నిఫ్టీ 23,750 స్థాయిపైకి
ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డులు
ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రయ్
ముంబై: ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 78 వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ ఈ ఏడాదిలో 34వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.
మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 823 పాయింట్లు ఎగసి 78,165 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 78,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు బలపడి 23,754 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 183 పాయింట్లు బలపడి 23,721 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ రియలీ్ట, విద్యుత్, వినిమయ, మెటల్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
రికార్డుల ర్యాలీకి కారణాలు
⇒ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికల అమలుపై మంత్రిత్వ శాఖలు దృష్టి సారించడంతో ట్రేడర్లు ఎఫ్‌అండ్‌ఓలపై బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నిఫ్టీ జూలై సిరీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోకి పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఎఫ్‌అండ్‌ఓ గణాంకాలు సూచిస్తున్నాయి.
⇒ ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. యాక్సిస్ బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.32% కోటక్ బ్యాంక్ అరశాతం మేర రాణించాయి. అలాగే పీఎస్‌యూ ఎస్‌బీఐ బ్యాంకు షేరూ ఒకశాతానికి పైగా లాభపడింది.
⇒ మూడోసారి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవరింగ్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం.
⇒ గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచి్చన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి.
స్టాన్లీ లైఫ్‌స్టైల్ ఐపీవో సక్సెస్ 96 రెట్లు అధిక స్పందన
లగ్జరీ ఫరీ్నచర్ బ్రాండ్(కంపెనీ) స్టాన్లీ లైఫ్‌స్టైల్ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 96 రెట్లు సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. కంపెనీ 1.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 98.57 కోట్ల షేర్లకు స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 18 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 351–369 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 537 కోట్లు సమీకరించింది.
⇒ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేరు 19% పెరిగి రూ.1,647 వద్ద ముగిసింది. లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు స్లొవేకియా సంస్థ జీఐబీ ఎనర్జీఎక్స్‌తో ఈ సంస్థ లైసెన్సింగ్ డీల్ కుదుర్చుకోవడం ఇందుకు కారణం.
⇒ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు 2.5% పెరిగి రూ.1199 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల (రూ.8.43 లక్షల కోట్లు) వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment