

జగన్ పలావు పెడితే.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు

బిర్యానీ లేదు కదా.. ఉన్న పలావు పోయింది

సూపర్ సిక్సూ లేదు.. సూపర్ సెవనూ లేదు

విద్యాదీవెన లేదు.. వసతిదీవెన కూడా లేదు

ఇంగ్లీష్ మీడియం చదువులు దెబ్బ తిన్నాయి, టోఫెల్ పోయింది

గోరుముద్ద పోయింది.. ప్రజారోగ్య రంగం తీవ్రంగా దెబ్బతింది

ఆరోగ్యశ్రీ అటకెక్కింది.. వ్యవసాయం కూడా పోయింది

పెట్టుబడి సాయం కూడా పోయింది.. ఉచిత ఇన్సూరెన్స్ ఆచూకీ లేదు

ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోతున్నాయి

డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్ చేశారు

పేరుకు ఇసుక ఉచితం అన్నారు.. ఇప్పుడు అధిక రేటుకు ఇస్తున్నారు

ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కపైసా కూడా రావడం లేదు

చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి. ఆ మోసాలపై రోజురోజుకూ ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది

చంద్రబాబు ప్రభుత్వమా? జగన్ ప్రభుత్వమా?.. రెండింటిలో ఏది మంచి ప్రభుత్వం అనే చర్చ ప్రతీ కుటుంబంలో జరుగుతోంది