
సనంద్: ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల మనసుల్లో దళితులు, రైతులు, పేదలకు ఎంతమాత్రం చోటు లేదనీ, వారి మనసు కొద్ది మంది పారిశ్రామికవేత్తల పైనేననీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. హెలికాప్టర్‌లో చోటులేకపోవడంతో ఆగస్టు నెలలో దళితులు అందజేసిన జాతీయజెండాను గాంధీనగర్‌లో రూపానీ స్వీకరించకపోవడంపై రాహుల్ మండిపడ్డారు. అహ్మదాబాద్‌లోని సనంద్‌లో దళిత్ శక్తి కేంద్రంలో దళితులు అందజేసిన జాతీయ జెండాను ఆయన స్వీకరించారు. ఆ జెండాను ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెమొరియల్ మ్యూజియంలో భద్రపరుస్తామన్నారు. ఉనాలో దళితులపై దాడి, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యలపై మోదీ, రూపానీ ఉదాసీనంగా వ్యవహరించారని రాహుల్ విమర్శించారు.