International Markets
-
బంగారు కొండ దిగుతోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో గురువారం 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రా ముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.77,050కి చేరింది. కాగా, 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.700 తగ్గి రూ.76,650కి దిగివచి్చంది. కిలో వెండి సైతం రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరింది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్‌కు తోడు పండుగ సీజన్ కారణంగా ఈ అక్టోబర్ 31న 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి రూ.4,650 తగ్గింది. రెండు వారాల్లో 260 డాలర్లు డౌన్... అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రాములు) ధర 45 డాలర్లు తగ్గి 2,541.70 డాలర్లకు పడింది. ఈ వార్త రాస్తున్న 9 గంటల సమయానికి 13 డాలర్ల తగ్గుదలతో రూ.2,574 వద్ద ట్రేడవుతోంది. జీవితకాల గరిష్టం 2,802 డాలర్ల నుంచి 260 డాలర్లు తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 4% తగ్గింది.‘‘ట్రంప్ గెలుపుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగకపోవచ్చు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణగొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చనే అశలతో డాలర్ ఇండెక్స్(107.06) అనూహ్యంగా బలపడుతోంది. దీంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ట్రంప్ వాణిజ్య విధాన నిర్ణయాలు రానున్న రోజుల్లో పసిడి ధరలకు దిశానిర్ధేశం చేస్తాయి’’ అని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఆగని బుల్ పరుగు
ముంబై: ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.మారుతీ పరుగు⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల రిజి్రస్టేషన్ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈః రూ. 451.27 లక్షల కోట్లు ⇒ స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది. -
Stock Market: సెన్సెక్స్ 80000
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో బుధవారం మరో మరపురాని రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తొలిసారి 80,000 శిఖరాన్ని తాకింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, పారిశ్రామిక షేర్లు ముందుండి నడిపించాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% రాణించి సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ముగింపులోనూ తాజా రికార్డులు నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 572 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయిపైన 80,013 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 633 పాయింట్లు పెరిగి 80,074 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 545 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయి దిగువన 79,987 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 183 పాయింట్లు ఎగసి 24,307 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 163 పాయింట్ల లాభంతో 24,287 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్ షేర్లలో ర్యాలీ క్రమంగా చిన్న, మధ్య తరహా షేర్లకు విస్తరించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.86%, 0.86 శాతం రాణించాయి. → బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితం కావడంతో బ్యాంకింగ్ షేర్లు మరింత రాణిస్తాయని విశ్లేషకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఎస్బీఐలు 2% లాభపడ్డాయి.→ బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు ఎంఎస్సీఐ ఇండెక్సు ఆగస్టు సమీక్షలో వెయిటేజీ పెంచవచ్చనే అంచనాలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2% పెరిగి రూ.1,768 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.50% ఎగసి రూ.1,792 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,758 కోట్లు ఎగసి రూ.13.45 లక్షల కోట్లకు చేరుకుంది. → ఈ జూన్ 25న 78 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్... 80,000 స్థాయిని చేరేందుకు కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంది. → ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం(జూన్ 9న) నాటి నుంచి 3,294 పాయింట్లు ర్యాలీ చేసింది. → సెన్సెక్స్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవితకాల గరిష్ట స్థాయి రూ.445.43 లక్షల కోట్లకు చేరింది. వ్రజ్ ఐరన్ బంపర్ లిస్టింగ్ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో 16% ప్రీమియంతో రూ.240 వద్ద లిస్టయ్యింది. ఈక్విటీ మార్కెట్ రికార్డు ర్యాలీతో మరింత కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 22% లాభపడి రూ.252 అప్పర్ సర్క్యూట్ వద్ద లాకైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది.సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకోవడం దలాల్ స్ట్రీట్‌కు దక్కిన పెద్ద విజయం. లేమన్ సంక్షోభం(2008)లో 8800 స్థాయికి దిగివచి్చంది. కానీ 16 ఏళ్లలో 9 రెట్ల ఆదాయాలు ఇచి్చంది. నాలుగేళ్ల క్రితం కరోనా భయాలతో 26,000 స్థాయికి చేరుకుంది. అయితే పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా పుంజుకుంది. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి అనేందుకు ఇది నిదర్శనం. – శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ -
సెన్సెక్స్ @ 78,000
ముంబై: ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 78 వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ ఈ ఏడాదిలో 34వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 823 పాయింట్లు ఎగసి 78,165 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 78,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు బలపడి 23,754 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 183 పాయింట్లు బలపడి 23,721 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ రియలీ్ట, విద్యుత్, వినిమయ, మెటల్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రికార్డుల ర్యాలీకి కారణాలు ⇒ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికల అమలుపై మంత్రిత్వ శాఖలు దృష్టి సారించడంతో ట్రేడర్లు ఎఫ్అండ్ఓలపై బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నిఫ్టీ జూలై సిరీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోకి పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఎఫ్అండ్ఓ గణాంకాలు సూచిస్తున్నాయి. ⇒ ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. యాక్సిస్ బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.32% కోటక్ బ్యాంక్ అరశాతం మేర రాణించాయి. అలాగే పీఎస్‌యూ ఎస్బీఐ బ్యాంకు షేరూ ఒకశాతానికి పైగా లాభపడింది. ⇒ మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవరింగ్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచి్చన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. స్టాన్లీ లైఫ్‌స్టైల్ ఐపీవో సక్సెస్ 96 రెట్లు అధిక స్పందనలగ్జరీ ఫరీ్నచర్ బ్రాండ్(కంపెనీ) స్టాన్లీ లైఫ్‌స్టైల్ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 96 రెట్లు సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. కంపెనీ 1.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 98.57 కోట్ల షేర్లకు స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 18 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 351–369 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 537 కోట్లు సమీకరించింది.⇒ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేరు 19% పెరిగి రూ.1,647 వద్ద ముగిసింది. లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు స్లొవేకియా సంస్థ జీఐబీ ఎనర్జీఎక్స్తో ఈ సంస్థ లైసెన్సింగ్ డీల్ కుదుర్చుకోవడం ఇందుకు కారణం.⇒ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు 2.5% పెరిగి రూ.1199 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల (రూ.8.43 లక్షల కోట్లు) వద్ద ముగిసింది. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. → ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి. → అమెరికాలో పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది. -
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో బ్యాంకింగ్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,124 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్(4%), మారుతీ సుజుకీ(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. రోజంతా లాభాలే.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 73,139 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు ఎగసి 22,193 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మళ్లీ రూ.20 లక్షల కోట్లపైకి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేరు 3.60% లాభపడి రూ.2988 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ రిలయన్స్ కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం ఈ షేరుకు డిమాండ్ లభించింది. ట్రేడింగ్‌లో 4% లాభపడి రూ.3000 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,039 కోట్లు పెరిగి రూ.20.21 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 13న కంపెనీ రిలయన్స్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల స్థాయిని అందుకుంది. దేశంలో టాప్–5 మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థల్లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలవగా.., టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► జ్యువెలరీ రిటైల్ కంపెనీ పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ► బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 83,000 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ► మారుతీ సుజుకీ రూ.12,256 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దీనితో ఇంట్రాడేలో మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లను అందుకుంది. -
ఐఐపీ, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ముంబై: కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, బాండ్లపై రాబడులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ బ్యాంకులు సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లడంతో గత వారంలో సూచీలు అరశాతం నష్టపోయాయి. ఫైనాన్సియల్, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 490 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘ అమెరికాతో పాటు బ్రిటన్, భారత్ దేశాల ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించవచ్చు. యూఎస్ పదేళ్ల బాండ్లపై రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 21,800 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే దిగువున 21,690 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,500 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు ఉంది. రికవరీ జరిగి అప్‌ట్రెండ్ మూమెంటమ్ కొనసాగితే ఎగువున 21,800 వద్ద నిరోధం చేధించాల్సి ఉంటుంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ దే తెలిపారు. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్‌తో పాటు బ్రిటన్ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. చివరి దశకు క్యూ3 ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ఘట్టం చివరి దశకు చేరింది. మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఐషర్ మోటార్స్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, మజగాన్ డాక్ షిప్‌యార్డ్స్, ఫోనిక్స్ మిల్స్‌తో సహా సుమారు 1000కి పైగా కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనుపమ్ రసాయన్, కోల్ ఇండియా, సెయిల్, సంర్ధన్ మదర్సన్, హిందాల్కో, ఐఆర్సీటీసీ, భెల్, గ్లాండ్ ఫార్మా, ముత్తూట్ ఫైన్సాన్లూ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. 4 లిస్టింగులు, 2 పబ్లిక్ ఇష్యూలు ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ షేర్లు నేడు(ఫిబ్రవరి 12న) లిస్టింగ్ కానున్నాయి. ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ (మంగళవారం) ముగిస్తుంది. రాశి పెరిఫెరల్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు (ఫిబ్రవరి 14న) బుధవారం లిస్టింగ్ కానున్నాయి. వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ గురువారం ముగియనుంది. డెట్ మార్కెట్లో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫిబ్రవరిలో ఇప్పటి వరకు (ఫిబ్రవరి 09 నాటికి) దేశీయ డెట్ మార్కెట్లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం పాటు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు జనవరిలో రూ.19వేల కోట్లుగా ఉన్నాయి. ఇక ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం నెల(జనవరి)లో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా ఈ ఫిబ్రవరి 09 నాటికి రూ.3,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు, భారతీయ ఈక్విటీ మార్కెట్ వాల్యూయేషన్లు పెరగడంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో భిన్న ట్రెండ్ దారితీసింది’’ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
80 డాలర్ల కిందకు వస్తేనే పెట్రో ధరల సవరణ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదిన్నరగా ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 80 డాలర్ల దిగువనకు వచ్చి స్థిరపడినప్పుడే, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తిరిగి రోజువారీ రేట్ల సవరణకు వెళ్లొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశ ఆయిల్ మార్కెట్లో ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థల వాటా 90 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 84 డాలర్ల వద్ధ చలిస్తోంది. 2022 ఏప్రిల్ 6 నుంచి రోజువారీ రేట్ల సవరణ నిలిచిపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది ముడి చమురు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లినప్పటికీ, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయే కానీ, రేట్లను పెంచలేదు. ఆ తర్వాత బ్యారెల్ చమురు ధర 80డాలర్ల లోపునకు దిగి వచి్చనప్పటికీ, అంతకుముందు భారీ నష్టాలను చవిచూసిన కారణంగా అవి రేట్లను సవరించకుండా కొనసాగించాయి. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరల్లో చెప్పుకోతగ్గ మేర అస్థిరత నెలకొంది. ధరలు అనూహ్యంగా ఆటుపోట్ల మధ్య చలిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూపాయి తగ్గించినా అందరూ అభినందిస్తారు. కానీ, అంతర్జాతీయంగా రేట్లు పెరిగిపోతే తిరిగి విక్రయ ధరలను అవి సవరించడానికి అనుమతిస్తారా? అన్నదే సందేహం’’అని ఓ అధికారి పేర్కొన్నారు. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఉండే ధరలు కీలకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సెపె్టంబర్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 93.54 డాలర్లుగా ఉంటే, అక్టోబర్‌లో 90 డాలర్లు, నవంబర్‌లో 83.42 డాలర్లకు దిగొచ్చింది. స్థిరత్వం లేనందునే.. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ విక్రయాలపై చమురు కంపెనీలకు లాభాలే వస్తున్నాయి. కానీ, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. పైగా త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఒకవేళ అంత్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, సవరించే పరిస్థితి ఉండదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరత్వం ఆధారంగా రేట్లపై ఆయిల్ కంపెనీలు నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘‘కొన్ని రోజులు డీజిల్ విక్రయాలపై లాభాలు వస్తుంటే, కొన్ని రోజులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకే విధమైన ధోరణి లేదు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర స్థిరంగా 80 డాలర్లకు దిగువన ఉన్నప్పుడు రేట్లను సవరించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లోనూ మంచి లాభాలనే నమోదు చేశాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం నష్టపోయిన మొత్తం ఇంకా భర్తీ కాలేదని సదరు అధికారి తెలిపారు. క్రూడాయిల్ డిమాండ్‌కు భారత్, ఆఫ్రికా దన్ను అంతర్జాతీయంగా 2030 నాటికి రోజుకు 112 మిలియన్ బ్యారెళ్ల వినియోగం ∙ ఎస్అండ్పీ నివేదిక భారత్, ఆఫ్రికా దన్నుతో 2030 నాటికి అంతర్జాతీయంగా క్రూడాయిల్‌కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత 103 మిలియన్ బ్యారెళ్ల (రోజుకు) స్థాయి నుంచి 112 మిలియన్ బ్యారెళ్లకు చేరనుంది. ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వంట, వాహనాల్లో స్వచ్ఛ ఇంధనాల వినియోగం గణనీయంగా పెరగగలదని ఇండియా కంటెంట్ హెడ్ పులకిత్ అగర్వాల్ తెలిపారు. 2040 నాటికి భారత్‌లో క్రూడాయిల్ డిమాండ్ గరిష్ట స్థాయైన 7.2 మిలియన్ బ్యారెళ్లకు (రోజుకు) చేరుతుందని అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఇది రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. నివేదిక ప్రకారం.. దేశీయంగా కెమికల్ కమోడిటీ ఉత్పత్తుల విభాగం 2023లో 7 శాతం, 2024లో 8 శాతం మేర వృద్ధి చెందనుంది. 80–90 డాలర్ల రేటు.. సమీప భవిష్యత్తులో ధరపరంగా చూస్తే బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిలో తిరుగాడి 2024 మూడో త్రైమాసికం నాటికి 90 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈడీ గౌరి జౌహర్ తెలిపారు. భారత్ వృద్ధి చెందే కొద్దీ పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు క్రమంగా మళ్లుతుందని వివరించారు. ఇది టెక్నాలజీ ఆధారితమైనదిగా ఉంటుందని, ఇలాంటి సాంకేతికతలు భారీ స్థాయిలో వినియోగంలోకి రావాలంటే దేశీయంగాను, అంతర్జాతీయంగానూ నిధులు, విధానాలపరమైన మద్దతు అవసరమవుతుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికోత్పత్తి ఊతంతో వచ్చే ఏడాది ఆసియాలో పెట్రోకెమికల్స్ డిమాండ్‌కి సంబంధించి భారత్ కాంతిపుంజంగా ఉండగలదని సంస్థ అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా వివరించారు. డిమాండ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ తగినంత సరఫరా ఉండటం, కొత్తగా ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తుండటం వంటి అంశాల కారణంగా ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. ఫలితంగా మార్జిన్లపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీ ఉత్పత్తి సంస్థలకు పెద్దగా ఊరట లభించకపోవచ్చని ఆమె పేర్కొన్నారు. -
2035 నాటికి ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్ డి లిటిల్ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ ప్రపంచ కేంద్రంగా మారవచ్చు. దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది. నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్వేర్ మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ సాఫ్ట్వేర్ హబ్‌గా, ఆఫ్‌షోర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది. -
66 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో బలహీనంగా కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 158 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 78 పాయింట్లు నష్టపోయి 66వేల దిగువున 65,945 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్లను కోల్పోయి 19,665 వద్ద నిలిచింది. పారిశ్రామిక, మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.693 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.715 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెల్లరీ ఐపీఓకు 2.25 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 91.20 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 2.05 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగతేతర కోటా 5.18 రెట్లు, రిటైల్ విభాగం 1.66 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. నష్టాల మార్కెట్లో స్మాల్ క్యాప్ షేర్లు మెరిశాయి. శ్రేయాస్ షిప్పింగ్ 20%, ఐఎఫ్సీఐ 12%, కొచి్చన్ షిప్‌యార్డ్ 11%, ఎన్ఐఐటీ 10%, ఓమాక్స్ 9% అశోకా బిల్డ్‌కాన్ 8%, ఎన్సీసీ, అపార్ ఇండస్ట్రీస్, ఎంటార్ షేర్లు 7% ర్యాలీ చేశాయి. బీఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ అరశాతం వరకు లాభపడింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పరీస్.., షేరు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,150కి పెంచడంతో ఐషర్ మోటార్స్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2.5% బలపడి రూ.3471 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.3539 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు యోచన నేపథ్యంలో డిమాండ్ రికవరీ ఆలస్యం అవ్వొచ్చనే అంచనాలతో ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి. ఎంఫసీస్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 2–1% నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా పాజిటివ్ అవుట్‌లుక్ కేటాయింపుతో వరుణ్ బేవరేజెస్ షేరు ఐదున్నర శాతం ర్యాలీ చేసి రూ.975 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.967 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 29 లక్షల షేర్లు చేతులు మారాయి. రూపాయి విలువ రెండోరోజూ కరిగిపోయింది. డాలర్ మారకంలో 15 పైసలు బలహీనపడి 83.28 వద్ద స్థిరపడింది. క్రూడ్æ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన ఈక్విటీ మార్కెట్ దేశీ కరెన్సీ క్షీణతకు కారణమయ్యాయి. -
అంతర్జాతీయ విపణిలోకి మహిళా స్టార్టప్‌లు
సాక్షి, హైదరాబాద్: మహిళలను వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వి హబ్ (వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) అటు గ్రామీణ, ఇటు అంతర్జాతీయ స్థాయికి కార్యకలాపాలు విస్తరించేలా ద్విముఖ వ్యూహానికి పదును పెడుతోంది. వి హబ్‌లో పురుడు పోసుకుంటున్న మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఓ వైపు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను వి హబ్ సిద్ధం చేస్తోంది. ఆర్ధిక, సామాజిక అడ్డంకులను అధిగమించి మహిళలు వాణిజ్యవేత్తలుగా రాణించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు చేయూతను అందిస్తోంది. తమ వద్ద ఉన్న వినూత్న ఆలోచనలు, పరిష్కారాలకు వాణిజ్య రూపం ఇచ్చేందుకు పడుతున్న ఇబ్బందులను మహిళలు అధిగమించేందుకు అవసరమైన సాయాన్ని వి హబ్ వివిధ రూపాల్లో అందిస్తోంది. మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు మహిళల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలు, సంక్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారం చూపుతూ స్టార్టప్‌ల ద్వారా వాణిజ్యరూపంలో ఊతమిచ్చేందుకు 2018 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వి హబ్ ఏర్పాటు చేసింది. వి హబ్‌లో ప్రస్తుతం మహిళల సారథ్యంలోని 84 స్టార్టప్‌లు ఇంక్యుబేట్ అవుతుండగా, వి హబ్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 914 మహిళా స్టార్టప్‌లు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వి హబ్‌లో ఇంక్యుబేట్ అవుతున్న స్టార్టప్‌లలో ఎక్కువగా నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందినవి కాగా, 25 శాతం చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగాలు, 13 శాతం ఆరోగ్య, లైఫ్‌సైన్సెస్ రంగాలు కాగా మిగతావి ఇతర రంగాలకు చెందినవి. స్టార్టప్‌లు తమ ఆలోచనలకు పదును పెట్టుకునేందుకు అవసరమైన సాయంతో పాటు సాంకేతిక సాయం అందించే మెంటార్లను (మార్గదర్శకులు) కూడా వి హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీలు, ఈక్విటీ ఫండింగ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ తదితరాల ద్వారా మహిళా స్టార్టప్‌లకు వి హబ్ రూ.83 కోట్ల మేర నిధులు సమకూర్చింది. అటు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో ఒప్పందం ఇటు మారుమూల ప్రాంతాల్లో విస్తరణ మహిళా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా మెరుగైన వాణిజ్య అవకాశాలను పొందేందుకు వీలుగా వి హబ్ ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పలు అంతర్జాతీయ కంపెనీలతోనూ మహిళా స్టార్టప్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక హైదరాబాద్‌కే కార్యకలాపాలను పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలపైనా వి హబ్ దృష్టి సారించనుంది. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ స్టార్టప్ సంస్కృతిపై అవగాహన కల్పించాలని వి హబ్ నిర్ణయించింది. మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం రాష్ట్రంలో మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా మహిళా వాణిజ్యవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వినూత్న ఆలోచనలు కలిగిన మహిళలను గుర్తించడం, వారి ఆలోచనలకు స్టార్టప్‌ల ద్వారా వాణిజ్య రూపం ఇవ్వడం, వారికి అవ సరమైన పెట్టుబడి, సాంకేతిక, వాణిజ్య సల హాలు, మార్గదర్శనం ఇవ్వడంలో వి హబ్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ స్టార్టప్‌లు స్థానిక ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. – దీప్తి రావుల, సీఈఓ, వి హబ్ గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. ఇప్పుడు వాణిజ్యవేత్తను గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసిన నేను వి హబ్ ప్రోత్సాహంతో వాణిజ్యవేత్తగా మారాను. స్టార్టప్ ద్వారా బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, బిజినెస్ ఐడియాలు, మార్కెటింగ్ నెట్వర్క్ తదితరాల్లో ఇక్కడ మార్గదర్శకత్వం లభించింది. ప్రస్తుతం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషీన్ల వ్యాపారం చేస్తున్నా. ఎంబ్రాయిడరీ స్టూడియో నుంచి మొదలైన నా ఆలోచన ప్రస్తుతం ఎంబ్రాయిడరీ మెషీన్ల దాకా విస్తరించింది. ప్రస్తుతం రూ.1.2 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నా వ్యాపారం సాగుతోంది. – భవ్య గుమ్మడి -
స్పోర్టీ డిజైన్‌తో స్కోడా ఎలక్ట్రిక్ ఎస్యూవీ: అదిరిపోయే ఫీచర్స్
సాక్షి,ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్' (Enyaq iV vRS) పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల లాంచ్ చేసింది. స్పోర్టీ-డిజైన్‌తో వస్తున్న ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందు కుంటుందని కంపెనీ తెలిపింది. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. అంతేకాదు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని స్కోడా ఆటో ప్రకటించింది. ఈ కారు ధర విషయానికి వస్తే మన దేశంలో సుమారు రూ. 48.6 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్ స్పెసిఫికేషన్స్ ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ట్రాక్షన్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. తమ డ్రైవింగ్‌కి అనుగుణంగా వినియోగ దారులు ఈ వెహికల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోని 82 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 296 బీహెచ్పీ పవర్‌ని అందిస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే గ్లాసీ-బ్లాక్ ఫ్రంట్ ఏప్రాన్లు, డోర్ మిర్రర్లు, రియర్ డిఫ్యూజర్ తో పాటు మరిన్ని స్పోర్టీ ఫీచర్లను జోడించింది. ఇంటీరియర్‌గా ఫాక్స్ లెదర్ ఫినిషింగ్, డ్యాష్ బోర్డ్ ను కార్బన్ ఫైబర్‌తోనూ రూపొందించింది. 13 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 'క్రిస్టల్ ఫేస్' ఫ్రంట్ గ్రిల్, ముందువైపు ఎల్ఈడీ లైట్లు, క్రోమ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్లోయ్ వీల్స్, రూఫ్ రైల్స్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు, చైనాలో కోవిడ్ కేసుల నమోదు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టొచ్చు. తుది దశకు చేరిన దేశీయ కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను పరిశీలించవచ్చు. ప్రాథమిక మార్కెట్లో రెండు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. మరో రెండు ఐపీవోలు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణుల చెబుతున్నారు. ‘‘చివరి ట్రేడింగ్ సెషన్లో సాంకేతికంగా నిఫ్టీ 16,250 స్థాయిపై ముగిసింది. బౌన్స్‌బ్యాక్ ర్యాలీ కొనసాగితే 16,400 స్థాయిని.., ఆపై 16,666 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 16,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,800వద్ద మద్దతు లభించొచ్చు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎంజీసీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ పెరుగుదల, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల అస్థిరత తదితర ప్రతికూల పరిస్థితులను అధిగమించి గతవారం దేశీయ సూచీలు దాదాపు మూడుశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 484 పాయింట్ల లాభాలన్ని ఆర్జించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే.., ► గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఏప్రిల్ 26న) నిఫ్టీ సూచీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ► కార్పొరేట్ ఫలితాల ప్రభావం దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్ తుది దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. దీవీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సెయిల్, జొమాటో, అదానీ పోర్ట్స్, గ్రాసీం, ఇప్కా ల్యాబ్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఇండిగో, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, బర్గర్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నైకా సంస్థలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల్లో పెద్ద ఎత్తున ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఈ మే నెల(20 తేదీ నాటికి)లో ఇప్పటి వరకు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెల చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వరుసగా ఐదో నెలలో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా మారడం ఈక్విటీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తోంది. ► ప్రాథమిక మార్కెట్‌పై దృష్టి ఇటీవల ఐపీవోలను పూర్తి చేసుకున్న డెలివరీ.., వీనస్ పైప్స్అండ్ట్యూబ్స్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున ఏథర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుండగా.., గతవారంలో ప్రారంభమై ఈ ముద్ర ఐపీవో మంగళవారం ముగియనుంది. ఈ రెండు పబ్లిక్ ఇష్యూల మొత్తం పరిమాణం రూ.1,221 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరు.., ఐపీఓ స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు. ప్రపంచ పరిణామాలు అమెరికా ఫెడ్ చైర్మన్ పావెల్.., ఈసీబీ ప్రెసిడెంట్ లాగార్డ్ ప్రసంగాలు మంగళవారం ఉన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జీడీపీ వృద్ధి రేటు అవుట్‌లుక్(గురువారం) విడుదల కానున్నాయి. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి అవుతుంది. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. -
Nifty: సరికొత్త శిఖరాలకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు రాణించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభంతో ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం కూడా కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 308 పాయింట్లు లాభపడి 51,423 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 51,259 – 51,529 పాయింట్ల మధ్యలో ట్రేడైంది. మరో ఇండెక్స్ నిఫ్టీ మూడు నెలల విరామం తర్వాత ఇంట్రాడేలో 15,469 వద్ద సరికొత్త రికార్డును లిఖించింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,436 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి కూడా నిఫ్టీకి రికార్డు గరిష్టం. అలాగే ఆరోరోజూ లాభాలను గడించినట్లైంది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.914 కోట్ల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు రూ.661 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 882 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు పెరిగాయి. ‘‘దేశంలో కోవిడ్ వ్యాధి సంక్రమణ రేటు క్షీణించడంతో పాటు డాలర్ ఇండెక్స్ పతనం భారత ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడుతూ ర్యాలీకి మద్దతుగా నిలుస్తోంది. ఆర్థిక రికవరీ ఆశలు, మెరుగైన క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో మార్కెట్ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ తెలిపారు. సూచీలకు మద్దతుగా రిలయన్స్ ర్యాలీ... అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు చాలాకాలం తరువాత లాభాల బాట పట్టింది. జెఫ్పారీస్‌తో సహా బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు బుల్లిష్ రేటింగ్‌ను కేటాయించాయి. ఇన్వెస్టర్లు ఈ షేరును కొనేందుకు ఆసక్తి చూపారు. ఎన్ఎస్ఈలో 6% లాభంతో రూ. 2,095 వద్ద స్థిరపడింది. -
మార్కెట్‌కు బైడెన్ జోష్
ముంబై: అందరూ అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్ష పోటీలో జో బైడెన్ ముందంజలో కొనసాగుతుండడం స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. భారత సేవల రంగం ఏడునెలల తర్వాత మెరుగైన గణాంకాలను ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు దేశ ఆర్థిక రికవరీ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగడం, రూపాయి 40 పైసలు బలపడటం, అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన పెట్టుబడిదారులకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగిసేవరకు మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరిగాయి. ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. మెటల్ షేర్ల పట్ల అధిక ఆసక్తి చూపారు. దీంతో సూచీలకు వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు ఖరారైంది. సెన్సెక్స్ 724 పాయింట్లు పెరిగి 41,340 వద్ద, నిఫ్టీ 212 పాయింట్ల లాభంతో 12,120 వద్ద స్థిరపడ్డాయి. ఇరు సూచీలకిది ఎనిమిది నెలల గరిష్ట ముగింపు కావడం విశేషం. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,727 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్లను ఆర్జించాయి. తద్వారా ఈ ఏడాదిలో నమోదైన నష్టాలను పూడ్చుకోగలిగాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆరుశాతం పెరిగిన ఎస్బీఐ షేరు ఎస్బీఐ షేరు గురువారం బీఎస్ఈలో 6 శాతం లాభపడింది. రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరుతో బ్యాంకు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో షేరు రూ.214 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు తెరతీశారు. ఒకదశలో ఏడుశాతం ఎగిసిన రూ.221 స్థాయికి చేరుకుంది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.218 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,397 కోట్లు పెరిగి రూ.1.95 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ‘‘ఊహించినట్లుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ముందంజ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేకుండా యథాతథ కొనసాగింపును ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్వార్టర్ ఫలితాలు, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు భారత మార్కెట్‌ను లాభాల్లో నడిపిస్తున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగపు అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్ల సంపద రూ.2.78 లక్షల కోట్లు అప్ సూచీలు భారీ ర్యాలీతో గురు వారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.78 లక్షల కోట్లను సంపదను ఆర్జించారు. మార్కెట్లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 162 లక్షల కోట్లకు ఎగసింది. -
మూడోరోజూ ముందుకే...
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో మార్కెట్ ముచ్చటగా మూడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ సూచీలకు దన్నుగా నిలిచింది. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. అధిక వెయిటేజీ రిలయన్స్‌తో పాటు ఐటీ షేర్ల అండతో సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 40,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లను ఆర్జించి 11,900 పైన 11,909 వద్ద స్థిరపడింది. వరుస మూడు ట్రేడింగ్ సెషన్లలో సెనెక్స్ 1,003 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 266 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. 617 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్.... అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ బుధవారం మార్కెట్ లాభాలతో మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవి పోరులో ఊహించినట్లుగానే బైడెన్ ముందంజలో ఉన్నాడనే వార్తలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఉదయం సెషన్లో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,693 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 117 పాయింట్లను ఆర్జించి 11,929 వద్ద ఇంట్రాడే హైని తాకింది. మిడ్ సెషన్లో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు వెనకడుగు వేశాయి. అయితే యూరప్ మార్కెట్ల పాజిటివ్ ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. అలాగే చివరి గంట కొనుగోళ్లు కూడా సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ‘‘యూఎస్ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈక్విటీల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు ఆరంభలాభాల్ని కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మంచిది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ దీపక్ జెసానీ తెలిపారు. సన్‌ఫార్మా షేరు 4 శాతం జంప్: సన్‌ఫార్మా షేరు బుధవారం బీఎస్ఈలో 4 శాతం లాభపడింది. ప్రోత్సాహకరమైన క్యూ2 ఫలితాల ప్రకటన షేరును రెండోరోజూ లాభాల బాట పట్టించింది. ఒకదశలో 6.81 శాతం పెరిగి రూ.518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.504 వద్ద స్థిరపడింది. నవంబర్ 14న దీపావళి మూరత్ ట్రేడింగ్ దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా గంటపాటు మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది నవంబర్ 14 న దీపావళి పండుగ జరగనుంది. అదేరోజు సాయంత్రం 6:15 గంటల నుంచి 7:15 మధ్య ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తామని స్టాక్ ఎక్సే్ఛంజీలు వివరించాయి. హిందూ పంచాంగం ప్రకారం బ్రోకర్లకు, వ్యాపారులకు కొత్త సంవత్సరం దీపావళి రోజున ప్రారంభం అవుతుంది. నవంబర్ 16న (సోమవారం) బలిప్రతిపద పండుగ సందర్భంగా ఎక్సే్ఛంజీలకు సెలవు ప్రకటించారు. దీంతో మార్కెట్లు తిరిగి నవంబర్ 17న ప్రారంభమవుతాయి. -
బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ..
ముంబై: ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలను ప్రతిబింబిస్తూ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లు నెలకొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ కూడా ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. ఫలితంగా సూచీల మూడురోజుల నష్టాలకు సోమవారం చెక్ పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 39,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,669 వద్ద నిలిచింది. లాక్డౌన్ తర్వాత తొలిసారి అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లను దాటడంతో పాటు ఇదే నెలలో ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండింతల వృద్ధిని సాధించాయి. దీంతో వ్యవస్థలో తిరిగి డిమాండ్ ఊపందుకుందనే సంకేతాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. మరోవైపు ప్రపంచమార్కెట్లు నెలరోజుల కనిష్టం నుంచి కోలుకోవడం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. చైనాతో పాటు ఐరోపా దేశాలు మెరుగైన తయారీ రంగ గణాంకాలను ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,335 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ 11,726– 11,557 పాయింట్ల మధ్య కదలాడింది. అయితే ఐటీ, ఫార్మా, మెటల్, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రూ.లక్ష కోట్లకు పైగా రిలయన్స్ సంపద ఆవిరి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 9 శాతం పతనంతో కంపెనీ రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో షేరు 9.50 శాతం నష్టపోయి రూ.1,860 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని పతనమైంది. చివరికి 9% నష్టంతో రూ.1,877 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంలో కంపెనీ రూ.1.19లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాప్‌ను నష్టపోయింది. ఆరుశాతం పెరిగిన ఐసీఐసీఐ షేరు రెండో త్రైమాసికంలో ఐసీసీఐసీఐ నికరలాభం నాలుగు రెట్లు పెరగడంతో బ్యాంకు షేరు సోమవారం 6శాతం లాభంతో రూ.417 వద్ద ముగిసింది. దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు సోమవారం సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కరోనా సంబంధిత కేటాయింపులు తక్కువగా ఉండడంతో పాటు ఆదాయ వృద్ధి పెరగడంతో ఈ ద్వితియా క్వార్టర్లో కంపెనీ రూ.4,882 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.16,957 కోట్లు పెరిగి రూ.2,87,668 వద్ద స్థిరపడింది. నిరాశపరిచిన ఈక్విటాస్ లిస్టింగ్... ఇటీవల పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరాశపరచింది. ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 6 శాతం తక్కువగా రూ.31 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 9 శాతం నష్టపోయి రూ.30.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్ తర్వాత బ్యాంకింగ్ రంగ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతులో భాగంగా నష్టాలను తగ్గించుకోగల్గింది. చివరికి 1 శాతం నష్టంతో రూ.32.75 వద్ద స్థిరపడింది. రెండు నెలల కనిష్టానికి రూపాయి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 32 పైసలు పతనంతో 74.42 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో రూపాయి ఇంత తక్కువ స్థాయిని చూడలేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, డాలర్ల కోసం డిమాండ్ రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
మార్కెట్ జోరుకు రిలయన్స్ అడ్డుకట్ట
ముంబై: అధిక వెయిటేజీ గల రిలయన్స్ షేరు పతనంతో పాటు మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 540 పాయింట్లను కోల్పోయి 40,146 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 162 పాయింట్లను నష్టపోయి 11,768 వద్ద ముగిసింది. అమెరికా, ఐరోపాల్లో భారీగా నమోదైన కరోనా కేసులు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల పతనం ఆందోళనలను కలిగించాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసల క్షీణత ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ట్రేడింగ్ ఆద్యంతం మార్కెట్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఇంట్రాడేలో సెనెక్స్ 734 పాయింట్లను నష్టపోయి 39,948 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 218 పాయింట్లను కోల్పోయి 11,712 స్థాయికి దిగివచ్చింది. ఎఫ్ఐఐలు రూ.119.40 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.976.16 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4 శాతం నష్టంతో రూ.2029 వద్ద స్థిరపడింది. సోమవారం సెన్సెక్స్ 540 పాయింట్ల పతనంలోని ఒక్క రిలయన్స్ షేరువి ఏకంగా 111 పాయింట్లు కావడం విశేషం. నిఫ్టీ మెటల్, ఆటో ఇండెక్స్ 3.50శాతం నష్టపోయాయి. ఆసియాలో హాంగ్‌కాంగ్, తైవాన్ మినహా మిగిలిన అన్ని మార్కెట్లు అరశాతం నుంచి 1శాతం నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు 3 నుంచి 1 శాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి... మార్కెట్ భారీ నష్టంతో రూ.1.92 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.160.57 లక్షల కోట్ల నుంచి రూ.158.66 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘పాజిటివ్ క్యూ2 ఫలితాలతో మార్కెట్ ర్యాలీ చేసింది. ఇప్పుడు దిద్దుబాటుకు లోనైంది. స్వల్పకాలంలో మార్కెట్లో బలహీనత కొనసాగవచ్చు. కంపెనీల ద్వితియా క్వార్టర్ ఫలితాలు, అమెరికా పరిణామాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయి’ జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. -
ఆర్బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!
న్యూఢిల్లీ: ఆర్బీఐ పాలసీ, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్‌కు కీలకాంశాలని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు వాహన విక్రయ గణాంకాలు, మౌలిక, తయారీ రంగ సంబంధిత గణాంకాలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు....మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం(వచ్చే నెల2న) సెలవు కావడంతో ట్రేడింగ్ ఈ వారం నాలుగు రోజులే జరగనున్నది. మరో వైపు మంగళవారం నుంచి మూడు ఐపీఓలు–యూటీఐ ఏఎమ్‌సీ, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ఐపీఓలు మొదలు కానున్నాయి. గురువారం ఆర్బీఐ పాలసీ.. మారటోరియం రుణాలపై వడ్డీకి సంబంధించిన కేసు ఈ నెల 28న (నేడు–సోమవారం)సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. బుధవారం (ఈ నెల 30న) ఆగస్టు నెలకు సంబం«ధించిన మౌలిక రంగ గణాంకాలు వెల్లడవుతాయి. వచ్చే నెల 1(గురువారం) ఆర్బీఐ పాలసీ వెల్లడి కానున్నది. అదే రోజు వాహన కంపెనీలు సెప్టెంబర్ నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. మరోవైపు సెప్టెంబర్ నెలకు సంబంధించి తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు కూడా గురువారమే రానున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లండ్‌ల జీడీపీ గణాంకాలు, అమెరికాకు సంబంధించి పీఎమ్ఐ గణాంకాలు వెల్లడవుతాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్.... గత శుక్రవారం రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకున్నా, యూరప్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో మార్కెట్లో ఒడిదుడుకులకు అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. రూ. 476 కోట్ల విదేశీ నిధులు వెనక్కి.... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.476 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత వారంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.10,491 కోట్లు నికర అమ్మకాలు జరిపారు. యూరప్, ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల అప్రమత్తతను ఇది సూచిస్తోందని నిపుణులంటున్నారు. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ ఈక్విటీ మార్కెట్ నుంచి నికరంగా రూ.4,016 కోట్లు ఉపసంహరించుకోగా, డెట్ మార్కెట్లో నికరంగా రూ. 3,540 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద నికరంగా రూ.476 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
గోల్డ్ బాజా!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ప్రస్తుతం ప్రధాన మార్గంగా పసిడివైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం 26 డాలర్లకుపైగా పెరిగి 1,778.95 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటల సమయంలో 1,774 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణికితోడు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడికి వరమవుతోంది. దేశీయంగా 50 వేల దిశగా... హైదరాబాద్, విజయవాడసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛత ధర ఒక దశలో రూ.50,000 దాటినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అటు తర్వాత రూపాయి బలోపేతం పసిడి ధరను కొంత తగ్గించింది. ఈ వార్త రాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)లో ధర స్వల్ప లాభంతో 48,026 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే సోమవారం 17 పైసలు బలపడి 76.03 వద్ద ముగిసింది. కరోనా భయాలు, ఈక్విటీల అనిశ్చితికి తోడు చైనాతో ఉద్రిక్తతలూ ఇప్పుడు రూపాయి విలువను భయపెడుతున్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). మళ్లీ ఆ కనిష్టాల దిశగా రూపాయి కదిలితే దేశీయంగా పసిడి ధర వేగంగా రూ 50,000 దాటేస్తుందనేది నిపుణుల అంచనా. 1,800 డాలర్లు దాటితే పరుగే... అంతర్జాతీయంగా పసిడి ధరకు 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే పసిడి వేగంగా తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు దూసుకుపోయే వీలుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటున్నపలు ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి అప్ట్రెండ్వైపు మొగ్గు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడి జరక్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగటివ్‌లోకి వెళితే... పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాది లోపు 2000 డాలర్లను అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ ఇప్పటికే ఒక నివేదికలో పేర్కొంది. మా వద్ద 13,212 కేజీల పసిడి డిపాజిట్లు: ఎస్బీఐ పడిసి డిపాజిట్ స్కీమ్ (గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్– జీఎంఎస్) ద్వారా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొత్తం 13,212 కేజీల పసిడిని సమీకరించింది. బ్యాంక్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. జీఎంఎస్ కింద ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3,973 కేజీల పసిడిని సమీకరించినట్లు వెల్లడించింది. వ్యక్తులు, ట్రస్టుల వద్ద నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగానికి ప్రభుత్వం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) స్కీమ్ ద్వారా దాదాపు రూ.244 కోట్ల విలువైన 647 కేజీల పసిడిని సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. తద్వారా ఈ ఒక్క స్కీమ్‌తో పసిడి సమీకరణ పరిమాణం 5,098 కేజీలకు (రూ.1,561 కోట్లు) చేరినట్లు బ్యాంక్ తెలిపింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్జీబీని తీసుకువచ్చింది. -
అమెరికానే దాటేశాం..!
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా నిలిచిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2019వ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోభారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 27శాతం మార్కెట్ షేర్‌తో షియోమీ మొదటి స్థానంలో నిలవగా, వివో 21 శాతం వాటాతో శాంసంగ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక శాంసంగ్ 19 శాతం వాటాతో 3వ స్థానానికి పడిపోయింది. అలాగే 12శాతం మార్కెట్‌తో ఒప్పో, 8 శాతం మార్కెట్ షేర్‌తో రియల్‌మీలు 4, 5వ స్థానాల్లో నిలిచాయి. కాగా కౌంటర్ పాయింట్ రీసెర్చి ప్రకారం గడిచిన నాలుగేళ్ల కాలంలో వివో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టడంలో ఇతర మొబైల్ తయారీ కంపెనీల కన్నా ముందుందని వెల్లడైంది. అలాగే రూ.15వేల నుంచి రూ.20వేల సెజ్‌మెంట్‌లో ఫోన్లను తయారు చేయడంలో వివో విజయవంతమైందని, ఆయా ఫోన్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయని తేలింది. -
భగ్గుమన్న పెట్రోల్ ధరలు
సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో సెప్టెంబర్ డెలివరీ ఒక బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 19.5 శాతం ఎగసి 71.95 డాలర్లను తాకింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి డాలర్ల పరంగా ఒక్క రోజులో ఇంతగా ధర పెరగడం ఇదే మొదటిసారి. ఇక అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటరీ్మడియట్ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్ 15.5 శాతం ఎగసి 63.34 డాలర్లకు పెరిగింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ రెండు రకాల ముడి చమురు ధరలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఈ వార్త రాసే సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ నైమెక్స్ క్రూడ్ ధర 12 శాతం ఎగసి 61.38 డాలర్ల వద్ద, బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 12.4 శాతం ఎగసి 67.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లో 9 శాతం అప్... ఇక మన మార్కెట్ విషయానికొస్తే, సోమవారం మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎమ్‌సీఎక్స్)లో సెపె్టంబర్ డెలివరీ క్రూడ్ ధర 9.14 శాతం ఎగసి రూ.4,273 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో స్పెక్యులేటర్లు తాజాగా పొజిషన్లు తీసుకోవడంతో ధరలు పెరిగాయి. ట్రేడర్ల స్పెక్యులేటివ్ పొజిషన్ల కారణంగా సమీప భవిష్యత్తులో ధరలు అధిక స్థాయిల్లోనే ట్రేడవుతాయని నిపుణులంటున్నారు. సౌదీ సగం ఉత్పత్తికి గండి... ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ప్రాసెసింగ్ కేంద్రం, సౌదీ అరేబియాలోని సౌదీ ఆరామ్కో ఆయిల్ ప్లాంట్లపై గత శనివారం ద్రోన్లతో దాడి జరిగింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని అబ్క్వైక్ నగరంలోని రిఫైనరీపైనా, రియాద్‌కు 150 కిమీ. దూరంలోని ఖురయాస్ చమురు క్షేత్రంపైనా ద్రోన్లతో దాడి జరిగింది. దీంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగం (ఇది ప్రపంచ రోజువారీ చమురు సరఫరాల్లో ఐదు శాతానికి సమానం) వరకూ తగ్గుతుందని అంచనా. రోజుకు 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి గండి పడుతుంది. కాగా ఈ దాడులకు కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపిస్తుండగా, ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దాడులు తామే చేశామని యెమెన్‌కు చెందిన హౌతి రెబెల్స్ పేర్కొన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులు చేసే అవకాశాలు మరింతగా పెరిగాయని, ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. సౌదీ ఆరామ్కో ఐపీఓ ఆలస్యం...! ఉగ్రవాద దాడుల కారణంగా సౌదీ ఆరామ్కో భారీ ఐపీఓ (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్) మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దాడుల నష్టా న్ని మదింపు చేస్తున్నామని, ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ మార్కెట్లో లిస్టయ్యే ముందు సౌదీ అరేబియా స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది నవంబర్‌లో లిస్టింగ్ కావాలని సౌదీ ఆరామ్కో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లనూ నియమించింది. మరింతగా వదలనున్న మన ‘చమురు’... సింగపూర్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచి్చందని సామెత. సామెత అన్వయం సరిగ్గా లేకపోయినప్పటికీ, సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా భారత్‌కు మరింతగా చమురు వదలనున్నది. సౌదీ ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా మన దిగుమతి బిల్లు మరింతగా పెరుగుతుందని, ముందుగా రూపాయిపై దెబ్బ పడుతుందని సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకింగ్ గ్రూప్ వెల్లడించింది. ముడి చమురు ధరలు 10 శాతం పెరిగితేనే, ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని, భారత కరంట్ అకౌంట్ లోటు 0.4–05 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కో డాలర్ పెరిగితే, భారత చమురు దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని వివరించింది. భారత్ తన అవసరాల్లో 83 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునేది ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే. గత ఆరి్థక సంవత్సరంలో భారత్ మొత్తం 2017.3 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోగా, దీంట్లో సౌదీ అరేబి యా వాటా 40.33 మిలియన్ టన్నులుగా ఉంది. సరఫరాల్లో కొరత ఉండదు సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా మనకు చమురు సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాబోవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాడుల అనంతరం సౌదీ ఆరామ్కో కంపెనీ ప్రతినిధులను సంప్రదించామని, సరఫరాల్లో ఎలాంటి కొరత ఉండబోదని వారు భరోసానిచ్చారని వివరించారు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్‌కంపెనీల వద్ద సెప్టెంబర్ నెలకు సంబంధించిన చమురు నిల్వలపై సమీక్ష జరిపామని, పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని, సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధర రూ.5–6 పైపైకి..! సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో రెండు వారాల్లో రూ.5–6 మేర పెరుగుతాయని నిపుణులంటున్నారు. ఈ దాడుల కారణంగా సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరలు భగ్గుమంటూనే ఉంటాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. సౌదీలో చమురు ఉత్పత్తి సాధారణ స్థాయికి రావడానికి మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా అమెరికాతో కలిసి ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏతావాతా పశ్చిమాసియాలో సంక్షోభం మరింతగా ముదిరితే ముడి చమురు ధరల ర్యాలీ ఇప్పట్లో ఆగదని విశ్లేషకులు భయపడుతున్నారు. ముడి చమురు, సంబంధిత ఉత్పాదకాలు పలు పరిశ్రమలకు ముడిపదార్ధాలుగా వినియోగమవుతున్నాయని, పెయింట్లు, టైర్లు, ఆయిల్, గ్యాస్, వాహన విడిభాగాల పరిశ్రమలపై పెను ప్రభావం పడుతుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటే, అది ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రతికూలమేనని, అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే వెనుజులా, ఇరాన్‌ల నుంచి చమురు సరఫరాలు తగ్గాయని కోటక్ ఈక్విటీస్ తెలిపింది. రూపాయి.. ‘క్రూడ్’ సెగ! ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పరుగు భయాలు సోమవారం రూపాయిని వెంటాడాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 68 పైసలు పతనమైంది. 71.60 వద్ద ముగిసింది. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటన పయనించిన రూపాయి సోమవారం మొట్టమొదటిసారి నేలచూపు చూసింది. క్రూడ్ ధరల పెరుగుదల భారత్ కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి కీలక ఆరి్థక గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో... సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి బలహీనంగా 71.54 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 71.63 స్థాయినీ చూసింది. రూపాయి శుక్రవారం ముగింపు 70.92. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. స్టాక్ మార్కెట్లో ‘మంట’... సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ద్రోన్లతో దాడి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇంట్రాడేలో 20% వరకూ క్రూడ్ ధరలు ఎగియడంతో మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చమురు సెగతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 356 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 262 పాయింట్ల నష్టంతో 37,123 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 11,004 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరి్థక వ్యవస్థలో వృద్ధి జోష్‌ను పెంచడానికి ప్రభుత్వం శనివారం ప్రకటించిన రూ.70,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ(ఎగుమతులు, రియల్టీకి) చమురు దాడుల నష్టాల్లో కొట్టుకుపోయింది. ఆయిల్ షేర్లు విలవిల.... సౌదీ చమురు క్షేత్రాల దాడుల నేపధ్యంలో బీఎస్ఈ ఆయిల్ గ్యాస్ అండ్ ఎనర్జీ ఇండెక్స్ భారీగా నష్టపోయింది. చమురు సంబంధిత షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, క్యా్రస్టాల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7% వరకూ నష్టపోయాయి. స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జెట్ ఎయిర్వేస్ వంటి విమానయాన ఇంధన షేర్లు 4% వరకూ నష్టపోయాయి. ఇప్పటికే అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కుదేలైన ప్రపంచ మార్కెట్లపై సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తాజాగా జరిగిన దాడి మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని షేర్‌ఖాన్ బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ గౌరవ్ దువా వ్యాఖ్యానించారు. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే, మన ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ప్రధాన ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. -
'బుల్' చల్.. 'బిట్' హిట్!
ఒక్క ఇండియానే కాదు. 2017లో యావత్ ప్రపంచానిదీ బుల్ పరుగే. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ జీవితకాల గరిష్ఠ స్థాయులకు చేరుకున్నాయి. ఏ ఆర్థిక వ్యవస్థకూ తీవ్రస్థాయి కుదుపులు లేవు. మొబైల్ విప్లవం కొత్త దశకు చేరింది. దీంతో కొత్త మొబైళ్లొచ్చాయి. చైనా కంపెనీలు విజృంభించాయి. పెద్ద స్క్రీన్లతో యాపిల్ తెచ్చిన ఫోన్లూ సూపర్‌హిట్. బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది.ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్వైపు పరిగెడుతోంది. ఆలోచించే రోబోలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. గూగుల్, టెస్లాలు అంతరిక్షంలో కాలనీలు కట్టాలని ఆలోచిస్తున్నాయి. దేశీయంగా చూస్తే... పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీకి, నకిలీలకు అడ్డుకట్ట పడలేదని అర్థమైపోయింది. కాకపోతే డిజిటల్ కరెన్సీ వాడకం పెరిగింది. ఆ దెబ్బ తట్టుకుని కోలుకుంటున్న తరుణంలో జీఎస్టీ వచ్చి చిన్న వ్యాపారుల్ని కొంత ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఈ రెండింటి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయినా.. ఏడాది చివరికి వచ్చేసరికి మాత్రం కాస్త కోలుకుంటున్న సంకేతాలు వెలువడ్డాయి. ఇక ఆరంభంలో ధరలు కాస్త శాంతించినప్పటికీ.. ఏడాది చివరికొచ్చేసరికి భయపెట్టే స్థాయికి చేరి.. ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు అడ్డంకిగా మారాయి. ఇక మొండి బకాయిలు. వీటిలో మనది ఐదో స్థానం... ఇన్ఫ్రా, మెటల్, విద్యుత్ కంపెనీలదే ఈ జాబితాలో అగ్రస్థానం. ఇక ఈ ఏడాది పోతూ పోతూ 2జీ స్పెక్ట్రం కేసు నిందితులకు పెద్ద బోనస్సే ఇచ్చింది. దీన్లో ఎలాంటి అవకతవకలూ లేవంటూ అందరినీ నిర్దోషులుగా కోర్టు వదిలేసింది. ఆయా సంఘటనల సమాహారంతో ‘సాక్షి’ బిజినెస్ విభాగం అందిస్తున్న ‘రివైండ్–2017’ ఇది.. జనవరి ♦ టాటా గ్రూపునకు మిస్త్రీ స్థానంలో కొత్త ఛైర్మన్ వచ్చారు. టీసీఎస్ సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరన్‌ను ఆ పదవిలో నియమించారు. టీసీఎస్‌కు గోపీనాథన్‌ను నియమించారు. ♦ అంతర్జాతీయంగా పొగాకు పరిశ్రమలో భారీ డీల్ సాకారమయింది. రేనాల్డ్స్ అమెరికన్‌ను బ్రిటిష్ అమెరికన్ టొబాకో చేజిక్కించుకుంది. ఫిబ్రవరి ♦ సంప్రదాయానికి భిన్నంగా 1న కేంద్రం రూ.21.47 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ♦ రూ.16,000 కోట్ల విలువైన నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది. ♦ భారీ నష్టాల్లో ఉన్న టెలినార్ ఇండియాను భారతీ ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. మార్చి ♦ టాటా మోటార్స్ తన తొలి స్పోర్ట్స్ కారు ‘రేస్‌మో’ను జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. ♦ అవెన్యూ సూపర్ మార్ట్స్(డీమార్ట్) షేర్లు లిస్టింగ్‌లో చరిత్ర. ఇష్యూ ధర రూ.299తో పోలిస్తే 102 శాతం లాభంతో రూ.604 వద్ద లిస్టయ్యాయి. ♦ ’టయోటా’ తన లగ్జరీ బ్రాండ్ ’లెక్సస్’ను భారత్‌లోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ ♦ శాంసంగ్.. గెలాక్సీ ’ఎస్8’, ’ఎస్8 ప్లస్’లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ♦ భారతీయ మహిళా బ్యాంక్‌సహా ఐదు అనుబంధ బ్యాంకులు మాతృసంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాంఛనంగా విలీనమయ్యాయి. ♦ దేశంలో వాహనాలకు సంబంధించి బీఎస్–4 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మే ♦ టాటా స్టీల్ బ్రిటన్‌లోని తన స్పెషాలిటీ స్టీల్ వ్యాపారాన్ని లిబర్టీ హౌస్ గ్రూపునకు రూ.850 కోట్లకు అమ్మేసింది. ♦ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించింది. ♦ పేమెంట్స్ బ్యాంకు సేవల లైసెన్స్ పొందిన పేటీఎం కార్యకలాపాలు ప్రారంభం. జూన్ ♦ యాహూ .. రెండు దశాబ్దాల ప్రస్థానానికి తెరపడింది. 4.5 బిలియన్ డాలర్లకు యాహూను వెరిజాన్ కొనుగోలు చేసింది. ♦ డర్టీ డజన్ పై దివాలా చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. ♦ కేజీ బేసిన్లో రిలయన్స్, బ్రిటిష్ పెట్రోలియం ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక. జూలై ♦ అమల్లోకి జీఎస్టీ ♦ ఈ–కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకోవటానికి ఫ్లిప్‌కార్ట్ కుదుర్చుకున్న ఒప్పందం విఫలమయింది. ♦ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ♦ హెచ్పీసీఎల్లో తనకున్న 51.11% వాటాను ఓఎన్జీసీకి విక్రయించడానికి కేంద్రం ఆమోదం. ఆగస్టు ♦ ’భారత్22’ పేరిట కొత్త ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ♦ ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ విశాల్ సిక్కా అనూహ్యంగా రాజీనామా. చైర్మన్‌గా నందన్ నీలేకని . – ఎస్సార్ గ్రూపు... ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌కు విక్రయించింది. డీల్ విలువ రూ.82,500 కోట్లు. సెప్టెంబర్ ♦ రెగ్యులేటరీ నిబంధనలను పాటించని 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు. ♦ హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాలో 74% వాటా కొంటున్నట్లు చైనా ఫార్మా దిగ్గజం షాంఘై ఫోసున్ తెలిపింది. డీల్ 1.09 బిలియన్ డాలర్లు. ♦ యాపిల్ కంపెనీ ‘ఐఫోన్–ఎక్స్’ను ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.89,000. అక్టోబర్ ♦ ’హువావే’ ప్రపంచంలోనే తొలిసారిగా నాలుగు కెమెరాలతో కూడిన ’హానర్ 9ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.17,999. ♦ ఎస్బీఐ చైర్మన్‌గా రజనీష్ కుమార్ బాధ్యతలు. ♦ టాటా టెలీసర్వీసెస్... తన మొబైల్ వ్యాపారాన్ని ఫ్రీగా భారతీ ఎయిర్‌టెల్‌కు అప్పగించింది. ♦ బ్యాంకింగ్‌కు రూ.2.11 లక్షల కోట్లు. నవంబర్ ♦ మూడీస్... దేశ సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది. ♦ లాజిస్టిక్స్ రంగానికి కూడా మౌలిక రంగ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ♦ మహిళా సదస్సు– జీఈఎస్‌కు ఆసియాలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికైంది. దీనికి ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ ♦ పథకాలు, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువును కేంద్రం 2018 మార్చి 31 వరకు పొడిగించింది. ♦ ఫెడ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. దీంతో మొత్తం ఈ ఏడాది 0.75% రేటు పెరిగినట్లయ్యింది. æ ఎయిర్‌సెల్ 6 టెలికం సర్కిళ్లలో కార్యకలాపాలను 2018 జనవరి 30 నుంచి నిలిపేయనుంది. సెన్సెక్స్ ⇒ 34,057 ⇒ 26,626 నిఫ్టీ ⇒ 10,531 ⇒ 8,186 రూపాయి ⇒ 63.80 ⇒ 67.90 ఆర్బీఐ రెపో రేటు ⇒ 6.75% ⇒ 6.50% ⇒ 6.25% ⇒ 6.00% బంగారం 10 గ్రాములు (రూ.లలో)... ⇒ 29,390 ⇒ 28,050 వెండి కేజీ (రూ.లలో) ⇒ 38,425 ⇒ 39,930 బ్రెంట్ క్రూడ్(బేరల్... డాలర్లలో) ⇒ 66.26 ⇒ 56.69 బిట్ కాయిన్ (డాలర్లలో) ⇒ 14,064 ⇒ 1,000 -
పసిడికి ‘అంతర్జాతీయ’ దన్ను
ముంబై మార్కెట్లో రూ.29,000పైకి ముంబై: అమెరికా–ఉత్తర కొరియా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి అంతర్జాతీయంగా పరుగులు పెడుతోంది. ఇదే ప్రభావం దేశీయంగానూ కనబడుతోంది. ముంబై ప్రధాన మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర గురువారం రూ.340 పెరిగి, రూ. 29,070కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో ఎగిసి రూ. 28,920కి చేరింది. వెండి కేజీ ధర భారీగా రూ. 1,120 ఎగసి రూ.38,995కి చేరింది. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం కడపటి సమాచారం అందేసరికి ఏకంగా 10 డాలర్లకు పైగా లాభంతో 1,290 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న 10 గ్రాముల పసిడి కాంట్రాక్ట్ ధర కడపటి సమాచారం అందేసరికి రూ.300 లాభంతో రూ. 29,144 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, శుక్రవారం స్పాట్ మార్కెట్లో పసిడి ధర మరింత పెరిగే వీలుంది.