నెల 22న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేశారు. అయితే తన బ్యాంకు నుంచి సర్దుబాటు చేయడం కష్టమని.. తాను ఇచ్చే మొబైల్ నంబర్‌ను సంప్రదిస్తే హైదరాబాద్‌లోని ఓ పోస్టాఫీసు నుంచి ప్రత్యేక పార్శిళ్ల ద్వారా కొత్త రూ.2వేల నోట్లను దశలవారీగా సమకూరుస్తారని చెప్పారు. ఆ తరువాత కొద్దిసేపటికే హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసులపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి.. నగదుతో కూడిన కొన్ని పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్లు రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే ఇలా నగదు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నట్లు నిఘా సంస్థలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. దీనిపై అప్రమత్తమయ్యే లోపే దాదాపు రూ.450 కోట్ల మేర నగదు పక్కదారి పట్టినట్లు రిజర్వుబ్యాంకు తాజాగా అంచనాకు వచ్చింది. నగదు ఏయే రూపాల్లో, ఏ విధంగా అక్రమార్కుల చేతికి చేరిందన్న వివరాలను అంతర్గత విచారణ ద్వారా సేకరించింది. కొద్దిరోజుల్లోనే.. నగదు మార్పిడి ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే పోస్టాఫీసులు, సహకార బ్యాంకుల ద్వారా దాదాపు రూ.250 కోట్ల మేర, ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా మరో రూ.200 కోట్ల మేర కొత్త నోట్లు అక్రమార్కులకు చేరినట్లు అంచనా వేశారు. తొలుత 40 శాతం కమీషన్‌పై పాత నోట్లు తీసుకుని ప్రత్యామ్నాయ నగదు అందజేస్తామంటూ మొదలైన అక్రమ వ్యాపారం ఇప్పుడు 15 శాతానికి తగ్గిపోరుుంది. ఓ ఉన్నతాధికారి మాటల్లో చెప్పాలంటే ‘ఇప్పుడు రూ.100, రూ.2,000 నోట్లు ఇస్తామని ముందుకు వచ్చేవారు 10 మంది ఉంటే. పాత నోట్లు తీసుకుంటారా అని అడిగేవారు నలుగురు కూడా లేరు’. ఈ లెక్కన ఇప్పటికే భారీ మొత్తంలో నగదు పక్కదారి పట్టి ఉంటుందని రిజర్వుబ్యాంకు అంచనాకు వచ్చి పలు కోణాల్లో విచారణ జరిపింది. పటిష్టమైన నిఘా సహకార బ్యాంకులకు నగదు తరలించిన 48 గంటల్లోనే పక్కదారి పట్టిన విషయం తెలిసి రిజర్వుబ్యాంకు దిగ్బ్రాంతికి గురైంది. ఆ వెంటనే సహకార బ్యాంకులకు నగదు సరఫరా నిలిపివేసింది. అంతేకాదు సహకార బ్యాంకుల నగదు లావాదేవీలపై విచారణ జరపాలని నాబార్డ్‌ను ఆదేశించింది. తెలంగాణలోని ఏ సహకార బ్యాంకుకు ఎంత మొత్తంలో నగదు వెళ్లిందన్న వివరాలను నాబార్డ్‌తో పాటు సీబీఐకి అందజేసింది. సహకార బ్యాంకుల్లో ప్రతి రూపారుుకి లెక్క అడుగుతున్నామని, అనుమానం వస్తే విచారణ జరిపిస్తామని నాబార్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కొద్ది రోజుల్లోనే నగదు దుర్వినియోగం చేసిన బ్యాంకులు, బాధ్యులైన అధికారుల చిట్టా బయటపెడతామన్నారు. మరోవైపు పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు సక్రమంగా నగదు చేరుతుందని తొలుత రిజర్వుబ్యాంకు భావించినా... వారంలోపే వాటిల్లోనూ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించింది. దీంతో అనుమానిత పోస్టాఫీసులతోపాటు ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల వద్ద నిఘా పెంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొందరు బ్యాంకు మేనేజర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, అనుమానిత కాల్స్‌ను రికార్డు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను నిఘా వర్గాలు సమకూర్చుకున్నాయని తెలుస్తోంది. ఆ సంభాషణల ఆధారంగా కొన్ని లావాదేవీలను గుర్తించారని సమాచారం. నగదు లావాదేవీల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఎక్కువ మొత్తంలో నగదు ఉపసంహరణ, నోట్ల మార్పిడి పేరిట విపరీతంగా రూ.2వేల నోట్లు వినియోగించిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రికార్డుల పరిశీలనకు రిజర్వుబ్యాంకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ బహుళజాతి ఆర్థిక సంస్థ నిపుణుల సేవలను కూడా వినియోగించుకుంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ కొందరు సీనియర్ మేనేజర్లు పలు కంపెనీలు, అత్యవసర సర్వీసుల పేరుతో భారీగా నగదు జారీ చేసిన విషయం బయటపడింది. ఆ నగదు ఉపసంహరించిన వారు ఆ మొత్తాన్ని దేనికి వాడారు, ఎవరెవరికి చెల్లించారన్న వివరాలను సేకరించే పనిని సీబీఐకి అప్పగించినట్లు తెలిసింది. నగదు మార్పిడి పేరుతో ఒక రోజు వచ్చిన ఆధార్, ఇతర డాక్యుమెంట్లను మూడో రోజు, ఏడో రోజు, పదో రోజు సమర్పించి పెద్ద ఎత్తున నగదు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా కూడా విచారణ జరుగుతోందని.. వారిలో కొంతమందిని ప్రశ్చించడంతో పాటు సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని సీబీఐ వర్గాలు వెల్లడించారుు. ఈ అక్రమాలపై ప్రాథమిక నివేదిక అందాకే కేంద్ర ప్రభుత్వం వేలికి ఇంకు గుర్తు పెట్టాలన్న నిర్ణయంతీసుకుందని ఆ వర్గాలు తెలియజేశాయి. త్వరలో అరెస్టులు నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణల్లో అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న కొందరిని సీబీఐ ప్రశ్నిస్తోందని.. త్వరలోనే కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిమందిని సీబీఐ అదుపులోకి తీసుకుందని.. వారిలో కొందరు దళారులతోపాటు, పోస్టాఫీసు, బ్యాంకుల సిబ్బంది ఉన్నారని సమాచారం. -
ఇలాంటప్పుడే ఇన్వెస్ట్ చేయాలి..
పరాగ్ మ్యూచ్‌వల్ ఫండ్ చైర్మన్ నీల్ పారిఖ్ ♦ ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ స్టాక్స్ బాగున్నాయి ♦ ఇన్ఫ్రా షేర్లవైపు చూడకపోవటమే ఉత్తమం ♦ మూడేళ్లుగా ఏటా 20% రాబడి అందిస్తున్నాం ♦ రెండేళ్లలో రూ.1,000 కోట్ల విలువను చేరుకుంటాం సాక్షి, బిజినెస్ బ్యూరో: బ్రెగ్జిట్ వంటి పరిణామాలతో స్టాక్‌మార్కెట్లు తాత్కాలికంగా క్షీణించినా.. పెట్టుబడులు పెట్టేందుకు ఇలాంటి సమయాలే సరైనవని చెప్పారు ఫండ్ సంస్థ పరాగ్ పారిఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ (పీపీఎఫ్ఏఎస్) చైర్మన్ నీల్ పారిఖ్. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ రంగాల షేర్లు కొనుగోళ్లకు అనుకూలమైనవిగా చెప్పారాయన. రెండేళ్లలో రూ. 1,000 కోట్ల ఏయూఎం లక్ష్యంగా నిర్దేశించుకున్న నీల్ పారిఖ్... ‘సాక్షి ప్రాఫిట్ ప్లస్’కిచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... పెట్టుబడికి ఏఏ రంగాలు బాగున్నాయంటారు? బ్రెగ్జిట్తో దేశీ మార్కెట్లు కొంత తగ్గినప్పటికీ.. వెంటనే కోలుకున్నాయి. ఇన్వెస్ట్మెంట్కి ఇలాంటి తరుణాలే సరైనవి. మన దగ్గర బ్రెగ్జిట్ కన్నా రుతుపవనాలే ముఖ్యం. వర్షాలు బాగుంటే.. మార్కెట్లూ బాగుంటాయి. ఈక్విటీలు తగ్గిన ప్రతిసారీ బంగారం లాంటి ఇతర సాధనాలు పెరగడం సహజమే. మళ్లీ పరిస్థితులు మామూలు కాగానే ఆ నిధులు తిరిగి ఈక్విటీల్లోకి వచ్చేస్తాయి. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులు, టెక్నాలజీ స్టాక్స్ బాగుంటాయని అంచనా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ ఎన్పీఏల సమస్యలు తీరేందుకు సమయం పడుతుంది. దీంతో విస్తరణకు ఆస్కారమున్న ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయి. పెట్టుబడులు ఎక్కువగా అవసరమయ్యే మౌలిక రంగ సంస్థలు లాభాల్లోకి రావాలంటే చాన్నాళ్లు పడుతుంది కనక అటువైపు వెళ్లకపోవడం ఉత్తమం. అయితే, ఏదైనా ప్రత్యేక రంగాన్ని ఎంచుకోవడం కన్నా నాణ్యమైన షేర్‌ను ఎంచుకోవడమే ముఖ్యం. 15 శాతం రాబడులు వచ్చినా మెరుగ్గా ఉన్నట్లే. ఆ లెక్కన కొన్నాళ్లలోనే మీ పెట్టుబడి రెట్టింపవుతుంది. ప్రస్తుతం మీ ఫండ్ ఆస్తులెంత? మేం గతంలో పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలందించాం. కానీ నియంత్రణల కారణంగా దాన్నుంచి వైదొలిగి మూడేళ్ల కిందట మ్యూచువల్ ఫండ్ సేవల్లోకి వచ్చాం. ఈ మూడేళ్లలోనే ఫండ్ ఆస్తులు రూ.683 కోట్లకు చేరాయి. 8వేల పైచిలుకు క్లయింట్లున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో సుమారు 150 మంది పైగా ఉన్నారు. ముంబై కేంద్రంగా ఉన్న మా సంస్థ.. పుణె, చెన్నైల్లోనూ సేవలందిస్తోంది. ఏడు వందల పైచిలుకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌తో (ఐఎఫ్ఏ) చేతులు కలిపాం. వచ్చే రెండేళ్లలో ఏయూఎంను రూ.1,000 కోట్ల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మీ ఫండ్ పనితీరు ఎలా ఉంది? రాబడి శాతమెంత? రాశి కన్నా వాసి ముఖ్యమనేది మా నమ్మకం. అందుకే రకరకాల ఫండ్స్‌తో గందరగోళపర్చకుండా పీపీఎఫ్ఏఎస్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ (పీఎల్టీవీఎఫ్) పేరిట ఒకే ఫండ్‌ను తెచ్చాం. మూడేళ్లుగా ఇది వార్షిక ప్రాతిపదికన సుమారు 20 శాతం మేర రాబడులిస్తోంది. సగటున మా క్లయింట్ల ఇన్వెస్ట్మెంట్ సుమారు రూ.8 లక్షల దాకా ఉంటోంది. అలాగని కేవలం సంపన్న ఇన్వెస్టర్లే కాకుండా సామాన్య ఇన్వెస్టర్లకూ అవకాశం ఉండేలా సిప్ విధానాన్ని కూడా అందిస్తున్నాం. నెలనెలా రూ. 1,000 కూడా ఇన్వెస్ట్ చేసే వీలుంది. మీ ఇన్వెస్ట్మెంట్ విధానమేంటి? అంటే... షేర్లలోనేనా లేక డెట్‌లోనూ పెడతారా? ఒకే ఫండ్ ద్వారా ఇటు దేశీ, అటు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేయటం మా ప్రత్యేకత. సాధారణంగా విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇతర సంస్థలు.. ఫీడర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వాటిని డెట్ ఫండ్లుగా పరిగణించడం వల్ల పన్నులూ ఎక్కువే ఉంటున్నాయి. కానీ మా పోర్ట్‌ఫోలియోలో నేరుగా సుమారు 65% దేశీ ఈక్విటీలు, డెట్ మార్కెట్లకు, 35% విదేశీ ఈక్విటీలకు కేటాయిస్తున్నాం. స్టాక్స్, కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనైనా మా హెడ్జింగ్ వ్యూహంవల్ల ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులొస్తాయి. దీంతో పాటు దీర్ఘకాలికం కనక పన్ను ప్రయోజనా లూ ఉంటాయి. విదేశీ షేర్లలో యాపిల్, గూగుల్ వంటివి కూడా మా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. మీ ఫండ్ ప్రత్యేకతలేంటి? పూర్తి పారదర్శకత ఉంటుంది. ఇన్వెస్టర్లకు భరోసా కలిగేలా స్వయంగా కంపెనీ ప్రమోటర్లు, ఉద్యోగులు దీన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫండ్ పెట్టుబడుల్లో సు మారు 13% మాదే. పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగిస్తేనే లాభాలొస్తాయి. అందుకే కనీసం ఐదేళ్లయినా కొనసాగించే వారికే ఇది అనువైనదని ముందే చెబుతున్నాం. దాన్ని బట్టి వారు తగు నిర్ణయం తీసుకోవచ్చు. ఎగ్జిట్ లోడ్ తొలి ఏడాది రెండు శాతంగాను, ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఒక్క శాతంగాను ఉంది. -
జోరుగా ముందస్తు పన్ను వసూళ్లు
అగ్రస్థానంలో ప్రైవేట్ బ్యాంక్‌లు ముంబై: ముందస్తు పన్ను వసూళ్లు డిసెంబర్ క్వార్టర్లో జోరుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 45 కంపెనీల నుంచి అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు 12 శాతం వృద్ధితో రూ.24,279 కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు రూ.21,681 కోట్లుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరతామని ప్రధాన ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ డి. ఎస్. సక్సేనా చెప్పారు. ప్రైవేట్ బ్యాంక్‌ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు జోరుగా ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు అగ్రస్థానంలో ఉన్నాయని, మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు ప్రోత్సాహ కరంగా లేవని పేర్కొన్నారు. -
లాభాల్లో ప్రైవేటుదే పైచేయి..!
తొలిసారి నికరలాభంలో ప్రభుత్వ బ్యాంకుల కన్నా ముందంజ ప్రభుత్వ బ్యాంకులకు మొండిబకాయిలు గుదిబండలా మారుతున్నాయి. నానాటికీ ఇవి కొండలా పేరుకుపోతుండటంతో ఆ ప్రభావం వాటి లాభాలపై పడుతోంది. అందుకే... తొలిసారిగా దేశంలో 24 ప్రభుత్వ బ్యాంకుల మొత్తం నికర లాభాన్ని 13 ప్రయివేటు బ్యాంకుల నికరలాభం మించిపోయింది. దేశ చరిత్రలో తొలిసారి ఉమ్మడిగా ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటు బ్యాంకులు అధిగమించాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 25 ప్రభుత్వ బ్యాంకుల మొత్తం నికరలాభం రూ.33,976 కోట్లు కాగా... టాప్ 13 ప్రైవేటు బ్యాంకుల ఉమ్మడి నికరలాభం రూ.37,361 కోట్లకు చేరింది. అంటే రూ.3,385 కోట్లు ఎక్కువన్న మాట. మొండిబకాయిల కోసం, రాని బకాయిల కోసం ప్రభుత్వ బ్యాంకుల పక్కనబెట్టిన మొత్తం (ప్రొవిజనింగ్) విపరీతంగా పెరిగిపోవటంతో వాటి నికరలాభం గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) ఈ సారి ఏకంగా 0.58 శాతం పెరిగి 5.47 శాతానికి చేరుకున్నాయి. అదే ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఎన్పీఏల స్థాయి ఇంతలా లేదు. ఈ ఏడాది పెరుగుదల 0.19 శాతం మాత్రమే ఉండగా మొత్తం ఎన్పీఏల శాతం 2.01గా ఉంది. అందుకే నిరర్ధక ఆస్తుల నిమిత్తం ప్రైవేటు బ్యాంకులు రూ.10,852 కోట్లు కేటాయించగా ప్రభుత్వ బ్యాంకులు ఏకంగా రూ.72,095 కోట్లు కేటాయించాయి. ఇదే వాటి నికరలాభం తగ్గుదలకు ప్రధాన కారణంగా మారింది. చిత్ర మేంటంటే ఏడాది కిందట పరిస్థితి ఇలా లేదు. 13 ప్రయివేటు బ్యాంకుల మొత్తం నికర లాభం కన్నా 24 ప్రభుత్వ బ్యాంకులే రూ.2,312 కోట్లను అధికంగా ఆర్జించాయి. సగానికి క్షీణించిన నికరలాభం... ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండింటి నికరలాభం గతేడాదితో పోలిస్తే సగమే నమోదయింది. గతేడాదికన్నా ఏకంగా 134 శాతం అధికంగా బీఓబీ ఏకంగా రూ.1,491 కోట్లను ఎన్పీఏల కోసం కేటాయించింది. చిత్రమేంటంటే ఈ విషయమై బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ, సీఈఓ రంజన్ ధావన్ ఇటీవల మాట్లాడుతూ... తదుపరి సంవత్సరానికి అంటే 2015-16కు ఎన్పీఏలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేమనటం. ‘‘బడా కార్పొరేట్ సంస్థలు చాలావరకూ దారుణమైన కష్టాల్లో ఉన్నాయి. అలాంటి వాటిని ఎన్పీఏలుగా ప్రకటించాలా? లేదా? అనే విషయమై ఇంకా చర్చ జరుగుతోంది. నా ఉద్దేశం ప్రకారం వచ్చే ఐదారు నెలల్లో ఇవి ఎన్పీఏలుగా మారకపోవచ్చు. అలా మారితే గనక ఒకే కంపెనీ నుంచి వందల కోట్లు రాని బాకీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది’’ అని చెప్పారు. పీఎన్బీ విషయానికొస్తే ఈ ఏడాది దాదాపు 76% అధికంగా రూ.7,979 కోట్లను రాని బాకీల కోసం కేటాయించింది. దీనిపై బ్యాంకు ఎండీ, సీఈఓ గౌరీ శంకర్ మాట్లాడుతూ ‘‘రాని బాకీలుగా గుర్తించిన వాటిలో కొన్ని రికవరీ అయ్యే చాన్సుంది. అదే జరిగితే ప్రొవిజనింగ్ మారి లాభం పెరుగుతుంది’’ అన్నారు. ఇన్ఫ్రా, ఉక్కు రంగాలు బాగా దెబ్బతిన్నట్లు చెప్పారాయన. ఈ మధ్యే దీనిపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా మాట్లాడతూ ఎన్పీఏలు అన్నిచోట్లా ఒకేలా లేవని, ప్రభుత్వ బ్యాంకుల్లో బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎస్బీఐ కేటాయింపులు రూ. 25,812 కోట్లు ఉదాహరణకు ఎస్బీఐను చూస్తే 2014-15 కోసం కేటాయించిన రూ.25,812 కోట్లలో రూ.19,086 కోట్లు రాని బాకీల కోసమే. దీంతో మొత్తం కేటాయింపులు ఈ ఏడాది ఏకంగా 21.6% పెరిగినట్లయింది. ప్రొవిజనింగ్.. - ఒక ఖాతా గనక ఏడాదిపాటు నిరర్థక ఆస్తిగా దాన్ని నాసిరకంగా పరిగణిస్తారు. అలాంటి ఖాతాకోసం 15% మొత్తాన్ని కేటాయించాలి. - నాసిరకంగా 12 నెలలు కొనసాగితే దాన్ని రికవరీ అవుతుందో రాదో తెలియని సందేహాస్పద ఖాతాగా పరిగణిస్తారు. దీనికి కనీసం 25%, గరిష్టంగా 100% ప్రొవిజనింగ్ చేయాలి. -
సీడీ రేషియో.. మూడు, నాలుగు స్థానాల్లో ఏపీ, తెలంగాణ
ముంబై: క్రెడిట్-డిపాజిట్ల రేషియో(సీడీ)లో ఆంధ్రప్రదేశ్ 109 శాతంతో మూడో స్థానంలో, 106 శాతంతో తెలంగాణ నాల్గో స్థానంలో ఉన్నాయి. సీడీ రేషియోలో 121 శాతంతో తమిళనాడు అగ్ర స్థానంలో, 114.9 శాతంతో చండీగఢ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. బ్యాంకులు సేకరించిన డిపాజిట్లతో పోలిస్తే అవి ఇచ్చిన రుణాల నిష్పత్తి శాతాన్నే సీడీ రేషియోగా వ్యవహరిస్తారు. క్యూ3లో 10%కి తగ్గిన బ్యాంకు పరపతి వృద్ధి రిజర్వు బ్యాంకు సమాచారం ప్రకారం క్యూ3లో బ్యాంకు పరపతి వృద్ధి 10 శాతానికి తగ్గింది. ఇది గతేడాది అదే త్రైమాసికంలో 14.2 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం డిపాజిట్లలో వృద్ధి గతేడాది 15.4 శాతంగా ఉంటే, ఈ ఏడాది వృద్ధి మాత్రం 10.9 శాతంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాలలో బ్యాంకు పరపతి, డిపాజిట్ల సంఖ్య తగ్గింపు కనిపించిందని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిట్లలో 73.3 శాతాన్ని, పరపతిలో 71.2 శాతాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిగి ఉన్నాయని తెలిపింది. అలాగే డిపాజిట్లలో ప్రైవేట్ బ్యాంకుల శాతం 19.2గా, పరపతిలో 21 శాతంగా ఉందని పేర్కొంది. మెట్రోపాలిటన్ నగరాల్లో డిపాజిట్ల సంఖ్య 53.1 శాతంగా, పరపతి 64.2 శాతంగా ఉందని తెలిపింది. ఈ నగరాల్లో క్రెడిట్- డిపాజిట్ల రేషియో అత్యధికంగా 92.3% ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా సీడీ రేషియో 76%గా ఉంది. -
పవాసీల కోసం ఐసీఐసీఐ ‘ఈజీ ఎన్నారై అకౌంటు’
దుబాయ్: మధ్య ప్రాచ్య దేశాల్లోని ప్రవాస భారతీయుల కోసం ‘ఈజీ ఎన్నారై అకౌంటు’ పేరిట ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఖాతా సదుపాయాలను ప్రారంభించింది. మినిమం బ్యాలెన్స్ సమస్య లేకుండా ఎన్నారైలు స్వదేశాలకు నగదు పంపేందుకు(రెమిటెన్స్) ఈ ఖాతాలు ఉపయోగపడగలవని బ్యాంకు తెలిపింది. నెలవారీ సగటున బ్యాలెన్స్ రూ. 2,000 ఉంటే చాలని పేర్కొంది. ఒకవేళ అంతక్రితం 3 నెలల్లో రూ. 20,000 గానీ రెమిట్ చేసిన పక్షంలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినప్పటికీ ఎలాంటి చార్జీలు ఉండవు. ఎన్నారైలు అత్యంత తక్కువగా రూ. 500 నుంచి రికరింగ్ డిపాజిట్లు కూడా చేసే అవకాశం ఉంది. మనీ2ఇండియాడాట్‌కామ్ యూజర్ల కోసం కాల్2రెమిట్ సర్వీసులను కూడా ఐసీఐసీఐ బ్యాంకు ప్రారంభించింది. ఎం2ఐ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఖాతాదారులు మనీ ట్రాన్స్ఫర్ సేవలు పొందొచ్చని బ్యాంకు పేర్కొంది. -
‘ధన జన’పై బ్యాంకుల ఆసక్తి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రైవేటు బ్యాంకులు ప్రధానమంత్రి జన ధన యోజన పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడానికి ప్రైవేటు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన జన ధన యోజన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నట్లు దేశీయ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐతో పాటు డీసీబీ బ్యాంక్, యాక్సిస్, ఫెడరల్ బ్యాంకులు ప్రకటించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ పథకం కింద 25 లక్షల ఖాతాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తెలిపారు. తమ 3700 శాఖల నెట్‌వర్క్‌లో ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినప్పటికీ గ్రామీణ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్న డీసీబీ బ్యాంక్ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించినట్లు డీసీబీ బ్యాంక్ అగ్రి, ఇంక్లూజివ్ బ్యాంక్ హెడ్ నరేంద్రనాథ్ మిశ్రా తెలిపారు. ఈ పథకం ప్రారంభిస్తున్న గురువారం ఒక్క రోజులో దేశ వ్యాప్తంగా కోటి ఖాతాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా కోటిన్నర ఖాతాలను తెరవడం విశేషం. ప్రభుత్వం రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతోనే ఈ విజయం సాధ్యమైందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మాకు 2.5 లక్షల ఖాతాలను తెరిపించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించగా, ఏకంగా 4.7 లక్షల ఖాతాలను ప్రారంభించామని, ఇందులో ప్రైవేటు బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాయని తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్, ఎస్బీహెచ్ ఎండి శంతను ముఖర్జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మార్కెట్లోకి వేగంగా చొచ్చుకు వెళ్ళగలుగుతున్నామని, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 15,600 గ్రామాల్లోకి ప్రవేశించ గలిగినట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఈ ఒక్క రోజులోనే 3.62 లక్షల ఖాతాలను తెరిచినట్లు ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. ఎస్బీఐ స్పాన్సర్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 90,773 ఖాతాలను ప్రారంభించినట్లు ఆ బ్యాంక్ చైర్మన్ వి.నర్సిరెడ్డి పేర్కొన్నారు. బీమా కంపెనీలు కూడా.. ఈ కార్యక్రమంలో ప్రైవేటు బ్యాంకులే కాకుండా ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ముందుకు రావడం విశేషం. జన ధన యోజన పథకం కింద ఖాతాదారునికి అందిస్తున్న ఉచిత బీమా రక్షణను కల్పించడానికి ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ ఎర్గో ముందుకొచ్చింది. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఫైనాన్సియల్ సంస్థలు ముందుకొస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యాలను నిర్దేశిత కాలానికంటే ముందే చేరుకోగలమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. -
ఐబిఎ నూతన చైర్మన్ ఎవరు?
Banks Special GENERAL AWARENESS 1. Which of the following private banks announced EMI facility on debit cards to enable its customers to convert their high value transactions into easy installments on August 19, 2014? 1) ICICI Bank 2) Axis Bank 3) HDFC Bank 4) IndusInd Bank 5) Yes Bank 2. Which senior congress leader took over as the new Chairman of Parli-ament's Public Accounts Comm-ittee (PAC) on August 20, 2014? 1) Kamal Nath 2) K.V. Thomas 3) Mallikarjun Kharge 4) A.K. Antony 5)Jairam Ramesh 3. U.R. Ananthamurty died on August 22, 2014. He won the 1994 Jnanpith Award for writings in which of the following languages? 1) Telugu 2) Tamil 3) Kannada 4) Malayalam 5) Marathi 4. Who was elected as the Chairman of the Indian Banks' Association (IBA) for 2014-15? (He succeeds K.R. Kamath) 1) Rakesh Sethi 2) C.V.R. Rajendran 3) S.S. Mundra 4) T.M. Bhasin 5) R.K. Dubey 5. Who bagged India's first medal in the second Youth Olympic Games by winning a silver in the men's 77kg weightlifting catego-ry in Nanjing, China on August 22, 2014? 1) Maymon Poulose 2) Mithra Varun 3) Lalu Taku 4) Ragala Venkata Rahul 5) None of these 6. The world's first Hindu eco te-mple Shree Swaminarayan Mandir was opened in which of the following cities on August 19, 2014? 1) Angkor Wat 2) New Delhi 3) London 4) Chicago 5) New York 7. Who won the men's singles title at the 44th All India inter-institutional table tennis championship in New Delhi on August 22, 2014? 1) Soumyajit Ghosh 2) Sanil Shetty 3) Sarthak Gandhi 4) G.Sathiyan 5) Sourav Saha 8. Who won the women's singles title at the 44th All India inter-institutional table tennis cham-pionship on August 22, 2014? 1) Poulomi Ghatak 2) Pooja Sahasrabudhe 3) Mousumi Paul 4) Madhurika Patkar 5) Nikhat Bhanu 9. Identify the mismatched pair? Public Sector Bank CMD 1) Punjab National Bank K.R. Kamath 2) UCO Bank Arun Kaul 3) Oriental Bank of Commerce S.L. Bansal 4) Indian Bank T.M. Bhasin 5) Bank of India Rajeev Rishi 10. The Depositor Education and Awareness Fund (DEAF) has be-en announced by? 1) Public sector banks 2) SEBI 3) SBI 4) RBI 5) Government of India 11. An unclaimed deposit is one wherein an account is not operated for? 1) Six months 2) One year 3) Two years 4) Ten years 5) Five years 12. The Hindustan Motors suspe-nded the production of which of the following cars in May 2014? 1) Morris Oxford 2) Ambassador 3) Contessa 4) Land Rover 5) None of these 13. With which of the following is the term 'pre-shipment finance' related? 1) Farm credit 2) Consumer credit 3) Export credit 4) Industrial credit 5) None of these 14. Recapitalization in public sector banks is done to meet the? 1) CASA ratio 2) Capital adequacy norms 3) Ratio of NPAs 4) Credit to deposit ratio 5) None of these 15. Mukul Rohatgi has recently been appointed as the new? 1) Chief Information Commissi-oner 2) Chief Vigilance Commissi-oner 3) Solicitor General 4) Principal Secretary to the Pri-me Minister 5) Attorney General 16. Which country suspended $10 million contribution to the Com-monwealth secretariat over alle-ged human rights abuses in Sri Lanka? 1) UK 2) India 3) Bangladesh 4) New Zealand 5) Canada 17. Who is the Commonwealth Cha-irperson-in-Office at present? 1) Queen Elizabeth II 2) Kamalesh Sharma 3) Mahinda Rajapakse 4) David Cameron 5) Stephen Harper 18. Nobel laureate Muhammad Yunus is well known for his contribution to Bangladesh's? 1) Agro credit sector 2) Consumer credit sector 3) Housing finance sector 4) Micro credit sector 5) Retail credit sector 19. Sachin Tendulkar has been named as the goodwill am-bassador for the 35th National Games to be held in? 1) Manipur 2) Jharkhand 3) Kerala 4) Goa 5) Maharashtra 20. The United Nations and the In-ternational Olympic Committee (IOC) have signed a historic agreement in April 2014 to use the power of sports to promote? 1) World trade and commerce 2) Peace and development 3) Literacy and awareness 4) Peaceful uses of nuclear tech-nology 5) None of these 21. The Indian Banks' Association members comprise of? 1) Public sector banks 2) Private sector banks 3) Foreign banks having offices in India 4) Urban cooperative banks 5) All the above 22. Which of the following was sta-rted in 1946? 1) RBI 2) NABARD 3) SBI 4) IBA 5) None of these 23. Which of the following is the location of the permanent office of the International Mathema-tical Union (IMU)? 1) Paris 2) Frankfurt 3) Berlin 4) Berne 5) Madrid 24. The International Congress of Mathematicians (ICM) will be held in which of the following cities in August 2018? 1) Hyderabad 2) Madrid 3) Melbourne 4) Rio de Janeiro 5) Durban 25. Kruger National Park is in the news recently. It is located in? 1) Kenya 2) Ethiopia 3) Somalia 4) Tunisia 5) South Africa 26. Which of the following is known as the Jasmine Revolution? 1) Czech uprising 2) Sudan uprising 3) Libyan uprising 4) Syria revolution 5) Tunisian revolution 27. Turkey is a member of which of the following groups/ organiza-tions? 1) G20 2) NATO 3) ASEAN 4) Both 1 and 2 5) All 1, 2 and 3 28. Mark Rutte is in the news recently. He is the Prime Minister of which of the following countries? 1) Slovenia 2) Belgium 3) Netherlands 4) Luxembourg 5) Finland 29. The third edition of the Nuclear Security Summit was held in which of the following cities on March 24-25, 2014? 1) Seoul 2) The Hague 3) New Delhi 4) Tokyo 5) Sydney 30. The Nuclear Security Summit aims to prevent nuclear terrorism by? 1) Reducing the amount of dan-gerous nuclear material in the world 2) Improving the security of all nuclear material and radio-active sources 3) Improving international coo-peration 4) Both 1 and 2 5) 1, 2 and 3 KEY 1) 1; 2) 2; 3) 3; 4) 4; 5) 4; 6) 3; 7) 4; 8) 1; 9) 5; 10) 4; 11) 4; 12) 2; 13) 3; 14) 2; 15) 5; 16) 5; 17) 3; 18) 4; 19) 3; 20) 2; 21) 5; 22) 4; 23) 3; 24) 4; 25) 5; 26) 5; 27) 4; 28) 3; 29) 2; 30) 5. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల్లో ఇంధనాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - కె.నరేంద్రనాథ్, కాచిగూడ ఏ పోటీ పరీక్ష అయినా ఎగ్జామినర్‌కి తప్పకుండా మదిలో మెదిలే అంశం ఇంధనాలు. సాంప్రదాయికంగా వాడుకలో ఉన్న పిడకలు, కలప మొదలుకొని ఎల్పీజీ, గోబర్ గ్యాస్ లాంటివన్నీ ఇంధనాలే. సాధారణంగా పెట్రోల్, కిరోసిన్, డీజిల్ లాంటి ద్రవ ఇంధనాలు; ఎల్పీజీ, సీఎన్జీ లాంటి వాయు ఇంధనాలకు ఆధారం పెట్రోలియం. క్రూడ్ ఆయిల్‌ను ‘పాక్షిక అంశిక స్వేదన’ పద్ధతిలో రిఫైనరీల్లో శుద్ధిచేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. పోటీ పరీక్షల్లో ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలతోపాటు వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఏయే అనుఘటకాలు వస్తాయో అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మొదట సహజవాయువు వస్తుంది. చివరగా ‘తారు’ మిగులుతుంది. వివిధ ఇంధనాల్లోని రసాయన పదార్థాల గురించి కూడా అడగవచ్చు. సాధారణంగా ఏ ఇంధనమైనా వివిధ హైడ్రోకార్బన్ల మిశ్రమం. ఉదాహరణకు ఎల్పీజీలో ప్రధాన అనుఘటకం ‘బ్యూటేన్’, సహజ వాయువులో ఉండే ప్రధాన వాయువు ‘మీథేన్’. ఇవేకాకుండా జీవ వ్యర్థాల నుంచి తయారయ్యేది బయోగ్యాస్. పేడ నుంచి తయారయ్యేది గోబర్ గ్యాస్. రెండింట్లోనూ ప్రధాన అనుఘటకం మీథేన్. ఇవన్నీ హైడ్రోకార్బన్‌లే. అంటే కార్బన్, హైడ్రోజన్‌లతో నిర్మితమై ఉన్నాయి. వీటిని మండించినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి వెలువడతాయి. రాకెట్లలో తక్కువ బరువుండి ఎక్కువ శక్తినిచ్చే ఇంధనాలు కావాలి. ద్రవ హైడ్రోజన్ మంచి ఇంధనం. ఇది మండినప్పుడు కేవలం నీరు విడుదలవుతుంది. ఇది పర్యావరణ హితమైన (నష్టం చేయని) ఇంధనం. ప్రతి గ్రాముకి ఎంత శక్తివిడుదలవుతుందనేది ఆ ఇంధన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. దేనికి ఎక్కువ కెలోరిఫిక్ విలువ ఉంటే దాని సామర్థ్యం అధికం. ఇంధనాలపై ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అలాగే హైడ్రోకార్బన్ల గురించి తప్పనిసరిగా చదవాలి. - డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ. -
మిగిలే ప్రభుత్వ బ్యాంకులు.. ఏడే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇరవై ప్రైవేటు బ్యాంకుల్ని 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేసిన 45 సంవత్సరాల తర్వాత వీటిని ఒకదానిలో మరోదానిని విలీనం చేసేందుకు కొత్త ప్రభుత్వం పావులు కదుపుతోంది. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఈ అంశం బ్యాంకింగ్ వర్గాల్లో ఇటీవల బాగా చర్చకు దారితీస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి జి.ఎస్.సంధు మాటలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల మధ్య విలీనాలను చేపడతామని జైట్లీ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యక్తం చేయడమే కాకుండా, మొన్నటి బడ్జెట్లో ఆ దిశగా గట్టి సంకేతాలనే ఇచ్చారు. ఈ ఏడాది కనీసం మూడు ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే విధంగా ముందుకెళుతున్నామని, ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో ఒకటి రెండుతోపాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సంధు తెలిపారు. మిగిలేవి ఎన్ని? ఎస్బీఐ అనుబంధ బ్యాంకులతో కలుపుకుంటే దేశంలో ప్రస్తుతం 26 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో అత్యధిక బ్యాంకులను కలపడం ద్వారా మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల సంఖ్యను ఏడుకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోందని సమాచారం. ఇందుకోసం ప్రధానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకులు అత్యధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం, శాఖల సంఖ్య, బ్యాంకుల వ్యవహార శైలి వంటి అంశాల ఆధారంగా బ్యాంకుల మధ్య విలీనాలను ప్రోత్సహిస్తున్నట్లు సంధు తెలిపారు. బ్యాంకుల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, వాటి వినియోగం ఆధారంగా ఎస్బీఐ క్యాప్ ఇచ్చిన నివేదిక ప్రకారం పీఎస్‌యూ బ్యాంకులను గ్రూపులుగా వర్గీకరించింది. ప్రధానంగా నాలుగు లక్షల కోట్ల వ్యాపారం దాటి ఉండి, నాలుగు వేలకు పైగా శాఖలు కలిగిన బ్యాంకులను ప్రధాన బ్యాంకులుగా చేసి వాటి కింద మిగిలిన బ్యాంకులను చేర్చడం జరిగింది. దీనికి కోర్ బ్యాంకింగ్ సేవలు ఇచ్చి పుచ్చుకోవడానికే అని పేరు పెట్టినప్పటికీ విలీన సమయంలో సాంకేతిక పరిజ్ఞానం విషయంలో బ్యాంకుల మధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని ప్రకారం ఇప్పటికే పలు బ్యాంకులు కలిసి పనిచేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్‌ను ఓబీసీతో కలిపి బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపులో చేర్చారని, దీని ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్, ఓబీసీలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని బ్యాంకింగ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తన పేరెంట్ బ్యాంక్ ఎస్బీఐలో విలీనం కానుంది. ఇదే తరహాలో మిగిలిన బ్యాంకుల మధ్య విలీన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ స్పందిస్తూ, ప్రభుత్వ బ్యాంకుల మధ్య విలీనాలు తప్పవని, కానీ దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. అనుబంధ బ్యాంకుల విలీనం గురించి మూడు నాలుగు నెలల్లో ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎస్బీఐ చైర్పర్సన్ అరుధంతీ భట్టాచార్య ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుబంధ బ్యాంకుల్లో ఎస్బీహెచ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో లీడ్ బ్యాంక్‌గా ఉండటంతోఎస్బీహెచ్ విలీనం చివర్లో ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా ఇప్పటికే స్టాక్ మార్కెట్లో నమోదైన ఎస్బీ బికనీర్ అండ్ జైపూర్, ఎస్బీ మైసూర్‌తో అనుబంధ బ్యాంకుల విలీనం మొదలు కావచ్చన్నది అంచనా. తట్టుకునే దిశగా.. రూ. 4 లక్షల కోట్ల వ్యాపారాన్ని, 4,000 మించి శాఖల్ని ఏర్పాటుచేయడం ద్వారా విలీనం నుంచి తప్పించుకోవచ్చని టార్గెట్ బ్యాంకులు భావిస్తున్నట్లు కొంతమంది బ్యాంకింగ్ అధికారుల మాటల్ని బట్టి అవగతమవుతోంది. ఇందుకు ఆయా బ్యాంకులు విభిన్నమైన వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు టేకోవర్ టార్గెట్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ తన గ్రామీణ బ్యాంకులను విలీనం చేసుకోవడం, శాఖల విస్తరణ ద్వారా ప్రధాన బ్యాంక్ స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తోంది. మా బ్యాంక్‌కు చెందిన మూడు ఆర్ఆర్బీలను కలుపుకుంటే బ్యాంకు శాఖల సంఖ్య పెరగడమే కాకుండా మూలధనం కూడా పెరుగుతుందని, దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్ సీఎండీ టి.