Crude
-
రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్‌గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు కనీసం 3 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా కరెన్సీ రుబెళ్లలో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ డీల్ ఒక ఏడాదిపాటు కొనసాగుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి.రోస్నెఫ్ట్తో కుదిరిన ఈ డీల్ వల్ల రిలయన్స్ రాయితీ ధరలకే చమురు పొందనుంది. చమురు ఉత్పత్తిదారుల ఒపెక్ ప్లస్ కూటమి జూన్ తర్వాత స్వచ్ఛందంగా క్రూడ్ సరఫరాలో కోతలు విధించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్), రష్యాతో సహా మిత్రదేశాలతో కూడిన ఒపెక్ ప్లస్ కూటమి జూన్ 2న జరిగే ఆన్లైన్ సమావేశంలో చమురు కోతలపై చర్చించనుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఈ డీల్ కుదుర్చుకోవడంపట్ల మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: థాయ్‌లాండ్ వీసా నిబంధనల్లో మార్పులురష్యా-ఉక్రెయిన్ మధ్య అనిశ్చితులు తీవ్రరూపం దాల్చిన సమయంలో వెస్ట్రన్ దేశాలు, అమెరికా రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించింది. దాంతో రష్యా తక్కువ ధరకే భారత్ వంటి ఇతర దేశాలకు చమురు అమ్మడం ప్రారంభించింది. అందులో భాగంగానే రిలయన్స్ వంటి భారత ప్రైవేట్ చమురు కంపెనీలు ఆ దేశం నుంచి క్రూడ్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. -
క్రూడాయిల్‌పై పన్ను పెంపు.. ఎంతో తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌పై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ప్రపంచ మార్కెట్లో తాజాగా ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను స్వల్పంగా పెంచింది. పదిహేను రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడాయిల్‌పై రూ.3,300కు చేర్చింది. ఫిబ్రవరి 16 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. రెండు వారాల క్రితం ఇది రూ.3,200 ఉంది. అలాగే తాజాగా డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు సుంకాన్ని లీటరుకు రూ.1.50కు పెంచింది. గతంలో దీనిపై పన్నును పూర్తిగా తొలగించి జీరో చేసింది. ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రముఖ కంపెనీ పెట్రోల్, విమానయాన ఇంధనం ఎగుమతులపై సుంకాన్ని జీరో శాతం వద్దే నిలిపిఉంచింది. ఇంధన కంపెనీలు అధికంగా ఆర్జించే లాభాలపై కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ విధింపును 2022 జూలై 1 నుంచి ప్రారంభించింది. ప్రపంచ మార్కెట్లో రెండు వారాల సగటు ఆయిల్ ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి పన్ను రేట్లను సవరిస్తుంది. -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్‌పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్‌లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్‌ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..రికవరీ ఎప్పుడంటే..
ఈక్విటీ మార్కెట్లు గురువారం సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత పది ట్రేడింగ్ సెషన్‌ల్లో తొమ్మిదింటిలో నష్టాల్లోకి లాగబడ్డాయి. దాంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ఈవెంట్‌కు మార్కెట్ ఎల్లప్పుడూ ముందే స్పందిస్తుంది. కాబట్టి, ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని భావిస్తున్నారు. దాంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. డాలర్ పెరుగుతుడడంతో రూపాయి పతనం కొనసాగవచ్చనే భయాలు ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్‌లు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. విదేశీ, రిటైల్ మదుపరులు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు ఇంకా దిగజారిపోతున్నాయి. మార్కెట్లు ఓవర్‌సోల్డ్ జోన్లోకి చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సద్దుమనుగుతే తప్పా మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని తెలుస్తుంది. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ గడిచిన ట్రేడింగ్‌తో పోలిస్తే 264 పాయింట్లు నష్టపోయి 18857 వద్దకు చేరింది. సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి 63148 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.210కు చేరింది. క్రూడ్ బ్యారెల్ ధర 84.36డాలర్లకు చేరింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.32శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.06శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్ 30 లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లోకి వెళ్లాయి. అధికంగా ఎం అండ్ ఎం, బజాజ్‌ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్ ట్యాక్స్ కట్
దేశీయంగా క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించింది. అలాగే డీజిల్, ఎటిఎఫ్ ఎగుమతులకు చెక్ పెట్టేలా లెవీనీ కూడా పెంచింది. ముడి చమురు అమ్మకంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.6,700కి తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇది సెప్టెంబర్ 2 నుండి అమలుల్లోఉంటుందని తెలిపింది. క్రూడ్ పెట్రోలియంపై సాడ్ టన్నుకు రూ.7100 నుంచి రూ.6700కి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆగస్టు 14న జరిగిన సమీక్షలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.7,100గా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. ( డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లెవీ పెంపు మరోవైపు డీజిల్ ఎగుమతిపై SAED లేదా సుంకం లీటరుకు రూ.5.50 నుండి రూ.6కి పెంచింది. జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్‌పై సుంకం లీటరుకు రూ.2 నుంచి రూ.4కు రెట్టింపు అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలియం ఎగుమతులపై సుంకం ఏమీఉండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఉత్పత్తి కంపెనీలు భారీ లాభాల నేపథంయలో జూలై 1, 2022 నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు అమ్మకాలపై కేంద్రం మొదట విండ్‌ఫాల్ పన్నులను విధించింది. అంతేకాకుండా, దేశీయ మార్కెట్‌కు బదులుగా, ప్రైవేట్ రిఫైనర్లు మెరుగైన అంతర్జాతీయ ధరల మధ్య విదేశాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నందున పెట్రోల్, డీజిల్ ,జెట్ ఇంధనాల ఎగుమతులపై అదనపు సుంకంవిధించిన సంగతి తెలిసిందే. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) -
భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు
-
ముడి చమురు ఉత్పత్తిపై ఇక జీరో విండ్‌ఫాల్ ట్యాక్స్
భారత ప్రభుత్వం ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా తొలగించింది. టన్నుకు రూ. 3,500 (42.56 డాలర్లు) ఉన్న పన్నును సున్నాకు తగ్గించింది. అంటే దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ఎలాంటి విండ్‌ఫాల్ పన్ను ఉండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. (వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?) అలాగే డీజిల్‌పై గతంలో ఉన్న విండ్‌ఫాల్ పన్నును ప్రభుత్వం లీటరుకు రూపాయి నుంచి 50 పైసలకు తగ్గించింది. ఇక పెట్రోలియం, ఏటీఎఫ్‌పై ఎలాంటి విండ్‌ఫాల్ పన్ను లేదు. విండ్‌ఫాల్ టాక్స్ అనేది కొన్ని పరిశ్రమలు తమ సగటు ఆదాయం కంటే ఎక్కువ ఆర్జించినప్పుడు విధించే పన్ను. ఒక పరిశ్రమ ఊహించని విధంగా భారీ లాభాలను ఆర్జించినప్పుడు ప్రభుత్వానికి ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఇంధన ధరలు చమురు ఉత్పత్తిదారులకు అధిక లాభాలను తెచ్చిపెట్టడంతో గత ఏడాది జూలైలో ప్రభుత్వం ఈ పన్నును ప్రవేశపెట్టింది. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) అప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా 2022 జూలైలో ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నులు టన్నుకు రూ. 23,250 నుంచి 2023 మార్చి 21 నాటికి టన్నుకు రూ. 3,500కి తగ్గాయి. ఇటీవల పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చర్య కారణంగా ఏప్రిల్ 3న బ్రెంట్ ధర దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.58 డాలర్లకు చేరుకుంది. -
రూపాయి... మళ్లీ 69.95కు
ముంబై: రూపాయి మళ్లీ చక్కటి రికవరీతో 70కన్నా దిగువకు వచ్చింది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 69.95 వద్ద ముగిసింది. గురువారంతో పోల్చితే ఇది 40 పైసలు రికవరీ. గురువారం ముగింపు 70.35. డిసెంబర్ 20న రూపాయి 69.70 వద్ద ముగిసింది. అటు తర్వాత రూపాయి మళ్లీ ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఆరు ప్రధాన విదేశీ కరెన్సీలతో డాలర్ బలహీనత, క్రూడ్ ధరలు తిరిగి ఇప్పుడే భారీగా పెరగబోవన్న విశ్లేషణలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్లు వరుసగా మూడవరోజు లాభాల బాటన పయనించడం కూడా రూపాయి బలోపేతానికి కారణమయ్యింది. ట్రేడింగ్ మొదట్లోనే రూపాయి పటిష్ట ధోరణిలో 70.05 వద్ద ప్రారంభమైంది. 69.89–70.12 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వస్తోంది. -
ఇన్ఫ్రా దిగాలు!
♦ ఏప్రిల్‌లో ఉత్పాదకత 2.5% క్షీణత ♦ బొగ్గు, క్రూడ్, సిమెంట్ పేలవం! న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన ఎనిమిది పరిశ్రమల ఇన్ఫ్రా గ్రూప్ ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల– ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. 2016 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2017 ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా ఉత్పత్తి 2.5 శాతం క్షీణించింది (మైనస్). బొగ్గు, క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాల పేలవ పనితీరు దీనికి కారణం. ఇంకా ఈ గ్రూప్‌లో నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. ఈ గ్రూప్ 2016 ఏప్రిల్ వృద్ధి రేటు 8.7 శాతం. ఎనిమిది రంగాలూ వేర్వేరుగా... ⇔ బొగ్గు: –1.8% క్షీణత.. –3.8 శాతానికి చేరింది. ⇔ క్రూడ్ ఆయిల్: క్షీణతలోనే ఉన్నా ఇది –2.2 శాతం నుంచి –0.6 శాతానికి తగ్గింది. ⇔ సిమెంట్: 4.3 శాతం వృద్ధి రేటు నుంచి –3.7 శాతం క్షీణతకు పడిపోయింది. ⇔ నేచురల్ గ్యాస్: –6.9 శాతం క్షీణత నుంచి 2 శాతం వృద్ధికి మళ్లింది. ⇔ రిఫైనరీ: 19.1% వృద్ధి 0.2%కి పడింది. ⇔ ఎరువులు: –3% క్షీణత నుంచి 6.2%కి ఎగసింది. ⇔ స్టీల్: వృద్ధి 4.5% నుంచి 9.3 శాతానికి చేరింది. ⇔ విద్యుత్: ఉత్పాదకత వృద్ధి 14.5 శాతం నుంచి 4.7 శాతానికి పడిపోయింది. -
గెలుపు ట్రంప్‌దే.. ఇక ట్రేడ్ వారే!
ముంబై: హోరా హోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో అంచనాలు మరింత ఉత్కంఠను రాజేస్తున్నాయి. రేపు(నవంబర్ 8న) పోలింగ్ జరగనుండగా ఫలితాలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అంతేకాదు ఎవరు గెలిస్తే ఏంటి అనే చర్చ కూడా భారీగానే నడుస్తోంది. ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు, ట్రేడ్ పండితుల విశ్లేషణలు పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్నాయి. తాజాగా ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ సంచలన విశ్లేషణ చేశారు. ఒకవైపు హిల్లరీ ఫౌండేషన్ ప్రయివేట్ ఈమెయిళ్లను వినియోగించారన్న అభియోగంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) క్లీన్ చిట్ ఇవ్వడంతో ట్రంప్‌ను వెనక్కి నెట్టి హిల్లరీ రేసులో ముందంజలోకి వచ్చేశారు. అయితే తాను మాత్రం ట్రంప్ గెలుస్తారనే భావిస్తున్నానని, అందువల్ల యూఎస్ స్టాక్ మార్కెట్ లో షార్ట్ సెల్లింగ్ చేస్తున్నానని ఆయన తెలిపారు. హిల్లరీ, ట్రంప్‌లలో ఎవరు అమెరికా ప్రెసిడెంట్ అయినా ఒరిగేదేమీ ఉండదంటూ వ్యాఖ్యానించినప్పటికీ, ట్రంప్ గెలిస్తేమాత్రం ముప్పు తప్పదన్న సంకేతాలందించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందనీ, ఇందులో చైనాకు కూడా మినహాయింపులేదన్నారు. భారత్ కూడా ఆర్థిక మందగమనం నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. అయితే భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు బావున్నాయని కితిబిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే, అమెరికా రుణభారం మరింత పెరిగి దివాలా పరిస్థితికి చేరుతుందన్నారు. వాణిజ్యపరమైన వివాదాలకు తెరలేస్తుందని విశ్లేషించారు. తన అంచనా కరెక్టయితే స్వల్పకాలంలో ముడిచమురు, బంగారం షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొని ధరలు కుప్పకూలతాయని జోస్యం చెప్పారు. కమోడిటీ ధరలు మాత్రం పుంజుకుంటాయన్నారు. ఈ షేర్లలో మదుపర్లు దీర్ఘకాలిక పొజిషన్లు తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. అలాగే వ్యవసాయ సంబంధిత షేర్లు కొనుక్కోవాలని, అయిదు సం.రాల కాలపరిమితిలో అమెరికాలో జంక్ బాండ్స్ లో షాట్ పొజిషన్ తీసుకోవచ్చని సూచించారు. ట్రంప్ విజయంతో ముడిచమురు మార్కెట్ తో పాటు బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని, బంగారం ధరలు, క్రూడాయిల్ భారీగా పతనమవుతాయని రోజర్స్ అంచనా వేశారు. కొత్త పెట్టుబడులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి దీర్ఘకాల అవకాశాలు లభిస్తాయని అన్నారు. కమోడిటీ మార్కెట్ అందనంత ఎత్తునకు చేరుతుందని, ఇండియాపైనా ఈ ప్రభావం ఉంటుందని, అయితే, ఇండియాలో కాగా, వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ లో హిల్లరీకి అనుకూలంగా60 శాతం మెజార్టీ లభిస్తోంది. అయితే హిల్లరీ గెలిచినా ఈపరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయానా కాస్త ఆలస్యమవుతాయని పేర్కొనడం విశేషం. -
భారీగా పతనమైన ఆయిల్ ధరలు
న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కీలకమైన ఒపెక్ సమావేశం ప్రారంభానికి ముందే క్రూడ్ ధరలు ఢమాల్ అన్నాయి. చమురు సరఫరాల నియంత్రణపై ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్‌యేతర దేశాలతో ఒపెక్ దేశాలు సమావేశంకానున్న నేపథ్యంలో ధరలు 4 శాతం పతనం కావడం ఆందోళన రేపింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 3.7 శాతం(1.76 డాలర్లు) దిగజారి 45.89 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ మరింత అధికంగా 4 శాతం(1.84 డాలర్లు) పడిపోయి 44.48 డాలర్ల వద్ద నిలిచింది. గత రెండేళ్లుగా నష్టాలను మూడగట్టుకుంటున్న ముడిచమురు ధరలను నిలబెట్టేందుకు సరఫరాలపై నియంత్రణలు తీసుకురావాలని సౌదీ అరేబియా ఇటీవల పేర్కొంది. అయితే సెప్టెంబర్ 26-28 మధ్య నిర్వహించనున్న సమావేశంపై ప్రతికూల అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సమావేశం విఫలంకావడం ఈ అంచనాలకు ఆధారమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒపెక్ సమావేశాల్లో 'నో డీల్' ఫలితం రానుందని మాక్క్వారీ కాపిటల్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. అల్జీరియా మీట్ మరో మీట్ చారిత్రక వైఫల్యం కానుందని పేర్కొంది. ఇది డిసిసేషన్ మేకింగ్ సమావేశం కాదని, కేవలం సంప్రదింపులు మాత్రమేనని సౌదీ ఆయిల్ అధికారులు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించాయి. అలాగే ఫిజికల్ కమెడిటీస్ లో బ్యాంకుల జోక్యం పై ఆంక్షలు విధించాలన్న యోచనలోఉన్న ఫెడరల్ రిజర్వ్ విధానం, బలపడుతున్న డాలర్ విలువ, విద్యుత్ ధరలు, పెరిగిన చైనా ఎగుమతులు, ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య నెలొకొన్న విబేధాలు బ్రిటన్ కంపెనీల కష్టాలు ముఖ్యమైన అంశాలుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే నాన్ ఒపెక్ దేశం, ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దారు అయిన రష్యా ఈవారంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడం కూడా ఒక కారణమని తెలిపాయి. కాగా నాన్‌ఒపెక్ దేశమైన రష్యా ఈ ప్రతిపాదనకు మద్దతు పలకడంతో చమురు దేశాలకు ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అల్జీర్స్ లో వచ్చే వారం ఒపెక్ సమావేశానికి నిర్ణయించింది. -
పశ్చిమబెంగాల్ లో నాటు బాంబులు స్వాధీనం
బర్ధమన్ః పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గ్రామాలు ఇటీవల బాంబు తయారీ కేంద్రాలుగా మారిపోతున్నాయి. తరచుగా జరుగుతున్న బాంబు పేలుళ్ళ నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా అందిన విశ్వసనీయ సమాచారంతో బర్దమన్ జిల్లాలో దాడులు నిర్వహించిన పోలీసులు... ఓ ఇంటి నుంచీ నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్ లో పోలీసులు వందలకొద్దీ నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బర్ధమన్ జిల్లా మంగళ్ కోట్ నియోజకవర్గంలో దాడులు నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో జరిపిన సోదాల్లో 123 దేశవాళీ బాంబులను స్వాధీనం చేసుకోవడంతోపాటు... ఇంటి యజమాని సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నాటుబాంబుల తయారీ, నిల్వలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అదుపులో ఉన్నవారిని ఆరా తీస్తున్నారు. -
రిలయన్స్ భేష్!
అంచనాలను మించిన ఫలితాలు.. క్యూ1లో లాభం రూ.7,113 కోట్లు; 18 శాతం జంప్ ♦ రిఫైనింగ్ మార్జిన్ల జోరు ప్రభావం.. ♦ జూన్ క్వార్టర్లో జీఆర్ఎం 11.5 డాలర్లు ♦ ఆదాయం మాత్రం 13.4 శాతం డౌన్; రూ.71,451 కోట్లు ♦ క్రూడ్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల క్షీణత కారణం న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్... అంచనాలను మించిన లాభాలతో అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18.1 శాతం దూసుకెళ్లి రూ.7,113 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,024 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా పటిష్టమైన ముడిచమురు రిఫైనింగ్ మార్జిన్లు లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 13.4 శాతం దిగజారి రూ.71,451 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పతనం కావడం ఆదాయాల క్షీణతకు దారితీసింది. కాగా, జూన్ క్వార్టర్లో మార్కెట్ విశ్లేషకులు రూ.6,515 కోట్ల లాభాన్ని అంచనా వేశారు. జీఆర్ఎం దూకుడు... క్యూ1లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 11.5 డాలర్లకు ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్టస్థాయి కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్ఎం 10.4 డాలర్లుకాగా, గడిచిన త్రైమాసికం(క్యూ4)లో ఇది 10.8 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా శుద్ధి చేయడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. క్రూడ్ రిఫైనింగ్‌కు సంబంధించి ప్రామాణికంగా పరిగణించే సింగపూర్ బెంచ్‌మార్క్ జీఆర్ఎం క్యూ1లో 5 డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. క్యూ1లో రిలయన్స్ జీఆర్ఎం 9.8 డాలర్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇతర ముఖ్యాంశాలు.. ♦ క్యూ1లో స్థూల లాభం 26% దూసుకెళ్లి రూ.6,593 కోట్లకు ఎగసింది. ఈ విభాగంలో ఆదాయం 17.7% క్షీణించి రూ.68,729 కోట్ల నుంచి రూ.56,568 కోట్లకు తగ్గింది. ♦ జూన్ క్వార్టర్లో ఆర్ఐఎల్ జామ్ నగర్ జంట రిఫైనరీలు 16.8 మిలియన్ టన్నుల ముడిచమురును శుద్ధి చేశాయి. ♦ పెట్రోకెమికల్స్ వ్యాపారంలో స్థూల లాభం 20.5 శాతం వృద్ధి చెంది రూ.2,806 కోట్లకు చేరింది. ఆదాయం స్వల్పంగా 0.7 శాతం తగ్గుదలతో రూ.20,858 కోట్ల నుంచి రూ.20,718 కోట్లకు తగ్గింది. ♦ చమురు, గ్యాస్ వ్యాపారంలో స్థూల నష్టం రూ.199 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెరిగింది. ఈ రంగంలో ఆదాయం రూ.1,340 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ. 2,054 కోట్లతో పోలిస్తే ఏకంగా 34.8 శాతం క్షీణించింది. ♦ కేజీ-డీ6 క్షేత్రాల్లో క్రూడ్ ఉత్పత్తి 35% దిగజారి 0.28 మిలియన్ బ్యారళ్లకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి 23% క్షీణించి 28.05 బిలియన్ ఘనపుటడుగులకు తగ్గింది. ♦ ఇతర ఆదాయం గతేడాది క్యూ1లో రూ.1,584 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఏకంగా రూ.2,378 కోట్లకు దూసుకెళ్లింది. ప్రధానంగా కొన్ని ఆస్తుల విక్రయం, వడ్డీ రూపంలో ఆదాయం పెరగడం దోహదం చేసింది. ♦ రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ1లో రూ. 45.8% ఎగసి రూ.6,666 కోట్లకు చేరింది. స్థూల లాభం రూ.198 కోట్ల నుంచి రూ.240 కోట్లకు పెరిగింది. జూన్ చివరికి 679 నగరాల్లో మొత్తం 3,383 స్టోర్లను నిర్వహిస్తోంది. ♦ కంపెనీ మొత్త రుణ భారం ఈ ఏడాది జూన్ చివరినాటికి రూ.1,86,692 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ చివరికి రుణ భారం రూ.1,80,388 కోట్లు. ♦ కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు స్వల్ప పెరుగుదలతో రూ.80,966 కోట్ల నుంచి రూ.90,812 కోట్లకు చేరాయి. ♦ శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు ధర 0.61 శాతం లాభంతో రూ.1,013 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. మేం లాభాల జోరును కొనసాగిస్తున్నాం. రిఫైనింగ్ వ్యాపారం మరోసారి రికార్డుస్థాయి పనితీరును నమోదు చేసింది. పెట్రోకెమికల్స్ వ్యాపారంలోనూ వృద్ధి జోరందుకుంది. రిలయన్స్ జియో 4జీ టెలికం సేవలకు మొత్తం వ్యవస్థ సిద్ధమైంది. దేశంలో ప్రతి ఒక్కరికీ అధునాతన వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ విప్లవానికి తెరతీయనున్నాం’. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ జియో వాణిజ్య సేవలు ఎప్పటినుంచో? దేశీ టెలికం రంగంలో ఉత్కంఠ రేపుతున్న రిలయన్స్ జియో 4జీ సేవలకు సంబంధించి వాణిజ్యపరమైన కార్యకలాపాలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయనేది కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌లో 15 లక్షల మందికి పైగా టెస్ట్ యూజర్లు ఉన్నట్లు అంచనా. కాగా, రానున్న నెలల్లో ఈ ప్రయోగాత్మక సేవలను పూర్తిస్థాయి వాణిజ్య సేవల్లోకి అప్‌గ్రేడ్ చేయనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. టెస్టింగ్ సందర్భంగా యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 26 జీబీగా ఉన్నట్లు తెలిపింది. ఇక సగటు నెలవారీ వాయిస్ వినియోగం 355 నిమిషాలుగా నమోదైనట్లు వెల్లడించింది. -
డీజిల్ ధరలపై త్వరలో నియంత్రణ ఎత్తివేత?
న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకంపై నష్టం రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. డీజిల్ ఉత్పత్తి వ్యయం, విక్రయ ధరల మధ్య వ్యత్యాసం ఈ నెల తొలి పక్షంలో లీటరుకు రూ.2.80 ఉండగా, ఇప్పుడది రూ.1.62కు తగ్గిపోయింది. రూపాయి మారకం విలువ బలపడుతూ, లీటరు రేటును నెలకు 50 పైసల చొప్పున పెంచుతుంటే వచ్చే సెప్టెంబరుకల్లా డీజిల్ ధరలపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించనుంది. ధరలను ప్రతినెలా స్వల్పంగా పెంచడం ద్వారా సబ్సిడీలను ఎత్తివేయాలన్న మునుపటి యుపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు కొనసాగిస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16 విడతల్లో లీటరు డీజిల్ ధరను రూ.10.12 పెంచారు. మే ద్వితీయార్థంతో పోలిస్తే ఈ నెల ప్రథమార్థంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గాయని అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినపుడు లీటరుపై రూ.4.41 చొప్పున నష్టం వచ్చింది. పెట్రోలు ధరలపై కంట్రోలును 2010 నుంచి ఎత్తివేశారు. దీంతో ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా పెట్రోలు ధరలు ఉంటున్నాయి. డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై విక్రయిస్తున్నందువల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రస్తుతం రోజుకు రూ.249 కోట్లు నష్టం వస్తోంది. గత పక్షంలో ఇది రూ.262 కోట్లుగా ఉంది. -
స్టాక్ మార్కెట్ పై క్రూడ్ పంజా, భారీ నష్టాలు!
హైదరాబాద్: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల దాడితో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధర పెరుగడం, ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి 59.69 రూపాయలను నమోదు చేసుకోవడం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీగా నష్టపోయాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 348 పాయింట్ల పతనంతో 25228 పాయింట్ల వద్ద, నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 7542 పాయింట్ల వద్ద ముగిసాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలో పతనమవ్వడం గత నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. క్రూడ్ ధర, పెరగడం, ద్రవ్య మార్కెట్ లో రూపాయి పతనం కావడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీయడంతో సుమారు 12 రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీ అధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 8 శాతం, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, ఎన్ఎమ్ డీసీ, యాక్సీస్ బ్యాంక్, కంపెనీలు 45 శాతానికి పైగా నష్టపోయాయి. హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, హెచ్ యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్పోసిస్ కంపెనీల షేర్లు స్వల్పంగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి.