జీవితకాల గరిష్ట స్థాయి నుంచి రూ.4,650 డౌన్
అంతర్జాతీయంగానూ వెనకడుగు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో గురువారం 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రా ముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.77,050కి చేరింది. కాగా, 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.700 తగ్గి రూ.76,650కి దిగివచి్చంది. కిలో వెండి సైతం రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరింది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్‌కు తోడు పండుగ సీజన్ కారణంగా ఈ అక్టోబర్ 31న 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి రూ.4,650 తగ్గింది.
రెండు వారాల్లో 260 డాలర్లు డౌన్...
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రాములు) ధర 45 డాలర్లు తగ్గి 2,541.70 డాలర్లకు పడింది. ఈ వార్త రాస్తున్న 9 గంటల సమయానికి 13 డాలర్ల తగ్గుదలతో రూ.2,574 వద్ద ట్రేడవుతోంది. జీవితకాల గరిష్టం 2,802 డాలర్ల నుంచి 260 డాలర్లు తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 4% తగ్గింది.
‘‘ట్రంప్ గెలుపుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగకపోవచ్చు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణగొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చనే అశలతో డాలర్ ఇండెక్స్(107.06) అనూహ్యంగా బలపడుతోంది. దీంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ట్రంప్ వాణిజ్య విధాన నిర్ణయాలు రానున్న రోజుల్లో పసిడి ధరలకు దిశానిర్ధేశం చేస్తాయి’’ అని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment