న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి వ్యక్తం చేశారు. క్రూడ్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటకు ఢోకా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక వృద్ధిని అతిగా అంచనా వేస్తోందని అమెరికాకు చెందిన కొంతమంది ఆర్థికవేత్తల వాదనపై ఆయన మాట్లాడుతూ, కొంతమంది మాజీ అధికారులకు భారత్ జీడీపీ మదింపుపై ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు.
ఎల్ నినో పరిస్థితుల సమస్య మళ్లీ తెరపైకి వచి్చందని, వాతావరణ మార్పుల కారణంగా అనిశ్చితి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారు రుణం వేగంగా పెరుగుతున్నందున నికర హౌస్‌హోల్డ్ పొదుపు నిష్పత్తి (జీడీపీలో) తగ్గుతోందని, అయితే స్థూలంగా చూస్తే, నిలకడగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక హౌస్‌హౌల్డ్ సెక్టార్ రుణం కూడా జీడీపీ నిష్పత్తిలో చూస్తే, తీవ్ర స్థాయిలో లేని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలే దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment