
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj), మొఘల్ పాలకుడు ఔరంగజేబు అంశంపై వివాదాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో బీజేపీ ఎంపీ ఒకరు దీనికి ఆజ్యం పోసేలాంటి వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని బార్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎంపి ప్రదీప్ పురోహిత్ పార్లమెంటులో మాట్లాడుతూ ప్రధాని మోదీ గత జన్మలో మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అభివర్ణించారు. ఎంపీ చేసిన ఈ ప్రకటన కలకలం సృష్టించింది.
ఎంపీ ప్రదీప్ పురోహిత్ లోక్ సభ(Lok Sabha)లో మాట్లాడుతూ తాను ఇటీవల ఒక సాధువును కలిశానని, ఆయన గత జన్మలో ప్రధాని మోదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ మహారాష్ట్రతో సహా మొత్తం దేశాన్నంతటినీ పురోగతి వైపు తీసుకెళ్లడానికి పునర్జన్మ తీసుకున్నారని ప్రదీప్ పురోహిత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యానంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే, దానిని సభా కార్యకలాపాల నుండి తొలగించినట్లుగా పరిగణించాలని కోరారు. కాగా ప్రదీప్ పురోహిత్ ప్రకటనపై విచారణ చేయాలని, ఆయనను సభా కార్యకలాపాల నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించాలని స్పీకర్ దిలీప్ సైకియా ఆదేశించారు.
अखंड हिंदुस्तानाचे आराध्य दैवत आणि रयतेचे राजे छत्रपती शिवाजी महाराज यांचा वारंवार अपमान करण्याचे आणि महाराष्ट्रातील तसेच जगभरातील शिवप्रेमींची अस्मिता दुखावण्याचे नियोजनबद्ध कारस्थान भाजपच्या नेतेमंडळींकडून केले जात आहे.
या लोकांनी छत्रपती शिवाजी महाराजांचा मानाचा जिरेटोप… pic.twitter.com/N624xkfkQN— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) March 17, 2025
కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్.. ప్రదీప్ పురోహిత్ ప్రకటనను విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ చేశారు.. ‘ఇలాంటివారు నరేంద్ర మోదీ తలపై ఛత్రపతి శివాజీ మహారాజ్ కిరీటాన్ని ఉంచడం ద్వారా.. శివాజీ మహారాజ్‌ను తీవ్రంగా అవమానించారన్నారు. అవిభక్త భారతదేశ పూజ్య దైవం, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను పదే పదే అవమానించడానికి ప్రయత్నిస్తూ, శివాజీ మహరాజ్ గుర్తింపును దెబ్బతీసేందుకు బీజేపీ నాయకత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: మహాకుంభమేళాలో ఐక్యత అనే అమృతం ఉద్భవించింది: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment