
సాక్షి,.ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా నాలుగో సెషన్‌లో కూడా బలపడింది. శుక్రవారం ఆరంభంలో డాలరు మారకంలో స్వల్పంగా వెనుకంజ వేసినా గణనీయంగా పుంజుకుంది. ఒక దశలో 70.86 గరిష్టాన్ని తాకింది. చివరికి 27పాయింట్ల లాభంతో రూ. 70.94 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు చల్లబడటంతో వరుసగా నాలుగవ సెషన్‌లో తన విజయ పరుగును కొనసాగించింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా రూపాయి 99 పైసలు పుంజుకోగా, ఈ వారంలో 1.19 శాతం ఎగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు బ్రెంట్ 0.03 శాతం తగ్గి బ్యారెల్కు 65.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ సూచిక 0.12 శాతం పెరిగి 97.57 వద్ద ఉంది.
అటు స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 147.37 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 41,599.72 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 40.90 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 12,256 ముగిసింది. ఇంట్రా-డేలో 12,311 స్థాయిని టచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment