
గాంధీ నగర్: విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమవుతోన్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఎయిర్ పోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అలా వెళ్లిన సిబ్బందికి వరదలో చిక్కుకోని ఓ చోట ఇద్దరు చిన్నారులు కనిపించారు.
నీళ్లల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పోలీస్ కానిస్టేబుల్ పృథ్విరాజ్ సింగ్ జడేజా తన భుజాలపైకి ఎత్తుకుని.. వరదనీటిలో నడుచుకుంటూ గట్టుకు చేర్చారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. ఆ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన సీఎం.. ‘‘ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. వారి నిబద్ధతను అభినందించండి’’ అంటూ ట్వీట్ చేశారు. ఆయనపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment