ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో రూ.42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘అజంగఢ్‌లో గతంలో మాఫియా పాలన ఉండేదని, ఇప్పుడు ఇక్కడి ప్రజలు చట్టబద్ధమైన పాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ‘ఇండియా కూటమి’కి నిద్రపట్టడంలేదని ప్రధాని మోదీ విమర్శించారు.
అజంగఢ్ అభివృద్ధికి బాటలు వేస్తుందని, నక్షత్రంలా వెలిగిపోతుందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నేతలు కేవలం పథకాలను మాత్రమే ప్రకటించేవారని విమర్శించారు. మోదీ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, దేశాభివృద్ధే లక్ష్యంగా తన ప్రయాణం సాతున్నదని అన్నారు. అజంగఢ్ అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని మోదీ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజల కళ్లలో దుమ్ము కొట్టిందని ఆరోపించారు. తాము దేశంలో అనేక రైల్వే స్టేషన్లు ఏకకాలంలో నిర్మిస్తున్నామన్నారు.
దేశం మొత్తం మీద అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఇక్కడ నుండే ప్రారంభమవుతున్నాయని, ఈరోజు దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అజంగఢ్ నుంచి ప్రారంభించామన్నారు. నేడు ఆజంగఢ్ కొత్త చరిత్ర నాందిపలుకుతోందని అన్నారు. కులతత్వం, బంధుప్రీతి, ఓటు బ్యాంకుపై ఆధారపడిన ఇండియా కూటమి ఇంతటి అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. అజంగఢ్, పూర్వాంచల్ ప్రజలకు రాజా సుహెల్‌దేవ్ స్టేట్ యూనివర్శిటీ, మండూరి విమానాశ్రయంతో సహా అనేక ప్రాజెక్టులను కానుకగా ఇచ్చారు.
पूर्वी उत्तर प्रदेश समेत पूरे देश के परिवारजनों के जीवन को आसान बनाने के लिए हमारी सरकार दिन-रात काम रही है। आजमगढ़ में विकास कार्यों के शिलान्यास और लोकार्पण कार्यक्रम को संबोधित कर रहा हूं।https://t.co/fGxt3QsZt4
— Narendra Modi (@narendramodi) March 10, 2024
Comments
Please login to add a commentAdd a comment