ఎం.భాసిన్ తెలిపారు. ఇదే దిశగా కెనరా బ్యాంక్ కూడా ఆర్ఆర్బీలను విలీనం చేసుకుంటున్నట్లు ఆ బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దుబే తెలిపారు. మరో టేకోవర్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా వచ్చే ఏడాదిలోగా రూ.5 లక్షల కోట్ల వ్యాపార పరిమాణం చేరుకోవడం ద్వారా టాప్ 5 బ్యాంకుల్లో ఒకటిగా నిలవాలనుకుంట్లున్న ఆ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్ర పేర్కొన్నారు. విలీనం ఎందుకు..? ప్రపంచంలో టాప్ 10 బ్యాంకులను తీసుకుంటే అందులో మూడు చైనా బ్యాంకులే ఉన్నాయి. కానీ మన దేశంలో 26 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నా ఒక్కటి కూడా వాటి దరిదాపుల్లో లేవంటే అతిశయోక్తి కాదు. అంతే కాకుండా ఒక్క మధ్యస్థాయి ప్రాజెక్టుకు ఒక బ్యాంక్ సొంతంగా రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇందు కోసం నాలుగైదు బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పాటు కావాల్సి వస్తోంది. దీంతో పీఎస్‌యూ బ్యాంకులను కలిపి 5-6 ప్రధాన బ్యాంకులుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయాన్ని బ్యాంకింగ్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. బ్యాంకుల మధ్య విలీనం చేస్తే అవి పెద్ద బ్యాంకులుగా తయారవుతాయే కాని పటిష్టమైన బ్యాంకులు కాలేవని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు అంటున్నారు. బ్యాంకుల విలీనానికి సంబంధించి ప్రధానమైన అడ్డంకి ఉద్యోగుల నుంచే వస్తోంది. ప్రస్తుత బ్యాంకుల్లో లభిస్తున్న ప్రయోజనాలు విలీన బ్యాంకుల్లో కలిపించినా, అదే విధంగా ప్రమోషన్ల విషయంలో కూడా స్పష్టమైన విధానం ప్రకటి చినా ఈ సారి ఉద్యోగుల నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చని కొంతమంది యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నాయర్ కమిటీ సిఫార్సులను తిరస్కరించి, 51 శాతం ప్రభుత్వ వాటాను కొనసాగిస్తామన్న హామీ ఇవ్వడంతో యూనియన్లు పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనంపై కొంత మెత్తబడినట్లు కనిపిస్తోంది. -
ఇక... పోస్టల్ ఏటీఎం సెంటర్లు!
జిల్లాలో మొదటగా 5 కేంద్రాలు హెడ్ పోస్టాఫీసుల్లో ఏర్పాటు హన్మకొండ, వరంగల్, జనగాం, పరకాల, మహబూబాబాద్‌లో పరిశీలన పూర్తి తీరనున్న ఖాతాదారుల వెతలు హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : టెలిఫోన్, సెల్ఫోన్ల ప్రభావంతో పోస్ట ల్ శాఖలో కీలకమైన టెలిగ్రాం వ్యవస్థ మూతపడితే... ప్రైవేట్ కొరియర్లతో పోస్టు కార్డు జో రు తగ్గిన విషయం తెలిసిందే. వీటికి తోడు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల పోటీకి పోస్టాఫీసుల్లో పొదుపు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అ న్ని విధాలుగా వెనుకబడిన పోస్టల్ శాఖ... ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. తాజాగా ఏటీఎం సెంటర్లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. సేవింగ్స్ బ్యాంక్ (ఎస్బీ) ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఐదు ఏటీఎం సెంటర్లు జిల్లాలో హన్మకొండ, వరంగల్ డివిజన్లుగా పోస్టల్ శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తోం ది. హన్మకొండ డివిజన్ పరిధిలో జనగాం, పరకాల, హన్మకొండలో మూడు హెడ్ పోస్టాఫీసులుండగా... 47 సబ్ పోస్టాఫీసులున్నా యి. మరో 372 బ్రాంచీల్లో పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నారుు. వరంగల్ డివిజన్ పరిధిలో వరంగల్‌తోపాటు మహబూబాద్‌లలో హెడ్ పోస్టాఫీసులు, 41 సబ్ పోస్టాఫీసులుండగా... 300 బ్రాంచీలున్నా రుు. మొదటగా జిల్లావ్యాప్తంగా ఐదు హెడ్ పోస్టాఫీసు ల్లో ఏటీఎం సెంటర్ల ఏర్పాటుకు పోస్టల్ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. నెల రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఇన్ఫోసిస్, సిఫి కంపెనీల ఇంజినీర్ల బృందం ఇటీవల హన్మకొండ, వరంగల్, జనగాం, పరకా ల, మహబూబాబాద్ పోస్టాఫీసులను పరిశీ లించింది. అంతేకాకుండా... పోస్టల్ శాఖ అధికారులు హెడ్ పోస్టాఫీసుల పరిధిలో ఎస్బీ ఖాతాల వివరాలను కంప్యూటర్లో పొందుపరిచే ప్రక్రియను కూడా చేపట్టారు. ఈ మేరకు వచ్చే ఏడాదిలో పోస్టల్ ఏటీఎంలను నెలకొల్పనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నారుు. జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది సేవింగ్ బ్యాంక్ ఖాతాదారుల ఉన్న ట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ ఏటీఎంలు అందుబాటులోకి వస్తే... వినియోగదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన బాధ తీరినట్లే. అంతేకాదు... వారు తమ తమ ఖాతాల్లో ఎప్పుడైనా నగదు వేసుకోవచ్చు.... ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు.