గెలుపు ట్రంప్దే.. ఇక ట్రేడ్ వారే!
గెలుపు ట్రంప్దే.. ఇక ట్రేడ్ వారే!
Published Mon, Nov 7 2016 1:00 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
ముంబై: హోరా హోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో అంచనాలు మరింత ఉత్కంఠను రాజేస్తున్నాయి. రేపు(నవంబర్ 8న) పోలింగ్ జరగనుండగా ఫలితాలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అంతేకాదు ఎవరు గెలిస్తే ఏంటి అనే చర్చ కూడా భారీగానే నడుస్తోంది. ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు, ట్రేడ్ పండితుల విశ్లేషణలు పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్నాయి. తాజాగా ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ సంచలన విశ్లేషణ చేశారు. ఒకవైపు హిల్లరీ ఫౌండేషన్ ప్రయివేట్ ఈమెయిళ్లను వినియోగించారన్న అభియోగంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) క్లీన్ చిట్ ఇవ్వడంతో ట్రంప్ను వెనక్కి నెట్టి హిల్లరీ రేసులో ముందంజలోకి వచ్చేశారు. అయితే తాను మాత్రం ట్రంప్ గెలుస్తారనే భావిస్తున్నానని, అందువల్ల యూఎస్ స్టాక్ మార్కెట్ లో షార్ట్ సెల్లింగ్ చేస్తున్నానని ఆయన తెలిపారు.
హిల్లరీ, ట్రంప్‌లలో ఎవరు అమెరికా ప్రెసిడెంట్ అయినా ఒరిగేదేమీ ఉండదంటూ వ్యాఖ్యానించినప్పటికీ, ట్రంప్ గెలిస్తేమాత్రం ముప్పు తప్పదన్న సంకేతాలందించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందనీ, ఇందులో చైనాకు కూడా మినహాయింపులేదన్నారు. భారత్ కూడా ఆర్థిక మందగమనం నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. అయితే భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు బావున్నాయని కితిబిచ్చారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే, అమెరికా రుణభారం మరింత పెరిగి దివాలా పరిస్థితికి చేరుతుందన్నారు. వాణిజ్యపరమైన వివాదాలకు తెరలేస్తుందని విశ్లేషించారు. తన అంచనా కరెక్టయితే స్వల్పకాలంలో ముడిచమురు, బంగారం షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొని ధరలు కుప్పకూలతాయని జోస్యం చెప్పారు. కమోడిటీ ధరలు మాత్రం పుంజుకుంటాయన్నారు. ఈ షేర్లలో మదుపర్లు దీర్ఘకాలిక పొజిషన్లు తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. అలాగే వ్యవసాయ సంబంధిత షేర్లు కొనుక్కోవాలని, అయిదు సం.రాల కాలపరిమితిలో అమెరికాలో జంక్ బాండ్స్ లో షాట్ పొజిషన్ తీసుకోవచ్చని సూచించారు.
ట్రంప్ విజయంతో ముడిచమురు మార్కెట్ తో పాటు బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని, బంగారం ధరలు, క్రూడాయిల్ భారీగా పతనమవుతాయని రోజర్స్ అంచనా వేశారు. కొత్త పెట్టుబడులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి దీర్ఘకాల అవకాశాలు లభిస్తాయని అన్నారు. కమోడిటీ మార్కెట్ అందనంత ఎత్తునకు చేరుతుందని, ఇండియాపైనా ఈ ప్రభావం ఉంటుందని, అయితే, ఇండియాలో కాగా, వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ లో హిల్లరీకి అనుకూలంగా60 శాతం మెజార్టీ లభిస్తోంది. అయితే హిల్లరీ గెలిచినా ఈపరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయానా కాస్త ఆలస్యమవుతాయని పేర్కొనడం విశేషం.
Advertisement
Advertisement