రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో అమెరికా, జర్మనీ స్పందించడాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ విమర్శించారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం పశ్చిమ దేశాలకు ఉన్న అదొక చెడ్డ అలవాటుగా అభివర్ణించారు. అది తమకు దేవుడిచ్చిన హక్కుల పశ్చిమ దేశాలు భావిస్తున్నాయంటూ చురకలింటించారు. ఈ మేరకు జైశంకర్ బెంగళూరులోని సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని..పాశ్చాత్య దేశాల జోక్యం గురించి, ఉచిత పథకాల గురించి మాట్లాడారు. పాశ్చాత్య దేశాల తీరు గురించి మాట్లాడుతూ..నేను మీకు వాస్తవాలు గురించి చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంపై పాశ్చాత్యులు వ్యాఖ్యానించడానికి రెండు కారణాలు ఉన్నాయి.
మొదటిది..ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసకోవడాన్ని దేవుడిచ్చిన హక్కులా భావిస్తూ..ఇలా చేస్తూ ఉంటే ఇతరులు కూడా ఇలానే చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారి విషయాల్లో జోక్యం ప్రారంభమవుతుంది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వారు అనుభవపూర్వకంగానే తెలుసుకోగలరు. రెండోది..భారత్‌లో సమస్యలున్నాయని ఇతరు దేశాలను ఆహ్వానిస్తున్నాం. ఒకరకంగా మట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం. ముందు సమస్యలున్నాయని ప్రపంచానికి మట్లాడమని ఉదారంగా ఆహ్వానించడం మానేయాలి. అయినా మీరు(రాహుల్‌ని ఉంద్దేశిస్తూ) ఎందుకు ముందు మాట్లాడటం లేదు.
దీని గురించి ఏమైనా చేయొచ్చు కదా. మన సమస్యల్లోకి ఇతరులను ఎందుకు లాగడం. మనం అలా అవకాశం ఇస్తే కచ్చితంగా వారు స్పందిస్తారు. నిజానికి ఇక్కడ సమస్య వాళ్లు కాదు, మనం కూడా. ముందు రెండిటిని సరిచేయాల్సిన అవసరం ఉంది అని శంకర్ అన్నారు. అదే క్రమంలో రాజకీయ పార్టీ ఉచిత పథకాల గురించి ప్రస్తావిస్తూ..ఈ సంస్కృతి ప్రస్తావనపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. వనరులు పెంచే బాధ్యత తమ వద్ద లేదు కాబట్టే వాళ్లు అలా చేస్తున్నారు. ఇలాంటి ఉచిత పథకాలతో దేశాన్ని నడపటం సాధ్యం కాదు. ఉచితాలకు ఆధారం ఎవరైనా దాని కోసం చెల్లించుండాలి లేదా దేనినైనా తీసేస్తుండాలి అని అర్థం. ఈ ఉచిత పథకాలతో ప్రజాధరణ పొందడం సులువైన మార్గం కావచ్చు కానీ ఇది ముమ్మాటికీ బాధ్యతరహితమైన మార్గమే అని నొక్కి చెప్పారు జై శంకర్.
(చదవండి: ఔను! మేము అధికారం కోసమే కలిశాం: బీజేపీ పై ఉద్ధవ్ థాకరే ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment