ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌పై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ప్రపంచ మార్కెట్లో తాజాగా ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను స్వల్పంగా పెంచింది.
పదిహేను రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడాయిల్‌పై రూ.3,300కు చేర్చింది. ఫిబ్రవరి 16 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. రెండు వారాల క్రితం ఇది రూ.3,200 ఉంది. అలాగే తాజాగా డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు సుంకాన్ని లీటరుకు రూ.1.50కు పెంచింది. గతంలో దీనిపై పన్నును పూర్తిగా తొలగించి జీరో చేసింది.
ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రముఖ కంపెనీ
పెట్రోల్, విమానయాన ఇంధనం ఎగుమతులపై సుంకాన్ని జీరో శాతం వద్దే నిలిపిఉంచింది. ఇంధన కంపెనీలు అధికంగా ఆర్జించే లాభాలపై కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ విధింపును 2022 జూలై 1 నుంచి ప్రారంభించింది. ప్రపంచ మార్కెట్లో రెండు వారాల సగటు ఆయిల్ ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి పన్ను రేట్లను సవరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment