పశ్చిమబెంగాల్ లో నాటు బాంబులు స్వాధీనం
బర్ధమన్ః పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గ్రామాలు ఇటీవల బాంబు తయారీ కేంద్రాలుగా మారిపోతున్నాయి. తరచుగా జరుగుతున్న బాంబు పేలుళ్ళ నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా అందిన విశ్వసనీయ సమాచారంతో బర్దమన్ జిల్లాలో దాడులు నిర్వహించిన పోలీసులు... ఓ ఇంటి నుంచీ నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమబెంగాల్ లో పోలీసులు వందలకొద్దీ నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బర్ధమన్ జిల్లా మంగళ్ కోట్ నియోజకవర్గంలో దాడులు నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో జరిపిన సోదాల్లో 123 దేశవాళీ బాంబులను స్వాధీనం చేసుకోవడంతోపాటు... ఇంటి యజమాని సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నాటుబాంబుల తయారీ, నిల్వలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అదుపులో ఉన్నవారిని ఆరా తీస్తున్నారు.