vijay rupani
-
‘మహ’ సీఎం ఎంపిక : పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ
ముంబై: మహరాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ డిసెంబర్ 4 జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రేపే ఢిల్లీకి వెళ్లనున్నారు. మహరాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి పెద్దలు చేస్తున్న కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి పెద్దలతో ఏకాంతంగా చర్చలు జరిపేందుకు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఢిల్లీకి పయనమయ్యారు. కేబినెట్ పదవులు ఖరారు చేసేందుకు మహాయుతి నేతల సమావేశానికి ఏక్నాథ్ షిండే హాజరు కావాల్సి ఉంది. కానీ షిండే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం షిండే బీజేపీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాల సమాచారం మేరకు.. ఇవాళ తమ అధినేత షిండేకు.. బీజేపీ అగ్రనేతలతో సమావేశానికి సంబంధించి ఎలాంటి మీటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదని తెలిపారు. బీజేపీ పెద్దలు మీటింగ్ షెడ్యూల్ ఖరారుపై ఎదురు చూస్తున్నారంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ అగ్రనాయకులతో చర్చలు జరిపేందుకు అజిత్ పవార్ ఢిల్లీకి బయలుదేరడం గమనార్హం. Union Finance Minister @nsitharaman and Former Gujarat Chief Minister Vijay Rupani have been appointed as #BJP's Central Observers for Legislature Party meeting to elect leader in #Maharashtra. pic.twitter.com/3wb1DryKVD— All India Radio News (@airnewsalerts) December 2, 2024 -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్
రాజ్‌కోట్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు సీనియర్ నాయకులు పోటీ విముఖత చూపారు. తాము పోటీ చేయడం లేదని, అభ్యర్థుల ఎంపికలో తమ పేర్లు పరిశీలించొద్దని అధిష్టానానికి తెలిపారు. మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, భూపేంద్రసిన్హ్ చూడాసమా, ప్రదీప్‌సిన్హ్ జడేజా.. ఈ మేరకు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు లేఖలు రాశారు. ఈ నలుగురు వేర్వేరుగా లేఖలు రాసినట్టు బీజేపీ అధికార ప్రతినిధి యమల్ వ్యాస్ ధ్రువీకరించారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో బీజేపీ కేంద్ర పార్లమెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీనియర్ నాయకుల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తమకు టికెట్లు వద్దంటూ సీనియర్లు లేఖలు ఇవ్వడంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పి తప్పినట్టయింది. పోటీ చేయనని ముందే చెప్పా: రూపానీ ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. గుజరాత్‌కు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం బీజేపీ నాకు కల్పించింది. ఇప్పుడు నన్ను పంజాబ్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. సీనియర్ నాయకుడిగా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ముందే ప్రకటించాను. నేను టికెట్ కూడా అడగటం లేద’ని విజయ్ రూపానీ విలేకరులతో చెప్పారు. 66 ఏళ్ల రూపానీ రాజ్‌కోట్ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2016, ఆగస్టు నుంచి 2021, సెప్టెంబర్ వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా: పటేల్ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెహసానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం లేదని, తన పేరు పరిశీలించొద్దని పాటిల్‌కు రాసిన లేఖలో నితిన్ పటేల్ పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కడి, మెహసానా స్థానాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాన’ని పటేల్ విలేకరులతో అన్నారు. తొమ్మిది సార్లు పోటీ చేశా, ఇక చాలు.. పార్టీ తనకు తొమ్మిది సార్లు అవకాశం ఇచ్చిందని, ఇక చాలని మాజీ మంత్రి, ధోల్కా ఎమ్మెల్యే భూపేంద్రసిన్హ్ చూడాసమా అన్నారు. ‘తొమ్మిది సార్లు పోటీ చేసే అవకాశమిస్తే నేను ఐదు సార్లు గెలిచి క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశాను. ఇక చాలు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని పార్టీకి ముందే చెప్పాన'ని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయబోనని, పార్టీ తనకు ఏ పని అప్పగించినా చేస్తానని ప్రదీప్‌సిన్హ్ జడేజా పేర్కొన్నారు. (క్లిక్: మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను) -
భూపేంద్ర పటేల్: ప్రోఫైల్
-
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్: ఆయనే ఎందుకు
గాంధీనగర్: గుజరాత్లో 2017లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్(59)ను అదృష్టం వరించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, సీనియర్ నేత తరుణ్ చుగ్ హాజరయ్యారు. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎన్నికతో రూపానీ వారసుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు తెరపడింది. భూపేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపేంద్ర వెంట నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, విజయ్ రూపానీ, సి.ఆర్.పాటిల్ తదితరులు ఉన్నారు. నేడు భూపేంద్ర ఒక్కరే ప్రమాణం భూపేంద్ర పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాణ స్వీకా రం చేస్తారని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. కేవలం ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి, 2, 3 రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై పార్టీ శాసనసభా పక్ష భేటీలో ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. మోదీ, షా, నడ్డాలకు కృతజ్ఞతలు తనపై నమ్మకం ఉంచి, ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు భూపేంద్ర పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. విజయ్ రూపానీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. భూపేంద్ర పటేల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, భూపేంద్ర నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధికి కొత్త ఉత్సాహం, ఊతం లభిస్తాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారం దక్కించుకోవాలనే.. గుజరాత్ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపర్చింది. నిజానికి తొలుత కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలి, డయ్యూ, డామన్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్లు వినిపించాయి. కొత్త ముఖ్యమంత్రిగా వారిద్దలో ఒకరిని ఎంపిక చేస్తారన్న ప్రచారం సాగింది. ఆశావహుల జాబితాలో భూపేంద్ర పటేల్ పేరు లేదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయనను ఏకంగా సీఎం పదవి వరించడం గమనార్హం. భూపేంద్ర పటేల్ గుజరాత్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన పాటిదార్ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే పాటిదార్ వర్గాన్ని మచ్చిక చేసుకోక తప్పదన్న అంచనాతోనే బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విజయ్ రూపానీ మొదటిసారిగా 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 7న సీఎంగా మొత్తం ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. వార్డు కౌన్సిలర్ నుంచి సీఎం దాకా.. అహ్మదాబాద్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌ను రికార్డు స్థాయిలో 1,17,000 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. భూపేంద్ర ఎమ్మెల్యేగా నెగ్గడం ఇదే మొదటిసారి. గుజరాత్ మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ 2012 నుంచి 2017 దాకా ఘాట్లోడియా స్థానం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. భూపేంద్ర పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్. అభిమానులు, అనుచరులు దాదా అని పిలుచుకుంటారు. అనందిబెన్ పటేల్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన 1999 నుంచి 2000 దాకా మేమ్‌నగర్ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్‌లోని థాల్టెజ్ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు. అహ్మద్‌బాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిపొ్లమా పూర్తిచేసిన భూపేంద్ర పటేల్ పాటిదార్ సామాజికవర్గంలోని కాడ్వా అనే ఉప కులానికి చెందినవారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పాటిదార్ వర్గం నేతలు లియువా అనే ఉప కులానికి చెందినవారు. భూపేంద్ర పాటిదార్ సంస్థలైన సర్దార్‌ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు. మంత్రిగా పని చేయకుండానే ఆయన సీఎం అవుతుండడం విశేషం. ఆయనే ఎందుకు? వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను అధిష్టానం భూపేంద్ర పటేల్‌పై మోపింది. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ఆయనను సీఎం పదవిలో కూర్చోబెట్టడం ఆసక్తికరంగా మారింది. బలమైన పాటిదార్(పటేల్) సామాజికవర్గంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు చూరగొన్న వ్యక్తి కావడమే ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో భూపేంద్ర అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. నగర అభివృద్ధి విషయంలో మోదీ ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. అప్పుడే మోదీ దృష్టిలో సమర్థవంతుడైన నాయకుడిగా ముద్రపడ్డారు. ఇటీవల కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు బాధితుల కోసం భూపేంద్ర ఆక్సిజన్ సిలిండర్లు విరివిగా సమకూర్చారు. ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేయించారు. పదవిలో ఉన్నప్పటికీ ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండడం, తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోవడం భూపేంద్ర ప్రత్యేకత. ఇవన్నీ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఆనందిబెన్ పటేల్ సిఫారసు కూడా బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపేలా చేసింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తమ పార్టీ అధిష్టానం ఆనందిబెన్ అభిప్రాయానికి విలువనిచి్చందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. లేకపోతే నితిన్ పటేల్ గానీ, మరొకరు గానీ ముఖ్యమంత్రి అయ్యేవారని వెల్ల డించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మన్సుఖ్ మాండవియా(ప్రస్తుతం కేంద్ర మంత్రి) గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పాటిదార్ వర్గం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల వెనుక చేరకుండా చూడాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని మరో నేత చెప్పాడు. గుజరాత్ జనాభాలో పాటిదార్ వర్గం దాదాపు 14 శాతం ఉంటుంది. దాదాపు 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించేది పాటిదార్లే. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పాటిదార్ కావడం గమనార్హం. 1995 నుంచి బీజేపీకి అండగా నిలుస్తున్న పాటిదార్లు 2015లో రిజర్వేషన్ల ఆందోళనతో కొంత దూరమయ్యారు. -
కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
-
ఏడాదిలో నలుగురు సీఎంలను మార్చిన బీజేపీ
-
సీఎం పదవికి రాజీనామా: నాలుగో వ్యక్తి రూపానీ.. ముందు ముగ్గురు ఎవరంటే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్లో బీజేపీ కీలక మార్పులకు తెర తీసింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం తన పదవికీ రాజీనామా చేశారు. పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ అధిష్టానం విజయ్ రూపానీతో రాజీనామా చేయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. తదుపరి సీఎం రేసులో ఉన్న వారి పేర్లు చూస్తే ఈ వార్తలు వాస్తవమే అనిపిస్తున్నాయి. గుజరాత్ కొత్త సీఎం రేసులో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, ఎంపీ సీఆర్ పటేల్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుజరాత్ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించబోయేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల్లో ఇలా ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నాల్గవ వ్యక్తి. గతంలో కర్ణాటక, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల చేత బీజేపీ అధిష్టానం ఇలానే రాజీనామా చేయింది. రాజీనామాలు చేయించడం ఎందుకు.. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లో విజయం కోసం బీజేపీ వేర్వేరు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత సీఎం పనితీరు, వారిపై ఉన్న వ్యతిరేకత-వివాదాలు, ఆయా రాష్ట్రాల్లో పార్టీకి మేజర్ ఓటు బ్యాంకు ఇలా తదితర అంశాల ఆధారంగా బీజేపీ పావులు కదుపుతోంది. తాజాగా కర్ణాటక, గుజరాత్లో పరిశీలించినట్లయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ మెజారిటీ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే సీఎంల చేత రాజీనామా చేయించింది. ఈ క్రమంలో యడ్డీ రాజీనామా తర్వాత కర్ణాటకలో తనకు గట్టి మద్దతుదారులైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మైనే ముఖ్యమంత్రిగా నియమించింది. ఇక గుజరాత్లో కూడా పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇవ్వనున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఇక బీజేపీ ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించిన మిగతా రాష్ట్రాలు ఏవి అంటే.. 1. జూలై 2021: కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్డీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తర్వత.. ఈ ఏడాది జూలై 26 న, బీఎస్ యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. యడ్డీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన, అతడి కుమారుడిపై పెద్ద ఎత్తున ప్రజాగ్రాహం వెల్లడయ్యింది. అంతేకాక పార్టీ రాష్ట్ర విభాగంలోని ఒక నిర్దిష్ట విభాగం యడ్డీని పదవి నుంచి తొలగించాలని బీజేపీ అధిష్టాన్నాన్ని డిమాండ్ చేసింది. యడియూరప్పపై పెరుగుతున్న ఆగ్రహం.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ యడ్డీ చేత రాజీనామా చేయించింది. 75 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పరిమితి కారణంగానే 78 ఏళ్ల యడ్డీ చేత రాజీనమా చేయించినట్లు బీజేపీ తెలిపింది. ఆయన స్థానంలో బీజేపీ తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించింది. బొమ్మై గతంలో యడ్డీ మంత్రివర్గంలో హోంమినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. (చదవండి: బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై) 2. జూలై 2021: ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామా మార్చి 2021 లో త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామాను సమర్పించిన తర్వాత తీరథ్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తీరథ్ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం చేత ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మార్చిలో పదవి చేపట్టినప్పటి నుంచి అమ్మాయిల చిరిగిన జీన్స్‌పైన, ఆధ్యాత్మికతతో కరోనాపై పోరాటం లాంటి తీరథ్ వ్యాఖ్యలు పలు వివాదాలు రేపాయి. కరోనా రెండో ఉద్ధృతి వేళ కుంభమేళా నిర్వహణ తెచ్చిన చెడ్డపేరు, పార్టీలోనూ – పాలనలోనూ గందరగోళం... ఇలా అన్నీ కలిసి ఆయనకు పదవీగండం తెచ్చాయి. ఫలితంగా తీరథ్ ఈ ఏడాది జూలై 2021న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. (చదవండి: ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా..) 3. మార్చి 2021: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి 9 వ తేదీన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2017, మార్చి 18న రావత్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 57 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే పార్టీలోని చాలా మంది నాయకులు రావత్ ముఖ్యమంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రావత్ తమ మాట వినలేదని ఫిర్యాదు చేశారు. రావత్ పని తీరును కూడా వారు వ్యతిరేకించారు. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో రావత్‌ను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. ఈ మీటింగ్ అనంతరం రావత్ తన రాజీనామాను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు రాజ్‌భవన్‌లో సమర్పించారు. ఆయన స్థానంలో తీరత్ సింగ్ తెరపైకి వచ్చారు. ఆయన కూడా నాలుగు నెలల్లో రాజీనామా చేయడం గమనార్హం. తాజాగా విజయ్ రూపానీ రాజీనామా చేసిన నాల్గవ సీఎంగా నిలిచారు. చదవండి: అనివార్యతే వేటుకి కారణమైందా? -
విజయ్ రూపానీ రాజీనామా: కొత్త సీఎం రేసులో ఉన్నది వీరే
-
విజయ్ రూపానీ రాజీనామా: కొత్త సీఎం రేసులో ఉన్నది వీరే
గాంధీనగర్: మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. మోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే విజయ్ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గుజరాత్లో బలమైన పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే రూపానీతో రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్ధిక్ పటేల్ బీజేపీని బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయన భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దీంతో అధికార బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. 15 శాతం జనాభా.. మద్దతు లేకుంటే కష్టమే.. గుజరాత్లో అధికార బీజేపీకి పటేళ్లు గట్టి మద్దతుదార్లు. ఆ రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వారు 15 శాతం మంది ఉన్నారు. గుజరాత్లో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం వారు కీలక స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలోనే పటేళ్లకు మరింత ప్రాధాన్యం కల్పించి.. వారికి దగ్గరవ్వాలని బీజేపీ చూస్తోంది. ఇక రూపానీ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం పీఠాన్ని ఎవరికి కట్టబెడతారనే చర్చ ఊపందుకుంది. కొత్త ముఖ్యమంత్రి రేసులో నితిన్ పటేల్, సీఆర్ పటేల్, ఆర్సీ ఫాల్దూ, మన్సుఖ్ మాండవియా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. చదవండి: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా -
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా
-
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా
గాంధీనగర్: అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శనివారం గవర్నర్‌కి సమర్పించారు విజయ్ రూపానీ. 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్న రూపానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వచ్చే ఏడాది గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం నాయకత్వ మార్పుకు ఆదేశించినట్లు సమాచారం. దానిలో భాగంగానే విజయ్ రూపానీ రాజీనామా చేశారు. పటేల్ సామాజిక వర్గం నుంచే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. కొత్త సీఎం రేసులో నితిన్ పటేల్, సీఆర్ పటేల్, ఆర్సీ ఫాల్దూ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి రాజీనామా పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇటీవలే బీజేపీ.. కర్ణాటక, ఉత్తరాఖండ్ సీఎంలను మార్చిన సంగతి తెలిసిందే. (చదవండి: స్వపక్షంలో విపక్షం) 2016 నుంచి విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా కొనసాగుతున్నారు. ఏబీవీపీ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగారు. రూపానీ 1998లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2006-12 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజీనామా అనంతరం విజయ్ రూపానీ మాట్లాడుతూ ‘‘ఇన్నాళ్లు మోదీ మార్గదర్శకంలో పని చేశా. నాకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాను. నేను సీఎంగా రాజీనామా చేసినప్పటికి మోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి కొనసాగుతుంది. ఇక కొత్త సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది’’ అని తెలిపారు. చదవండి: వైరల్: కొడుక్కు సెల్యూట్ చేసిన తల్లి, నెటిజన్లు ఫిదా -
కోరిక తీర్చమన్నారు.. విషయం సీఎంకు చేరింది!
జామ్‌నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఆర్ మేనేజర్, సూపర్వైజర్ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహిళా అటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ నితేశ్ పాండే తెలిపారు. ఈ విషయం తెలిసిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. కొంతమంది కాంట్రాక్టు మహిళా అటెండెంట్లు తమపై కొందరు ఉన్నతాధికారులు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వారి కోరికను తిరస్కరించిన కొందరు మహిళా అటెండెంట్లను జూన్ 16న విధుల నుంచి తొలిగించినట్లు పేర్కొన్నారు. వార్డ్ బాయ్స్ ద్వారా తమకు ఈ ప్రతిపాదనలు చేయిస్తున్నారని అన్నారు. వారి కోరికను తిరస్కరించిన వారికి మూడు నెలలుగా జీతం చెల్లించకుండా తొలగించారని వివరించారు. కాగా దీనిపై జామ్ నగర్ బి డివిజన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 354, 354-ఎ, 354-బి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు జరుగుతోందని అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ నితీశ్ పాండే అన్నారు. ఇక ఈ ఆరోపణలపై సమగ్ర నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర మహిళా కమిషన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌ను కోరింది. చదవండి: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు -
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేడు ఈ-వేహికల్ పాలసీ-గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2021ను విడుదల చేశారు. కొత్త పాలసీ గురించి రాష్ట్ర సమాచార శాఖ ఈ విదంగా తెలిపింది. రాబోయే నాలుగు సంవత్సరాలలో గుజరాత్ రోడ్లపై 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను చూడాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గుజరాత్ ఎలక్ట్రిక్ వాహన విధానం 2021ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. టూ వీలర్, ఫోర్ వీలర్ ఈ-వాహనాలను భారీగా ప్రోత్సాహకలను ప్రకటించింది. గుజరాత్ ఈ-వేహికల్ పాలసీలోని ముఖ్యాంశాలు: రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్రంలో ఈ-వాహనాల వినియోగం పెరగడం గుజరాత్ ను ఈ-వాహనాలు, దానికి సంబంధించిన వాటికి కేంద్రంగా చేయడం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో యువ స్టార్టప్‌లు, పెట్టుబడిదారులను ప్రోత్సహించడం వాయు కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడటం ప్రస్తుతం ఈ-వాహనాల ఛార్జింగ్ కోసం రాష్ట్రంలో 278 ఛార్జింగ్ స్టేషన్లకు తోడుగా మరో కొత్త 250 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పెట్రోల్ పంపులకు ఆమోదం హౌసింగ్, వాణిజ్య మౌలిక సదుపాయాల వద్ద ఛార్జింగ్ సదుపాయం. గుజరాత్ ఆర్టీఓలో నమోదైన ఈ-వాహనానికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు టూ వీలర్ వాహనాలకు రూ.20 వేలు, త్రీ వీలర్ వాహనాలకు 50 వేలు, 4 చక్రాల వాహనాలకు 1.5 లక్షల వరకు సబ్సిడీనేరుగా బ్యాంకు ఖాతాలో జమ కిలోవాట్ పై ఈ-వేహికల్ వాహనాలపై గుజరాత్ ఇతర రాష్ట్రాల కంటే రెట్టింపు సబ్సిడీని ఇస్తుంది. ఈ-వాహనాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఫేమ్ -2 పథకం ప్రయోజనాలతో పాటు ఈ-వాహన కొనుగోలుదారులకు గుజరాత్ ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకలు ఇస్తుంది. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలు -
గుజరాత్ సీఎంకు కరోనా
సాక్షి, వడోదర: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కరోనా బారిన పడ్డారు. ఆదివారం స్వల్ప అనారోగ్యంతో ఎన్నికల సభలో మాట్లడుతూ కళ్లు తిరిగి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో సీఎంకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న రూపానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అన్ని పారామీటర్స్ నార్మల్ ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అటు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో తమ నేత, ముఖ్యమంత్రి రూపానీ వైరస్ బారిన పడటంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. (వేదికపై కుప్పకూలిన సీఎం, పీఎం ఆరా) పిబ్రవరి 21న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ రూపానీ స్పృహ తప్పిపడిపోయారు. సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ ప్రకటించిన వైద్యులు 24 గంటల పాటు రూపానీని అబ్జర్వేషన్లో ఉంచాలని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో రెండో విడత కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. -
వేదికపై కుప్పకూలిన సీఎం, పీఎం ఆరా
సాక్షి,వడోదర: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (64) వేదికపై హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో అస్వస్థతకు గురైన ఆయన స్టేజ్‌పైనే పడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రథమ చిక్సిత అనంతరం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇతర బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. వడోదరలోని నిజాంపురలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీసారు. (గుజరాత్ సీఎంకు కరోనా) ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానికబీజేపీ నాయకులు వెల్లడించారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా సీఎంకు కళ్లు తిరిగాయనీ దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పడిపోకుండా పట్టుకున్నారనీ బీజేపీ నేత భరత్ తెలిపారు. అనంతరం ఆయనను వడోదర నుంచి అహ్మదాబాద్‌కు హెలికాప్టర్లో తరలించామన్నారు. కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం దెబ్బతిందన్నారు. లో బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరిసించి పోయారని వైద్యులు తెలిపారని చెప్పారు. కాగా గుజరాత్‌లోని వడోదరతో సహా కీలకమైన ఆరుమునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి. మునిసి పాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి. -
రాహుల్.. కొత్తిమీరకు, మెంతికి తేడా తెలుసా?
గాంధీనగర్: కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు రైతులకు మద్దతుగా రోడుపైకి వచ్చి నిరసన తేలుపుతున్నాయి. కానీ గుజరాత్లో మాత్రం భారత్ బంద్ పాటించమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఉత్తర గుజరాత్‌లోని మెహసానాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు రూపానీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలియని రాహుల్ రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, విపక్షాలను తరిమి కొట్టారు. ఇప్పుడు వారు రైతులకు మద్దతు తెలపుతున్నాం అంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ ఈ ప్రశ్నకు సమాధానం చెబితే నీకు వ్యవసాయం, రైతుల గురించి ఏ మేరకు అవగాహన ఉందో అందరికి అర్థమవుతుంది. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలుసా నీకు.. సమాధానం చెప్పు’ అంటూ రూపానీ ఎద్దేవా చేశారు. (చదవండి: విశ్వాస పునరుద్ధరణ కీలకం) అంతేకాక నరేంద్ర మోదీ ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలని సాల్వ్ చేస్నున్నారని తెలిపారు రూపానీ. ‘ప్రస్తుతం రైతుల పేరు చెప్పి కాంగ్రెస్ లబ్ది పొందాలని భావిస్తుంది. కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ విద్యుత్, విత్తనాలు, ఎరువులు, కనీస మద్దతు ధర, సాగు నీరు వంటి అంశాల గురించి అస్సలు పట్టించుకోలేదు. బీజేపీ హయాంలో వీటన్నింటిని సాధిస్తుంటే తట్టుకోలేకపోతుంది’ అంటూ రూపానీ విమర్శించారు. -
మా రాష్ట్రంలో బంద్ పాటించం: సీఎం
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు డిసెంబర్ 8న తలపెట్టిన భారత్ బంద్‌ను తమ రాష్ట్రం పాటించదని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఈ చట్టాల విషయంలో రైతులలో అసంతృప్తి లేదని భావిస్తున్నానన్నారు. బంద్ పేరిట శాంతిభద్రతలకి విఘతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ప్రభుత్వంతో రైతుల ఐదవ రౌండ్ చర్చలు విఫలమవ్వడంతో, కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో హర్యానా, ఉత్తర ప్రదేశ్ మార్గాలలో బైటాయించిన విషయం తెలిసిందే. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో డిసెంబర్ 9న ప్రభుత్వం మరో సమావేశాన్ని కేంద్రం ప్రతిపాదించింది. వృద్ధులు, మహిళలు, పిల్లలను నిరసన స్థలాల నుంచి వారి ఇళ్లకు తిరిగి పంపమని వారిని అభ్యర్థించింది. అందుకే నిరసనలో పాల్గొంటున్నారు: కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విపక్షాల తీరును తప్పుబట్టారు. ‘‘ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. యుపీఏ పాలనలో చేయలేని వ్యవసాయ రంగంలో సంస్కరణలు ఈ రోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఇప్పుడు వారు ఎన్నికలలో ఓడిపోతున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాలు ఏ నిరసనలోనైనా పాల్గొంటారు’’ అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) ను ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెడుతుందో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కొత్త చట్టాలను రద్దు చేయాలనే లక్ష్యంతో ఆందోళన చేస్తున్న రైతులు డిసెంబర్ 8న 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే దేశ రాజధానికి వెళ్లే మరిన్ని రహదారులను అడ్డుకుంటామని, ఆందోళనలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. -
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గాంధీనగర్/వడోదర: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం తెల్లవారుజామున వడోదర శివారులో వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలోని వంతెనపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో సూరత్ నుంచి పావగఢకు వెళ్తున్న ట్రక్కు వాఘోడియా వద్ద మరో ట్రక్కును ఢీకొట్టింది. వేకువజామున ప్రమాదం జరగడంతో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి సీఎం విజయ్ రుపానీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. (చదవండి: మానవత్వం చాటుకున్న మంత్రులు..) Saddened by the loss of lives due to a road accident near Vadodara. Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls: Gujarat CM Vijay Rupani (File photo) https://t.co/DfjccVSVmN pic.twitter.com/peVSC1Jykk — ANI (@ANI) November 18, 2020 -
రానున్న ఎన్నికలకు ట్రైలర్ వంటిది: సీఎం
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ విద్వేషపూరిత రాజకీయాలు, ఎత్తుగడలను ఓటర్లు చిత్తు చేశారంటూ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికలకు ట్రైలర్ వంటివని, అప్పుడు కూడా విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో 8 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిలో జయకేతనం ఎగురవేసిన కాషాయ పార్టీ.. మరో 5 స్థానాల్లోనూ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘కాంగ్రెస్ మునిగిపోతున్న నావ.. ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఎప్పుడో దూరమయ్యారు. ప్రతిచోటా వారికి వ్యతిరేకంగానే ఫలితాలు వెలువడుతున్నాయి. అధినాయకత్వ లోపం కనబడుతోంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు రాబోయే స్థానిక ఎన్నికలకు ట్రైలర్ వంటివి’’ అని పేర్కొన్నారు. (చదవండి: బిహార్ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం) ఇక రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. అబ్డాసా, మోర్బీ, కర్జన్ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. డాంగ్స్, ధరి, గధాడా, కప్రాడా, లింబ్డీ నియోజకవర్గాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం సాధించి విజయం దిశగా దూసుకుపోతోంది. కాగా మధ్యప్రదేశ్‌తో పాటు గుజరాత్లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అన్ని చోట్లా విపక్షాలను చిత్తు చేస్తూ బీజేపీ విజయం దిశగా పయనిస్తూ సత్తా చాటుతోంది. -
కేశూభాయ్ పటేల్ కన్నుమూత
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అత్యంత సీనియర్ నేత కేశూభాయ్ పటేల్(92) కన్ను మూశారు. కోవిడ్–19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్ గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గుజరాత్లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించిన కేశూభాయ్ 1995, 1998–2001 సంవత్సరాల్లో రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. కేశూభాయ్ మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్య క్రియలు జరుగుతాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ తన తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా క్షీణిస్తోందని కేశూభాయ్ కుమారుడు భరత్ పటేల్ తెలిపారు. గురువారం ఉదయం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోవడంతో ఆస్పత్రికి తరలించామన్నా రు. కేశూభాయ్ గుండెపోటుతో చనిపో యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పర్యటనలో ఉన్న రూపానీ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గాంధీనగర్ చేరుకుని స్వగృహంలో ఉంచిన కేశూభాయ్ మృతదేహానికి నివాళుల ర్పించారు. జునాగఢ్ జిల్లా విసవదార్ పట్టణంలో 1928లో జన్మించిన కేశూభాయ్ 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రచారక్‌గా చేరారు. జన్‌సంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్ర శాసనసభకు ఆయన 6 పర్యాయాలు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
గుజరాత్, మహారాష్ట్రలను వణికిస్తోన్న నిసర్గ
-
వణికిస్తోన్న నిసర్గ తుపాను
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్‌కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం మరో 12 గంటల్లో నిసర్గ తుపానుగా మారనున్నదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో ఉత్తర మహారాష్ట్రను దాటి, దక్షిణ గుజరాత్‌లోకి ప్రవేశించి, అలీబాగ్ వద్ద హరిహరేశ్వర్, డామన్‌ల మధ్య జూన్ 3వ తేదీ సాయంత్రం తీరందాటే అవకాశం ఉన్నదని, తీరందాటే సమయంలో గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.ఎస్.హసలీకర్ హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్కి చెందిన 14 జాతీయ విపత్తు సహాయక బృందాలు తీరప్రాంతాల్లో రక్షణచర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మరో ఐదు బృందాలను ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాల్లో రప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తుపానుని ‘నిసర్గ’గా పిలుస్తున్నారు. నిసర్గ పేరుని బంగ్లాదేశ్ సూచించినట్టు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడించారు. గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్సారీ, భరూచి జిల్లాల్లోని తీరప్రాంతాల్లో నివసించే 78,971 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 6 స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ తుఫాన్ సహాయక చర్యల్లో ఉన్నట్టు అధికారి హర్షద్ పటేల్ అహ్మదాబాద్‌లో వెల్లడించారు. వారికి 140 భవనాల్లో తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో సహాయక బృందాలు పీపీఈ కిట్లను ధరించాలనీ, షెల్టర్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. నిసర్గ తుపాను తాకిడిని తట్టుకునేందుకు రాష్ట్రంలో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. తుపాను 16 ఎన్డీఆర్ఎఫ్ యూనిట్లలో 10 బృందాలు తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఇంకా 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. జూన్ 1 నాటికి ముంబైలో నమోదైన 41,099 కేసులతో సహా మహారాష్ట్రలో 70,000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మూలిగే నక్కపైన తాటికాయపడ్డ చందంగా ఇప్పుడు తుపాను తాకిడికి మహారాష్ట్ర మరింత అతలాకుతలం కానుంది. ముంబై నగరంలోని థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధు దుర్గ్ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోనూ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలతో మాట్లాడి రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాననీ, ప్రజలంతా సురక్షితంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు వహించాలని ప్రధాని ట్వీట్ చేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో ఉన్న 150 మంది కోవిడ్ పేషెంట్లను మరో ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. కేరళలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన ఒక రోజు తరువాత కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. రాష్ట్ర రాజధానితో సహా ఏడు జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. ఈ ప్రాంతాల్లో 6.4 సెంటీమీటర్ల నుంచి 11.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం, 11.5 సెంటీమీటర్ల నుంచి 20.4 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. -
ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత
అహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు బెజన్ దారువాలా (89) మరణించారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుదిశ్వాస విడిచారని అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈయన భారతదేశంలోని ప్రసిద్ధ జోతిష్య శాస్త్ర కాలమిస్ట్‌లలో ఒకరు. తన దశాబ్ధాల కెరీర్లో అనేక వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. బెజన్‌కు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన చేతిని చూపించానని చెప్పడం విశేషం. అయితే తన తండ్రి కరోనా బారిన పడి మరణించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కుమారుడు నాస్టూర్ దారువాలా ఖండించారు. కాగా.. బెజన్ దారువాలా మరణానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి స్మతి ఇరానీలు సంతాపం ప్రకటిస్తూ.. 'ఆయన మరణం మమ్మల్ని కలిచివేసింది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఓం శాంతి' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే -
గుజరాతీ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని ఓ న్యూస్ పోర్టల్ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ అధిష్టానం గుజరాత్లో నాయకత్వ మార్పు చేసే అవకాశం ఉందనే వార్తకు సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఫేస్ ఆఫ్ నేషన్ అనే న్యూస్ పోర్టల్‌కు ధావల్ పటేల్ అనే వ్యక్తి ఎడిటర్‌గా ఉన్నారు. మే 7వ తేదీన ఆ న్యూస్ పోర్టల్‌లో ప్రచురితమైన ఓ ఆర్టికల్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను నియమించే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉందని పేర్కొన్నారు. కరోనాను అదుపు చేయడంలో విజయ్ రూపానీ విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. అయితే ఈ వార్తలను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఖండించారు. (చదవండి : సుప్రీంకోర్టు సెలవుల రద్దు!) ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 124(ఏ) కింద ధావల్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం ధావల్‌ను అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ‘ధావల్ తన వెబ్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో, సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేశారు. ఆ తర్వాత ధావల్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు’ అని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ బీవీ గోహిల్ తెలిపారు. అయితే ధావల్‌పై పోలీసు చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. దేశంలోని పలుచోట్ల జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేలా క్రిమినల్ చట్టాలను దుర్వినియోగపరచడం పెరుగుతోందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. (చదవండి : మొదటి రైలు: నిబంధనల ఉల్లంఘన) -
విజయ్ రూపానీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఏపీకి తరలించడంలో సహకరించినందుకు విజయ్ రూపానీకి, అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అలాగే వారు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్ చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకురావడానికి సీఎం వైఎస్ జగన్ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ సీఎంకు ఫోన్ చేయడమే కాకుండా.. పలుమార్లు వారి పరిస్థితి గురించి సమీక్ష చేపట్టారు. అలాగే మత్య్సకారుల బాగోగులు పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారిని క్షేమంగా ఏపీకి తరలించేందుకు రూ. 3 కోట్లు మంజూరు చేశారు. తాజాగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ జరిపిన చర్యలు ఫలించాయి. గుజరాత్ నుంచి 12 బస్సుల్లో ఏపీకి బయలుదేరిన మత్స్యకారులు శుక్రవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి గరికపాడు చెక్ పోస్టు వద్ద విప్ సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ ఉదయభాను మత్య్సకారులకు జగ్గయ్యపేట వద్ద కిచిడీ ప్యాకెట్లు పంపిణి చేశారు. కాగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐదు చోట్ల అల్పాహార పాకెట్లు, వాటర్ బాటిళ్లను సిద్ధం చేసినట్లు మత్య్సశాఖ పేర్కొంది. I thank @CMOGuj @vijayrupanibjp & his team for helping us bring back the stranded fishermen home. I highly appreciate & look forward to such cooperation.#COVID19 — YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2020 చదవండి : విజయవాడ చేరుకున్న మత్య్సకారులు మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు రూ. 3 కోట్లు -
లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం
అహ్మదాబాద్: లాక్డౌన్ నిబంధనలకు సడలింపు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్నిగుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తోసిపుచ్చారు. రంజాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. లాక్డౌన్ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా దుకాణాలు తెరవాలని చెప్పామే తప్పా, రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని కాదని వెల్లడించారు. కరోనాపై పోరాటాన్ని నీరుగార్చేందుకు కొన్ని శక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలతో రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ‘6.5 కోట్ల మంది గుజరాతీలను కాపాడటమే మా ముందున్న ధ్యేయం. కరోనా వైరస్ సంక్షోభం నుంచి వారిని బయటపడేలా చూడటం మా లక్ష్యం. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అన్న వివక్ష చూపడం లేదు. మొత్తం 6.5 కోట్ల గుజరాతీల కోసం పోరాడుతున్నామ’ని రూపానీ చెప్పుకొచ్చారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో ఎటువంటి దుకాణాలు తెరవడానికి అనుమతి లేదన్నారు. (కరోనా: పతంగులు ఎగరేయొద్దు) హిందూ పండుగలైన శ్రీరామనవమి, చిత్ర నవమికి లాక్డౌన్ నిబంధనలను సడలించని ప్రభుత్వం రంజాన్‌కు మాత్రం సడలింపు ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ముఖ్యమంత్రి రూపానీ స్పందించారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ నగరాల్లో మే 3 వరకు నిత్యవసర సరుకులు విక్రయించే దుకాణాలను మినహాయించి ఏ దుకాణాలను తెరవడానికి అనుమతించలేదని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం గుజరాత్లో ఇప్పటివరకు 3301 మంది కరోనా వైరస్ బారిన పడగా 151 మంది మృత్యువాత పడ్డారు. 313 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. చదవండి: కరోనా వైరస్.. మరో దుర్వార్త -
విజయ్ రూపానీకి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో ఫోన్లో మాట్లాడారు. గుజరాత్లో చిక్కుకుపోయిన ఏపీకి మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆయన గురువారం గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. అలాగే మత్స్యకారులను తరలించేందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా పొట్టకూటి కోసం వలస వెళ్లి గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని సీఎం జగన్ ఈ నెల 21న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన విజయ్ రూపానీ తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. మత్స్యకారులుని రాష్ట్రానికి రప్పిస్తాం విజయవాడ: గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి రప్పిస్తామని మత్స్యకార శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆయన గురువారం విజయవాడలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కృషితో ఇది సాధ్యమైందన్నారు. గుజరాత్లో ఉన్న 5000 మంది మత్స్యకారులను ప్రత్యేక బోటులలో రప్పిస్తున్నట్లు చెప్పారు. సముద్ర మార్గం ద్వారా ఏపీకి తరలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. -
గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకొండి
-
గుజరాత్ సీఎంకు జగన్ ఫోన్
-
గుజరాత్ సీఎంకు ఏపీ సీఎం జగన్ ఫోన్..
సాక్షి, తాడేపల్లి : గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. గుజరాత్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిపై గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ సానుకూలంగా స్పందించారు. తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కరోనా కలకలం: క్వారంటైన్లోకి సీఎం
గాంధీనగర్ : గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అధికారుల సూచనల మేరకు సీఎం రూపానీ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తెలిసింది. అహ్మదాబాద్‌లోని జమల్పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. (కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా) అయితే మంగళవారం మధ్యాహ్నం ఇమ్రాన్ గాంధీ నగర్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కలిశారు. దీంతో వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా బుధవారం నాటికి గుజరాత్లో 617 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. మృతుల సంఖ్య 26కు చేరింది. -
సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యేకు కరోనా
గాంధీనగర్: కరోనా లక్షణాలు ఉన్న ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహా, ఇతర మంత్రులను కలిశాడు. అనంతరం కొద్దిసేపటికే అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం గుజరాత్లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలా అహ్మదాబాద్‌లోని జమల్పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన గ్యాసుద్దీన్ షైఖ్, శైలేష్ పార్మర్ అనే మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గాంధీనగర్‌లోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, హోంమంత్రి ప్రదీప్ సిన్హా జడేజా, ఇతర అధికారులు పాల్గొన్నారు. (లక్షణాలు లేకున్నా పాజిటివ్) అనంతరం రాత్రి సమయంలో ఎమ్మెల్యే ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించారని అధికారులు చెప్తుండగా, మాస్కులు కూడా తీసేసి కనిపించారని పలువురు పేర్కొంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భేటీ అవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత రెండు రోజుల నుంచి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని సీఎంతో భేటీకి ఎలా అనుమతించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గుజరాత్లో ఇప్పటివరకు 617 కేసులు నమోదవగా 26 మంది మృతి చెందారు. (దూరాన్నీ.. భారాన్నీ తొక్కిపడేశాడు) -
22 కి.మీ... లక్ష మంది
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ గాంధీనగర్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాని మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ప్రకారం స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్, మోదీలు సందర్శిస్తారు. తర్వాత ఆశ్రమం నుంచి ఇందిర బ్రిడ్జి పైనుంచి ఎస్పీ రింగు రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు వద్దనున్న మొటెరా స్టేడియంకు చేరుకుంటారు. రోడ్‌షోలో భద్రతా ఏర్పాట్లూ, ట్రాఫిక్ తదితర అంశాలు సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గుజరాత్ హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా చెప్పారు. రోడ్ షోకి ఒక లక్ష మంది రోడ్‌షోలో సుమారు లక్ష మంది ప్రజలు భాగస్వాములవుతారని భావిస్తున్నారు. రోడ్‌షోలో 70 లక్షల మంది జనం పాల్గొంటున్నారని ట్రంప్ చెప్పారు. అయితే లక్ష మంది వరకు రోడ్‌షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా వెల్లడించారు. మొటెరాలో కొత్తగా నిర్మిస్తోన్న క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభను ఉద్దేశించి ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షా పదివేల మంది ప్రజలు పాల్గొననున్నారు. సర్వాంగ సుందరంగా ఆగ్రా తాజ్‌మహల్‌ని ట్రంప్, ఆయన భార్య మెలానియా దర్శించనున్న నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాలను యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తాజ్‌మహల్, పరిసర ప్రాంతాలనూ ముస్తాబు చేస్తున్నారు. తాజ్‌మహల్ పక్కనున్న యమునా తీర ప్రాంతంలోని భారీచెత్తను గత రెండు రోజులుగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఖెరియా ఎయిర్‌పోర్టు నుంచి తాజ్‌మహల్ వరకు ఎంజీ రోడ్డుపైన భిక్షాటన చేసేవారిని అక్కడి నుంచి ఖాళీచేయించారు. దారిపొడవునా గోడలకు రంగులు వేశారు. భద్రతాకారణాల రీత్యా దారిలో ఉన్న చెట్లను నరికివేశారు. 20వేల మంది విద్యార్థులు జెండాలతో స్వాగతం పలుకుతారు. రామ్‌లీలా, రాస్లీలా, పంచకుల, నౌతంకి సహా ఆగ్రా, మధుర, బృందావన్‌ల నుంచి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న మెలానియా మెలానియా దక్షిణ ఢిల్లీలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ‘హ్యాపీనెస్ కరికులమ్’ పాఠశాలను సందర్శించనున్నారు. 25న ఢిల్లీకి చేరుకోనున్న ట్రంప్, మెలానియాలకు సీఎం కేజ్రీవాల్ స్వాగతం పలుకుతారు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు గతంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘హ్యపీనెస్’ పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇందులో 40 నిముషాల పాటు మెడిటేషన్, విశ్రాంతి తదితర కార్యక్రమాలుంటాయి. రోడ్ షోకు డీఆర్డీఓ డ్రోన్ నిరోధక వ్యవస్థ ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షోలో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన డ్రోన్ నిరోధక వ్యవస్థను వాడనున్నారు. అగ్రనేతల భద్రత కోసం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్, చేతక్ కమాండో, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ల సేవలను వినియోగించుకుంటున్నారు. రోడ్ షో జరిగే ప్రాంతంలోని కీలక, వ్యూహాత్మక ప్రదేశాల్లో వీరిని మోహరిస్తామని క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ తోమర్ గురువారం తెలిపారు. డ్రోన్‌ను గుర్తించడంతో పాటు, దాన్ని నాశనం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. రోడ్ షో సందర్భంగా ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణిస్తారా? అన్న విషయంపై తమకు సమాచారం లేదని తోమర్ తెలిపారు. అలాగే, ఓపెన్ వెహికిల్‌ను వారు వాడకపోవచ్చన్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసరాలను ముస్తాబుచేస్తున్న దృశ్యం. -
సబర్మతీకి డొనాల్డ్ ట్రంప్!
ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతీ నది తీరాన్ని సందర్శించనున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నార్త్ ఢిల్లీలోని శాస్త్రి నగర్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు ఆసియాలోనే సబర్మతీ నదిని అత్యంత పరిశుభ్రమైన నదిగా మార్చారని వెల్లడించారు. ఇంతకముందు భారత పర్యటనకు వచ్చిన జపాన్, ఇజ్రాయెల్ ప్రధానులు సబర్మతీ నది తీరాన్ని సందర్శించారని గుర్తుచేశారు.(ఫిబ్రవరి 21న భారత్‌కు రానున్న ట్రంప్!) ఈసారి భారత పర్యటనకు రానున్న ట్రంప్ సబర్మతీ నదీ తీరాన్ని సందర్శించనున్నారని.. కానీ ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని విజయ్ రూపానీ తెలిపారు. కాగా ట్రంప్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. వచ్చే నెల 24-26 మధ్య ట్రంప్ భారత్‌కు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అంశాలపై పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. 2019 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రంప్ అప్పట్లో హాజరుకాలేకపోయారు. -
సీఎం ముందే స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ముసాయిదాను తయారుచేసిన ఘనత అంబేద్కర్‌ది కాదని, బ్రాహ్మణ కులానికి చెందిన బెనగళ్ నరసింహారావుదని అన్నారు. దానికి బ్రాహ్మణ సామాజిక వర్గమంతా ఎంతో గర్వపడాలని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లో జరిగిన ‘మెగా బ్రాహ్మణ బిజినెస్ సమ్మిట్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ముసాయిదా తయారు చేసిన ఘనత ముమ్మాటికి బ్రహ్మణుడైన బీఎన్ రావ్‌కే దక్కుతుందన్నారు. రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్ చైర్మన్ కావడం మూలంగా ఆయన క్రిడిట్ ఆయనకు దక్కిందన్నారు. అలాగే భారత్ తరఫున నోబెల్ బహుమతి పొందిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది బ్రాహ్మణులని అని ఆయన గుర్తుచేశారు. అలాగే ఇటీవల ఆ బహుమతి గెలుచుకున్న అబిజిత్ బెనర్జీ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారని పేరొన్నారు. కాగా స్పీకర్ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడుతున్నారు. రాజేంద్ర త్రివేది మాట్లాడుతున్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎంలు అదే వేదికపై ఉండటం గమనార్హం. -
వారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింలు జీవించేందుకు ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్ దేశాలున్నాయని, హిందువులకు మాత్రం కేవలం భారతదేశంలోనే తలదాచుకోవాల్సిన పరిస్ధితి ఉందని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వ కల్పించే చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. సబర్మతి ఆశ్రమం వద్ద పౌర చట్టానికి మద్దతుగా జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి గుజరాత్ సీఎం మాట్లాడారు. ఈ అంశంపై జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ల వైఖరులకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్లో 22 శాతంగా ఉన్న భారత జనాభా వారిపై దౌర్జన్యం, హింసాకాండ, లైంగిక దాడుల కారణంగా ప్రస్తుతం కేవలం మూడు శాతానికి పడిపోయిందని అన్నారు. అందుకే హిందువులు భారత్‌కు తిరిగిరావాలని కోరుకుంటున్నారని, వారు మాతృదేశంలో గౌరవంగా జీవించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. ముస్లింలు ప్రపంచంలో 150 దేశాల్లో ఎక్కడైనా తలదాచుకోవచ్చని హిందువులకు కేవలం భారత్ ఒక్కటే ఆశ్రయం ఇచ్చే దేశమని, హిందువులు ఇక్కడకు తిరిగి రావాలనుకుంటే సమస్య ఏమిటని ప్రశ్నించారు. -
ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు
అహ్మదాబాద్ : నూతన మోటారు వాహన సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలుచేస్తూనే.. అందులోని జరిమానాలను సగానికి సగం తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త మోటారు వాహన చట్టంలో భారీగా జరిమానాలు విధిస్తుండటంతో వాహనదారులు బండిని బయటకు తీయాలంటేనే బెదిరిపోతున్నారు. భారీగా ట్రాఫిక్ చలాన్లు విధిస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలపై తాజాగా విధిస్తున్న జరిమానాలను తగ్గిస్తున్నామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన చట్టాన్ని గుజరాత్‌లోని సొంత పార్టీ సర్కారే యథాతథంగా అమలుచేయకపోవడం గమనార్హం. సాక్షాత్తు గుజరాత్‌లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో పలు రాష్ట్రాలు కూడా ఇదే దారిలో సాగే అవకాశముందని అంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం తాజాగా సవరించిన జరిమానాలివి.. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000 జరిమానా విధిస్తుండగా.. దానిని రూ.500కి తగ్గించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ. 5వేల జరిమానాను విధిస్తుండగా.. దానిని రూ.3వేలకు తగ్గించింది. సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది. ఆర్సీ, పీయూసీ, ఇన్సూరెన్స్ తదితర పేపర్లు లేకుంటే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది. ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1,000 జరిమానాను ఏకంగా రూ.100కి తగ్గించింది వాహన కాలుష్యంపై రూ.10వేల జరిమానాను చిన్న వాహనాలకు రూ.1,000, పెద్ద వాహనాలకు రూ. 3వేలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ట్రాఫిక్ చట్టాలను చాలా తేలికగా తీసుకుంటున్నారని, చట్టం పట్ల భయంకానీ, గౌరవంకానీ లేనందుకే కఠినమైన చట్టం తీసుకొచ్చామని మోటారు వాహన చట్టం సవరణ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడం తెలిసిందే. జరిమానాలు తగ్గించడం ద్వారా గడ్కరీ అభిప్రాయంతో రూపానీ సర్కారు పరోక్షంగా విభేదించినట్టయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి : లుంగీకి గుడ్‌బై చెప్పకపోతే.. మోత మోగుడే -
'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ ఉల్లంఘనులకు విధించే జరిమానాలు అతి భారీగా ఉండడంతో తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలు మాత్రం పాత చలాన్లే విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌తో సహా ఈ జాబితాలో బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రం కూడా చేరింది. అంతేకాక అనేక ఇతర రాష్ట్రాలు సవరించిన చట్టాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. భారీ జరిమానాలు విధించడం సాధ్యం కాదని, ఈ విషయమై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపి కొత్త జరిమానాలను నిర్ణయిస్తామని గుజరాత్ ప్రభుత్వ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం పేర్కొన్నారు. అలానే మధ్యప్రదేశ్‌లో కొత్త చట్టం అమల్లోకి రాదని, జరిమానాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత చట్టం అమలు చేయబడుతుందని ఆ రాష్ట్ర న్యాయ వ్యవహారాల మంత్రి ప్రకటించిన విషయం విదితమే. ఢిల్లీలో కొత్త చట్టం అమలు చేస్తున్నప్పటికీ చలాన్ల విషయమై ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే మోటారు వాహనాల సవరణ బిల్లు 2019ను పార్లమెంటు జూలైలో ఆమోదించింది. ఈ చట్టంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఉల్లంఘనులకు కఠినమైన జరిమానాలు విధించారు. కొత్త చట్టం ప్రకారం.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానా రూ .100 నుంచి అమాంతం రూ .1,000లకు పెంచడం చర్చనీయాంశంగా మారింది. కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మొదటి రోజు కేవలం 3,900 మందికి మాత్రమే చలాన్లు విధించారు. గత కొన్ని సంవత్సరాలుగా సాధారణంగా పండుగ రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న వేళల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి సగటున కేవలం 6గంటల వ్యవధిలో సగటున 15,000 నుంచి 20,000 చలాన్లు విధించే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం జారీ చేసిన చలాన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే సవరించిన చట్టం అమలులో మొదటి రోజు ఆదివారం కావడం, కొత్త చట్టం ప్రకారం జరిమానాలు చాలా భారీగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్త పడడం ఒకటైతే, జారీ చేసిన మొత్తం చలాన్లు ఆదివారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే తీసుకున్నవి అని ట్రాఫిక్ విభాగపు అధికారులు ధృవీకరించారు. -
కానిస్టేబుల్‌కు యావత్తు దేశం సెల్యూట్
గాంధీ నగర్: విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమవుతోన్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఎయిర్ పోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అలా వెళ్లిన సిబ్బందికి వరదలో చిక్కుకోని ఓ చోట ఇద్దరు చిన్నారులు కనిపించారు. నీళ్లల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పోలీస్ కానిస్టేబుల్ పృథ్విరాజ్ సింగ్ జడేజా తన భుజాలపైకి ఎత్తుకుని.. వరదనీటిలో నడుచుకుంటూ గట్టుకు చేర్చారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించారు. ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. ఆ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్లో వీడియోను అప్లోడ్ చేసిన సీఎం.. ‘‘ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. వారి నిబద్ధతను అభినందించండి’’ అంటూ ట్వీట్ చేశారు. ఆయనపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. -
‘కాంగ్రెస్ గెలిస్తే.. పాక్‌లో దీపావళి’
గాంధీనగర్ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక గెలిస్తే.. పాక్ దీపావళి పండుగ జరుపుకుంటుందని బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరోపించారు. బాలాకోట్‌లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలంటూ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆదివారం బీజేపీ పార్టీ అధ్వర్యంలో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీ ప్రారంభోత్సవానికి హాజరైన విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లు అనే విషయం ప్రపంచానికంతటికి తెలుసు. కానీ రాహుల్ గాంధీ టీచర్ శామ్ పిట్రోడా మాత్రం ఎవరో పది మంది ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్తాన్‌ను నిందించడం సరికాదంటూ ఆ దేశం తరఫున వకల్తా పుచ్చుకుంటారు. పైగా సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఆధారాలను చూపించమంటూ డిమాండ్ చేస్తారు. దేశం కోసం ప్రాణాలర్పించే సాయుధ బలగాలను పదే పదే అవమానించడం విపక్షాలకు అలవాటుగా మారిందం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఒక వేళ మే 23న గనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. పాక్ దీపావళి చేసుకుంటుంది. ఎందుకంటేం పాక్, కాంగ్రెస్ ఎల్లప్పుడు కలిసే ఉంటాయి’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. మోదీ భాయ్ భారత్‌ను రామ రాజ్యంగా మార్చలనుకుంటున్నారన్నారు. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు, టెర్రరిస్ట్‌లు, నక్సలైట్లు, అవినీతిపరులు, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్, చంద్రబాబు లాంటి స్వార్థ ప్రతిపక్ష నేతలు మోదీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే జనాలు వారి ఆటలు సాగనివ్వరని తెలిపారు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలంటే మోదీనే మరోసారి గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
రాజీనామా చేసిన 24 గంటల్లోపు మంత్రి పదవి!
అహ్మదాబాద్: విజయ్ రుపానీ ప్రభుత్వం శుక్రవారం గుజరాత్ కేబినెట్‌ను మరోసారి విస్తరిస్తూ.. ముగ్గురు మంత్రులను కొత్తగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్ నేత ఒకరికి ఈసారి అవకాశం కల్పించింది. మనవాదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జవహర్ చవ్దా పార్టీకి, తన పదవికి రాజీనామా చేసిన 24 గంటల్లోపు ఆయనను రూపానీ ప్రభుత్వం కేబినెట్లోకి తీసుకోవడం గమనార్హం. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 2017లో బీజేపీలోకి ఫిరాయించిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధావల్ సిన్హా జడేజాకు కూడా రూపానీ సర్కారు అవకాశం కల్పించింది. మంజల్పూర్ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత యోగేశ్ పటేల్‌కు కూడా మంత్రి అవకాశం కల్పించారు. తొమ్మిదినెలల్లో రూపానీ ప్రభుత్వం చేపట్టిన రెండో కేబినెట్ విస్తరణ ఇది. 2018 జూలైలో సీనియర్ నాయకుడు కున్వర్జీ బవలియాను కేబినెట్లోకి తీసుకుంది. ఆయన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి రూపానీతో కలుపుకొని గుజరాత్ కేబినెట్ మంత్రుల సంఖ్య 24కు చేరుకుంది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన అల్ఫేష్ ఠాకూర్ కూడా బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలకు ఆయన తాజాగా తెరదించారు. మంత్రిని కావాలని భావించిన మాట నిజమే కానీ, ఆ పదవితో తన సామాజికవర్గం సమస్యలను పరిష్కరించలేనని గుర్తించడంతో ఆ ఆలోచన మానుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు. -
అవినీతిలో ‘రెవెన్యూ’ టాప్: రూపానీ
అహ్మదాబాద్: గుజరాత్లో అవినీతిలో రెవెన్యూ విభాగం తొలిస్థానంలో, పోలీస్ డిపార్ట్మెంట్ రెండో స్థానంలో ఉన్నాయని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంగీకరించారు. ప్రభుత్వ సంస్థల్లో అవినీతి జాఢ్యాన్ని అరికట్టడం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. అహ్మదాబాద్‌లో బుధవారం వేయి మంది భూ యజమానులకు ఆన్లైన్ ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో భయం వల్లో, నైతిక కారణాలతోనో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు పుచ్చుకునేందుకు సందేహించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల ఎలాంటి సంకోచం లేకుండా వారు లంచాలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. -
సీఎం కార్యక్రమంలో రైతు ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బహిరంగ సభలో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఈ సంఘటన గిర్ సోమ్‌నాథ్ జిల్లా ప్రాన్స్లీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మశ్రీ భాయ్ దోడియా అనే రైతు తన పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారని, దీన్ని తొలగించడంలో స్థానిక అధికారులు విఫలం చెందడంతో కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని గిర్ సోమ్‌నాథ్ ఎస్పీ రాహుల్ త్రిపాఠి వెల్లడించారు. ‘ఆ రైతు పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు. ఆక్రమణను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని తెలిపారు. దోడియాను వెంటనే వెరవల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
అహ్మదాబాద్.. ఇకపై కర్ణావతి!
అహ్మదాబాద్: చాలాకాలంగా కాషాయ వర్గాలు డిమాండ్ చేస్తున్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ పేరులో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గురువారం తెలిపారు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో రూపానీ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలోపే ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. ‘అహ్మదాబాద్ అన్న పేరు బానిసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కర్ణావతి పేరు మన ఆత్మాభిమానాన్ని, సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని సూచిస్తుంది’’ అని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వ్యాఖ్యానించారు. -
‘రాహుల్‌కు అవమానకరంగా లేదా’
గాంధీనగర్ : గుజరాత్లో స్థానికేతరులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. దాడులకు కారణం మీరంటే మీరేననీ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. దాడులు ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై రూపానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీనే అల్లర్లను ప్రోత్సహిస్తూ.. మరోవైపు ఖండిస్తూ ట్వీట్ చేయడానికి అతనికి అవమానకరంగా లేదా అని ఘాటుగా స్పందించారు. ‘‘దాడులను కాంగ్రెస్ పార్టీనే ప్రోత్సహిస్తోంది. వాటిని అరికట్టాలి అంటే ముందుగా వారి సొంత పార్టీ నేతలను, కార్యకర్తలను శిక్షించాలి. ఓవైపు అల్లర్లు చేస్తూ.. మరోవైపు ఏమీ తెలియనట్టు ఖండించడానికి అవమానకరంగా అనిపించడం లేదా’’ అంటూ విజయ్ రూపానీ ట్విటర్లో పేర్కొన్నారు. రూపానీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. దాడులకు ముమ్మాటికీ కారణం బీజేపీ అంటూ ఆరోపిస్తోంది. ‘‘గుజరాత్‌కు వలస వచ్చిన వారిపై అధికార బీజేపీ కక్షగట్టి దాడలకు పాల్పడుతోంది. దీనికి ముఖ్య కారణం రాష్ట్రంలో నిరుద్యోగం మరింత పెరిగిపోవడం. ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారీపోవడం. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మూతపడడం వల్ల ఉపాధి కరువై వలసదారులును గెంటివేస్తున్నారు’’ అని సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు. గుజరాత్లో 14 నెలల చిన్నారిపై బిహార్ వలస కార్మికుడి లైంగిక దాడి నేపథ్యంలో చెలరేగుతున్న నిరసనలు, హింసాకాండ వలస కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. క్షత్రియ ఠాకూర్ సేన ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో గుజరాతేతరులపై ఎలాంటి దాడులకు పాల్పడటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ స్పష్టం చేశారు. వలస కార్మికులపై గుజరాత్లో మూక దాడులకు తాము ఎన్నడూ పిలుపివ్వలేదని, గుజరాత్లో శాంతి కోసం కృషిచేస్తున్నామని క్షత్రియ ఠాకూర్ సేనకు నేతృత్వం వహిస్తున్న అల్పేష్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. బిహార్, యూపీ వాసులపై దాడులను ఖండిస్తున్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. దీనిపై గుజరాత్ సీఎంను తాను ఫోన్లో సంప్రదించానని అయన అన్నారు. చదవండి : ప్రాంతీయ చిచ్చు.. స్థానికేతరులపై దాడులు -
హింసాత్మక చర్యలకు పాల్పడకండి
అహ్మదాబాద్: హిందీ మాట్లాడే వలసదారుల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించామనీ, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన హిందీ భాషీయులు తిరిగి గుజరాత్‌కు రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞప్తి చేసింది. హిందీ మాట్లాడేవారిపై దాడులకు పాల్పడిన 431 మందిని ఇప్పటికే అరెస్టు చేశామంది. ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడొద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రజలను కోరారు. గుజరాత్లో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల అక్కడక్కడ జరిగిన దాడుల నేపథ్యంలో దాదాపు 20 వేల మంది హిందీ మాట్లాడే వలస కూలీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే గత 48 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని రూపానీ తెలిపారు. వలస కూలీల భద్రత కోసం పరిశ్రమల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా తెలిపారు. సెప్టెంబర్ 28న గుజరాత్‌లోని సాబర్కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం జరిగింది. రూపానీతో మాట్లాడిన నితీశ్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై జరుగుతున్న దాడుల విషయమై సీఎం విజయ్ రూపానీతో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మాట్లాడారు. ఈ దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడిని ఖండించారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, అయితే ఒక్కరు చేసిన తప్పునకు మొత్తం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడుల చేయడం సరికాదన్నారు. దాడుల గురించి గుజరాత్ సీఎంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి మాట్లాడారు. వారి భద్రతపై అక్కడి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చిందని యోగి చెప్పారు. -
ఆ రాష్ట్రాల్లో పెట్రోల్‌పై ఐదు రూపాయలు తగ్గింపు
వాహనదారులకు వాత పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఒక గంట క్రితమే గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూపాయిని తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అంటే మొత్తం లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో, వెంటనే రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తగ్గించాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. తమ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 తగ్గించాలని నిర్ణయించిందని గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రకటించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, తమ వ్యాట్ తగ్గింపుతో మొత్తంగా తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఐదు రూపాయల మేర తగ్గనున్నట్టు పేర్కొన్నారు. విజయ్ రూపాని మాత్రమే కాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ‘పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 ధర తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతలు. ఇది సామాన్య ప్రజానీకానికి అతిపెద్ద ఊరట. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజానీకానికి లీటరు పెట్రోల్‌కు అదనంగా మరో రూ.2.50 ఊరట ఇవ్వాలని నిర్ణయించింది. అంటే మొత్తంగా మా రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.5 తగ్గుతుంది’ అని దేవేంద్ర ఫడ్నవిస్ ట్వీట్ చేశారు. కాగా, ముంబైలోనే అత్యధికంగా పెట్రోల్ ధర రూ.91ను క్రాస్ చేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై భారీ ఊరట ఇవ్వడంతో, ముంబై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2.50 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రకటించారు. దీంతో మొత్తంగా తమ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ ఐదు రూపాయలు చౌకగా లభ్యం కానున్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఇక రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించి, వాహనదారులకు ఊరట ఇవ్వాల్సి ఉంది. -
గుజరాత్లో బంగారు ‘మోదీ’ రాఖీలు!
సూరత్: రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశంలోని దుకాణాలన్నీ రాఖీలతో కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాఖీ పండుగ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ నగల షాపు 22 కేరట్ల బంగారంతో చేసిన రాఖీలను అమ్ముతోంది. ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల ముఖ చిత్రాలను ముద్రించిన ఈ రాఖీలు ఒక్కొక్కటి రూ.30,000 నుంచి రూ.60,000 మధ్యలో లభ్యమవుతున్నాయి. ఈ విషయమై నగల షాపు యజమాని మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా మోదీ, రూపానీ, ఆదిత్యనాథ్ ముఖ చిత్రాలతో 50 బంగారు రాఖీలను తయారుచేశామని తెలిపారు. వీటిలో 47 రాఖీలు ఇప్పటికే అమ్ముడైపోయాయని వెల్లడించారు. ఇలాంటి రాఖీలు కావాలంటూ తమ షాపుకు ఇంకా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. -
రాఖీలపై మోదీ, ఆదిత్యనాథ్‌ల ఫోటోలు
గాంధీనగర్: సోదర ప్రేమకు ప్రతీక రక్షాబంధన్. ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇప్పటికే షాపింగ్ సెంటర్లు, బంగారు దుకాణాలు, స్వీట్‌హౌస్‌లకు పండుగ కల వచ్చేసింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్లు, వివిధ వెరైటీలతో వ్యాపరస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బంగారు పూత మిఠాయిలు, సిల్వర్ స్వీట్స్ వంటి వెరైటీలు మార్కెట్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూరత్‌లోని బంగారు దుకాణం యజయాని ఇలాంటి విభన్న ప్రయత్నమే చేశాడు. ప్రధాని నరేంద్రమోదీ, యూపీ యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల చిత్రాలతో కూడిన బంగారు రాఖీలను తయారు చేయించాడు. ఇప్పడు గుజరాత్లో వీటికి యమా క్రేజ్ వచ్చేసింది. తమ అభిమాన నాయకుల ఫోటోలతో కూడిన రాఖీలకోసం ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారని షాప్ యజమాని పేర్కొంటున్నారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీలాగా నా తమ్ముడు కూడా గొప్పవాడు కావాలనే ఉద్దేశంతో ఆయన చిత్రం ఉన్న రాఖీ కావాలని ఆర్డర్ చేశానని’ ఓ సోదరి వివరించింది. -
గుజరాత్ సీఎంను సాగనంపారు: హార్థిక్ పటేల్
అహ్మదాబాద్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌పై బీజేపీ దృష్టి సారించిందని, సీఎం విజయ్ రూపానీని తప్పించారని పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ పేర్కొన్నారు. గతంలో ఆనందిబెన్ పటేల్‌ను రాజీనామా చేయాలని కోరిన తరహాలోనే గురువారం కేబినెట్ బేటీలో విజయ్ రూపానీని సీఎం పదవి నుంచి వైదొలగాలని కోరారని చెప్పారు.సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారని పది రోజుల్లో గవర్నర్ దాన్ని ఆమోదిస్తారని చెప్పారు. గుజరాత్ తదుపరి సీఎంగా క్షత్రియ లేదా పటేల్ వర్గీయుడిని ఎంపిక చేస్తారని తాను భావిస్తున్నానని హార్థిక్ పటేల్ పేర్కొన్నారు. కాగా తాను రాజీనామా చేస్తున్నట్టు హార్థిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలను సీఎం విజయ్ రూపానీ తోసిపుచ్చారు. మీడియా దృష్టిని ఆకర్షించిందుకే పటేల్ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రులు రాజీనామా చేయరని, రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు సమర్పిస్తారని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు హార్థిక్ పటేల్ వంటి కాంగ్రెస్ ఏజెంట్లు ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
‘మా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవదు’
అహ్మదాబాద్: ‘వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మా రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేద’ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే గుజరాత్లో పునరావృత మవుతాయని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో (26 ఎంపీ స్థానాలు) బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పటీదార్, దళితుల నిరసనల వంటి ఇబ్బందులు ఉన్నా, ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టారని గుర్తుచేశారు. వస్తు సేవల పన్ను అమల్లోకి తేవడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ జీఎస్టీని ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’ అంటూ ఎద్దేవా చేసినప్పటికీ వ్యాపారులు బీజేపీపై నమ్మకముంచారని రూపానీ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని వర్తక, వ్యాపార వర్గం తమ పార్టీకి మద్దతు ప్రకటించిందని తెలిపారు. వారి మద్దతుతో గత అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్, వడోదర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుపొందామని వెల్లడించారు. ఆదివారం నాడు రాజ్‌కోట్‌లో దళితుడని కొట్టి చంపిన ఘటనపై రూపానీ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులను అరెస్టు చేశామని అన్నారు. మృతుని కుటుంబానికి 8 లక్షల రూపాయలు నష్ట పరిహారం అందించామని తెలిపారు. -
వీళ్లు ఆయనకు వారసులా?..ఖర్మ!
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ల వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. విచిత్రమైన వ్యాఖ్యలతో బీజేపీ ముఖ్యమంత్రులిద్దరూ వార్తల్లో నిలిచింది తెలిసిందే. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వీరి వ్యాఖ్యలపై మండిపడుతోంది. తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వీళ్ల వ్యవహారంపై స్పందించారు. ‘ఒకయాన(విజయ్ రూపానీ) గూగుల్‌ను-నారదుడ్ని పోలుస్తూ మాట్లాడతారు. ఆయన జ్ఞానం ఇంతేనేమో. ఇంకోకరేమో(విప్లవ్) మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉందంటాడు. ఆయన అక్కడితోనే ఆగలేదు. యువకులను ఉద్దేశించి ‘ఉద్యోగాలేం చేస్తారు.. పాన్ షాపులు పెట్టుకుని బతకండి’ అంటాడు. మరోసారి అందాల పోటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాడు. వాళ్లిద్దరి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. మోదీగారి వారసులు ఇలా ఉన్నారు. వీళ్లేం ముఖ్యమంత్రులు. వీళ్లా ప్రజల్ని పాలించేంది?. జనాలకు వీళ్లసలు ఏం చెప్పదల్చుకున్నారు. ఇది ఇంతటితోనే ఆగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు’ అని రేణుకా చౌదరి తెలిపారు. సోమవారం సాయంత్రం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే విప్లవ్ కుమార్ దేవ్‌కు అధిష్టానం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిందన్నది తెలిసిందే. అయితే ఆ వార్తలను విప్లవ్ తోసిపుచ్చారు. ‘మోదీ నన్ను కొడుకులా భావిస్తారు. ఆయన నాపై ఆగ్రహంగా ఉన్నారన్నది నిజం కాదు. చాలా కాలం క్రితమే ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నా. అది ఇప్పుడు కుదరటంతో వెళ్లి కలవబోతున్నా’ విప్లవ్ వివరణ ఇచ్చుకున్నారు. -
గూగుల్‌పై గుజరాత్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సెర్చిఇంజన్ దిగ్గజం గూగుల్‌ను నారదుడితో పోల్చారు. ‘ ఇవాళ గూగుల్ సమాచార వనరుగా ఉంటోంది..గూగుల్‌ను మనం నారదమునితో పోల్చవచ్చు..ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయన సమస్తం అందరికీ చేరవేసేవారు..అయితే మానవాళికి హాని తలపెట్టే సమాచారాన్ని ఎన్నడూ వ్యాప్తి చేయలేద’న్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాకులాడటం మాని పాన్‌షాపులు పెట్టుకోవాలని త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ సూచించిన క్రమంలో రూపానీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్రిపుర సీఎం అంతకుముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సివిల్ ఇంజనీర్లు మాత్రమే సివిల్స్ రాయాలని, మెకానికల్ ఇంజనీర్లు సివిల్ సర్వీసుల జోలికి వెళ్లరాదని ఆయన అన్నారు. మహాభారత సమయంలోనే ఇంటర్నెట్, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేదని కూడా విప్లవ్ దేవ్ చెప్పుకొచ్చారు. విప్లవ్ వ్యాఖ్యలపై మేథావులు, రాజకీయ ప్రత్యర్థులు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. -
‘గూగూల్లాగే ఆయనకూ అన్నీ తెలుసు..’
అహ్మదాబాద్ : గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌కుమార్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా.. సోషల్ మీడియాలో ఆయనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు పీఎంవో నుంచి సమన్లు కూడా అందినట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా విప్లవ్ తరహాలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) మీడియా వింగ్ విశ్వ సంవాద్ కేంద్ర ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న విజయ్ రూపానీ మాట్లాడుతూ.. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను నారద మహర్షితో పోల్చారు. ‘ప్రపంచంలో ఉన్న సమాచారమంతా నారద మహర్షి దగ్గర ఉండేది. అంటే గూగుల్‌ను ఆయనతో పోల్చవన్న మాట. అయితే నారదుడు తన దగ్గరున్న సమాచారాన్ని మంచి కోసమే వినియోగించేవారని’ విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. ‘నారదుడు అందరికీ మంచి చేశాడు. అందుకే ఆయనను రుషిగా అంగీకరించారు. నారదుడు మనుషుల మధ్య కలహాలు సృష్టించాడనే అపవాదు ఉంది. కానీ అది నిజం కాదు. ప్రజల సంక్షేమం కోసమే ఆయన అలా చేశారంటూ’ రూపానీ పేర్కొన్నారు. నారదుడు నిజమైన జర్నలిస్టు అని, ప్రస్తుతమున్న జర్నలిస్టులు కూడా నారద మహర్షిలాగే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటూ సూచించారు. -
‘ఆ రెండిట్లో గుజరాత్ వెనుకబడింది’
గాంధీనగర్: పారిశ్రామిక, మౌలికసదుపాయాలు, ఇంధన రంగాలతో పోల్చుకుంటే విద్య, ఆరోగ్య రంగాల్లో గుజరాత్ వెనుకపడి ఉందని నీతిఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆదివారం నాడిక్కడ భేటీ అయిన అనంతరం కుమార్ మీడియాతో మాట్లాడారు. 2018–19 నుంచి విద్య, ఆరోగ్య రంగాలను మెరుగుపర్చేందుకు కేటాయింపులు పెంచినట్లు భేటీ సందర్భంగా తనకు సీఎం చెప్పారన్నారు. ఈ రెండు రంగాల్లో పురోగతి సాధించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు. కోస్టల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి సహాయం అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో సక్రమంగా అమలు చేస్తున్నారని రాజీవ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఆ అమ్మాయిలంతా మాకు దేవదూతలే..
అహ్మదాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తమ రాష్ట్రంలో జన్మించిన ఆడ పిల్లలందరినీ కూడా 'దేవ దూత'లుగా గుర్తించి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభత్వాసుపత్రిని సందర్శించిన ఆయన.. నవజాత ఆడ శిశువులకు 5 గ్రాముల వెండి నాణేలు, బట్టలు, ‘మమతా కిట్’ ను అందించారు. పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవితం, మంచి చదువు అందించాలని శిశువుల తల్లులను కోరారు. అంతకుముందు గాంధీనగర్‌లో ‘బేటీ బచావో..బేటీ పడావో’ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రంలో స్త్రీ,పురుష నిష్పత్తిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో వెయ్యిమంది పురుషులకు 848 మందే స్త్రీలు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘బేటీ బచావో.. బేటీ పడావో’నినాదాన్ని అందరూ అందుకొని మహిళా శక్తికి ఊతమివ్వాలని ట్వీటర్ ద్వారా కోరారు. -
గుజరాత్ : కొత్త కేబినెట్లో కిరికిరి
గాంధీనగర్ : కొత్తగా ఏర్పాటయిన గుజరాత్ కేబినెట్లో శాఖల కిరికిరి మొదలైంది. మొన్నటిదాకా మంత్రివర్గంలో నంబర్-2గా కొనసాగిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు.. ఈ దఫా కీలకమైన ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కలేదు. శాఖల కోతను అవమానంగా భావిస్తోన్న నితిన్.. విధుల్లో చేరేందుకు విముఖంగా ఉన్నారు. శుక్రవారం నాటికి దాదాపు మంత్రులంతా బాధ్యతలు స్వీకరించినా.. ఆయన మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఇది తమ నాయకుడి ఆత్మగౌరవ సమస్య అని, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని నితిన్ సన్నిహిత వర్గీయులు వ్యాఖ్యానించారు. చేజారిన టాప్ పోస్ట్! : 2016 ఆగస్టులో ఆనందిబెన్ పటేల్ రాజీనామా అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో నితిన్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఒకదశలో ఆయన పేరునే ఖరారుచేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో విజయ్ రూపానీకి సీఎం పీఠం దక్కింది. కాగా, డిప్యూటీ హోదాతోపాటు ఆర్థిక, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలు దక్కడంతో నితిన్ మిన్నకుండిపోయారు. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నితిన్‌కు మరోసారి డిప్యూటీ పోస్టు లభించింది కానీ శాఖల్లో కోత పడింది. ఆర్థిక శాఖను సౌరభ్ పటేల్‌కు అప్పగించగా, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను సీఎం రూపానీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. నితిన్ పటేల్‌కు రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్ ప్రాజెక్టు శాఖలను కేటాయించారు. తాడోపేడో తేల్చుకుంటాం : శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయనప్పటికీ, ఆయన అవమానభరంతో రగిలిపోతున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. పాత శాఖలను తిరిగి కేటాయిస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని నితిన్ బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లుతెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్(ఫైల్ ఫొటో) -
రూపానీ ప్రమాణం
గాంధీనగర్: వరుసగా రెండోసారి విజయ్ రూపానీ గుజరాత్ పీఠం అధిష్టించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణం చేశారు. వీరిలో నితిన్ పటేల్ సహా 9 మంది కేబినెట్ మంత్రులు కాగా.. మిగతా 10 మంది సహాయ మంత్రులు. మంత్రివర్గంలో పటేల్, ఓబీసీ వర్గాలకు చెరో ఆరు పదవులు దక్కగా.. ముగ్గురు క్షత్రియ, ఇద్దరు ఎస్టీ, ఒకరు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ఉన్నారు. సీఎంగా రూపానీ ప్రమాణస్వీకారం అనంతరం..వరుసగా కేబినెట్, సహాయ మంత్రుల ప్రమాణస్వీకారం కొనసాగింది. బీజేపీ శాసన సభా పక్షం ఉపనేతగా ఎన్నికైన నితిన్ పటేల్ డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. భావ్‌నగర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న విభావరి బెన్ దవే ఒక్కరే మహిళా మంత్రి. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ‘2001, 2002, 2007, 2012ల నాటి ప్రమాణస్వీకారోత్సవాల్ని ఈ రోజు కార్యక్రమం గుర్తుకు తెచ్చింది’ అని అన్నారు. ‘మోదీ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే ఇక గుజరాత్లో బీజేపీ రాదని కొందరు భావించారు. బీజేపీ దాదాపు 50 శాతం ఓట్లను సాధించడం గొప్ప విషయం’ అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలనే ఆహ్వానించారని, అందుకు నిరసనగా కార్యక్రమానికి గైర్హాజరయ్యామని కాంగ్రెస్ ప్రతినిధి మనీశ్ దోషి చెప్పారు. కాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు జై రామ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. -
ఆ రోజులు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక్కసారి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ప్రధానంగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భాలను ఆయన ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. గుజరాత్లో బీజేపీ వరుసగా ఆరోదఫా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం విజయ్ రూపానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ.. ఒక్కసారిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001, 2002, 2007, 2012 సంవత్సరాల్లో చేసిన ప్రమాణ స్వీకర సందర్భాలను ఆయన ట్విటర్లో ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని మరోసారి బీజేపీకి కల్పించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు చెప్పారు. గుజరాత్-బీజేపీ బంధం చాలా ప్రత్యేకమైందిగా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధికి మైలురాయిగా నిలుపుతామని ఆయన గుజరాత్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. Attending today’s oath taking ceremony in Gujarat brought back memories of the ceremonies in 2001, 2002, 2007 and 2012 when I got the opportunity to serve Gujarat as CM. pic.twitter.com/tLQSpRIbgX — Narendra Modi (@narendramodi) 26 December 2017 -
హార్థిక్ ఎఫెక్ట్? గుజరాత్ కేబినెట్లో పటేళ్ల ముద్ర..!
సాక్షి, గాంధీ నగర్ : గుజరాత్లో పటేదార్ల ఉద్యమం.. ఎన్నికలపైనా, ప్రస్తుత మంత్రివర్గకూర్పుపైనా.. ప్రస్ఫుటంగా కనిపించింది. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటేదార్ వర్గం నుంచి అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. పటేదార్లకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ఆ వర్గాన్ని ఆకర్షించడం ద్వారా బీజేపీకి ఓటమి భయాన్ని కల్పించారు. ఇక కౌంటింగ్ సమయంలో పటేదార్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపోటములు ఊగిసలాడాయి. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గంలో పటేదార్లకు బీజేపీ భారీ ప్రాముఖ్యత కల్పించింది. విజయ్‌రూపానీ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన 20 మంది మంత్రుల్లో.. 6 మంది పటేదార్లకు పదవులు కట్టబెట్టింది బీజేపీ. తాజా మంత్రివర్గంలో మంత్రి పదవులు దక్కించుకున్న పటేదార్లలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఉన్నారు. ఆయతో సహా కౌశిక్ పటేల్, సౌరభ్ పటేల్, ప్రభాత్ పటేల్, ఈశ్వర్ పటేల్, రచ్చండ భాయ్ పటేల్ ఉన్నారు. ఇదిలా ఉండగా బ్రాహ్మణ వర్గానికి చెందిన విభావరిబెన్ దేవ్ మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుత కేబినెట్లో పదవి దక్కించుకున్న ఏకైక మహిళ కూడా విభావరిబెన్ కావడం గమనార్హం. ఇక విజయ్ రూపానీ కేబినెట్లో ఐదు మంది ఓబీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, క్షత్రియ వర్గాని తలా మూడు పదవులు దక్కాయి. మొత్తం 20 మంది మంత్రుల్లో.. 10 మంది కేబినెట్ హోదాలు దక్కగా.. మరో పదిమందికి సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ ప్రమాణం
గాంధీనగర్ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ(61) ప్రమాణ స్వీకారం రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటి ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీలు కూడా విచ్చేశారు. కాగా, మంగళవారం ఉదయం భార్య అంజలితో కలసి విజయ్‌రూపానీ అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శించారు. రూపానీ తర్వాత నితీశ్ పటేల్ మరోమారు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల వివరాలను కింది ఫొటోలో చూడొచ్చు. -
ముఖ్యమంత్రిగా రూపానీ ప్రమాణ స్వీకారం
-
సీఎంగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం
సాక్షి, గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత విజయ్ రూపానీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత విధేయుడైన విజయ్ రూపానీ రెండోసారీ గుజరాత్ సీఎంగా, డిప్యూటీ సీఎంగా నితిన్ భాయ్ పటేల్ రేపు (డిసెంబర్ 26న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ భారీ ఈవెంట్‌కు హాజరు అవుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గత శుక్రవారం గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యుల భేటీలో శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్ పటేల్‌ను ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది. మూడంకెల సీట్లు సాధించలేకపోయామని భావిస్తోన్న బీజేపీకి.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రతన్‌సిన్హ్ రాథోడ్ మద్దతు పలకడంతో సెంచరీ మార్కు దాటినట్లైంది. కాగా, మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించి అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. -
రూపానీదే గుజరాత్ పీఠం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత విధేయుడైన విజయ్ రూపానీనే రెండోసారీ గుజరాత్ సీఎం పీఠం వరించింది. శుక్రవారం గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యులతో భేటీ తర్వాత పార్టీ కేంద్ర పరిశీలకుడు అరుణ్ జైట్లీ వివరాలు వెల్లడిస్తూ.. శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్ పటేల్‌ను ఎన్నుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నిక ల్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవ సం చేసుకున్నా తక్కువ మెజార్టీతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో రూపానీని మరోసారి సీ ఎంగా కొనసాగించే అంశంపై ఊహాగానాలు కొనసాగాయి. అయితే పార్టీ అగ్ర నాయకత్వంతో రూపానీకి ఉన్న సాన్నిహిత్యం.. ఎలాంటి మచ్చలేని రాజకీయ జీవితం, తటస్థ కుల వైఖరి వంటి అంశాలు పూర్తిగా ఆయన వైపు మొగ్గు చూపేలా చేశాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఉప నేత పదవులకు రూపానీ, పటేల్ పేర్లను ఎమ్మెల్యే భూసేంద్ర సిన్హ్ చుదాసమ సూచించారని.. మరో ఐదుగురు సభ్యులు చుదాసమ ప్రతిపాదనను సమర్ధించారన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రూపానీ సంప్రదింపులు జరుపుతారని జైట్లీ చెప్పారు. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో.. 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది. ఇక మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించింది. గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థి రతన్ సిన్హ్ రాథోడ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. హిమాచల్ బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకుల భేటీ మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ కేంద్ర పరిశీలకులైన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ పాటు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ మంగళ్ పాండేలు శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత మీడియాను కలవకుండానే ఢిల్లీ బయల్దేరారు. శాసనసభా పక్ష భేటీలో ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఈ బృందం పార్టీ అధినాయకత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా సీఎం పేరుపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. కంగ్రా ఎంపీ శాంతా కుమర్, మండీ ఎంపీ రామ్ స్వరూప్, సిమ్లా ఎంపీ కశ్యప్, మరో సీనియర్ నేత సురేశ్ భరద్వాజ్‌లు... పార్టీ కేంద్ర పరిశీలకుల్ని కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో కేంద్ర మంత్రి నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్లు ముందు వరుసలో ఉన్నారు. మయన్మార్ టు భారత్ విజయ్ రూపానీ(61) మయన్మార్ రాజధాని యాంగాన్(అప్పట్లో రంగూన్)లో జన్మించారు. ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి కారణంగా 1960లో రూపానీ కుటుంబం గుజరాత్‌కు తరలివచ్చి రాజ్‌కోట్‌లో స్థిరపడింది. విద్యార్థి దశలోనే ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. కొన్నాళ్లు ఏబీవీపీలో పనిచేశాక బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. జైన వర్గానికి చెందిన రూపానీ గుజరాత్లో బీజేపీ పటిష్టానికి ఎంతో కృషి చేశారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ వజూభాయ్ వాలా కర్ణాటక గవర్నర్‌గా వెళ్లడంతో.. రాజ్‌కోట్ వెస్ట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఫిబ్రవరి 19, 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆగస్టు, 2016లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామాతో ఆయనను సీఎం పీఠం వరించింది. 2006లో గుజరాత్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రోత్సాహానికి చేసిన కృషి ప్రశంసలు అందుకుంది. -
గుజరాత్ సీఎంగా విజయ్ రూపాణీ
-
గుజరాత్ : ఎట్టకేలకు 100 మార్కు.. ‘సీఎం’పై ట్విస్ట్ లేదు
గాంధీనగర్ : పలు ఊహాగానాల నడుమ గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి పేరును బీజేపీ ఖరారుచేసింది. ఎలాంటి ట్విస్టులు, టర్నింగ్లకు తావు ఇవ్వకుండా తాజా మాజీ విజయ్ రూపానీనే తిరిగి సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది. గాంధీనగర్‌లో బీజేఎల్పీ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందే ఈ మేరకు పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. బీజేఎల్పీ నేతగా విజయ్ రూపానీని ఎన్నుకున్నట్లు గుజరాత్ వ్యవహారాల పరిశీలకుడు అరుణ్ జైట్లీ ప్రకటించారు. సెంచరీ మార్కు.. : మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను కైవసం చేసుకుని ఆరోసారి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మూడంకెల సీట్లు సాధించలేకపోయామని మధన పడుతోన్న బీజేపీకి.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రతన్‌సిన్హ్ రాథోడ్ మద్దతు పలకడంతో సెంచరీ మార్కు దాటినట్లైంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు! : ఇక రూపానీతోపాటు తాజా మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తన పదవిని నిలుపుకొన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ తరహాలో గుజరాత్‌లోనూ బీజేపీ ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. డిప్యూటీ సీఎం రేసులో ఉన్న ఆ రెండో వ్యక్తి.. మాజీ స్పీకర్, గిరిజన నాయకుడు గణపత్ వాసవ్య అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చివరికి నిత్ పటేల్ ఒక్కరినే డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. -
సీఎం రేసుపై స్మృతి క్లారిటీ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని కొనసాగిస్తారా? లేదా కొత్త ముఖాన్ని తెర మీదకు తీసుకోస్తారా? దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఆరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర జౌళి, ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల, మరో మంత్రి మాన్సుఖ్ మాందివా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తాను సీఎం రేసులో లేనని స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. తనను వివాదంలోకి లాగేందుకే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ ఆర్. వాలా పేరు కూడా వినిపిస్తోంది. 2012 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. పలుమార్లు రాజ్‌కోట్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైయ్యారు. 1997 నుంచి 2012 వరకు గుజరాత్ మంత్రిగా పలు రకాల శాఖలు నిర్వహించారు. మరోవైపు విజయ్ రూపానీతో ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్‌ను కొనసాగించేందుకే బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలు జరగనున్నందున ముఖ్యమంత్రిని మార్చడం మంచిదికాదన్న అభిప్రాయంతో కమలం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్ కేబినెట్లో 12 కొత్త ముఖాలకు చోటు దక్కనుందని సమాచారం. ఈనెల 25న కొత్త ప్రభుత్వం కొలువుతీరే అవకాశముంది. -
విజయ్ రుపానీకి జై కొడతారా? ఝలక్ ఇస్తారా??
అహ్మద్‌బాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబోటీ మెజారిటీ బీజేపీ గట్టెక్కిన సంగతి తెలిసిందే. బీజేపీ అధినేత అమిత్ షా గుజరాత్లో 'మిషన్-150' టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ, బీజేపీ సెంచరీ మార్కు దాటలేకపోయింది. 182 స్థానాలు ఉన్న గుజరాత్లో ఆ పార్టీ 99 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆసక్తిగా మారింది. సహజంగానే సీఎం పదవికి విజయ్ రుపానీ ఫెవరెట్ అని వినిపిస్తున్నా.. అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశముందని వినిపిస్తోంది. మరో పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీనే కొనసాగిస్తామని గత ఏడాది అమిత్ షా తమకు చెప్పినట్టు బీజేపీ అగ్రనేతలు అంటున్నారు. బీజేపీ తాజా ఎన్నికల్లో అనుకున్నంతగా ఫలితాలు రాబట్టలేకపోయిన నేపథ్యంలో నాయకత్వాన్ని మారిస్తే తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని, ఈ విషయంలో అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముందని కమలం నేతలు అంటున్నారు. ఒకవేళ రుపానీని కాదని సీఎం పదవికి మరొకరిని తెరపైకి తెస్తే.. రాష్ట్ర నాయకత్వంపై ఆయన నమ్మకం కోల్పోయినట్టు అవుతుందని బీజేపీ గుజరాత్ నేతలు అంటున్నారు. అంతేకాకుండా రుపానీ అమిత్ షాకు సన్నిహితుడు. క్లీన్ ఇమేజ్ ఉండి.. కులముద్రలేని నాయకుడు. కాబట్టి ఈసారి కూడా ఆయననే సీఎం పదవి వరించవచ్చునని అంటున్నారు. అయితే, అమిత్ షా వైఖరి బాగా తెలిసినవాళ్లు మాత్రం రుపానీ ఫెవరేట్ అని ఇప్పుడే అనడం సరికాదని పేర్కొంటున్నారు. అనూహ్యంగా నిర్ణయాలను తీసుకొని ప్రజలను సర్ప్రైజ్ చేయడంలో అమిత్ షాకు మంచి పేరుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత యోగిఆదిత్యనాథ్ పేరును, హరియాణాలో మనోహర్‌లాల్ ఖట్టర్ పేరును ఇలా అనూహ్యంగా తెరపైకి తెచ్చి ఆయన ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆనందిబేన్ రాజీనామా తర్వాత విజయ్ రుపానీ పేరును కూడా సర్ప్రైజ్ రూపంలోనే షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ సీఎంగా కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని, చివరినిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి.. సర్ప్రైజ్ నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రకటించినా ప్రకటించవచ్చునని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గుజరాత్ సీఎం ఎంపిక కోసం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 25లోపు గుజరాత్ సీఎంను ఖరారుచేయవచ్చునని తెలుస్తోంది. -
సీఎం అభ్యర్థిపై బెట్టింగ్ మార్కెట్ ఏమంటోందంటే?!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మొన్నటి వరకూ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారంటూ.. పందేలు కట్టిన బుకీలు తాజాగా సీఎం అభ్యర్థిపై భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. మెజారిటీ విషయంలో సర్వేలకన్నా బెట్టింగ్ మార్కెట్ అంచనాలు కచ్చితంగా ఉండడంతో.. సీఎం అభ్యర్థిపై బెట్టింగ్ పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. గుజరాత్ సీఎం అభ్యర్థి రేసులో ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, నితిన్ పటేల్ ఉన్నారు. విజయ్ రూపానీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది. విజయ్ రూపానీ మీద రూ. 1.60, నితిన్ పటేల్ మీద కూడా 1.60 బెట్టింగ్ నడుస్తోంది. ఇక అమిత్ షా మీద రూ. 3, కొత్త వ్యక్తి అవుతాడని రూ. 6 బెట్టింగ్ కాస్తున్నారు. ఆనందిబెన్ పటేల్ తరువాత అందరూ నితిన్ పటేల్ ముఖ్యమంత్రి అవుతారనుకుంటే ఎవరూ ఊహించని విధంగా విజయ్ రూపానీ సీఎం అయ్యారు. అలాగే యూపీలో కూడా ఎవరి అంచనాలకు అందకుండా యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠం ఎక్కారు. ఈ నేపథ్యంలో ఏదైనా జరగొచ్చన్న సందేహంతో అమిత్ షా మీద కూడా పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. -
ముఖ్యమంత్రి గెలుపు.. ముందంజలో డిప్యూటీ
గాంధీనగర్ : హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ పోరులో రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విజయం సాధించారు. అయితే, ఈ విజయం ఆయన్ను కలవరపాటుకు గురి చేసిందనడంలో సందేహం లేదు. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పలుమార్లు ఆధిక్యంలోకి వచ్చారు. విజయం సాధించిన రూపానీ, ఇంద్రనీల్ రాజ్యగురుల మధ్య తేడా పెద్దగా ఏమీ లేదు. మరోవైపు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌లు వెనుకంజలోకి వెళ్లి తిరిగి పుంజుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మెహసానా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. భావ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి జీతూ వాఘాణీ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు రాధన్‌పూర్ నియోజకవర్గంలో ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్, వడ్గాంలో దళిత నేత జిగ్నేష్ మెవానీలు ముందంజలో కొనసాగుతున్నారు. -
గుజరాత్లో ఏం జరుగుతోంది? సీఎం నోట అదే మాట!
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఊహించినట్టే అత్యంత వాడీవేడిగా జరగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి పాకిస్థాన్ అంశం రచ్చరచ్చ చేస్తోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీయే దాయాది అంశాన్ని ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుకున్నారు. కాంగ్రెస్-పాకిస్థాన్ కలిసి గుజరాత్ ఎన్నికల్లో కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పుడు తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం పాక్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రధాని మోదీ నోట ‘కాంగ్రెస్-పాక్’కుట్ర అన్న కొత్త మాట వెలువడగా.. రూపానీ మాత్రం గతంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. కాంగ్రెస్ గెలిస్తే.. పాకిస్థాన్‌లో పటాకులు పేలుతాయంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో షా ఉద్ఘాటించిన వ్యాఖ్యలు తెలిసిందే. నాటి బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు గుజరాత్ సీఎం రూపానీ కూడా అదే మాటను ఉపయోగించారు. భారత పాల నగరంగా పేరొందిన ఆనంద్‌లో మంగళవారం ఆయన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ‘బీజేపీ గెలిస్తే గుజరాత్లో పటాకులు పేలుతాయి. అదే కాంగ్రెస్ గెలిస్తే పాకిస్థాన్‌లో టపాసులు మోగుతాయి’ అని ఆయన అన్నారు. గుజరాత్ ప్రచారపర్వంలో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేస్తున్న పాకిస్థాన్ ప్రస్తావన రాజకీయ విశ్లేషకులను విస్మయపరుస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా వెనుకబడిపోయామన్న ఆందోళనతోనే వారు ప్రచారంలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సర్వేలు, విశ్లేషకుల మాట ఎలా ఉన్నా.. 20 ఏళ్లపాటు అధికారంలోఉన్న బీజేపీ తిరిగి ‘పవర్’ నిలబెట్టుకుంటుందా? లేక కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సాధిస్తుందా? అన్నది మరికొన్నిరోజుల్లో ఫలితాల్లో వెల్లడి కానుంది. -
గెలుపు బీజేపీదే.. కానీ!?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు... ఈ దఫా బెట్టింగ్ మార్కెట్‌ను కూడా టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకాన్ని సత్తార్ మార్కెట్ వ్యక్తం చేస్తున్నా.. మెజారిటీపై ధీమాను ప్రకటించడం చేయడం లేదు. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల మొదటి దశకు రెండు రోజులు మాత్రమే గడువుండడంతో పందెం రాయుళ్లు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల మేరకు ఈ ఎన్నికల ఫలితాలపై దాదాపు రూ. 500 నుంచి 600 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. బెట్టింగ్ మార్కెట్ అంచనాలు, వివిధ సర్వేల మేరకు.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం అంత ఆషామాషీ కాదని తెలుస్తోంది. ఒకవేళ భారతీయ జనతాపార్టీ గెలిచినా.. కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ లేనంత గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికలు మోదీ-అమిత్ షా ద్వయానికి అతి పెద్ద పరీక్షలా నిలిచాయని మరికొందరు చెబుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఈ ఎన్నికల్లో బీజేపీకి 101 నుంచి 103 సీట్లు వస్తాయని బెట్టింగ్ మార్కెట్ అంచనా. అలాగే కాంగ్రెస్ పార్టీకి 71 నుంచి 73 సీట్లు రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బుకీ రేట్ బీజేపీ 110 సీట్లు గెలుస్తుందన్న అంశంపై ఒకటిన్నర రూపాయి, 125 సీట్లకు పైగా గెలుస్తుందన్న బెట్టింగ్‌కు రూ. 3.50, అలాగే 150కి పైగా గెలుస్తుందన్న బెట్టింగ్‌కు రూ.7 బుకీ రేట్గా ఉంది. అలాగే కాంగ్రెస్ 99-100 సీట్లకు బుకీ రేట్ రూ.3, 75 సీట్లకు రూపాయి 10 పైసలు ఉంది. అలాగే ఎన్నికల తరువాత విజయ్ రూపానీ ముఖ్యమంత్రి అవుతాడన్న అంశంపై 44 పైసలు, నితిన్ పటేల్ సీఎం అనే దానిపై 55 పైసలును బుకీలు రేట్గా పెట్టారు. బుకీల రేటును బట్టి బీజేపీ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. బీజేపీ విజయం సాధిస్తే మరోమారు విజయ్ రూపానీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. -
సీఎం ప్రసంగం మధ్యలో హైడ్రామా
-
సీఎం ప్రసంగం మధ్యలో హైడ్రామా.. విమర్శలు
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఊహించని ఝలక్ తగిలింది. ఓ సభలో ఆయన ప్రసంగిస్తున్న వేళ ఓ యువతి నినాదాలు చేయటం.. పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లటం రచ్చ రేపింది. ఆమె అమర వీరజవాన్ కూతురు కావటంతో ప్రభుత్వంపై విమర్శలు మరింతగా చెలరేగుతున్నాయి. విషయం ఏంటంటే... శుక్రవారం వడోదరా జిల్లాలోని కేవదియా కాలనీలో నిర్వహించిన ప్రచార సభలో విజయ్ రూపానీ ప్రసంగిస్తున్నారు. ఇంతలో రూపల్ తాద్వి(26) అనే యువతి సీఎం ప్రసంగానికి అడ్డు తగిలింది. తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. రూపల్, బీఎస్ఎఫ్ జవాన్ అశోక్ తాద్వి కూతురు. అశోక్ విధినిర్వహణలో ప్రాణాలు వదిలారు. దీంతో ప్రభుత్వం ఆ కుటుంబానికి భూమిని ఇస్తామని ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఆ హామీ నెరవేరకపోవటంతో ఆ కుటుంబం కష్టాలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆయన సభ విషయం తెలుసుకున్న రూపల్ అక్కడి గుంపులో కూర్చుంది. ప్రసంగం కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా సీఎం వేదిక వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న మహిళ కానిస్టేబుళ్లు ఆమెను లాక్కెళ్లారు. ‘నేను ఆయన్ని కలవాలి. నన్ను వదలండి’ అంటూ ఆమె అరుస్తున్నా.. పోలీసులు వదలకుండా ఈడ్చుకెళ్లారు. ఈ సమయంలో రూపానీ అదేం పట్టించుకోకుండా రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. రాహుల్ విమర్శలు... పరమ దేశభక్తుడిగా చెప్పుకునే విజయ రూపానీ ఒక జవాన్ కూతురిని ఈ విధంగా అవమానించటం దారుణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆ వీడియోను పోస్ట్ చేసిన రాహుల్ బీజేపీ అరాచకాలు తారాస్థాయికి చేరాయంటూ సందేశం ఉంచారు. ఆమెను ఈడ్చుకెళ్తున్న సమయంలో సీఎం ప్రసంగం కొనసాగించటం సిగ్గుచేటని రాహుల్ పేర్కొన్నారు. भाजपा का घमंड अपने चरम पर है। ‘परम देशभक्त’ रुपाणीजी ने शहीद की बेटी को सभा से बाहर फिंकवा कर मानवता को शर्मसार किया। 15 साल से परिवार को मदद नहीं मिली, खोखले वादे और दुत्कार मिली। इंसाफ़ माँग रही इस बेटी को आज अपमान भी मिला। शर्म कीजिए,न्याय दीजिए। pic.twitter.com/w8k7TYQrDt — Office of RG (@OfficeOfRG) December 1, 2017 రూపాని వివరణ... ఇక తనపై వస్తున్న విమర్శలకు విజయ్ రూపానీ ట్విట్టర్ ద్వారానే స్పందించారు. సరిహద్దులో పహారా కాసే సైనికుల విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తుందని రూపానీ పేర్కొన్నారు. వన్‌ర్యాంక్-వన్ పెన్షన్, ఆదర్శ్ సోసైటీ స్కాంల ప్రస్తావన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేశారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత ఆయన రూపల్ను కలిసినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది. देश की रक्षा करने वाले सैनिकों का सम्मान सिर्फ भाजपा सरकार ने किया है । शहीदों की विधवाओं के लिए बनाई गई आदर्श सोसायटी घोटाले के मामले में कांग्रेस जवाब देती तो अच्छा होता । — Vijay Rupani (@vijayrupanibjp) December 1, 2017 -
2 కోట్లు ఇస్తే సీఎం సెక్సు సీడీ చేయిస్తా.!
అహ్మదాబాద్: రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ అన్నారు. జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంత సేపు తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని, గుజరాత్ అభివృద్ధిపై మాట్లాడాలని హితవు పలికారు. ఒక వేళ ఆ వీడియోలో నేనుంటే నా వ్యక్తిగత జీవితం గురించే అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మార్ఫింగ్ వీడియోలతో చిల్లర రాజకీయాలు చేస్తూ బీజేపీ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో వ్యక్తిగత జీవితానికి, ఏకాంతానికి భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ఓ హోటల్లో అమ్మాయితో హర్దిక్ పటేల్ గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. గతంలో పటీదార్ ఆందోళన సమితి కన్వీనర్ కూడా ‘గుజరాత్ ప్రజలు అభివృద్ధి సీడీల కోసం ఎదురు చూస్తున్నారని, 22 ఏళ్ల హర్దిక్ సీడీల కోసం కాదని ట్వీట్ చేశారు. -
మోదీ ప్రజాదరణ చూసి భయం: రూపానీ
అహ్మదాబాద్: ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) నేత హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ, గిరిజన నేత ఛోటూ వాసవ వంటి కుల నేతల్ని ఆశ్రయిస్తోందని విమర్శించారు. వీరందరికీ వారివారి సామాజిక వర్గాల్లో ఎలాంటి మద్దతు లేదని ఆదివారం నాడిక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అబద్ధాల కోరుగా, హార్దిక్ పటేల్‌ను ‘మీడియా తయారుచేసిన నేత’గా అభివర్ణించారు. -
మోదీ మనసులో వారికి చోటు లేదు: రాహుల్
సనంద్: ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల మనసుల్లో దళితులు, రైతులు, పేదలకు ఎంతమాత్రం చోటు లేదనీ, వారి మనసు కొద్ది మంది పారిశ్రామికవేత్తల పైనేననీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. హెలికాప్టర్లో చోటులేకపోవడంతో ఆగస్టు నెలలో దళితులు అందజేసిన జాతీయజెండాను గాంధీనగర్‌లో రూపానీ స్వీకరించకపోవడంపై రాహుల్ మండిపడ్డారు. అహ్మదాబాద్‌లోని సనంద్‌లో దళిత్ శక్తి కేంద్రంలో దళితులు అందజేసిన జాతీయ జెండాను ఆయన స్వీకరించారు. ఆ జెండాను ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెమొరియల్ మ్యూజియంలో భద్రపరుస్తామన్నారు. ఉనాలో దళితులపై దాడి, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యలపై మోదీ, రూపానీ ఉదాసీనంగా వ్యవహరించారని రాహుల్ విమర్శించారు. -
సెబీ జరిమానా’పై మోదీ నోరు మెదపాలి
పాలన్పూర్: సెబీ జరిమానా నేపథ్యంలో, ‘నిజాయితీ లేని’ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై ప్రధాని మోదీ నోరు మెదపాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బానస్కాంత జిల్లాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రూపానీ, మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా గుజరాత్లో అవినీతి తీవ్రస్థాయికి చేరింది. లంచం కోసం ప్రతీ రెండు నిమిషాలకో పోలీసు వస్తున్నారని సూరత్‌లోని వ్యాపారి ఒకరు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది నెలల్లోనే అమిత్ షా తనయుడు జయ్ షా తన కంపెనీ టర్నోవర్‌ను రూ.50 వేల నుంచి రూ.80 కోట్లకు పెంచారు. ఇది అవినీతి జరగకుండా సాధ్యమా? అనేది మీకందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితం మీ ముఖ్యమంత్రి నిజాయితీ లేని వాడంటూ సెబీ తేల్చింది’ అని రాహుల్ అన్నారు. ‘‘నేను అవినీతికి పాల్పడను.. ఎవరినీ పాల్పడనివ్వను.. అని మోదీ నిరంతరం చెబుతుంటారు. అయితే ప్రస్తుతం సెబీ జరిమానాపై నేను మాట్లాడను.. మావాళ్లు నోరు మెదపరు.. అన్నది కొత్త నినాదంలా మారింది. ఈ దేశానికి ‘చౌకీదార్ (వాచ్మెన్).. ‘భాగీదార్ (భాగస్వామి)’లా ఉంటానన్నారు... మరి జయ్, రూపానీ విషయంలో నోరు మెదపరేం’’ అని రాహుల్ ప్రశ్నించారు. -
ఆ ఎంపీకి ఉగ్రవాదులతో సంబంధాలు
సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్ : ఈమధ్య అరెస్టయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదితో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు సంబంధాలున్నాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆరోపించారు. అహ్మద్ పటేల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యలను అహ్మద్ పటేల్, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమని అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. రెండురోజుల కిందట గుజరాత్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీస్) అధికారులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఖాసిం స్టింబర్‌వాలా అన వ్యక్తి అహ్మద్ పటేల్‌కు ట్రస్టీగా వ్యవహరిస్తున్న సర్దార్ పటేల్ ఆసుపత్రిలో టెక్నీషిన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్‌లు ప్రజలకు వివరణ ఇవ్వాలని విజయ్ రూపానీ గాంధీనగర్‌లో డిమాండ్ చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేయో ఒక్కసారి ఊహించుకోవాలని ఆయన తెలిపారు. ఖాసిం స్టింబర్వాలాను అరెస్ట్ చేయడానికి కేవలం రెండు రోజుల ముందే ఆసుపత్రిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని విజయ్ రూపానీ చెప్పారు. ఈ విషయమే అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. విజయ్ రూపానీ వ్యాఖ్యలపై ఎంపీ అహ్మద్ పటేల్ ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులకు అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ సిబ్బందికి అభినందనలు అని అహ్మద్ పటేల్ చెప్పారు. అంతేకాక వారిపై దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి శిక్షించాలని కోరారు. తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. అంతేకాక ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం.. దీనిపై రాజకీయాలు వద్దని ఆయన ట్వీట్ చేశారు. -
‘కోటి’ కలకలంపై స్పందించిన సీఎం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్లో ‘కోటి’ కలకలం రేగింది. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు అధికార బీజేపీ చేసిన ప్రయత్నం బట్టబయలు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. బీజేపీ ఇచ్చిన డబ్బుతో పీఏఏఎస్ కన్వీనర్ నరేంద్ర పటేల్ సోమవారం మీడియాకు రావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పందించారు. పటీదార్ల మద్దతు బీజేపీకే ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. తమపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, సీఎం విజయ్ రూపానీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. రూ. కోటి లంచం ఆరోపణలు, తాజా పరిణామాలపై చర్చించారు. తమ పార్టీలో చేరేందుకు బీజేపీ తనకు కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైందని నరేంద్ర పటేల్ తెలిపారు. ఇటీవల బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ సన్నిహితుడు వరుణ్ పటేల్ ద్వారా తనతో బేరం కుదుర్చుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. అడ్వాన్స్‌గా తనకు రూ. 10 లక్షలు ఇచ్చారని, మిగతా రూ. 90 లక్షలు రేపు ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. వరుణ్ పటేల్ ఇచ్చిన రూ. 10 లక్షల నగదును మీడియాకు చూపించారు. నరేంద్ర పటేల్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఇదంతా కాంగ్రెస్ కుట్రగా వర్ణించింది. తమ పార్టీలో చేరేందుకు ఆయనే ముందుకు వచ్చారని, రెండుమూడు గంటల తర్వాత ఈ డ్రామాకు తెరతీశారని బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా అన్నారు. మొత్తం కోటి రూపాయలు తీసుకున్న తర్వాత మీడియాకు ముందుకు రావచ్చు కదా, ముందే ఎందుకు వచ్చారని వరుణ్ పటేల్ ప్రశ్నించారు. పటేల్ కులస్తులంతా బీజేపీ వైపు మొగ్గుచూపుతుండటంతో భయపడిపోయి కాంగ్రెస్ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని ఎదురుదాడి చేశారు. -
అది మా పని కాదు
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ పనితీరులో బీజేపీ జోక్యం చేసుకోదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అన్నారు. రాష్ర్టంలో ఎన్నికల తేదీలను ప్రకటించే వ్యవహారం పూర్తిగా ఈసీ పరిథిలోనిదేనని స్పష్టం చేశారు. ఎన్నికల తేదీల ప్రకటనల్లో తాము జోక్యం చేసుకోమని, ఇది పూర్తిగా ఈసీ విచక్షణాధికారమని ఆయన పేర్కొన్నారు. గుజరాత్లో సకాలంలోనే ఎన్నికలు జరుగుతాయని, తాము ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం తప్పా అని విపక్షాల విమర్శలను ప్రస్తావిస్తూ రూపానీ వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల తేదీలను పట్టించుకోవడం లేదని, ప్రజల డిమాండ్లను నెరవేర్చడంలో నిమగ్నమయ్యామని తెలిపారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంలో గుజరాత్ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించకపోవడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుజరాత్లో ఓటర్లకు ప్రధాని తాయిలాలు, వరాలు కురిపించేందుకే ఎన్నికల షెడ్యూల్ వెల్లడించకుండా ఈసీ జాప్యం చేసిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో మోదీ సర్కార్ మితిమీరిన జోక్యానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
ప్రధాని మోదీకి అసలు పరీక్ష!
డిసెంబర్లో జరిగే గుజరాత్ 14వ శాసనసభ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలకు ‘సెమీఫైనల్’గా పరిగణిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాతీ కావడంతోపాటు 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టేవరకూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నెండేళ్లకుపైగా పనిచేయడంతో అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1995 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ (1996 అక్టోబర్ 1998 మార్చి మధ్య బీజేపీ రెబల్ శంకర్‌సింహ్ వాఘేలా, ఆయన వర్గానికే చెందిన దిలీప్ పారిఖ్ సర్కార్లలో భాగస్వామ్యం మినహా) మళ్లీ పాతికేళ్ల తర్వాత ఆరోసారి అధికారం కోసం పోటీపడుతోంది. మోదీ తర్వాత సీఎం పదవిని మొదట ఆనందీబెన్ పటేల్, తర్వాత ప్రస్తుత సీఎం విజయ్ రూపాణీ చేపట్టాక రాష్ట్రంలో బలమైన ముఖ్యమంత్రి లేరనే భావన జనంలో ఉంది. రాష్ట్రంలో ఆధిపత్యవర్గమైన పాటీదార్లు(పటేళ్లు) రిజర్వేషన్ డిమాండ్‌తో బీజేపీకి దూరమయ్యారు. పాటీదార్ యువనేత హార్దిక్ పటేల్ బాహాటంగా కాంగ్రెస్ మద్దతిస్తుండగా, రాష్ట్ర జనాభాలో పదిపన్నెండు శాతమున్న పటేళ్లు బీజేపీని ఏ మేరకు అధికారంలోకి రాకుండా అడ్డుకుంటారనే విషయం ప్రశ్నార్ధకమే. గుజరాత్లో ఇటీవల దళితులపై జరిగిన దాడుల ఫలితంగా వారు కూడా జిగ్నేష్ మేవానీ అనే యువ నేత నేతృత్వంలో ఉద్యమించడం కూడా బీజేపీకి ఎన్నికల్లో ఎంత వరకు హాని చేస్తుందో చూడాలి. పన్నెండేళ్ల క్రితం ముగిసిన కాంగ్రెస్ ‘ఖామ్’ ఫార్ములా! 1980, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో బీసీ జాబితాలో ఉన్న పెద్ద సామాజికవర్గం క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లింల(ఈ నాలుగు వర్గాలను కలిపి ఖామ్ అని పిలుస్తారు) మద్దతుతో కాంగ్రెస్ విజయం సాధించి వరుసగా పదేళ్లు పాలించింది. ఆ కాలంలోనే రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు ఉవ్వెత్తున లేచి చివరికి మతఘర్షణలతో ముగిశాయి. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ కాంగ్రెస్ సీఎం చిమన్‌భాయ్‌పటేల్ నాయకత్వాన జనతాదళ్-బీజేపీ సంకీర్ణం ఏడు నెలలకే ముగిసింది. చిమన్‌భాయ్ పార్టీని చీల్చి జేడీ(గుజరాత్) పేరుతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి సంకీర్ణసర్కారు నడిపించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌తో విలీనం చేశారు. 1994 ఫిబ్రవరిలో చిమన్‌భాయ్ మరణించాక ఆయన వారసునిగా కాంగ్రెస్ సీఎంగా చబీల్దాస్ మెహతా ఏడాదిపాటు కొనసాగారు. మళ్లీ ఆరెసెస్ మూలాలున్న బీజేపీ క్షత్రియ నేత, గుజరాత్లో కాషాయపక్షం విస్తరణకు విశేషకృషిచేసిన శంకర్‌సింహ్ వాఘేలాను ఏడాదిపాటు సీఎం పదవిలో కొనసాగడానికి కాంగ్రెస్ సహకరించింది. వాఘేలాతో విభేదాలు వచ్చాక ఆయన స్థానంలో ఆయన పార్టీ గుజరాత్ జనతాపార్టీకి చెందిన దిలీప్ పారిఖ్‌ను గద్దెనెక్కించిన కాంగ్రెస్ నాలుగు నెలలకే ఆయన సర్కారును కూలదోసింది. ఈ తరహా రాజకీయాల వల్ల కాంగ్రెస్ ప్రయోజనం పొందకపోగా బాగా నష్టపోయింది. చివరికి తాను తీవ్రంగా వ్యతిరేకించే కాషాయమూలాలు బలంగా ఉన్న వాఘేలా వంటి నేతలను చేర్చుకుని కాంగ్రెస్ పరువుపోగొట్టుకుంది. సెక్యులర్పార్టీగా ఇమేజ్ కోల్పోయింది. మోదీ నాయకత్వం, 2002 మత ఘర్షణలతో బలోపేతమైన బీజేపీ! బీజేపీ సీఎంగా రెండుసార్లు(1995, 2001) విఫలమైన బీజేపీ నేత కేశూభాయ్ పటేల్ 2001 అక్టోబర్‌లో రాజీనామా చేశాక అప్పటి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకూ ఎన్నికల్లో పోటీచేయని మోదీ తన శక్తియుక్తులతో రాష్ట్ర రాజకీయ చిత్రం శాశ్వతంగా మార్చేశారు. మోదీ గద్దెనెక్కిన ఐదు నెలలకే 2001 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా అల్లర్లు ఆయన ప్రతిష్టకు మాయనిమచ్చగా మారాయి. అయితే పది నెలలకే డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182కిగాను బీజేపీకి 127 సీట్లు(49.85 శాతం ఓట్లతో) సాధించడంతో మోదీ సుదీర్ఘ పాలనకు గట్టి పునాదిపడింది. 2012 డిసెంబర్ ఎన్నికల్లో వరుసగా మూడో విజయం ఆయనను బీజేపీ ప్రధాని అభ్యర్థిని చేసింది. గుజరాత్ అభివృద్ధి నమూనా పేరుతో దేశప్రధాని పదవిని చేపట్టి మూడున్నరేళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న మోదీకి వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ముందు జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవలి గుజరాత్ పర్యటనల్లో జనం కనిపిస్తున్నా గెలుపుపై ఆ పార్టీకి నమ్మకం కనిపించడం లేదు. అదీగాక 20 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగి ఇటీవల రాజీనామా చేసిన వాఘేలా కనీసం నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బదీస్తారని భావిస్తున్నారు. పీవీ నరసింహారావు ప్రధాని పదవిలో ఉండగా 1994 డిసెంబర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైంది. ఇప్పుడు మోదీకి సొంత రాష్ట్రంలో అంతటి ప్రమాదమైతే కనిపించడం లేదు. గుజరాత్ 57 ఏళ్ల చరిత్రలో 1975, 1990 ఎన్నికల్లో మాత్రమే ఏ పార్టీకి మెజారిటీరాని త్రిశంకు సభ ఏర్పడింది. 2001 అక్టోబర్ నుంచి కొనసాతున్న రాజకీయ సుస్థిరతను మోదీ నాయకత్వంలేని గుజరాత్ బీజేపీ వచ్చే ఎన్నికలో్ల విజయం ద్వారా కొనసాగిస్తుందా లేదా అనేది మూడు నెలల్లో తేలిపోతుంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యూపీలో 325.. గుజరాత్లో 150
అహ్మదాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్న ఊహాగానాలకు ఊతమిస్తూ గుజరాత్‌లోని పలు నగరాల్లో వెలసిన పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. పోస్టర్లలోని ‘యూపీలో 325, గుజరాత్లో 150’ నినాదం హాట్ టాపిక్‌గా మారింది. యూపీ ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాలు దక్కించుకుని భారీ విజయం సాధించిందని, గుజరాత్లో 150 స్థానాలు సాధించడమే లక్ష్యంగా పేర్కొంటూ ఈ పోస్టర్లు వెలిశాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోల్ని కూడా ముద్రించారు. నిజానికి ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిఉండగా.. యూపీ గెలుపు ఊపులో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. దీనిపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ.. దేశమంతా మోదీ గాలి వీస్తోందని, ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని, 150 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పారు. -
గుజరాత్ బీజేపీ చీఫ్‌గా జితు
అహ్మదాబాద్ : గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా బావ్ నగర్ ఎమ్మెల్యే జితు వఘనీ ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం జితు వఘానీని రాష్ట్ర అధ్యక్షుడిగా నియకం చేశారు. కాగా వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పట్టు కోసం కమలదళం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆనందీబెన్‌ను తప్పించి విజయ్ రూపానీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. -
గుజరాత్ సీఎంగా రూపానీ ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి మహాత్మా మందిర్‌లో గవర్నర్ ఓపీ కోహ్లి మధ్యాహ్నం ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా డిప్యూటీ సీఎం పదవి ఏర్పాటు చేశారు. నితిన్‌తో సహా 8 మంది కేబినెట్ మంత్రులు, 16 మంది సహాయ మంత్రులు వెరసి 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. పాత మంత్రివర్గంలో నుంచి ఆనందీబెన్ పటేల్ వర్గానికి చెందిన ఇద్దరు, మరో ఏడుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. ఆనందీబెన్ వర్గీయులైన హోం సహాయ మంత్రి రజనీభాయ్ పటేల్, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి వసుబెన్ త్రివేదిలను కొత్త కేబినెట్లోకి తీసుకోలేదు. ఆర్థిక మంత్రి సౌరభ్, సాంఘిక న్యాయ మంత్రి వోరా, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రి గోవింద్ పటేల్‌లకు ఉద్వాసన పలికారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మంత్రివర్గంలో అన్ని కులాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించారు. పటేల్ వర్గానికి చెందిన 8 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కేబినెట్లోకి ఒకే ఒక మహిళ (నరోడ ఎమ్మెల్యే నిర్మల వాధ్వానీ)ను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత అద్వానీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, హర్షవర్ధన్, మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, రఘుబర్ దాస్, మనోహర్ లాల్ ఖట్టర్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ అభినందనలు గుజరాత్ కొత్త సీఎం బాధ్యతలు చేపట్టిన రూపానీకి ప్రధానిమోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ పర్యటన వల్ల రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేక పోయిన మోదీ.. రూపానీ, నితిన్ బృందం రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన ఆనందీబెన్ పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమని మరో ట్వీట్లో కొనియాడారు. -
నేడు సీఎంగా రూపానీ ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విజయ్ రూపానీ శనివారం గవర్నర్ ఓపీ కోహ్లిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా రూపానీ వెంట డిప్యూటీ సీఎంగా ఎన్నిక కానున్న నితిన్ పటేల్, ఇతర నేతలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ రాష్ర్ట ఇన్చార్జి దినేశ్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ రూపానీ ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు. -
అమిత్ షాది విజయమా, అపజయమా?
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా తన విధేయుడైన విజయ్ రుపానిని ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విజయం సాధించారు. కానీ ఆయనకు ఇది నిజంగా విజయమేనా? అపజయం నుంచి వచ్చిన విజయం కాదా? గత కొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ తాజా పరిణామం ఆయన విజయం కాదని, ప్రత్యామ్నాయాన్ని సూచించడంలో మాత్రమే ఆయన విజయం సాధించినట్లు అర్థమవుతోంది. గత ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను అమిత్ షా తప్పించాలనుకోవడం కొత్త విషయం కాదు. కానీ ఆమెను ఇప్పుడే తప్పించాలని భావించలేదు. ఆమెకు 75 (నవంబర్ 21వ తేదీన ఆమె పుట్టిన రోజు) ఏళ్లు నిండిన తర్వాత, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆమెను ముఖ్యమంత్రి పదవిని తప్పించాలని అమిత్‌షా భావించారు. అప్పటికి రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత ఆమెను తప్పించి ఎన్నికలకు సారథ్యం వహించడంలో భాగంగా తానే గుజరాత్ సీఎం బాధ్యతలు స్వీకరించాలని ఆయన భావించారు. అందుకనే ఆయన తదుపరి పార్టీ అధ్యక్షుడికి వదిలేయాలనే ఉద్దేశంతో పార్టీ కేంద్ర కమిటీలను పునరుద్ధరించలేదు. ఈ విషయం ఇటు బీజేపీలో, అటు సంఘ్ పరివార్‌లో ముఖ్య నాయకులందరికి తెల్సిందే. అమిత్ షా అంచనాలను ఆనందిబెన్ పటేల్ తన రాజీనామా నిర్ణయం ద్వారా తలకిందులు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆమె సీఎం పదవి నుంచి తప్పుకుంటారని పార్టీ పెద్దలు భావించారు. కానీ పటేల్ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సోషల్ మీడియా ద్వారా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి అమిత్ షా పేర్లు చక్కర్లు కొట్టింది. అందుకు కారణం అంతుకుముందు పటేల్ స్థానంలో అమిత్ షానే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నాయకులు భావించడమే. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ తప్పిదనం అవుతుందని ఆయన భావించారు. అందుకని కొన్ని రోజులపాటు పార్టీ పెద్దలతో తర్జనభర్జనలు పడి చివరకు తన విధేయుడైన విజయ్ రుపానీని ఎంపిక చేశారు. ఆయన కూడా అమిత్ షాలాగా జైనుడే. బీసీలు, పటేళ్ల ఆందోళనతో రగిలిపోతున్న గుజరాత్లో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపిస్తారా, అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నే. -
గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ
• మరో సంఘ్ నేతకు పట్టంగట్టిన బీజేపీ అధిష్టానం • ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు • 2017 ఎన్నికలకు ముందు కమలదళం కీలక నిర్ణయం అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రిగా.. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ రూపానీ ఎంపికయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి గడ్కారీల సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆనందీబెన్ వారసుడిగా.. రూపానీని ఎన్నుకున్నారు. చివరి నిమిషందాకా సీనియర్ నేత నితిన్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అటు అమిత్ కూడా పార్టీ ముఖ్యనేతలతో తీవ్ర చర్చలు జరిపారు. రూపానీని ప్రకటించేంతవరకు రెండు పేర్లపై (నితిన్, రూపానీ) తర్జనభర్జనలు జరిగాయి. అయితే భేటీ ప్రారంభమైన వెంటనే.. రూపానీ పేరును గడ్కారీ ప్రతిపాదించారు. దీనికి ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. నితిన్‌ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటించిన తర్వాత సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేశాక శుక్రవారం రూపానీ పేరును ప్రకటించింది. వచ్చే ఏడాది(2017 చివర్లో) జరిగే ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు సమర్థుడు, వివాదరహితుడు ఉండాలనే రూపానీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2 దశాబ్దాలకు పైగా గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీకి పటేళ్ల కోటా, ఉనా దళితులపై దాడి వంటివి తలనొప్పిగా మారాయి. దీనికి తోడు 2015 చివర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవటం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటిస్తూ.. కంటిలో నలుసులా మారటం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. సమర్థతకు పట్టం బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ రూపానీ మయన్మార్‌లోని రంగూన్లో ఆగస్టు 2, 1956న జైన వైశ్య(గుజరాత్లో మైనారిటీలు) కుటుంబంలో జన్మించారు. తర్వాత వీరి కుటుంబం సౌరాష్ట్రకు వలస వచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పటినుంచే ఆరెస్సెస్, ఏబీవీపీల్లో చురుకుగా ఉన్న రూపానీ.. సౌరాష్ట్ర వర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టాపొందారు. 1971లో జన్‌సంఘ్‌లో.. ఆ తర్వాత బీజేపీలో ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. రాజ్‌కోట్‌లో కార్పొరేటర్‌గా, మేయర్‌గా కూడా పనిచేశారు. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా స్నేహపూర్వకంగా పరిష్కరిస్తాడని కార్యకర్తలు చెప్పుకునే విజయ్ రూపానీకి ప్రధాని మోదీ, అమిత్‌షాతో చాలా సాన్నిహిత్యం ఉంది. గుజరాత్ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఈయన చేపట్టిన ‘ఖుష్బూ గుజరాత్కీ’ ప్రచారం దేశాన్ని ఆకర్షించింది. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉండి.. జలవనరులు, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థ వంటి కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2014లో రాజ్‌కోట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వాజూభాయ్ వాలా రాజీనామా చేసి కర్ణాటక గవర్నర్‌గా వెళ్లడంతో ఖాళీ అయిన స్థానంలో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈయన సమర్థత, చతురత కారణంగా ఆనందీబెన్ పటేల్ కేబినెట్లో కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. బలమైన సామాజిక వర్గం నేపథ్యం లేకపోయినా పటేళ్ల ఉద్యమం తీవ్రంగా ఉన్న సౌరాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహించటం కలిసొచ్చింది. దీనికి తోడు ఆరెస్సెస్‌తో సుదీర్ఘ అనుబంధం, సమస్యల వలయంలో ఉన్న పార్టీని 2017 ఎన్నికల్లో నడిపే సమర్థత ఉందని పార్టీ అధిష్టానం భావించటం రూపానీని సీఎం పీఠం ఎక్కించాయి. -
దేశానికే రోల్ మోడల్ గా చేస్తాను..!
అహ్మదాబాద్ః గుజరాత్ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేస్తానని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ రూపానీ పేర్కొన్నారు. తనకు గొప్ప బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పిన ఆయన.... పటేల్ తనకీ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందీ బెన్ పటేల్ రాజీనామాతో.. గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్నిదక్కించుకున్నవిజయ్ రూపానీ పటేల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పని చేసిన ఆయన.. తనకప్పగించిన బాధ్యతలను సద్వినియోగం చేసుకొని, గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ముందుంటానన్నారు. అంతేకాక దేశంలోని రాష్ట్రాలన్నింటిలో ప్రత్యేకంగా తీర్చి దిద్దుతానని, దేశానికే రోల్ మోడల్ గా మారుస్తానని అన్నారు. భారతీయ జనతాపార్టీ నిర్ణయంమేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. మీడియా ముందు రూపానీని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రతి ఒక్కరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం పదిమంది బిజేపీ మంత్రులు రూపానీని ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్ ను చేసేందుకు మద్దతు పలికినట్లు గడ్కరీ తెలిపారు. అంతకు ముందు ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంటారని ఊహాగానాలు వచ్చినా.. పార్టీ నిర్ణయం మేరకు ఆయనను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. -
నితిన్కాదు.. విజయ్ ముఖ్యమంత్రి
-
గుజరాత్ కొత్త సీఎం ఎవరు?
న్యూఢిల్లీ: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటన చేయడంతో ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ మొదలైంది. రెండుమూడు రోజుల్లో నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశముంది. గుజరాత్ కొత్త సీఎంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. నారన్‌పురా అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ షా... గతంలో గుజరాత్ హోంమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి వదులుకోవడాన్ని ప్రధాని మోదీ అంగీకరిస్తారా, లేదా అనేది చూడాలి. అమిత్ షా తర్వాత పురుషోత్తం రూపాల(62), నితిన్ పటేల్(60), విజయ్ రూపాని(60), భికుభాయ్ దాల్సానియా(52), శంకర్ చౌదరి(46) పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. అమిత్ షాను గుజరాత్ సీఎంగా పంపకపోతే వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న పురుషోత్తం రేసులో ముందున్నారు. సౌరాష్ట్రలోని కడవా పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఆయన గుజరాత్ బీజేపీలో మోదీ తర్వాత మంచి వక్తగా పేరు గాంచారు. అమిత్ షా కంటే సీనియర్ అయిన ఆయన కొన్నేళ్లుగా ప్రాధాన్యం కోల్పోయారు. గుజరాత్ ప్రభుత్వంలో అధికారికంగా నంబర్ టూగా కొనసాగుతున్న ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ కూడా సీఎం పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఆనందీబెన్ వారసుడిగా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని పేరు కూడా విన్పిస్తోంది. జైన్ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొవడంలో సిద్ధహస్తుడు. సంఘ పరివార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి భికుభాయ్ దాల్సానియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మోదీ హాయంలో శక్తివంతమైన నేతగా ఉన్న ఆయన బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు సంధానకర్తగా కీలకభూమిక పోషించారు. ఉత్తర గుజరాత్ కు చెందిన బీసీ నాయకుడు శంకర్ చౌదరి పేరు విన్పిస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్తపేరు!
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో తర్వాతి సీఎం ఎవరనే విషయంపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం రవాణా, నీటి సరఫరా మంత్రిగా పనిచేస్తున్న విజయ్ రూపాని పేరు బలంగా వినిపిస్తోంది. 2017లో గుజరాత్ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేడర్ పై పట్టుకలిగిన రూపానికే పగ్గాలు అప్పజెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. కేవలం కేడర్ పై పట్టే కాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రూపాని అంటే అమితమైన ఇష్టం. పటీదార్లు డామినేట్ చేసే సౌరాష్ట్రా రీజియన్ లోని రాజ్ కోట్ నుంచి ఆయన ఎమ్మెల్యే గా గెలుపొందారు. పటీదార్ ఉద్యమం, దళితుల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అన్నింటికీ సమర్ధుడైన నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సీనియర్ బీజేపీ లీడర్ ఒకరు తెలిపారు. అంతేకాకుండా రూపాని.. అమిత్ షా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. గుజరాత్ లో ఈబీసీలకు 10శాతం కోటాను ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కాకుండా రూపాని ప్రకటించడమే ఇందుకు ప్రత్యక్షసాక్ష్యం. వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాల ప్రధానిని కలిసినట్లు సమాచారం. దీంతో ఆయన కూడా సీఎం రేసులో ఉన్నట్లు వాదనలు వినపిస్తున్నాయి. కద్వా కులానికి చెందిన రూపాలను పార్టీ ఉనా ఘటనలో దళితులను పరామర్శించేందుకు పంపింది. కానీ రూపాలను రాజ్యసభకు పంపేందుకు పార్టీ మొగ్గుచూపుతున్నట్లు ఉండటంతో ఆయనకు సీఎం పదవి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.