crude prices
-
బంగారు కొండ దిగుతోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో గురువారం 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రా ముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.77,050కి చేరింది. కాగా, 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.700 తగ్గి రూ.76,650కి దిగివచి్చంది. కిలో వెండి సైతం రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరింది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్‌కు తోడు పండుగ సీజన్ కారణంగా ఈ అక్టోబర్ 31న 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి రూ.4,650 తగ్గింది. రెండు వారాల్లో 260 డాలర్లు డౌన్... అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రాములు) ధర 45 డాలర్లు తగ్గి 2,541.70 డాలర్లకు పడింది. ఈ వార్త రాస్తున్న 9 గంటల సమయానికి 13 డాలర్ల తగ్గుదలతో రూ.2,574 వద్ద ట్రేడవుతోంది. జీవితకాల గరిష్టం 2,802 డాలర్ల నుంచి 260 డాలర్లు తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 4% తగ్గింది.‘‘ట్రంప్ గెలుపుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగకపోవచ్చు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణగొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చనే అశలతో డాలర్ ఇండెక్స్(107.06) అనూహ్యంగా బలపడుతోంది. దీంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ట్రంప్ వాణిజ్య విధాన నిర్ణయాలు రానున్న రోజుల్లో పసిడి ధరలకు దిశానిర్ధేశం చేస్తాయి’’ అని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్‌స్టాప్‌గా దౌడు తీస్తున్న బుల్‌కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్‌టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్‌ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్‌గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్‌కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘విండ్‌ఫాల్’ బాదుడు!
దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దేశీయంగా వెలికి తీస్తున్న ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.3,300 నుంచి రూ.4,600కు పెంచారు. ఈ పన్నును ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) రూపంలో వసూలు చేస్తారు. డీజిల్ ఎగుమతులపై ఎస్ఏఈడీ లీటరుకు రూ.1.50 ఉండగా, పూర్తిగా తొలగించారు. ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు పెట్రోలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(విమాన ఇంధనం)పై సుంకం లేదు. కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అదాటు లాభాలపై పన్నును తొలిసారిగా 2022 జులై 1న ప్రభుత్వం విధించింది. -
వృద్ధి 6.5 శాతం: అరవింద్ విర్మాణి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి వ్యక్తం చేశారు. క్రూడ్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటకు ఢోకా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక వృద్ధిని అతిగా అంచనా వేస్తోందని అమెరికాకు చెందిన కొంతమంది ఆర్థికవేత్తల వాదనపై ఆయన మాట్లాడుతూ, కొంతమంది మాజీ అధికారులకు భారత్ జీడీపీ మదింపుపై ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల సమస్య మళ్లీ తెరపైకి వచి్చందని, వాతావరణ మార్పుల కారణంగా అనిశ్చితి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారు రుణం వేగంగా పెరుగుతున్నందున నికర హౌస్‌హోల్డ్ పొదుపు నిష్పత్తి (జీడీపీలో) తగ్గుతోందని, అయితే స్థూలంగా చూస్తే, నిలకడగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక హౌస్‌హౌల్డ్ సెక్టార్ రుణం కూడా జీడీపీ నిష్పత్తిలో చూస్తే, తీవ్ర స్థాయిలో లేని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలే దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వివరించారు. -
డీజిల్‌పై ఇప్పటికీ రూ.4 నష్టమే!: చమురు వ్యవహారాల మంత్రి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) డీజిల్‌పై లీటరుకు ఇప్పటికీ రూ.4 చొప్పున నష్టపోతున్నాయని కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం పేర్కొన్నారు. అయితే పెట్రోల్ విషయంలో కంపెనీల మార్జిన్లు సానుకూలంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో కూడా చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంసహా దేశంలో ద్రవ్యోల్బణం పెరక్కుండా ప్రభుత్వ పోరాటానికి సహాయం చేయడానికి చమురు మంత్రిత్వశాఖ తగిన ప్రయత్నాలన్నింటినీ చేస్తుంది. ఈ విషయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లతో కలిసి పనిచేస్తుంది. అవసరమైతే చమురు కంపెనీలకు వచ్చే నష్టాలకు ప్రభుత్వ నుంచి ఆర్థికపరమైన సహాయాన్నీ కోరుతుంది. ► జూన్ 2020 నుండి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో దేశీయ వంట గ్యాస్ (ఎల్పీజీ) అమ్మకంపై వచ్చిన నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం గత నెలలో మూడు సంస్థలకు రూ.22,000 కోట్లను ఒకేసారి గ్రాంట్‌గా అందించింది. అయితే రూ.28,000 కోట్లు ఇవ్వాలని చమురు మంత్రిత్వశాఖ కోరింది. ► అండర్ రికవరీ (రిటైల్ అమ్మకపు ధర– అంతర్జాతీయ ధర మధ్య వ్యత్యాసం) ప్రస్తుతం డీజిల్‌పై లీటరుకు రూ. 27 ఉంది. అయితే వాస్తవిక నగదు నష్టం (ముడి చమురు సేకరణ–ఇంధనంగా మార్చడం వల్ల కలిగే వాస్తవ వ్యయ ఆధారిత నష్టం) లీటరుకు ఇప్పటికీ దాదాపు రూ. 3–4గా ఉంది. ► మూడు ఇంధన రిటైల్ కంపెనీలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 19,000 కోట్లకు పైగా నికర నష్టాన్ని చవిచూశాయి. తదుపరి త్రైమాసికంలో కూడా నష్టాలను ఎదుర్కొంటాయన్న అంచనా ఉంది. ► భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ధర జూన్‌లో బ్యారెల్‌కు 116 డాలర్ల వరకు పెరిగింది, అయితే నవంబర్ నెలలో 92.25 డాలర్లకు తగ్గింది. తగ్గిస్తే... మే తర్వాత మొదటిసారి ద్రవ్యోల్బణం నియంత్రించడం, వినియోగదారులపై ధరల భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఈ ఏడాది మే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీనితో వ్యవస్థలో ఆ నెల్లో పెట్రోల్, డీజిల్ ధరలూ తగ్గాయి. మళ్లీ ధరలు తగ్గిస్తే అది మే తర్వాత మొదటిసారి అవుతుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సవరించాలి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు మే తర్వాత ఈ సరవణలు చేయడం లేదు. అంతర్జాతీయ ధరల తీవ్రత నేపథ్యంలో మే నెల్లో ధరలు తగ్గింపునకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకూ పెరిగాయి. -
క్రూడ్ షాక్... రూపీ క్రాష్!!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 76 పైసలు బలహీనపడింది. 76.93 స్థాయికి రూపాయి పతనమైంది. రూపాయి ఈ కనిష్ట స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఒక దశలో రూపాయి 84పైసలు నష్టంతో 77.01 స్థాయిని సైతం చూసింది. కదలికలు ఇలా... దేశీయ కరెన్సీ ముగింపు శుక్రవారం 76.17. సోమవారం ట్రేడింగ్‌లో తీవ్ర బలహీన స్థాయిలో 76.85 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రతి దశలోనూ బలహీనంగానే కదలాడింది. కారణాలు ఇవీ... ► రష్యాపై ఉక్రెయిన్ దాడులు. నాటో దళాలు కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా యుద్ధంలోకి వస్తాయన్న వదంతులు. ► దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం. బంగారం, వెండి వంటి సురక్షిత సాధనల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల మొగ్గు. ► క్రూడాయిల్ ధరల పెరుగుదల. ఇది దేశంలో ఆయిల్ సంక్షోభానికి తద్వారా పెట్రో ధరల మంటకు వెరసి ద్రవ్యోల్బణం, వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య ఉన్న నికర వ్యత్యాసం) తీవ్రతకు, కరెంట్ అకౌంట్ (ఒక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యాన్ని ప్రతిబింబించే గణాంకాలు)భారీ లోటుకు దారితీస్తాయన్న ఆందోళనలు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి.. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రూపాయికిపైగా బలహీనతతో 76.91 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిప దికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 99 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. 79 దిశగా పయనం..! అంతర్జాతీయ క్రూడ్ ధరల తీవ్రత రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇన్వెస్ట్మెంట్ కన్సల్టి ంగ్ సంస్థ–మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సీఈఓ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. క్రూడ్ ధరలు మరింత పైకి ఎగసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది రూపాయిని సమీప కాలంలో 79 దిశగా బలహీనపరుస్తాయన్నది తమ అంచనా అని తెలిపారు. 2020 ఏప్రిల్ తర్వాత... రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కరోనా సవాళ్లు, ఆందోళనలు, లాక్డౌన్ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం వంటి అంశాలు దీనికి నేపథ్యం. 130 డాలర్లు దాటిన క్రూడాయిల్ ధర 2008 తరువాత గరిష్ట స్థాయి న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులుసహా పలు కీలక పరిణామాల నేపథ్యంలో సరఫరాలపై తలెత్తిన ఆందోళనలు సోమవారం క్రూడాయిల్ ధరలను 2008 గరిష్ట స్థాయిలకు చేర్చాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 2 శాతం పైగా లాభంతో 121.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 117.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ రెండు విభాగాల్లో ధరలు 130 డాలర్లు చూడ్డం గమనార్హం. 2008 తరువాత ఇంత తీవ్రస్థాయిలో క్రూడ్ ధరలు చూడ్డం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. ఐదు ప్రధాన కారణాలు..! ► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించే అవకాశాలను అమెరికా, యూరోపియన్ భాగస్వామ్య దేశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటన చేశారు. రోజుకు దాదాపు 7 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తి లేదా ప్రపంచ సరఫరాలో 7 శాతం (ఉత్పత్తిలో 10%) ఎగుమతులతో ఇందుకు సంబంధించి రష్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. అమెరికా మంత్రి తాజా ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలకు సవాళ్లు తప్పవన్న ఆందోళనలు నెలకొన్నాయి. ► ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా నౌకాశ్రయాల నుంచి కజికిస్తాన్‌కు చెందిన చమురు ఎగుమతులకు కూడా తీవ్ర విఘాతం కలుగుతోంది. ► దీనికి తోడు లిబియా చేసిన ఒక కీలక ప్రకటన చమురు ధర తీవ్రత కారణమైంది. ఒక సాయు« ద సమూహం రెండు కీలకమైన చమురు క్షేత్రాలను మూసివేసిందని లిబియా జాతీయ చమురు కంపెనీ ప్రకటించింది. ఈ చర్య వల్ల దేశం రోజువారీ చమురు ఉత్పత్తి 3,30,000 బ్యారళ్లకు పడిపోయిందని ప్రకటించింది. ► ఇరాన్‌పై 2015 ఆంక్షల ఎత్తివేత చర్చల్లోకి ‘ఆ దేశంతో రష్యా వాణిజ్య సంబంధాలను లాగొద్దని’ అమెరికాకు రష్యా డిమాండ్ చమురు ధర భారీ పెరుగుదలకు కారణమైంది. దీనితో ఈ చర్చలపై అనిశ్చితి నెలకొంది. -
త్వరపడండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంతో ‘రయ్’ మంటూ పైకి లేచిన బంగారం, క్రూడ్ వంటి కీలక కమోడిటీల ధరలు శుక్రవారం కొంత శాంతించాయి. యుద్ధంలో నాటో జోక్యం చేసుకోదన్న స్పష్టమైన సంకేతాలు, ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమన్న రష్యా ప్రకటన వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే 38 డాలర్ల నష్టంతో 1,888 వద్ద ట్రేడవుతోంది. యుద్ధం ప్రారంభంలో పసిడి ధర గురువారం అంతర్జాతీయంగా ట్రేడింగ్ ఒక దశలో 1976 డాలర్ల స్థాయిని కూడా తాకటం గమనార్హం. అంటే తాజా హై నుంచి దాదాపు 100 డాలర్లు పడిపోయింది. దేశీయంగా రూ. 2,000 డౌన్ ఇక దేశీయంగా చూస్తే, మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో (ఎంసీఎక్స్)లో ధర క్రితం ముగింపుతో పో ల్చితే రూ.1,339 నష్టంతో రూ.50,204 వద్ద ట్రేడ వుతోంది. దేశీయ ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం క్రితం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్ఛత రూ.1,873 తగ్గి రూ.50,667 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.1,866 దిగివచ్చి రూ.50,464కి చేరింది. వెండి కేజీ ధర రూ. 2,975 దిగివచ్చి రూ.65,174 వద్దకు దిగివచ్చింది. ఇక క్రూడ్ ధరలు కూడా అంతర్జాతీయంగా గురువారం ముగింపుతో పోల్చితే 2% నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ అరశాతం నష్టంతో 96.50 వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు లాభపడి, 75.33 వద్ద ముగిసింది. -
మళ్లీ చమురు సెగ- ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు?
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల క్రితం దేశీయంగా తొలిసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకిన పెట్రోల్ ధరలు మరింత మండనున్నాయా? కొద్ది రోజులుగా విదేశీ మార్కెట్లో దూకుడు చూపుతున్న ముడి చమురు ధరలు తాజాగా మరింత బలపడ్డాయి. దీంతో వచ్చే వారం మరోసారి పెట్రో మంట తప్పకపోవచ్చని ఇంధన వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కోవిడ్-19 కారణంగా దేశమంతటా లాక్డవున్లు విధించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 వరకూ పెంచింది. దీనికి జతగా రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ సైతం అమలవుతోంది. దీంతో గడిచిన గురువారం(7న) పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ హైను తాకిన సంగతి తెలిసిందే. వెరసి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. (ధరల మంట- పెట్రోల్ @ఆల్‌టైమ్ హై) పన్నుల వాటా అధికం ప్రస్తుత పెట్రోల్ ధర రూ. 84లో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 52 వరకూ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం తగ్గించమంటూ పెట్రోలియం శాఖ ప్రభుత్వానికి తాజాగా సూచించినట్లు తెలుస్తోంది. ఇది జరిగితే పెట్రోల్ ధర లీటర్‌కు కనీసం రూ. 5 వరకూ తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది ప్రజలు కనీసం 20 శాతం సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు లోకల్ సర్కిల్స్ తెలియజేసింది. చమురు కంపెనీలూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ విదేశీ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలో కోతలను తగ్గించడానికితోడు.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్‌ను తగ్గించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంధన రంగ పీఎస్‌యూలు సైతం ఈ భారాన్ని కొంతమేర మోయవలసి రావచ్చని తెలియజేశాయి. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) మళ్లీ ధరల సెగ విదేశీ మార్కెట్లో గత మూడు రోజుల్లో 7 శాతం జంప్‌చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. వారాంతాన న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 2.8 శాతం ఎగసి 52.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ మరింత అధికంగా 3 శాతం జంప్‌చేసి56 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంట
న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు బలపడి రూ. 83.13కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్‌కు 25 పైసలు అధికమై రూ. 73.32ను తాకింది. ఈ బాటలో కోల్‌కతాలో డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 76.89కు చేరగా.. పెట్రోల్ రేటు రూ. 84.63ను తాకింది. ముంబైలో డీజిల్ లీటర్ రూ. 79.93గా, పెట్రోల్ రూ. 89.78గా నమోదయ్యాయి. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 86కు చేరగా.. డీజిల్ రూ. 78.69 అయ్యింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. కాగా.. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. కోతల ఎఫెక్ట్ తాజా సమావేశంలో భాగంగా రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగాయి. వెరసి శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసింది. 49.25 డాలర్లను తాకింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు సైతం 1.4 శాతం జంప్‌చేసి 46.26 డాలర్లకు చేరింది. ఒపెక్ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7.2 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. దేశీయంగా విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
పసిడి ధరలు ప్లస్- చమురు ధరల సెగ
న్యూయార్క్/ ముంబై: కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు విడుదలకానున్న వార్తలు ముడిచమురు ధరలకు జోష్‌నిస్తున్నాయి. మరోపక్క బంగారం, వెండి ధరలు బలహీనపడుతున్నాయి. థాంక్స్ గివింగ్ డే సందర్భంగా నేడు యూఎస్ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం అటు చమురు, ఇటు బంగారం ధరలు లాభపడ్డాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. అయితే ఇటీవల పతన బాటలో సాగుతున్న బంగారం ధరలు నాలుగు నెలల కనిష్టాలకు చేరగా.. చమురు ధరలు మార్చి గరిష్టాలను తాకాయి. ఇతర వివరాలు చూద్దాం.. లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 161 లాభపడి రూ. 48,674 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో వెండి కేజీ రూ. 298 పుంజుకుని రూ. 60,141 వద్ద కదులుతోంది. ఇవి డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలు. కాగా.. ఎంసీఎక్స్‌లో పసిడికి రూ. 48,400- 48,220 వద్ద సపోర్ట్స్ లభించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ డైరెక్టర్ మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇదేవిధంగా రూ. 48,660- 48,850 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని పేర్కొన్నారు. బలపడ్డాయ్.. న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.22 శాతం బలపడి 1,815 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,808 డాలర్లకు చేరింది. వెండి సైతం 0.2 శాతం పెరిగి ఔన్స్ 23.50 డాలర్ల వద్ద నిలిచింది. కాగా.. కామెక్స్‌లో ఔన్స్ పసిడికి 1792- 1784 డాలర్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా 1814-1822 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. చమురు జోరు న్యూయార్క్ మార్కెట్లో బుధవారం నైమెక్స్ చమురు బ్యారల్ 0.3 శాతం పుంజుకుని 45.92 డాలర్లను తాకింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.6 శాతం ఎగసి 48.61 డాలర్లకు చేరింది. వెరసి మార్చి తదుపరి గరిష్టాలను తాకాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మంగళవారం(24) వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. అయితే రెండు రోజులుగా ధరలను సవరించకపోవడం గమనార్హం! విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్ల ఆశలు- మండుతున్న చమురు
లండన్/ న్యూయార్క్: దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు సిద్ధంకానున్న వార్తలతో ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. గత వారం 5 శాతం పురోగమించిన చమురు ధరలు వరుసగా రెండో రోజు బలపడ్డాయి. వెరసి విదేశీ మార్కెట్లో మూడు నెలల గరిష్టాలకు చేరాయి. ఇటీవలి ఎన్నికలలో అమెరికా ప్రెసిడెంట్‌గా జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా ధృవ పడటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లకు జతగా ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికి కరోనా కట్టిడికి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొనడంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. ఫలితంగా ముడిచమురు ధరలు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఒపెక్ ఎఫెక్ట్.. చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో రష్యాసహా ఒపెక్ దేశాలు గత కొద్ది నెలలుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2021 జనవరి వరకూ కోతలు అమలుకానున్నాయి. కాగా.. కోతల అంశాన్ని చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశంకానున్నాయి. దీనిలో భాగంగా జనవరి 2021 తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా కనీసం రోజుకి 2 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు నిర్ణయించవచ్చని సంబంధితవర్గాలు తెలియజేశాయి. అంటే 5.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలు మరో ఆరు నెలలు కొనసాగే వీలున్నట్లు చెబుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లతో ఆర్థిక రికవరీకి వీలు చిక్కుతుందని, దీంతో చమురుకు డిమాండ్ పుంజుకుంటుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు చమురు ఉత్పత్తిలో కోతలు కొనసాగితే ధరలు మరింత బలపడవచ్చని అంచనా వేస్తున్నాయి. ధరల జోరు ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1 శాతం ఎగసి 46.51 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1.1 శాతం పుంజుకుని 43.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం విదితమే. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా ప్రతీ 15 రోజులకోసారి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. వివిధ పన్నులతోపాటు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరల సవరణలో ప్రభావం చూపుతుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
మళ్లీ చమురు ధరల సెగ
న్యూయార్క్: సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 అమెరికా, యూరోపియన్ దేశాలను వణికిస్తుండటంతో పతన బాటలో సాగిన ముడిచమురు ధరలు మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 44 డాలర్లను దాటేయగా.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు 42 డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం నైమెక్స్ బ్యారల్ 1.3 శాతం బలపడి 41.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసి 44.13 డాలర్లకు చేరింది. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ పదవిని చేపట్టనుండటం, వ్యాక్సిన్‌పై అంచనాలు వంటి అంశాల నేపథ్యంలో ముందురోజు సైతం చమురు ధరలు దాదాపు 3 శాతం చొప్పున జంప్‌చేశాయి. బ్రెంట్ 1.2 డాలర్లు పెరిగి 43.61 డాలర్ల వద్ద నిలవగా.. నైమెక్స్ బ్యారల్ 1 డాలరు పుంజుకుని 41.36 డాలర్ల వద్ద స్థిరపడింది. కారణాలివీ నవంబర్ 6తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు 5.147 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ మంగళవారం వెల్లడించింది. ఇవి ఇంధన నిపుణులు వేసిన అంచనాల కంటే తక్కువకావడం గమనార్హం! దీనికితోడు తాజాగా అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతంపైగా విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం ద్వారా తిరిగి చమురుకు డిమాండ్ పుంజుకోనుందన్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థలు మందగిస్తుండటంతో చమురుకు డిమాండ్ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 2021 జనవరి తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను కొనసాగించాలని ఒపెక్, రష్యా తదితర దేశాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ సానుకూల వార్తలు చమురు ధరలకు జోష్‌నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
బంగారం.. క్రూడ్ బేర్..!
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లపైనే కాకుండా కమోడిటీలపైనా ప్రభావం చూపింది. గత కొద్ది నెలలుగా లాభాల బాటన పయనిస్తున్న పసిడి ధర, న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్‌కు (31.1గ్రా) సోమవారం భారీగా పతనమైంది. ఈ వార్త రాసే 10.30 గంటల సమయంలో 50 డాలర్లకుపైగా (3 శాతం) నష్టంతో 1908 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతక్రితం ఒక దశలో కీలక మద్దతుస్థాయి 1900 డాలర్ల దిగువకుసైతం పడిపోయి, 1,886 డాలర్లను కూడా తాకింది. కరోనా తీవ్రత నేపథ్యంలో పసిడి ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత ఏ రోజుకారోజు పసిడి పురోగతి బాటనే పయనిస్తూ, వారంరోజుల్లోనే ఆల్‌టైమ్ గరిష్టం 2,089 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు తర్వాత లాభాల స్వీకరణతో క్రమంగా రెండు వందల డాలర్ల వరకూ తగ్గింది. అయితే దీర్ఘకాలంలో పసిడిది బులిష్ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి 10 గ్రాముల ధర సోమవారం ఈ వార్త రాసే సమయానికి రూ.1,400 నష్టంలో రూ. 50,324 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, మంగళవారం భారత్ స్పాట్ మార్కెట్లలో ధర భారీగా తగ్గే వీలుంది. క్రూడ్ కూడా...: మరోవైపు నైమెక్స్‌లో లైట్ స్వీట్ ధర కూడా బేరల్‌కు 2 శాతం నష్టంతో 39 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ధర కూడా దాదాపు ఇదే స్థాయి నష్టంతో 41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
చమురుకు మళ్లీ కరోనా కాటు
తాజాగా చైనాలో కరోనా వైరస్ సోకిన కేసులు బయటపడంతో ముడిచమురు ధరలకు షాక్ తగిలింది. ఏప్రిల్ తదుపరి గత వారం తిరిగి పతనమైన చమురు ధరలు నేటి ట్రేడింగ్‌లోనూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. లండన్ మార్కెట్లో ప్రస్తుతం బ్రెంట్ బ్యారల్ 2 శాతం క్షీణించి 38 డాలర్ల దిగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ బ్యారల్ 3 శాతం వెనకడుగుతో 35.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 10 నుంచి చూస్తే చమురు ధరలు 11 శాతం పతనమమ్యాయి. బీజింగ్ వ్యవసాయ మార్కెట్లో సుమారు 25 మందివరకూ కరోనా వైరస్ బారినపడినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోపక్క శనివారం అమెరికాలో కోవిడ్-19 కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగినట్లు వెల్లడైంది. దీంతో రెండో దశలో కరోనా వైరస్ విజృంభించనుందన్న అంచనాలు ఆందోళనలు కలుగజేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే కోవిడ్-19 ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం విదితమే. గత వారం పతనం ఆరు వారాల ముడిచమురు ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. ఫలితంగా చమురు ధరలు 8.3 శాతం నష్టపోయాయి. కోవిడ్-19 కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020లో ఏకంగా 6.5 శాతం క్షీణత చవిచూడవచ్చని కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వేసిన అంచనాలు గత వారాంతాన చమురు ధరలను దెబ్బతీశాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరనున్నట్లు ఫెడ్ తాజాగా వేసింది. దీంతో అమెరికాసహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోనున్న అంచనాలు బలపడ్డాయి. ఫలితంగా చమురుకు డిమాండ్ పడిపోనుందన్న ఆందోళనలు తలెత్తాయి. దీనికితోడు గత వారం అమెరికాలో ఇంధన నిల్వలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నెల 5తో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7 మిలియన్ బ్యారళ్లమేర పెరిగి 538 మిలియన్ బ్యారళ్లను అధిగమించినట్లు యూఎస్ ఇంధన ఏజెన్సీ వెల్లడించింది. దీంతో చమురు నిల్వలు సరికొత్త రికార్డ్ గరిష్టానికి చేరుకున్నట్లు తెలియజేసింది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదయ్యాయి. నిజానికి 1.45 మిలియన్ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. చైనా ఎఫెక్ట్ చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనాలో తిరిగి కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో ఇంధన డిమాండ్ తగ్గనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంబారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్‌డవున్‌లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు ఇటీవల అంచనా వేస్తున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు ఇంధన వర్గాలు తెలియజేశాయి.కాగా.. ధరలకు స్థిరత్వాన్ని ఇచ్చేందుకు రష్యాసహా ఒపెక్ దేశాలు రోజుకి 9.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జులై చివరివరకూ ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నాయి. . -
చమురు ధరలకూ అమ్మకాల సెగ
పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేయడంతో ప్రపంచ ఆర్థిక పురోగతిపై ఆందోళనలు పెరిగాయి. 2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. దీంతో గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువత్తగా.. ముడిచమురు ధరలకూ ఈ సెగ తగిలింది. వెరసి గురువారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 7 శాతం పతనమైంది., 39 డాలర్ల దిగువకు చేరింది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 8 శాతం పడిపోయి 36.4 డాలర్లను తాకింది. దీంతో ఏప్రిల్ తదుపరి తిరిగి ఒకే రోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం మరోసారి అమ్మకాలు పెరగడంతో నేలచూపులతో కదులుతున్నాయి. బ్రెంట్ బ్యారల్ 1.5 శాతం క్షీణించి 37.97 డాలర్లకు చేరగా.. నైమెక్స్ బ్యారల్ దాదాపు 2 శాతం నీరసించి 35.68 వద్ద ట్రేడవుతోంది. నిల్వల ఎఫెక్ట్ ఈ నెల 5తో ముగిసిన వారంలో వాణిజ్య చమురు నిల్వలు 5.7 మిలియన్ బ్యారళ్లమేర పెరిగినట్లు యూఎస్ ఇంధన ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా చమురు నిల్వలు 538 మిలియన్ బ్యారళ్లను అధిగమించినట్లు తెలియజేసింది. తద్వారా చమురు నిల్వలు సరికొత్త రికార్డ్ గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదైనట్లు తెలియజేసింది. నిజానికి 1.45 మిలియన్ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్య పరిస్థితుల్లో చిక్కుకోనున్న భయాలు ప్రధానంగా చమురు వర్గాలలో ఆందోళనలకు దారితీసినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంబారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఇది చమురు డిమాండ్‌ను దెబ్బతీయవచ్చన్న అంచనాలు అమ్మకాలకు కారణమైనట్లు వివరించారు. అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్‌డవున్‌లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు ఇంధన వర్గాలు తెలియజేశాయి. -
చమురు షేర్లకు ధరల రెక్కలు
అంతర్జాతీయ మార్కెట్లలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా చమురు ఉత్పత్తిలో రష్యా, ఒపెక్ కోతలు విధించడం సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ దేశ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థల రికవరీకి దోహదపడగలవన్న అంచనాలు సైతం దీనికి జత కలిసినట్లు తెలియజేశారు.సోమవారం లండన్ మార్కెట్లో 7 శాతం జంప్‌చేసిన బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా మరికొంత పుంజుకుని 35 డాలర్లకు చేరింది. ఇక న్యూయార్క్ మార్కెట్లోనూ ముందురోజు 8 శాతం ఎగసిన నైమెక్స్ బ్యారల్ 32.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పాదక, తదితర కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.చమురు ఉత్పాదక కౌంటర్లపై సబ్సిడీ భారం తగ్గనుండగా..పెట్రో మార్కెటింగ్ షేర్లు సైతం కళకళలాడుతున్నాయి. రిఫైనింగ్ మార్జిన్లు బలపడే వీలుండటం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 78కు చేరింది. ఈ బాటలో ఆయిల్ ఇండియా 6.5 శాతం ఎగసి రూ. 84ను తాకగా.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 5.2 శాతం లాభంతో రూ. 231 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇంద్రప్రస్థ గ్యాస్ 2.3 శాతం పుంజుకుని రూ. 456 వద్ద కదులుతోంది. తొలుత ఈ షేరు 460 వరకూ ఎగసింది. ఇతర కౌంటర్లలో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ 1.5 శాతం బలపడి రూ. 183 వద్ద, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.5 శాతం పెరిగి రూ. 73 వద్ద, హెచ్‌పీసీఎల్ 1 శాతం పుంజుకుని రూ. 175 వద్ద, బీపీసీఎల్ 1 శాతం లాభంతో రూ. 297 వద్ద ట్రేడవుతున్నాయి.ఇంట్రాడేలో బీపీసీఎల్ 304ను, హెచ్‌పీసీఎల్ రూ. 180నూ అధిగమించాయి. -
భారీగా తగ్గిన విమాన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్/ఏటీఎఫ్) ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ ధరలను 23 శాతం తగ్గించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలకన్నా చౌక ధరకు ఏటీఎఫ్ అందుబాటులోకి రావడం ఆసక్తికరం. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ (వెయ్యి లీటర్లు)కు రూ.6,813 తగ్గడంతో రూ.22,545కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.22.54గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59గా ఉండడంతో ఏటీఎఫ్ ధర మూడో వంతుకే అందుబాటులోకి వచ్చినట్టయింది. ఢిల్లీలో డీజిల్ ధర రూ.62.29గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏటీఎఫ్ ధరలు రెండు వంతుల మేర తగ్గడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు చారిత్రక కనిష్టాలకు పడిపోవడం కలిసొచ్చింది. -
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర
సాక్షి, ముంబై: వంట గ్యాస్ వినియోగదారులకు మరో సారి ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. దీంతో ఎల్పిజి సిలిండర్ల ధరలు వివిధ మెట్రో నగరాల్లో దిగి వచ్చాయి. సవరించిన రేట్లు ఈ రోజు నుంచే (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా ఇది వరుసగా మూడవ తగ్గింపు హైదరాబాదులో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 207 తగ్గి రూ. 589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది. న్యూఢిల్లీలో ఎల్పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర 744 నుంచి తగ్గి రూ. 581.50 గా వుంటుంది. ముంబైలో 714.50 తో పోలిస్తే తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్‌కతాలో రూ. 190 తగ్గి రూ. 584.50, చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ వుంటాయి. చదవండి: కరోనా : అయ్యయ్యో మారుతి! ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి -
ఎంసీఎక్స్ ‘క్రూడ్’ తొండాట..!
న్యూఢిల్లీ/ముంబై: అమెరికా కమోడిటీ ఎక్సే్ఛంజ్(నైమెక్స్)లో క్రూడ్ మే నెల కాంట్రాక్టు ధర మైనస్ 37 డాలర్లకు పడిపోయినప్పటికీ.. మన మార్కెట్(ఎంసీఎక్స్) మాత్రం సొంత నిర్ణయాలతో ట్రేడర్లకు తీరని నష్టం మిగిల్చింది. లాంగ్ పొజిషన్లు తీసుకున్న కొంత మంది బడా బ్రోకర్లకు నష్టాలను తగ్గించేందుకు ఎంసీఎక్స్ గోల్మాల్ చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో నియంత్రణ సంస్థ సెబీ రంగంలోకి దిగింది. వాస్తవానికి కరోనా లాక్డౌన్స్ నేపథ్యంలో ట్రేడింగ్ వేళలను కమోడిటీ ఎక్సే్ఛంజీలు సాయంత్రం 5 గంటల వరకు కుదించాయి. ఇక్కడ సోమవారం ఏప్రిల్ నెల కాంట్రాక్టు ధర రూ.965 వద్ద ముగిసింది. అయితే, సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లో క్రూడ్ ధర మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. దీనిప్రకారం చూస్తే మన మార్కెట్లో మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెటిల్మెంట్ ధర క్రితం ముగింపు, మైనస్ 37.63 డాలర్ల చొప్పున రూ.2,860 కలుపుకొని సుమారు రూ.3,825 డాలర్ల వద్ద సెటిల్ చేయాల్సింది. అయితే, ఎంసీఎక్స్ మాత్రం సెటిల్మెంట్ ధరను రూ.1గా నిర్దేశించింది. మంగళవారంతో గడువు ముగిసే ఈ ఏప్రిల్ కాంట్రాక్టులో 11,522 ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. ఒక్కో పొజిషన్ 100 బ్యారెల్స్ క్రూడ్‌కు సమానం. దీని ప్రకారం 11,52,200 బ్యారెల్స్ విక్రయించిన వారికి(షార్ట్ సెల్లర్స్) రూ.3,825 చొప్పున రూ.440 కోట్లు లాంగ్పొజిషన్ తీసుకున్న ట్రేడర్ల నుంచి సెటిల్మెంట్ చేయాల్సి వచ్చేంది. కానీ ఎంసీఎక్స్ రూపాయి ధరనే నిర్ణయించడంతో క్రితం ముగింపు రూ.965 చొప్పున షార్ట్ సెల్లర్స్‌కు లాభాలు రూ.110 కోట్లకు పరిమితమయ్యాయి. లాంగ్ పొజిషన్ తీసుకున్న ట్రేడర్లు రూ.440 కోట్ల నష్లాలను కేవలం రూ.110 కోట్లకు మాత్రమే పరిమితం చేసుకోగలిగారు. ఇలా ఇష్టానుసారం రూల్స్ మార్చేస్తే ఎలా అంటూ విమర్శలు చెలరేగడంతో సెబీ దీనిపై దృష్టిపెట్టింది. -
రూపాయి 65 పైసలు పతనం
సాక్షి,ముంబై: ప్రపంచ వృద్ధి ఆందోళనల నేపథ్యంలో అటు డాలరు, ఇటు రూపాయి భారీగా నష్టపోతున్నాయి. కోవిడ్-19 భయాలకు తోడు, దేశీయంగా ప్రైవేటు బ్యాంకు యస్ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అనూహ్య వడ్డీరేటు కోత నిర్ణయం కరెన్సీ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి వృద్ధిని తాకవచ్చన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల డాలర్ సూచీ స్పాట్ మార్కెట్లలో 0.25 శాతం క్షీణించింది. దీంతో రూపాయి డాలరుమారకంలో శుక్రవారం ఏకంగా 65 పైసలు క్షీణించింది. 73.99 ట్రేడింగ్‌ను ఆరంభించి 74.06 కనిష్టానికి చేరింది. గురువారం డాలర్‌తో పోలిస్తే 73.33 వద్ద 6 పైసల లాభాలతో రూపాయి ముగిసింది. మూలధన మార్కెట్ల నుండి ఫారెక్స్ ప్రవాహం కొనసాగుతుండటం భారతీయ కరెన్సీని తాకిందని వ్యాపారులు తెలిపారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లుభారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకుపై పతనం కాగా, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) గురువారం నికర ప్రాతిపదికన రూ .2,476.75 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు మార్కెట్ డేటా ద్వారా తెలుస్తోంది. చమురు ధరలు 1.06 శాతం తగ్గాయి. దీంతో బంగారం ధరలు వరుసగా లాభపడుతూ శుక్రవారం ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. బంగారు ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముకు రూ. 200 పెరిగి 44,640 వద్ద కొత్త గరిష్టానికి తాకింది. చదవండి : బ్లాక్ ఫ్రైడే; సెన్సెక్స్1500 పాయింట్లు క్రాష్ -
భారీగా తగ్గిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా దిగి వస్తున్నాయి. వరుసగా మూడవరోజుకూడా పెట్రోలు డీజీలు క్షీణించాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు ధర తగ్గింది. దీంతో మొత్తంగా ఫిబ్రవరిలో పెట్రోల్ లీటరుకు 82 పైసలు, డీజిల్ లీటరుకు 85 పైసలు తగ్గింది. జనవరి 12 నుండి ఇంధన రేట్లు తగ్గడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రకంపనలు ముడిచమురు ధరలను కూడా తాకాయి. చమురుకు డిమాండ్ ఎక్కువుండే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తితో చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర గత వారం పడిపోయింది. వారంలో వరుసగా ఐదవ క్షీణతను నమోదు చేసింది. బ్రెంట్ ముడి బ్యారెల్ 54.50 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ : లీటరు పెట్రోల్ రూ. 72.45, డీజిల్ ధర రూ.65.43. ముంబై : లీటరు పెట్రోల్ రూ. 78.11, డీజిల్ ధరూ.68.57 కోల్‌కతా: లీటరు పెట్రోల్ రూ. 75.13, డీజిల్ ధ రూ. 67.79 చెన్నై: లీటరు పెట్రోల్ రూ. 75.27, డీజిల్ ధ రూ. 69.10 విజయవాడ : లీటరు పెట్రోల్ రూ. 76.63, డీజిల్ ధర రూ.70.91 హైదరాబాద్ : లీటరు పెట్రోల్ రూ. 77.08, డీజిల్ ధర రూ.71.35. -
41,700–41,810 శ్రేణే సెన్సెక్స్‌కు అవరోధం
అమెరికా–ఇరాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతవారం ప్రథమార్ధంలో పెరిగిన బంగారం, క్రూడ్ ధరలు మన ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం సృష్టించాయి. ఇంతలోనే మధ్యప్రాచ్య ఆందోళనలు చల్లారడంతో ఇటు బంగారం, క్రూడ్ ధరలు దిగివచ్చాయి. రూపాయి విలువ కూడా గణనీయంగా పుంజుకోవడంతో తిరిగి స్టాక్ సూచీలు ర్యాలీ చేయగలిగాయి. అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే, మన మార్కెట్లో ఇక బడ్జెట్ అంచనాలు, కార్పొరేట్ ఫలితాలకు అనుగుణంగా ఆయా రంగాలకు చెందిన షేర్లు పెరిగే అవకాశం ఉంది. అయితే స్టాక్ సూచీలను ప్రభావితం చేసే హెవీవెయిట్ షేర్లు మాత్రం ప్రస్తుతం నిస్తేజంగా ట్రేడవుతున్నందున, సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పడం అనుమానమే. బ్యాంకింగ్ హెవీవెయిట్లు ప్రకటించే ఫలితాలే సూచీల కదలికలకు కీలకం. ఇక స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 10తో ముగిసిన వారంలో 40,476–41,775 పాయింట్ల మధ్య 1300 పాయింట్ల మేర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 135 పాయింట్ల స్వల్పలాభంతో 41,600 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొద్దిరోజులుగా 41,700–41,800 శ్రేణి మధ్య పలు దఫాలు అవరోధాన్ని ఎదుర్కొంటున్నందున, ఈ శ్రేణిని ఛేదించి, ముగిసేంతవరకూ కన్సాలిడేషన్ ప్రక్రియ కొనసాగవచ్చు. ఈ వారం సెన్సెక్స్ పెరిగితే పైన ప్రస్తావించిన శ్రేణి తొలుత నిరోధించవచ్చు. ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే వేగంగా 41,980 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 42,300 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. మార్కెట్ క్షీణిస్తే తొలుత 41,450 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 41,170 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 40,860 పాయింట్ల వద్ద మద్దతు పొందవచ్చు. నిఫ్టీ అవరోధ శ్రేణి 12,300–12,320.... గత వారం ప్రథమార్ధం లో 11,929 పాయింట్ల వరకూ క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 12,311 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని తాకింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 12,257 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 12,300–320 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి అవరోధం కలగవచ్చు. ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే అప్‌ట్రెండ్ వేగవంతమై 12,420 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపై క్రమేపీ 12,480–12,540 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం నిఫ్టీ తగ్గితే 12,210 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 12,130 వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 12,045 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. -
రూపాయికి వరుస లాభాలు, ఈ వారంలో
సాక్షి,.ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా నాలుగో సెషన్లో కూడా బలపడింది. శుక్రవారం ఆరంభంలో డాలరు మారకంలో స్వల్పంగా వెనుకంజ వేసినా గణనీయంగా పుంజుకుంది. ఒక దశలో 70.86 గరిష్టాన్ని తాకింది. చివరికి 27పాయింట్ల లాభంతో రూ. 70.94 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు చల్లబడటంతో వరుసగా నాలుగవ సెషన్లో తన విజయ పరుగును కొనసాగించింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా రూపాయి 99 పైసలు పుంజుకోగా, ఈ వారంలో 1.19 శాతం ఎగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు బ్రెంట్ 0.03 శాతం తగ్గి బ్యారెల్‌కు 65.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ సూచిక 0.12 శాతం పెరిగి 97.57 వద్ద ఉంది. అటు స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 147.37 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 41,599.72 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 40.90 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 12,256 ముగిసింది. ఇంట్రా-డేలో 12,311 స్థాయిని టచ్ చేసింది. -
‘క్రూడ్’ కల్లోలం!
ఇరాన్–అమెరికా మధ్య భీకర పరస్పర ప్రతిజ్జలు కొనసాగుతున్నాయి. ఫలితం... ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగభగమన్నాయి. మన మార్కెట్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సోమవారం స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. నష్ట భయం అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి పెట్టుబడులు సురక్షిత సాధనాలైన పుత్తడి, జపాన్ కరెన్సీ యెన్లవైపు తరలిపోతుండటంతో రూపాయి 72ను సైతం తాకింది. అంతర్జాతీయంగా పుత్తడి పరుగులు పెట్టింది. దేశీయంగా పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగిసింది. పశ్చిమాసియాలో అమెరికా రాజేసిన యుద్ధభయాలతో స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరగడం నష్టాలకు మరింత ఆజ్యం పోసింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 41 వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 851 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 788 పాయింట్ల నష్టంతో 40,677 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 234 పాయింట్లు పతనమై 11,993 వద్దకు చేరింది. నిఫ్టీ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఆరు నెలల కాలంలో ఇదే ప్రథమం. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పరస్పర హెచ్చరికలు..... ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీమ్ సులేమానీని గత శుక్రవారం బాగ్దాద్‌లో అమెరికా డ్రోన్ దాడిలో చంపేసిన విషయం తెలిసిందే. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. 2015 నాటి అణ్వస్త్ర ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు కూడా ప్రకటించింది. అంతే కాకుండా ఇరాన్లో ఉన్న అమెరికా దళాలను ఉపసంహరించాలని ఇరాన్ పార్లమెంట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు ప్రతీకార దాడులకు దిగితే అంతకు మించిన దాడులు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధిస్తామని కూడా ఆయన బెదిరించారు. ఇరు దేశాల భీషణ ప్రతినల నడుమ ముడిచమురు ధరలు భగ్గుమనగా, ప్రపంచ మార్కెట్లు వణికిపోయాయి. షేర్ల తీరు ఇలా..... ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో రెండు షేర్లు–టైటాన్, పవర్ గ్రిడ్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 4.6 శాతం నష్టంతో రూ.3,938 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ముడిచమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్, విమానయాన రంగ షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్ 7 శాతం, ఐఓసీ 1.5 శాతం, బీపీసీఎల్ 2.7 శాతం చొప్పున క్షీణించాయి. ► టైర్లు, పెయింట్ల షేర్లు కూడా నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, అపోలో టైర్స్, ఎమ్ఆర్ఎఫ్, జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లు 1–4% నష్టపోయాయి. ► బీఎస్ఈలో ట్రేడైన ప్రతి ఐదు షేర్లలో సగటున 4 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ► రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–3% నష్టపోయాయి. సెన్సెక్స్ మొత్తం 788 పాయింట్ల నష్టంలో ఈ 3 షేర్ల వాటా 330 పాయింట్ల మేర ఉంది. ► సౌత్ అమెరికన్ సినర్జీ గ్రూప్ వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతోందన్న వార్తలతో ‘జెట్ ఎయిర్వేస్ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.36 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో రూ. 3.36 లక్షల కోట్లు ఆవిరి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో మన మార్కెట్ నష్టపోయింది. గత శుక్రవారం 162 పాయింట్లు, ఈ సోమవారం 788 పాయింట్లు చొప్పున సెన్సెక్స్ పతనమైంది. ఈ నష్టాల కారణంగా రూ.3.36 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఈ రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.37 లక్షల కోట్లు ఆవిరై రూ.153.9 లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్లలో భయం... అమెరికా– ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ మార్కెట్లు భయపడుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ విశ్లేషకులు వినోద్ నాయర్ పేర్కొన్నారు. ప్రపంచ పరిస్థితులు అస్థిరంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఉన్న తమ పొజిషన్లను స్క్వేరాఫ్ చేసుకొని సురక్షిత పెట్టుబడుల సాధనాల దిశగా మళ్లిస్తున్నారని వివరించారు. భారత్‌పై ప్రభావం అధికం... ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇతర వర్ధమాన దేశాల కంటే కూడా భారత్‌పైనే అధికంగా ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు వినియోగదేశమైనప్పటికీ, మన అవసరాలకు మూడో వంతుకు పైగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని, చమురు ధరలు పెరిగితే అది మన ఖజానాపై తీవ్రంగానే ప్రభావం చూపగలదని వారంటున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయి దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని, ఇది ప్రభుత్వవ్యయంపై ప్రభావం చూపుతుందనేది నిపుణుల ఆందోళన. బడ్జెట్ ర్యాలీ అనుకుంటే, భారీ నష్టాలు.... ఏడాది కాలం పాటు మన మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్లపై అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రంగానే ప్రభావం చూపాయి. ఇటీవలే ఇరు దేశాలు తొలి దశ ఒప్పందానికి అంగీకరించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. మరో నెలలో రానున్న బడ్జెట్లో కేంద్రం మరిన్ని తాయిలాలిస్తుందనే ఆశలతో బడ్జెట్ ర్యాలీ కొనసాగుతుందని అంతా అంచనా వేశారు. హఠాత్తుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లడంతో గత రెండు రోజులుగా మన మార్కెట్ కుదేలైంది. -
బంగారం.. చమురు భగ్గు!
న్యూఢిల్లీ: ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సొలేమానిని అమెరికా హతమార్చడం.. భౌగోళిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అంతర్జాతీయంగా అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు.. సురక్షిత సాధనాల వైపు మొగ్గు చూపారు. దీంతో బంగారం, క్రూడ్, డాలర్ ఇండెక్స్ శుక్రవారం భారీగా పెరిగాయి. వేర్వేరుగా ఆయా అంశాలపై దృష్టి సారిస్తే... బంగారం: అంతర్జాతీయ ఫ్యూచర్స్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో శుక్రవారం బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 25 డాలర్లు ఎగసి 1,553.95 డాలర్ల స్థాయి తాకింది. పసిడికి ఇది నాలుగు నెలల గరిష్టస్థాయి. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ఒక దశలో 10 గ్రాములు.. 24 స్వచ్ఛత పసిడి ధర రూ.791 లాభంతో రూ.40,068 వద్ద ట్రేడయ్యింది. గురువారంతో పోలి్చతే ఇది 2 శాతంకన్నా అధికం. వెండి కేజీ ధర కూడా ఒకశాతం పైగా పెరుగుదలతో రూ. 47,507 వద్ద ట్రేడయ్యింది. దేశంలోని పలు స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి ధరలు రూ.40,000, వెండి ధరలు 51,000పైన ముగియడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర లాభాలతో.. 18.14 డాలర్లను తాకింది. రూపాయి బలహీనత కొనసాగి, అంతర్జాతీయంగా ధరలు పటిష్టంగా ఉంటే.. సోమవారం దేశీ స్పాట్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్: ఇక క్రూడ్ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లో స్వీట్ నైమెక్స్ బ్యారల్ ధర ఒక దశలో 4 శాతం పెరిగి 64 డాలర్ల స్థాయిని తాకింది. మరోవైపు దాడులకు తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో బంగారం సహా క్రూడ్ ధర కూడా భారీగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నది నిపుణుల అంచనా. డాలర్ ఇండెక్స్ కూడా ఫ్యూచర్స్ మార్కెట్లో పటిష్టంగా (96.48) కొనసాగుతుండడం గమనార్హం. రూపాయి... 42పైసలు పతనం ముంబై: అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సోలేమని హతమవడం రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 42పైసలు పతనమైంది. నెలన్నర కనిష్టం 71.80కి పడిపోయింది. అమెరికా దాడి... ఇరాన్ హెచ్చరికలు.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల భారీ పెరుగుదల... ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 71.56 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒకదశలో 71.81ని కూడా చూసింది. వారంవారీగా రూపాయి 45 పైసలు నష్టపోవడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.