న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.
అందులోని కొందరు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తాజాగా ఓ జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. ఎన్డీఏ బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ విద్వేషపు ఆలోచనను ప్రజలు తిరస్కరించారన్నారు. ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే ఇండియా కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకొని ఉండేదన్నారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లోనూ తాము పోరాడామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment