
పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి
న్యూఢిల్లీ: ఆయిల్‌ఫీల్డ్స్ (నియంత్రణ, అభివృద్ధి) బిల్లు అమల్లోకి వచ్చాక చమురు, గ్యాస్ కంపెనీల అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ల్లాంటి కొత్త పన్ను ల విధింపు బాదరబందీ ఉండదని కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయం చెప్పారు. ఇన్వెస్టర్లకు ఆర్థిక విధానాల స్థిరత్వంపై కొత్త చట్టం భరోసా కల్పిస్తుందని పురి వివరించారు.
అంతర్జాతీయంగా పలు ఆయిల్ దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియాతో బ్రెజిల్‌కి చెందిన పెట్రోబ్రస్, ఓఎన్‌జీసీతో ఎక్సాన్‌మొబిల్, ఈక్వినార్ వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. ఇతర దేశాల తరహాలోనే, ఇంధన కంపెనీలకు వచ్చే అసాధా రణ లాభాలపై 2022 జూలై 1 నుంచి భారత్ విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యా క్స్‌లు విధించడం మొదలుపెట్టింది.
పెట్రోల్.. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున ఎగుమతి సుంకాలు విధించింది. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపైనా టన్నుకు రూ. 23,250 చొప్పున విధించింది. పలుమార్లు సవరించిన ఈ ట్యాక్స్‌లను 30 నెలల తర్వాత గతేడాది డిసెంబర్‌లో నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment