గాంధీనగర్: గుజరాత్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రమంతా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అక్కడ ఇంకా వర్ష ఉధృతి తగ్గకపోవడంతో ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక జునాగఢ్ జిల్లాలో అయితే భారీ సంఖ్యలో పార్కింగ్ కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక గ్యాస్ ఏజెన్సీ గోడౌన్లో నుండి వందలకొద్దీ గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
అసలే ఆకాశాన్నంటిన ధర కారణంగా గ్యాస్ సిలిండర్ సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఒకపక్క సామాన్యుడి గోడు ఇలా ఉంటే మరోపక్క గుజరాత్ లో వర్షాల కారణంగా నవసరి పట్టణం జునాతనా ప్రాంతంలో ఉన్న జుమ్రు గ్యాస్ ఏజెన్సీ నుండి వందల కొద్దీ సిలిండర్లు వరదలో కొట్టుకుపోతూ కనిపించాయి. ఈ వీడియోని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనికి విశేష స్పందన లభించింది.
మిగతా వారి సంగతెలా ఉన్నా కానీ సామాన్యులు మాత్రం సిలిండర్లు వరద ప్రవాహంలో పోతుంటే వాటి విలువ తెలిస్తే అంత నిర్లక్ష్యంగా వాటిని కొట్టుకుపోనిచ్చేవారు కాదని వాపోతున్నారు.
Flood like situation in Navsari city
— Ishani Parikh (@ishaniparikh) July 22, 2023
Gas cylinders of Jhumru Gas Agency in Junathana area were also washed away in water#GujaratRain #navsari pic.twitter.com/Uk2gUvAFOg
ఇది కూడా చదవండి: పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది?
Comments
Please login to add a commentAdd a comment