criticises
-
ఓలా సీఈఓ, కమెడియన్ మధ్య మాటల యుద్ధం
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆన్లైన్ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై కమ్రా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఎలక్ట్రిక్ వాహనాలను సూచించే ఫొటో షేర్ చేస్తూ కమ్రా తన ఎక్స్ ఖాతాలో ‘భారతీయ వినియోగదారులు సమస్యలపై మాట్లాడలేరని అనుకుంటున్నారా? వారికి ఇలాంటి సమస్యా? రోజువారీ వేతన కార్మికులు ద్విచక్ర వాహనాలు వాడుతూ జీవనాధారం పొందుతున్నారు’ అని ఆయన తన పోస్ట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ ‘భారతీయులు ఈవీలను ఎలా ఉపయోగిస్తారు?’ అని తెలిపారు. ‘పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా సంస్థ నాయకుడి నుంచి ఎలాంటి సమాధానం లేదు’ అని మరోపోస్ట్ పెట్టారు.Since you care so much @kunalkamra88, come and help us out! I’ll even pay more than you earned for this paid tweet or from your failed comedy career.Or else sit quiet and let us focus on fixing the issues for the real customers. We’re expanding service network fast and backlogs… https://t.co/ZQ4nmqjx5q— Bhavish Aggarwal (@bhash) October 6, 2024ఈ వ్యవహారంపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఘాటుగా స్పందించారు. కమ్రా పెట్టిన పోస్ట్‌లు ‘పెయిడ్ పోస్ట్’లు అని వ్యాఖ్యానించారు. ఈమేరకు భవిష్ కమ్రా విమర్శలకు ప్రతిస్పందనగా పోస్ట్ చేశారు. ‘మీరు ఈవీల వ్యవహారంపై చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి, వచ్చి మాకు సాయం చేయండి! ఈ ‘పెయిట్ ట్వీట్’లు, విఫలమైన మీ కామెడీ కెరీర్ ద్వారా ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగానే మీకు డబ్బు ఇస్తాను. ఇవేవీ కాదంటే నిశ్శబ్దంగా ఉండండి. మేము కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతున్నాం. సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం. బ్యాక్‌లాగ్‌లు త్వరలో క్లియర్ చేస్తాం’ అని స్పందించారు.Instead can you give a total refund to anyone who wants to return their OLA EV & who’s purchased it in the last 4 months? I don’t need your money people not being able to get to their workplace need your accountability.Show your customers that you truly care? https://t.co/tI2dwZT2n2— Kunal Kamra (@kunalkamra88) October 6, 2024కమ్రా భవిష్ ట్వీట్‌పై తిరిగి స్పందించారు. ‘పెయిడ్ ట్వీట్ చేసినట్లు, నేను ఏదైనా ప్రైవేట్ కంపెనీ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి డబ్బు పొందినట్లు మీరు రుజువు చేస్తే నా అన్ని సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే తొలగించి, మీరన్నట్లు ఎప్పటికీ నిశ్శబ్దంగా కూర్చుంటాను’ అని చెప్పారు. దీనికి అగర్వాల్ బదులిస్తూ ‘నేను అన్న మాటలతో బాధపడ్డారా? సర్వీస్ సెంటర్‌కు రండి. మాకు చాలా పని ఉంది. మీ ఫ్లాప్ షోల కంటే నేను బాగా డబ్బులిస్తాను. మీ వ్యాఖ్యలపై నిజంగా మీరెంత శ్రద్ధ వహిస్తున్నారో మీ అభిమానులకు తెలియాలి’ అని అన్నారు.ఇదీ చదవండి: రతన్‌టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరందీనిపై కమ్రా బదులిస్తూ ‘కస్టమర్ల ఈవీను తిరిగి ఇవ్వాలనుకునే వారికి, గత నాలుగు నెలల్లో ఈవీను కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేస్తారా? మీ డబ్బు నాకు అవసరం లేదు. మీ ఈవీ వాడుతున్న కస్టమర్లు సరైన సేవలందక తమ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. దీనికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నట్లు మీ కస్టమర్లకు తెలియాలి కదా?’ అని అన్నారు. దీనిపై భవిష్ స్పందిస్తూ ‘మా కస్టమర్లకు అందే సర్వీసు జాప్యం జరిగితే వారికి తగినన్ని ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. మీరు నిజంగా సమస్యపై స్పందించాలంటే కేవలం కుర్చీలో కూర్చొని విమర్శలు చేయడం కాదు. సమస్య ఎక్కడుందో తెలుసుకోండి. దీనిపై వెనక్కి తగ్గకండి’ అని పోస్ట్ చేశారు.We have enough programs for our customers if they face service delays. If you were a genuine one, you would have known.Again, don’t try and back out of this. Come and do some real work rather than armchair criticism. https://t.co/HFFKgsl7d9— Bhavish Aggarwal (@bhash) October 6, 2024 -
బాబు బ్యాచ్‌పై జగన్ మాస్ పంచులు (ఫొటోలు)
-
గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి
ఉద్యోగాల్లో చేరాలనుకునే చాలామంది గూగుల్ సంస్థలో పనిచేయడం ఒక కలగా పెట్టుకుంటారు. దీనికి కారణం వేతనాలు కావొచ్చు, కంపెనీ అందించే ప్రయోజనాలు కావొచ్చు. అయితే 2023లో కంపెనీ ఎక్కువ మందిని తొలగించినప్పటికీ.. జీతాలు ఎక్కువ చెల్లించే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురవుతోంది. గూగుల్ కంపెనీలో 15 సంవత్సరాలు పనిచేసిన మాజీ ఉద్యోగి 'జోనాథన్ బెల్లాక్' ఇటీవల కంపెనీ పరిస్థితులను వివరించడమే కాకుండా సీఈఓ సుందర్ పిచాయ్‌ను సైతం విమర్శించాడు. కంపెనీలో చాలామంది సీనియర్ నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా టీమ్ సమస్యలను పరిష్కరించడం మానేశారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారులు త్వరగా తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు సుదీర్ఘ వాదనలలో చిక్కుకుంటున్నాయని, ఇవి నెలలు తరబడి సుదీర్ఘ చర్చలుగా సాగుతూ.. కొత్త ఆలోచనలను అందించడానికి జూనియర్ ఉద్యోగులను ఉపయోగించుకుంటారని వెల్లడించారు. భిన్నాభిప్రాయాలతో కలిసి ముందుకు వెళ్లడం కంటే.. నష్టాలు లేదా ఖర్చుల గురించి చర్చించడం ఉన్నతాధికారులకు సులువుగా ఉండటమే దీనికి కారణమని బెల్లాక్ వివరించారు. ఇదీ చదవండి: బంగారం కొనటానికి ఇది సరైన సమయం.. మళ్ళీ తగ్గిన ధరలు తన పదవీకాలం ముగిసే సమయానికి, వాణిజ్యపరంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడంలో విఫలమైనందుకంటే గ్లోబల్ అఫైర్స్‌తో విభేదించినందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. గూగుల్ కంపెనీలో సుమారు 15 సంవత్సరాలు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన బెల్లాక్ ఇటీవల ఈ విషయాలను థ్రెడ్ యాప్ ద్వారా పోస్ట్ చేశారు. -
ఆ దేశాలకు అదోక చెడ్డ అలవాటు!పశ్చిమ దేశాలపై జైశంకర్ ఫైర్
రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో అమెరికా, జర్మనీ స్పందించడాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ విమర్శించారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం పశ్చిమ దేశాలకు ఉన్న అదొక చెడ్డ అలవాటుగా అభివర్ణించారు. అది తమకు దేవుడిచ్చిన హక్కుల పశ్చిమ దేశాలు భావిస్తున్నాయంటూ చురకలింటించారు. ఈ మేరకు జైశంకర్ బెంగళూరులోని సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని..పాశ్చాత్య దేశాల జోక్యం గురించి, ఉచిత పథకాల గురించి మాట్లాడారు. పాశ్చాత్య దేశాల తీరు గురించి మాట్లాడుతూ..నేను మీకు వాస్తవాలు గురించి చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంపై పాశ్చాత్యులు వ్యాఖ్యానించడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది..ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసకోవడాన్ని దేవుడిచ్చిన హక్కులా భావిస్తూ..ఇలా చేస్తూ ఉంటే ఇతరులు కూడా ఇలానే చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారి విషయాల్లో జోక్యం ప్రారంభమవుతుంది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వారు అనుభవపూర్వకంగానే తెలుసుకోగలరు. రెండోది..భారత్‌లో సమస్యలున్నాయని ఇతరు దేశాలను ఆహ్వానిస్తున్నాం. ఒకరకంగా మట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం. ముందు సమస్యలున్నాయని ప్రపంచానికి మట్లాడమని ఉదారంగా ఆహ్వానించడం మానేయాలి. అయినా మీరు(రాహుల్‌ని ఉంద్దేశిస్తూ) ఎందుకు ముందు మాట్లాడటం లేదు. దీని గురించి ఏమైనా చేయొచ్చు కదా. మన సమస్యల్లోకి ఇతరులను ఎందుకు లాగడం. మనం అలా అవకాశం ఇస్తే కచ్చితంగా వారు స్పందిస్తారు. నిజానికి ఇక్కడ సమస్య వాళ్లు కాదు, మనం కూడా. ముందు రెండిటిని సరిచేయాల్సిన అవసరం ఉంది అని శంకర్ అన్నారు. అదే క్రమంలో రాజకీయ పార్టీ ఉచిత పథకాల గురించి ప్రస్తావిస్తూ..ఈ సంస్కృతి ప్రస్తావనపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. వనరులు పెంచే బాధ్యత తమ వద్ద లేదు కాబట్టే వాళ్లు అలా చేస్తున్నారు. ఇలాంటి ఉచిత పథకాలతో దేశాన్ని నడపటం సాధ్యం కాదు. ఉచితాలకు ఆధారం ఎవరైనా దాని కోసం చెల్లించుండాలి లేదా దేనినైనా తీసేస్తుండాలి అని అర్థం. ఈ ఉచిత పథకాలతో ప్రజాధరణ పొందడం సులువైన మార్గం కావచ్చు కానీ ఇది ముమ్మాటికీ బాధ్యతరహితమైన మార్గమే అని నొక్కి చెప్పారు జై శంకర్. (చదవండి: ఔను! మేము అధికారం కోసమే కలిశాం: బీజేపీ పై ఉద్ధవ్ థాకరే ఫైర్) -
కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరోసారి పార్టీ అధినాయకత్వంపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. పార్టీకి పునరుత్తేజం రావాలంటే అనుభవంతో కూడిన ఆలోచనలు చేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించ గల సామర్థ్యంతో పాటు రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి అవసరమని మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. పార్టీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బీహార్‌తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. తాము ఆశించిన స్థాయిలో తమ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించడం లేదని కపిల్ సిబల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలివైనదని, ప్రస్తుతం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో తప్పకుండా గుర్తిస్తుందన్నారు. పార్టీ అధినాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ గత ఆగస్టులో లేఖ రాసిన 23 మందిలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. ఈ అంశంపై పార్టీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే తన అభిప్రాయాలు తీసుకోవడానికి ఇప్పటికీ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేయడంలేదని, బహిరంగంగా వ్వక్తపరచకుండా తనను పార్టీ నిర్భందించిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా నాయకత్వ మార్పు చేసి దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మనతో కలిసి రావాలనుకోవడం సరైంది కాదని మనమే ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. అనుభవం ఉన్నవారిని ప్రోత్సహించాలని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బిహార్‌తో పాటు ఉప ఎన్నికల్లో ఓటమిని సాధారణ విషయంగానే భావిస్తున్నట్లు ఉందని, ప్రస్తుతం పరిస్థితి అంతా బాగానే ఉన్నట్లు పార్టీ భావిస్తున్నట్లు ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీ ఎంపీ కార్తి చిదంబరం ట్వీట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
మేక్ ఇన్ ఇండియా అంటూ చైనావే కొంటోంది
న్యూఢిల్లీ: బీజేపీ మేక్ ఇన్ ఇండియా అని ప్రచారంచేస్తోంటే ప్రభుత్వమేమో చైనా ఉత్పత్తులనే కొంటోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికీ, బీజేపీ ప్రభుత్వానికీ అంతరం ఉన్నదని గ్రాఫ్ ద్వారా ట్విట్టర్లో రాహుల్ వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీ హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయని రాహుల్ అన్నారు. భారత భూభాగం నుంచి చైనా సైన్యాన్ని ఎప్పుడు, ఎలా తరిమికొడతారో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. యాప్స్‌పై నిషేధం ఒక్కటే చాలదు: మమత చైనా యాప్‌లపై నిషేధం ఒక్కటే సరిపోదని, చైనాకు తగిన జవాబు చెప్పాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఈ విషయంపై నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేస్తున్నానని మమత చెప్పారు. ఇది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయమని, అయితే ప్రభుత్వ విధానానికి తాము మద్దతిస్తామన్నారు. ఈ విషయంలో దౌత్య విధానాలను అవలంబిస్తూనే, దూకుడుగా వ్యవహరించాలని ఆమె అభిప్రాయపడ్డారు. దేశ భద్రతకు ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో టిక్‌టాక్‌సహా 59 చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించడం తెల్సిందే. -
‘భారతీయులు ఏం చెప్పినా నమ్మేస్తారు’
ఢిల్లీ : భారతీయులంతా అమాయకులను ఎక్కడా చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరైన చిదంబరం మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో భారతీయులంతా అమాయకులను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ఎవరేం చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి దానిని నమ్ముతాం. గ్రామాలన్నీ విద్యుదీపాలతో వెలిగి పోతున్నాయంటే నమ్ముతాం. దేశంలోని 99 శాతం కుటుంబాలకు టాయిలెట్లు నిర్మించారని చెబితే నమ్మేస్తాం’ అని కేంద్ర పథకాలను ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారని చిదంబరం విమర్శించారు ఈ సందర్బంగా కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్‌పై ఆయన మండిపడ్డారు. ‘ఢిల్లీకి చెందిన నా డ్రైవర్ తండ్రికి ఆయుష్మాన్ భారత్ కింద సర్జరీ జరిగింది. అయితే అక్కడి వైద్యులు ఈ పథకం గురించి వారికి ఏం తెలియదని, ఇది వర్తించదని చెప్పారు. కానీ మనం ఆయుష్మాన్ దేశమంతా వర్తిస్తుందని, దీని ద్వారా అన్ని రోగాలకు వైద్యం చేయించుకోవచ్చని నమ్ముతాం. మనం అమాయకులం కదా. అనేక విషయాలకు సంబంధించిన వార్తలు, నివేదికలు అన్నీ వాస్తవానికి విరుద్దమే’ అని కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలను ఎత్తి చూపారు. -
కశ్మీర్‌కు పదివేల బలగాలు
న్యూఢిల్లీ/కశ్మీర్: కశ్మీర్ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు, శాంతి భద్రతల విధి నిర్వహణకు వీరిని పంపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరికొన్ని బలగాలను కూడా తరలించే యోచనలో కేంద్రం ఉందని కూడా వెల్లడించారు. ఒక సీఏపీఎఫ్ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. కశ్మీర్ లోయకు పంపే వారిలో సీఆర్పీఎఫ్కు చెందిన 50 కంపెనీలు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) నుంచి 30, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ నుంచి పదేసి కంపెనీల చొప్పున బలగాలు ఉంటాయన్నారు. వీరందరినీ రైళ్లు, విమానాల్లో విధులు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్ర నిరోధక చర్యలతోపాటు అమర్నాథ్ యాత్రకు బందోబస్తు కల్పిస్తున్న 80 బెటాలియన్ల బలగాలకు వీరు అదనమన్నారు. ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని యోచిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బలగాలను మోహరిస్తోందని భావి స్తున్నారు. బలగాలను తరలించాలన్న కేం ద్రం నిర్ణయాన్ని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. జైషే టాప్ కమాండర్ హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి జైషే మహమ్మద్ (జేఎం)కు చెందిన కమాండర్ మున్నా లాహోరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి సోపియాన్‌లోని బోన్బజార్ ప్రాంతం బండే మొహల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత నెలలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కారు పేలు డుకు లాహోరి కారణమని పోలీసులు తెలి పారు. పాక్ జాతీయుడైన మున్నా లాహోరి కశ్మీర్లో వరుస పౌర హత్యలకు పాల్పడ్డా డని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల నియా మకం కోసం లాహోరిని జైషే నియమిం చిందని, అతడు పేలుడు పరికరాల తయా రీలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. -
హోదా కంటే ప్యాకేజీయే కావాలన్నారు
సాక్షి, నర్సీపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే సంజీవిని అన్నారని బీజేపీ మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టీడీపీ సర్కార్ నాశనం చేసిందని మండిపడ్డారు. మంగళవారం నర్సీపట్నం వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు కోరడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామనడంలో అర్థంలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదా ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఓట్ల తొలగింపుపై వచ్చిన ఫారం–7 దరఖాస్తుల అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. దేశంలో అవినీతిరహిత పాలన అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దక్కిందన్నారు. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడులు చేసి 130 కోట్ల మంది భారతీయుల సత్తా చాటారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పొన్నగంటి అప్పారావు, అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ కాళ్ల సుబ్బారావు పాల్గొన్నారు. -
ఐవైఆర్‌పై ఆనంద్ సూర్య ధ్వజం
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబునాయుడుపై అవాకులు చెవాకులు పేలితే మర్యాద దక్కదని ఐవైఆర్ కృష్ణారావును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సీఎస్ ఐవైఆర్ తీరు గర్హనీయమైందనీ, మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలు మిమ్మల్ని పక్కన పెట్టిన సంగతి మర్చిపోయారా అంటూ విమర్శించారు. ఐవైఆర్ సొంత అజెండాతోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని, రాజధాని నిర్మాణం, హోదా గురించి మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐవైఆర్ లాంటి కుహానా వ్యక్తులు ఏ వేదికల్లో ఉంటే ఆ వేదికలు అధోగతి పాలవుతాయని ధ్వజమెత్తారు. -
టీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయి
శంకర్పల్లి: రైతాంగ సమస్యలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం అన్నదాతలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో జరిగిన కిసాన్ మోర్చా రైతుపోరుసభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామని, ఉచితంగా బోర్లు వేయిస్తామని, పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, ప్రకృతి వైపరీత్యాలు జరిగితే రైతులను ఆదుకునేందుకు నిధి ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలేవీ...: రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదని, ఒక్క టీచర్ పోస్టూ భర్తీ కాలేదని లక్ష్మణ్ అన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పేరుతో పబ్బం గడుపుతున్న ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి యువత సిద్ధంగా ఉందని హెచ్చరించారు. బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఏ కులానికి ఎన్ని నిధులు ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని, దీనిపై బీసీలను ఐక్యం చేసి ఉద్యమం చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్దం బాల్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నాయకులు సుగుణాకర్‌రావు, శేఖర్జీ, ఆచారి పాల్గొన్నారు. -
కరవు, కాంగ్రెస్‌లది అవినాభావ సంబంధం
పచపదరా(రాజస్థాన్): భారీ హామీలు, శంకుస్థాపనలతో ప్రజల్ని మోసగించడం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రూ. 43,129 కోట్లతో రాజస్థాన్‌లో నిర్మించనున్న బార్మర్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు పనుల్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పేరు కోసం రైల్వే ప్రాజెక్టుల్ని ప్రకటించేవారు. అవి కనీసం వెలుగు చూడలేదు. రాజస్థాన్‌లో కరవు, కాంగ్రెస్‌లు కలిసికట్టుగా సాగేవి, ఆ పార్టీ తప్పుకున్నాక రాష్ట్రానికి కరవు నుంచి విముక్తి దొరికింది’ అని మోదీ పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రూ. 500 కోట్లతో హాడావుడిగా ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ ప్రకటించిందని, కనీసం లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేయలేదని ప్రధాని తప్పుపట్టారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 10,700 కోట్లు చెల్లించిందని చెప్పారు. కాంగ్రెస్ కేవలం గరీబీ హటావో నినాదాలు మాత్రమే ఇస్తే.. దాన్ని సాధ్యం చేసేందుకు పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, 4 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బార్మర్ ప్రాజెక్టు ఘనత తమదేనంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రకటించుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2013లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మరోసారి మోదీ శంకుస్థాపన చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. -
మోదీ మనసులో వారికి చోటు లేదు: రాహుల్
సనంద్: ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల మనసుల్లో దళితులు, రైతులు, పేదలకు ఎంతమాత్రం చోటు లేదనీ, వారి మనసు కొద్ది మంది పారిశ్రామికవేత్తల పైనేననీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. హెలికాప్టర్లో చోటులేకపోవడంతో ఆగస్టు నెలలో దళితులు అందజేసిన జాతీయజెండాను గాంధీనగర్‌లో రూపానీ స్వీకరించకపోవడంపై రాహుల్ మండిపడ్డారు. అహ్మదాబాద్‌లోని సనంద్‌లో దళిత్ శక్తి కేంద్రంలో దళితులు అందజేసిన జాతీయ జెండాను ఆయన స్వీకరించారు. ఆ జెండాను ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెమొరియల్ మ్యూజియంలో భద్రపరుస్తామన్నారు. ఉనాలో దళితులపై దాడి, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యలపై మోదీ, రూపానీ ఉదాసీనంగా వ్యవహరించారని రాహుల్ విమర్శించారు. -
ట్రంప్ పై విరుచుకుపడ్డ జుకర్‌బర్గ్
శాన్ ఫ్రాన్సిస్కో:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా ఆంక్షలపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ విరుచుకుపడ్డారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు, ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను జుకర్ బర్గ్ తప్పుబట్టారు. ట్రంప్ ముస్లింపై ఆంక్షలనువిధిస్తూ తీసుకున్న కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన ధ్వజమెత్తారు. ఈ ఆదేశాల ప్రభావం గురించి తాను చింతిస్తున్నానని ఫేస్బుక్ పేజీ పోస్ట్ లో రాశారు. టెర్రరిస్టుల నుంచి అమెరికా రక్షణ ముఖ్యమే అయినప్పటికీ ఆపదలో ఉన్నవారికీ, శరణార్థులకు సహాయం చేసేందుకు విశాలంగా వ్యవహరించాలని కోరారు. వారికి సాయపడేందుకు మన దేశ ద్వారాలు ఎపుడే తెరిచే ఉండాలని సూచించారు. కొన్ని దశాబ్దాల క్రింత అమెరికా ఇలా వ్యవహరించి ఉండకపోతే చాన్ ప్రిస్కిల్లా ఇవాళ ఇక్కడ ఉండేది కాదంటూ..తన భార్య చాన్ కుటుంబం చైనా వియత్నాం నుంచి వలస వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చాన్ అంశం తన వ్యక్తిగత అంశమే ..అయినా.. మనది వలస దారుల దేశం.. మన చుట్టూ వున్న ప్రపంచం బావుంటే.. వలసదారులకు మంచి పనిని, జీవనాన్ని అందివ్వగలిగితే మనకే మంచిదంటూ చెప్పుకొచ్చారు. అమెరికా భవిష్యత్తులో వారు కూడా ఒక భాగమని జుకర్ వర్గ్ చెప్పారు. ఈ ప్రపంచంలో అందరికీ మరింత ఉన్నతమైన స్థానంగా అమెరికాను తీర్చిదిద్దడానికి మనం అందరం ధైర్యంగా, సంయమనంగా పనిచేయడానికి ముందుకు రావాలని ఆశిస్తున్నానని జుకర్ తన పోస్ట్ లో కోరారు. కాగా ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకుద్దేశించిన అత్యంత క్లిష్టమైన నిబంధనల ఆర్డర్ పై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము అనుకోవట్లేదని ఆయన వెల్లడించారు. ఈ ఆర్డర్ ప్రకారం ఏడు ముస్లిం దేశాల వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అలాగే అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. అయితే సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ప్రాధాన్యమివ్వనున్నారు. మరోవైపు ట్రంప్ ఈ సంచలన నిర్ణయంపై హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నారు. -
ఆ రెండు పార్టీలతో మతకల్లోలాలు
- బీజేపీ, ఎంఐఎంలతో తెలంగాణకు ప్రమాదం - టీఆర్ఎస్ ఓ మాఫియా - ప్రత్యర్థి పార్టీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ మల్లు భట్టి విక్రమార్క్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: మతతత్వ పార్టీలైన బీజేపీ, ఎంఐఎంను గెలిపిస్తే హైదరాబాద్ నగరానికి, తెలంగాణ భవిష్యత్తుకు చాలా ప్రమాదమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మేయర్ తమే అంటున్న బీజేపీ, షహర్ హమారా-మేయర్ హమారా అంటున్న మజ్లిస్ పార్టీలు గెలిస్తే హైదరాబాద్‌లో మతోన్మాదం పెరిగిపోతుందన్నారు. లౌకికపార్టీగా కాంగ్రెస్ శాంతిభద్రతలకోసం చేసిన కషిని, తీసుకున్న చర్యలను నగర ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ మాఫియాతో హైదరాబాద్ నగరం అల్లాడుతోందని భట్టి ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు చేసిందేమిటని ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు వంటి భారీ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినవేనని, అయితే హైదరాబాద్‌కు నీళ్లు వచ్చిన తర్వాత పైపుల ముందు కేటీఆర్ ఫోటోలు దిగి, పూర్తయిన మెట్రోరైలు ఎక్కి ప్రచారం చేసుకోవడం మినహా చేసిందేమీలేదని, తాజ్‌మహల్, చార్మినార్ ల ముందు నిలబడి ఫోటోలు దిగి తామే పూర్తిచేసినట్టుగా మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నాయని భట్టి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే సెటిలర్లు పెద్ద ఎత్తున ఉన్న ప్రాంతాల్లో కూల్చివేతలకు దిగిన టీఆర్ఎస్ను మర్చిపోరని హెచ్చరించారు. 'తెలంగాణ వాలో జాగో- ఆంధ్రావాలో భాగో' అంటూ పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగిన కేసీఆర్ ఇప్పుడు ఓట్లకోసం సెటిలర్లపై కపటప్రేమను చూపిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు, తరలింపులు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఎన్నికలు ఒక పార్టీకి సంబంధించినవి కావని, తెలంగాణ భవిష్యత్తుకోసం జరుగుతున్న ఎన్నికలు అని భట్టి అన్నారు. మతతత్వ పార్టీలైన బీజేపీ, ఎంఐఎం గెలిస్తే మతకల్లోలాలు జరుగుతాయని హెచ్చరించారు. టీఆర్ఎస్ గెలిస్తే హైదరాబాద్‌లో అభివృద్ధిని, శాంతిభద్రతలను పట్టించుకోరని చెప్పారు. ‘కేసీఆర్‌కో బగావో- హైదరాబాద్‌కో బచావో’ అని భట్టి పిలుపును ఇచ్చారు. అభివృద్ధికోసం కట్టుబడిన లౌకికపార్టీ కాంగ్రెస్‌ని హైదరాబాద్ ప్రజలు గెలిపిస్తారని భట్టి చెప్పారు. -
'భార్యాబిడ్డలు ఓడిపోయినా బుద్ధి రాలేదు'
పాట్నా: 'సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భార్య, కూతుర్లు చిత్తుగా ఓడిపోయారు. బొటాబొటి ఓట్లతో డిపాడిట్ మాత్రమే దక్కించుకోగలిగారు. అయినా సరే ఆ నేతకు బుద్ధి రాలేదు. ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యుల్ని చట్టసభలో కూర్చోబెడదామా అని ఆలోచిస్తూ ఉంటాడు' అంటూ ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్. ఆదివారం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లాలూ సహా బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల్లో లాలూ సతీమణి రబ్రిదేవి, కుమార్తె మీసా భారతిలు ఇద్దరూ ఓటమి చెందిన విషయం తెలిసిందే. 'బీహార్ లో ఇద్దరు పొగరుమోతు నాయకులున్నారు. ఒకరికేమో తన కుటుంబ ఉన్నతి తప్ప మరేదీ పట్టదు. ఇంకొకాయన తాను సమర్థుడినని ప్రచారం చేసుకోవడంతప్ప పనేమీ చేయరు' అంటూ లాలూ, నితీశ్ లను దాస్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల మాదిరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్ ఓటర్లు జేడీయూ, ఆర్ జేడీలను పాతిపెట్టి.. బీజేపీకి విజయాన్ని అందించాలని కోరారు. -
పొన్నం వర్సెస్ జగదీశ్ రెడ్డి
రాజీనామా చేసి ప్రజాకోర్టుకు సిద్ధం కావాలి మంత్రి జగదీష్‌రెడ్డికి కాంగ్రెస్ నేత పొన్నం సవాల్ సూర్యాపేట: ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రజాకోర్టుకు సిద్ధం కావాలని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డికి కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి ఒక్కరూ జిల్లా, రాష్ట్ర కీర్తిని నిలబెట్టారు కానీ.. దురదృష్టం కొద్ది మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం అవినీతి ఆరోపణలతో ఆ కీర్తికి మచ్చ తెచ్చారని విమర్శించారు. ముడుపుల వ్యవహారంలో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా తాను ఆరోపణలు చేశానని.. అయితే, ప్రభుత్వం వేయని పరువు నష్టం కేసు.. మంత్రి ఎందుకు వేశారో చెప్పాలన్నారు. పరువునష్టం కేసు జూన్ 3కు వాయిదా కాగా పరువు నష్టం దావా కేసులో పొన్నం ప్రభాకర్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఉదయం 10.30 గంటలకు కోర్టుకు హాజరయ్యారు. సూర్యాపేట ప్రథమ శ్రేణి జడ్జి డి.కిరణ్‌కుమార్ జూన్ 3కు కేసును వాయిదా వేశారు. సరే.. కాంగ్రెస్ సిద్ధమా.. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతి సవాల్ సూర్యాపేట: తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు సిద్ధమా అని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ కోర్టులో ఆధారాలు ఎందుకు చూపలేదని, కోర్టు సమన్లు పంపినా ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆరోపణలు చేసినందుకు కోర్టును ఆశ్రయించానని మంత్రి తెలిపారు. తనపై అక్కసుతో చేసిన ఆరోపణలను కోర్టులో రుజువు చేయాలని పేర్కొన్నారు. తన 14ఏళ్ల ఉద్యమ చరిత్రలో తెల్లకాగితంలా ఉన్నానని, నిబద్ధతతో ఉద్యమాలు చేశానని చెప్పారు. పొన్నం తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో కోర్టును ఆశ్రయించానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ ఎక్కడ అడ్రస్ లేకుండా పోతుందనే ఉద్దేశంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపైకి ఒక శిఖండిని వదిలారని విమర్శించారు. నేరస్తుడిగా కోర్టుకు వచ్చిన పొన్నంకు జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలకడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. -
'సీఎం కుటుంబమే బంగారుమయం'
బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుటుంబమే నిండు బంగారు కుటుంబంగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. 700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయ్యేదాకా రైతు ఆత్మహత్యలను పట్టించుకోరా? అని ఆయన నిలదీశారు. సీఎం హెలికాప్టర్లలో కాకుండా గ్రామాల్లో తిరిగితే రైతు సమస్యలు తెలుస్తాయని కిషన్‌రెడ్డి సూచించారు. మిగులు బడ్జెట్ అని, ధనిక రాష్ట్రం అంటూ విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న సీఎం కేసీఆర్ ప్రజలపై భారం మోపేవిధంగా విద్యుత్‌చార్జీలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ఒక్కొక్కరికీ రూ. 2 కోట్ల చొప్పున బహుమతులిస్తూ చార్జీలు ఎలా పెంచుతారని నిలదీశారు. మిషన్ కాకతీయను పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ తీరు అప్రజాస్వామికమని, ఎన్నికలకు సిద్ధమంటూనే వాటి నిర్వహణకు 249 రోజుల గడువు కోరడం ప్రభుత్వ అసమర్థ, దివాలాకోరుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నెలలోనే వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైఎన్నికలు జరిగాయని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో గ్రేటర్ ఎన్నికలపై భయపడుతున్న టీఆర్ఎస్ మజ్లిస్‌తో పొత్తు పెట్టుకున్నా ఓడిపోవడం ఖాయమన్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలపై రవాణా పన్ను విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 2019లో శక్తివంతమైన పార్టీగా అవతరించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ఈ నెల 2,3,4 తేదీల్లో బెంగుళూరులో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దీనిపై వ్యూహరచన చేస్తామన్నారు. -
'బీజేపీ నాయకుల చెల్లెళ్లు, కూతుళ్లను తిరిగి రప్పించండి'
ఫైజాబాద్(యూపీ): బీజేపీ నాయకుల "ఘర్ వాపసీ'' ప్రచార కార్యక్రమంపై సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ సింగ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. మతం మార్చుకొని పెళ్లాడిన తమ చెల్లెల్లు, కూతుళ్లను బీజేపీ నాయకులు తిరిగి హిందూ మతంలోకి రప్పిస్తేనే వారు చేపట్టిన కార్యక్రమానికి అర్ధం ఉంటుందన్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే తేజ్ నరైన్ తమ్ముని వివాహానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీజేపీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన భారీ అభివృద్ధి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యిందని.. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఘర్ వాపసీ కార్యక్రమం అని ఆయన ఎద్దేవా చేశారు.