‘విండ్‌ఫాల్‌’ బాదుడు! | Govt Hikes Windfall Tax On Petroleum Crude, Know Details Inside - Sakshi
Sakshi News home page

‘విండ్‌ఫాల్‌’ బాదుడు!

Published Sat, Mar 2 2024 9:35 AM | Last Updated on Sat, Mar 2 2024 11:48 AM

Govt Hikes Windfall Tax On Petroleum Crude - Sakshi

దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దేశీయంగా వెలికి తీస్తున్న ముడి చమురుపై విండ్‌ ఫాల్‌ ట్యాక్స్‌ను టన్నుకు రూ.3,300 నుంచి రూ.4,600కు పెంచారు. 

ఈ పన్నును ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం (ఎస్‌ఏఈడీ) రూపంలో వసూలు చేస్తారు. డీజిల్‌ ఎగుమతులపై ఎస్‌ఏఈడీ లీటరుకు రూ.1.50 ఉండగా, పూర్తిగా తొలగించారు.

ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు

పెట్రోలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్‌(విమాన ఇంధనం)పై సుంకం లేదు. కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అదాటు లాభాలపై పన్నును తొలిసారిగా 2022 జులై 1న ప్రభుత్వం విధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement