
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి రావడంతో కీలక సూచీలు భారీగా పుంజుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల వెల్లువతో సెన్సెక్స్ చివరికి 332 పాయింట్లు జంప్‌చేసింది. 35,144 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 10,582 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ కీలకమైన 10550పైన ముగిసింది.
ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆటో రంగాలు పుంజుకోగా.. ఫార్మా రియల్టీ నష్టపోయాయి. ఐషర్, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ, అల్ట్రాటెక్, గ్రాసిమ్, యాక్సిస్, ఎల్‌అండ్‌టీ టాప్ విన్నర్స్‌గా నిలవగా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఐబీ హౌసింగ్, పవర్ గ్రిడ్, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒపెక్ లేదా పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థలపై ఒత్తిడి నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ ముడి చమురు ధరలు 1 శాతం తగ్గాయి. దీంతో అటు ఈక్విటీ మార్కెట్లు, ఇటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బాగా పుంజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment