west
-
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తిరువనంతపురం: కేరళలో వెస్ట్ నైల్ వైరస్( (డబ్ల్యూఎన్వీ) కేసులు మళ్లీ వెలుగు చూశాయి. మొత్తం 10 కేసులు తాజాగా నమోదయ్యాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఐదు చొప్పున కేసులు రికార్డయ్యాయి. వెస్ట్ నైల్ వైరస్ సోకిన 10 మందిలో 9 మంది ఇప్పటికే కోలుకోగా ఒక్క వ్యక్తి మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల సంభవించిన ఇద్దరి వ్యక్తుల మరణాలకు కూడా వెస్ట్ నైల్ వైరస్ కారణమన్న అనుమానాలున్నాయి. ఇది నిజమా కాదా అన్నది తేల్చడానికి సాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.ఎన్సెఫలైటిస్ ఫ్లావి వైరస్ రకానికి చెందిన వెస్ట్ నైల్ వైరస్ దోమల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాప్తి చెందదు. ఈ వైరస్ పది మందిలో ఇద్దరికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2019,2022 కేరళలో వెస్ట్ నైల్ వైరస్ సోకి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. -
ఆ లోక్‌సభ సీటులో విజయం.. కేంద్రంలో అధికారం?
దేశ రాజధాని ఢిల్లీలోని ఆ లోక్‌సభ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారో వారే కేంద్రంలో అధికారం చేపడతారట. కొన్నాళ్లుగా ఇలానే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ ఈ స్థానం. 2009 పార్లమెంట్ ఎన్నికలకు కొంతకాలం ముందు ఈ సీటు ఉనికిలోకి వచ్చింది. ఈ స్థానంపై ఇప్పటి వరకు మూడు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో ఎన్నికలకు ఈ స్థానం ఎదురు చూస్తోంది. ఈ సీటుకు సంబంధించిన అత్యంత విశేషమేమిటంటే ఈ సీటును గెలుచుకున్న పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. 2009లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2014, 2019లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను నిలబెట్టడంతో ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. అయితే ఈసారి బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కమల్జిత్ సెహ్రావత్, కాంగ్రెస్ మద్దతు కలిగిన ఆప్ నేత మహాబల్ మిశ్రా మధ్య గట్టిపోటీ నెలకొంది. 2014లో ఆప్ రెండో స్థానంలో ఉండగా, 2019లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని బీజేపీ రెండుసార్లు సొంతం చేసుకుంది. 2014లో బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ 2.68 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన అత్యధికంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి బీజేపీ వర్మకు టికెట్ కేటాయించలేదు. బీజేపీకి చెందిన సెహ్రావత్‌కు ఇవి మొదటి లోక్‌సభ ఎన్నికలు. ఒకవేళ సెహ్రావత్ ఎన్నికైతే ఆమె ఈ స్థానానికి తొలి మహిళా ఎంపీ అవుతారు. పశ్చిమ ఢిల్లీ 24.88 లక్షల మంది ఓటర్లు కలిగిన అతిపెద్ద లోక్‌సభ స్థానం. దేశ రాజధాని ఓటర్లలో ఇది దాదాపు 17 శాతం. ఇందులో 13.27 లక్షల మంది పురుషులు, 11.61 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే 80 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్న లోక్‌సభ స్థానం కూడా ఇదే. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో పది అసెంబ్లీ స్థానాలున్నాయి. -
ఆ దేశాలకు అదోక చెడ్డ అలవాటు!పశ్చిమ దేశాలపై జైశంకర్ ఫైర్
రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో అమెరికా, జర్మనీ స్పందించడాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ విమర్శించారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం పశ్చిమ దేశాలకు ఉన్న అదొక చెడ్డ అలవాటుగా అభివర్ణించారు. అది తమకు దేవుడిచ్చిన హక్కుల పశ్చిమ దేశాలు భావిస్తున్నాయంటూ చురకలింటించారు. ఈ మేరకు జైశంకర్ బెంగళూరులోని సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని..పాశ్చాత్య దేశాల జోక్యం గురించి, ఉచిత పథకాల గురించి మాట్లాడారు. పాశ్చాత్య దేశాల తీరు గురించి మాట్లాడుతూ..నేను మీకు వాస్తవాలు గురించి చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంపై పాశ్చాత్యులు వ్యాఖ్యానించడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది..ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసకోవడాన్ని దేవుడిచ్చిన హక్కులా భావిస్తూ..ఇలా చేస్తూ ఉంటే ఇతరులు కూడా ఇలానే చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారి విషయాల్లో జోక్యం ప్రారంభమవుతుంది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వారు అనుభవపూర్వకంగానే తెలుసుకోగలరు. రెండోది..భారత్‌లో సమస్యలున్నాయని ఇతరు దేశాలను ఆహ్వానిస్తున్నాం. ఒకరకంగా మట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం. ముందు సమస్యలున్నాయని ప్రపంచానికి మట్లాడమని ఉదారంగా ఆహ్వానించడం మానేయాలి. అయినా మీరు(రాహుల్‌ని ఉంద్దేశిస్తూ) ఎందుకు ముందు మాట్లాడటం లేదు. దీని గురించి ఏమైనా చేయొచ్చు కదా. మన సమస్యల్లోకి ఇతరులను ఎందుకు లాగడం. మనం అలా అవకాశం ఇస్తే కచ్చితంగా వారు స్పందిస్తారు. నిజానికి ఇక్కడ సమస్య వాళ్లు కాదు, మనం కూడా. ముందు రెండిటిని సరిచేయాల్సిన అవసరం ఉంది అని శంకర్ అన్నారు. అదే క్రమంలో రాజకీయ పార్టీ ఉచిత పథకాల గురించి ప్రస్తావిస్తూ..ఈ సంస్కృతి ప్రస్తావనపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. వనరులు పెంచే బాధ్యత తమ వద్ద లేదు కాబట్టే వాళ్లు అలా చేస్తున్నారు. ఇలాంటి ఉచిత పథకాలతో దేశాన్ని నడపటం సాధ్యం కాదు. ఉచితాలకు ఆధారం ఎవరైనా దాని కోసం చెల్లించుండాలి లేదా దేనినైనా తీసేస్తుండాలి అని అర్థం. ఈ ఉచిత పథకాలతో ప్రజాధరణ పొందడం సులువైన మార్గం కావచ్చు కానీ ఇది ముమ్మాటికీ బాధ్యతరహితమైన మార్గమే అని నొక్కి చెప్పారు జై శంకర్. (చదవండి: ఔను! మేము అధికారం కోసమే కలిశాం: బీజేపీ పై ఉద్ధవ్ థాకరే ఫైర్) -
ఆయుధాలు పంపినంత కాలం యుద్ధం ఆపే ప్రసక్తే లేదు: పుతిన్
తమ దేశ పార్లమెంట్లో రష్యాను ఉద్దేశించి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ఈ మేరకు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి ఏడాది కావొస్తున్న సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పుతిన్. వాస్తవానికి తాము ఈ సమస్యను శాంతియుతం పరిష్కరించడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నించామన్నారు. అంతేగాదు ఈ వివాదం నుంచి బయటపడేలా కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కానీ దీని వెనుక ఒక విభిన్నమైన కుట్ర దాగి ఉందని ఆరోపణలు గుప్పించారు పుతిన్. ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాలే యుద్ధాన్ని ప్రారంభించాయని, దాన్ని ఆపడానికి రష్యా శాయశక్తులా ప్రయత్నం చేస్తోందన్నారు. అంతేగాదు పశ్చిమ దేశాలతో భద్రతా పరంగా దౌత్య మార్గాన్ని అనుసరించి సమస్యను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ విషయంలో ఎటువంటి పారదర్శకత లేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆయా దేశాలు నాటో విస్తరణ కోసమే చూస్తున్నాయనే తప్ప.. శాంతియుత మార్గం కోసం ప్రయత్నం జరగడం లేదని విమర్శించారు. ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు, పశ్చిమ దేశాలు, నాటో దేశాలు సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అలాగే గతేడాది నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సాయం చేస్తున్న దేశం పేరు చెప్పకుండానే అమెరికాను పరోక్షంగా పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ఎంత ఎక్కువగా ఆయుధాల పంపితే అంత ఎక్కువ కాలం రష్యా దాడి చేస్తుందని హెచ్చరించారు. అంతేగాదు ఉక్రెయిన్‌లో ప్రజలు పాశ్చాత్య యజమానులకు బందీలుగా మారారని, వారికంటూ వ్యక్తిగతం లేదని విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ పాలన వారికి జాతీయ ప్రయోజనాలను అందించడం లేదన్నారు. రష్యాకు వ్యతిరేక చర్యలు చేపట్టేందుకు ఉక్రెయిన్ వివిధ మార్గాలను అన్వేషిస్తుందని, ముఖ్యంగా నాజీలు, ఉగ్రవాదులను సైతం ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ దళాల్లో నాజీ యూనిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. రష్యా ప్రజలను రక్షించాలని, వారి ఇళ్లను రక్షించాలని కోరుకుంటోందన్నారు. కానీ పాశ్చాత్య నాయకులు వివాదాన్ని మరింత ముదిరిలే చేసేందుకు ఆర్థిక, సైనిక సాయాన్ని చేస్తున్నాయంటూ పుతిన్ మండిపడ్డారు. తాము దశలవారిగా లక్ష్యాలను చేధించుకుంటూ ఒక క్రమపద్ధతిలో ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ.. ఈ సమస్యను పరిష్కారిస్తామని ధీమాగా చెప్పారు పుతిన్. We were doing everything possible to solve this problem peacefully, negotiating a peaceful way out of this difficult conflict, but behind our backs, a very different scenario was being prepared: Russian President Vladimir Putin pic.twitter.com/ZY8p1nEf84— ANI (@ANI) February 21, 2023 (చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం) -
డేంజర్స్ డర్టీ గేమ్‌కి ప్లాన్... పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ డర్టీ బాంబును ప్రయోగించనుందంటూ పదేపదే గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదులు సైతం చేశారు. అందులో భాగంగా ఇప్పుడూ పుతిన్ పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్‌తో మాట్లాడుతూ...ఉక్రెయిన్ అత్యంత ప్రమాదకరమైన డర్టీ గేమ్ ఆడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు వలసవాదంతో కళ్లుమూసుకుపోయి ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ చేత ప్రమాదకరమైన రక్తపాతంతో కూడిన గేమ్‌కి ప్లాన్ చేస్తున్నాయి. ప్రపంచాన్ని నియంత్రించడంలో భాగంగానే పశ్చిమ దేశాలు ఇలా ప్రవర్తిస్తున్నాయంటూ మండిపడ్డారు. అంతేగాదు చివరికి ఈ విషయమై అమెరికా, దాని మిత్రదేశాలతో రష్యాతో మాట్లాడాల్సి పరిస్థితి ఏర్పడుతుందంటూ హెచ్చరించారు. (చదవండి: డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు) -
'అట్లుంటది మాతోని' అంటున్న రష్యా! షాక్‌లో పాశ్చాత్య దేశాలు
Russia released a video invites people to move to Russia: ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్ని రష్యా తీరుని ఖండించడమే కాకుండా ఆంక్షలతో ఇబ్బంది పెట్టాయి. అయినా రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో యుద్ధానికి సై అంది. ఎంతలా ఆర్థిక ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేసి ఒంటరిని చేసినా భయపడలేదు సరికదా ప్రపంచదేశాలపైనే కన్నెర్రె జేసింది. ఆఖరికి ప్రంపచ దేశాలే తలొగ్గి కిందకి దిగి వచ్చాయి గానీ, రష్యా మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు పెంచింది. ఏ ఆంక్షల్ని ఖాతరు చేయలేదు. రష్యా పై ఆధారపడకుండా ఉండేలా ఎగుమతులను నిషేధించిన వెనుకంజవేయలేదు. చివరికి ఈ యుద్ధం ప్రపంచ దేశాల్ని గడగడలాడించడమే కాకుండా ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితి ఎదురైంది. ఆఖరికి ఐక్యరాజ్యసమతి ముందుకు వచ్చి రష్యాని ప్రపంచ శాంతి దిశగా అడుగులు వేయమని అభ్యర్థించాల్సి వచ్చింది. ఈ తరుణంలో రష్యా పాశ్చాత్య దేశాలను ఎగతాళి చేసేలా తమ దేశ పర్యటనకు సంబంధించిన టూరిజం వీడియోని రష్యా విడుదల చేసింది. పైగా ఆ వీడియోలో రష్యా పర్యటనకు ప్రజలను ఆహ్వానిస్తూ... మా దేశంలోని రుచికరమైన వంటకాలు, అందమైన మహిళలు, చౌకగా లభించే గ్యాస్, మా దేశ వైభవం తదితరాలన్నింటిని వీక్షించేందుకు ఆహ్వానిస్తున్నాం అంటూ ఒక ఆడియో కూడా వినిపిస్తుంది. అంతేకాదు రష్యాలో రద్దు సంస్కృతి అనేది లేదని పేర్కొంది. ఆ వీడియో చివర్లో ఇది రష్యా దేశం, వేలాది ఆంక్షలను తట్టకుని నిలబడగల బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న గొప్ప దేశం కాబట్టి ఈ దేశాన్ని చూసేందుకు త్వరితగతిన రండి, శీతకాలం వచ్చేస్తోంది అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రష్యన్ రాయబార కార్యాలయాలు సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆన్లైన్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు జౌను! ఇది రష్యా ఒక్క రాత్రిలో ఉక్రెయిన్ అమాయకులపై కాల్పులు జరిపి లక్షలాది మందిని నిరాశ్రయులను చేయగల సమర్థవంతమైన దేశం అంటూ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. Time to move to Russia 🤍💙❤️ pic.twitter.com/4CZL1Nt4Gi — Rusia en España (@EmbajadaRusaES) July 29, 2022 (చదవండి: అవమానపడ్డ టూరిస్ట్...టచ్ చేయకూడనవి టచ్ చేస్తే ఇలానే ఉంటుంది!) -
మనది కాని వంటకం.. విషంతో సమానమే!
మతం, కులం, ప్రాంతం, భాష, చివరకు తినే తిండి.. ఇలా రాజకీయానికి ఏదీ అతీతం కాదని నిరూపిస్తున్నారు మన నేతలు. ఇదిలా ఉండగా.. ఇక్కడో మంత్రిగారు మాత్రం ‘షవర్మా’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యువతి పాడైన షెవర్మా తిని ప్రాణాలు పొగొట్టుకోవడమే అందుకు కారణం. మిడిల్ ఈస్ట్ దేశాల స్ట్రీట్ ఫుడ్ అయిన షవర్మాను.. పాశ్చాత్య దేశాల వంటకంగా సర్టిఫై చేశారు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్. అంతేకాదు అసలు భారతీయ వంటకంలో భాగం కానీ షవర్మా ఎట్టిపరిస్థితుల్లో తీసుకూడదంటూ జనాలను కోరుతున్నాడాయన. ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలంటూ మాట్లాడిన ఆయన.. షవర్మాను తినొద్దంటూ ప్రజలకు సలహా ఇచ్చారు. ‘‘షవర్మా మన వంటకం కాదు. అది పాశ్చాత్య దేశాల మెనూలోని ఆహారం. అక్కడి వాతావరణానికి తగ్గట్లుగానే అది ఉంటుంది. పాడైపోదు కూడా. ఒకవేళ మాంసానికి సంబంధించిన ఏ ఆహారాన్ని భద్రపర్చాలంటే ఫ్రీజర్లలో ఉంచాలి. సరిగ్గా మెయింటెన్ చేయకపోతే షవర్మా పాడైపోతుంది. తిన్నవాళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంద’’ని వ్యాఖ్యానించారాయన. దేశంలో షవర్మాను అందించే ఏ ఫుడ్ కోర్టుల్లోనూ స్టోరేజ్ సౌకర్యాలు సరిగా లేవని, దుమ్ము ధూళితో రోడ్డు బయటే ఉంచుతున్నారని.. తద్వారా యువతను, ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారని వ్యాఖ్యలు చేశారాయన. మన వాతావరణానికి తగ్గట్లుగా ఉండే ఆహారాన్ని తీసుకుంటేనే మనకు మంచిది. మనది కానిది.. విషంతోనే సమానం అంటూ ఆదివారం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న మా సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. విశేషం ఏంటంటే.. చాలామంది సోషల్ మీడియాలో సుబ్రమణియన్ ట్రోల్ చేస్తున్నప్పటికీ.. కొంత మంది మాత్రం ఆయన వ్యాఖ్యలతోనే ఏకీభవిస్తున్నారు. కేరళ కాసరగోడ్ జిల్లాలోని ఓ జ్యూస్ సెంటర్లో.. మే 1వ తేదీన ఓ ఫుడ్ కోర్టులో పాడైపోయిన షవర్మా తిని 59 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో దేవానంద అనే అమ్మాయి మృతి చెందింది కూడా. ఈ ఘటన నేపథ్యంలోనే తమిళనాడు మంత్రి పైవ్యాఖ్యలు చేశారు. ఇక ఘటనలో.. ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు సాల్మోనెల్లా, షిగెల్లాను ఆ సెంటర్లోని షవర్మా శాంపిల్స్‌లో గుర్తించినట్లు కేరళ ఆరోగ్య విభాగం ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సంబంధిత వార్త: ఐదు నెలల క్రితం తండ్రి! ఇప్పుడేమో కుళ్లిన షవర్మా తిని.. -
కాలువలకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను స్వల్పంగా పెంచారు. ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3,540 క్యూసెక్కుల చొప్పున 130 డ్యూటీలో సరఫరా చేస్తున్నారు. ‘వంతు తంతు’ శీర్షికను శివారు ప్రాంత రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో శనివారం ప్రచురిం చిన కథనానికి అధికారులు స్పందించారు. పశ్చిమ డెల్టాకు 3,830 క్యూసెక్కులకు పెంచి 120 డ్యూటీలో సాగునీరు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఇతర కాలువలకు సైతం నీటి విడుదలను పెంచారు. నరసాపురం కాలువకు 1,437, ఉండి కాలువకు 959, జీ అండ్ వీకి 455, ఏలూరు కాలువకు 539, అత్తిలి కాలువకు 295 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. ఇప్పటికే ఫాండ్ లెవెల్ తగ్గడం, గోదావరి నదికి నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో నీటి పొదుపు చర్యలు పాటించాలని నీటిపారుదల శాఖ అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఫాండ్ లెవెల్ మూడురోజుల నుంచి 13.38 మీటర్లు వద్ద నిలకడగా ఉంటుంది. దీంతో అప్రమత్తమైన నీటి పారుదలశాఖ అధికారులు ఆదివారం నుం చి వంతుల వారీ విధానం అమలు చేయనున్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం వరకు మొదటి వంతు ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. 27వ తేదీ సాయంత్రం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రెండో వంతు ప్రాంతంలోని ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తారు. -
దుర్గాదేవి నమోస్తుతే!
శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం జిల్లా అంతటా దుర్గాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంగా భక్తులకు దర్శనం ఇచ్చింది. అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కష్టాల నుంచి తమను గట్టెక్కించామని వేడుకొన్నారు. -
బెల్టుషాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఏలూరు అర్బన్ : జిల్లావ్యాప్తంగా బెల్ట్‌షాపులు, నియమిత వేళలు పాటించని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం విస్తృతంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.బి. భాస్కరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు ఏలూరు, భీమవరం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం, నరసాపురం ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని బెల్ట్‌షాపులు, నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై దాడులు చేసినట్టు వివరించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 47మద్యం బాటిళ్లు, పది బీరు సీసాలు స్వా«ధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదే సందర్భంలో సారా విక్రయిస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈదాడుల్లో అసిస్టెంట్ కమిషనర్ బి.శ్రీలత నేతృత్వంలో ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వై.శ్రీనివాసచౌదరి, కె. శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారని వివరించారు. -
పశ్చిమబెంగాల్ లో నాటు బాంబులు స్వాధీనం
బర్ధమన్ః పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గ్రామాలు ఇటీవల బాంబు తయారీ కేంద్రాలుగా మారిపోతున్నాయి. తరచుగా జరుగుతున్న బాంబు పేలుళ్ళ నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా అందిన విశ్వసనీయ సమాచారంతో బర్దమన్ జిల్లాలో దాడులు నిర్వహించిన పోలీసులు... ఓ ఇంటి నుంచీ నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్ లో పోలీసులు వందలకొద్దీ నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బర్ధమన్ జిల్లా మంగళ్ కోట్ నియోజకవర్గంలో దాడులు నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో జరిపిన సోదాల్లో 123 దేశవాళీ బాంబులను స్వాధీనం చేసుకోవడంతోపాటు... ఇంటి యజమాని సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నాటుబాంబుల తయారీ, నిల్వలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అదుపులో ఉన్నవారిని ఆరా తీస్తున్నారు. -
'పుడ్ పార్క్' నిర్మాణం పై ప్రజల వ్యతిరేకత
-
పశ్చిమ గోదావరిలో సైకో టెర్రర్..
-
త్వరలో 'భారతమాల'
తూర్పు, పడమరలను కలుపుతూ రహదారి హారం న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి(గోల్డెన్ క్వాడ్రీలేటరల్) తరహాలో.. భారతదేశ తూర్పు పడమరలను కలుపుతూ ‘భారతమాల’ పేరుతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాలు.. ♦ మౌలిక వసతులకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చేపట్టనున్న మరో ప్రతిష్టాత్మక, భారీ కార్యక్రమం ‘భారతమాల’. ♦ భారతదేశ తూర్పు, పడమరలను అనుసంధానిస్తూ రహదారి హారం. ♦ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలను కలుపుతూ గుజరాత్ నుంచి మిజోరం వరకు రోడ్డు నిర్మాణం. ♦ రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా రహదారుల నిర్మాణం. ♦ గుజరాత్ నుంచి ప్రారంభించి రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌ల మీదుగా మిజోరం వరకు రోడ్డు రవాణా సౌకర్యం. ♦ ఈ రహదారికి మహారాష్ట్ర నుంచి బెంగాల్ వరకు ఉన్న తీర రాష్ట్రాల రహదారులతో, మరో ప్రతిష్టాత్మక పథకం ‘సాగరమాల’తో అనుసంధానం. ♦ ఈ సంవత్సరం చివరలో ప్రారంభించి.. ఐదేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న ప్రభుత్వం. ♦ పర్యావరణ అనుమతులు, భూసేకరణే ప్రధాన అడ్డంకిగా భావిస్తున్న అధికారులు. ♦ సరిహద్దు ప్రాంతాలకు, మిలటరీ అవసరాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం ఈ పథకం వ్యూహాత్మక ఉద్దేశం. ♦ దీనితో సరిహద్దు వాణిజ్యం విస్తృతమయ్యే అవకాశం. ♦ భారతదేశానికి వేసిన దండలా కనిపించే ఈ రోడ్డు రవాణా పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి.