Gandhinagar
-
మోడల్ సోలార్ సిటీగా అయోధ్య: ప్రధాని మోదీ
గాంధీనగర్: ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ‘పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం’ లబ్ధిదారులతో ఆయన సంభాషించారు. అలాగే ‘గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీటింగ్ అండ్ ఎగ్జిబిషన్’ (రీ-ఇన్వెస్ట్ 2024) నాలుగో ఎడిషన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూడవ సారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేశామన్నారు. ప్రతి రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించామన్నారు. యూపీలోని అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.భారతదేశంలో కనిపించే వైవిధ్యం, సామర్థ్యం, పనితీరు అన్నీ ప్రత్యేకమైనవేనని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ‘ఇండియన్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ అప్లికేషన్స్’ అని అంటున్నానని, దీనిని ప్రపంచం కూడా అర్థం చేసుకుంటుందన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ అగ్రగామిగా నిలిచిందని, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన విధానం, గ్రీన్ హైడ్రోజన్ విధానం హరిత భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయన్నారు. గుజరాత్లో పునరుత్పాదక శక్తి స్థాపిత సామర్థ్యం 50 వేల మెగావాట్లను దాటింది. సోలార్ ఎనర్జీ ఇన్‌స్టాలేషన్‌లో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పటేల్ అన్నారు.ఇది కూడా చదవండి: కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే! -
34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోట అని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బరిలోకి దిగిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రికార్డు స్థాయిలో 10 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధిస్తారని ఆ పార్టీ అంచనావేస్తోంది.గతంలో ఈ నియోజకవర్గానికి ఎల్‌కె అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి తదితర దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించారు. 1989 నుంచి ఈ సీటు బీజేపీకి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ తరపున గతంలో ఎన్నికల బరిలోకి దిగిన టీఎన్ శేషన్, రాజేష్ ఖన్నాలు కూడా ఈ బీజేపీ కోటను చేధించలేకపోయారు.ఈసారి అమిత్‌షాపై గుజరాత్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోనాల్ పటేల్ పోటీకి దిగారు. 2019 ఎన్నికల్లో ఐదున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో షా గెలిచారు. 10 లక్షలకు పైగా గెలుపు మార్జిన్‌ను పెంచడమే తమ పార్టీ లక్ష్యమని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 21.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్పూర్, నారన్‌పురా, సబర్మతి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అహ్మదాబాద్ ప్రాంతంలోని ఐదు అర్బన్ స్థానాలు (ఘట్లోడియా, వేజల్పూర్, నారన్‌పురా, సబర్మతి, సనంద్) సహా మొత్తం ఏడు స్థానాలను 2022 అసెంబ్లీ ఎన్నికలలో అధికార బీజేపీ గెలుచుకుంది.1999 సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. అదే సమయంలో అతనికి ప్రత్యర్థిగా బీజేపీ అద్వానీని రంగంలో నిలిపింది. ఆ ఎన్నికల్లో శేషన్ ఓటమి పాలైనా అద్వానీకి గట్టిపోటీ ఇవ్వడంలో విజయం సాధించారు. 1991 నుండి 2014 వరకు అద్వానీ గాంధీనగర్ నుండి ఆరుసార్లు గెలిచారు.1996 లో వాజ్‌పేయి ఈ స్థానంతో పాటు లక్నో నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. ఈ నేపధ్యంలో గాంధీనగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి చెందిన విజయ్ పటేల్‌పై బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది. అయితే ఖన్నా ఓటమి పాలయ్యారు. 2019లో అద్వానీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి అమిత్ షా పోటీ చేశారు. గుజరాత్లో మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరగనుంది. -
గాంధీనగర్ లో గల్లంతైన మహిళ మృతి
-
తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌లో నాలాలో పడిపోయి ఓ మహిళ గల్లంతయ్యింది. వివరాల ప్రకారం.. వర్షాల నేపథ్యంలో గాంధీనగర్ నాలాలో పడిపోయి మహిళ గల్లంతయ్యింది. సదరు మహిళను లక్ష్మిగా గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి మూసీ నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ గాలింపు చర్యల్లో 100 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొని మూసీని జల్లెడ పడుతున్నారు. పది కిలోమీటర్ల మేర డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కూతురు మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మా అమ్మ కనిపించడం లేదు. వర్షం కారణంగానే నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. నాలాను ఆనుకుని మేము గోడ కట్టుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించలేదన్నారు. తాము ఒక గోడ నిర్మించిన తర్వాతే.. మేము గోడ కట్టుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఎన్నో రోజులుగా గోడ నిర్మిస్తామని చెప్పినా ఇప్పటి వరకు అది జరగలేదన్నారు. ఇది కూడా చదవండి: అనుమానాస్పద స్థితిలో ముంబై ఎయిర్ హోస్టెస్ మృతి -
'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధనం ఘెబ్రేయేసుస్ భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనియాడారు. జీ20 సదస్సు ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సును ఇంతటి స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ముందుగా భారత్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్యం విషయంలో భారత దేశం అనుసరిస్తోన్న విధానాలను కొనియాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రశంసలు కురిపించారు. నేనొక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కనీసం వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయాను. గుజరాత్ లోని టెలి మెడిసిన్ సౌకర్యం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వైద్య రంగంలో డిజిటల్ సేవలు ఒక విప్లవాత్మక మార్పని చెబుతూ జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ ఈ సమావేశాలకు సుమారు 70 దేశాల నుండి ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీ సదస్సు ద్వారా భారత దేశంలో మేము అవలంబిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు. ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు ఈరోజు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అత్యవసర ఆరోగ్యసమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిస్థితుట్లకు తగట్టుగా స్పందించి సిద్దపడటం.. సురక్షితమైన, ప్రభావవంతమైన,నాణ్యమైన సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
Semicon India 2023: సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం
గాంధీనగర్: దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. స్థానికంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోందని అన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా–2023’ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ప్రపంచంలో వేర్వేరు కాలాల్లో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే ప్రతి పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతీయుల ఆకాంక్షలే ముందుకు నడిపిస్తున్నాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. దీన్ని మరింత పెంచుతున్నామని, ఇకపై దేశంలో సెమికండర్టక్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ఏకంగా 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. 300 కాలేజీల్లో సెమికండక్టర్ డిజైన్ కోర్సులు భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధికి ఇక ఆకాశమే హద్దు అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏడాది క్రితం భారత్‌లో ఈ పరిశ్రమలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రశ్నించేవారని, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ‘గ్రాండ్ కండక్టర్’గా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన ‘చిప్ సప్లై చైన్’ అవసరం ప్రపంచానికి ఉందన్నారు. అతి తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ‘నేషనల్ క్వాంటన్ మిషన్’ను ఇటీవలే ఆమోదించామని, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు క్వాంటన్ మిషన్ దోహదపడుతుందన్నారు. సెమికండక్టర్ పరిశ్రమకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టామని, దేశంలో పదేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. సోలార్ పీవీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్స్ విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. సదస్సులో పలు దేశాల పారిశ్రామికవేత్తలు, సెమికండక్టర్ రంగ నిపుణులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భారత్ ముందంజ చెన్నై: జీవ వైవిధ్య పునఃస్థాపన, పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ‘జి–20 పర్యావరణ, వాతావరణ స్థిరత్వ మినిస్టీరియల్’ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గంగా నదిని శుభ్రపరిచేందుకు నమామి గంగ మిషన్ అమలు చేస్తున్నామన్నారు. ‘‘భారతీయులకు ప్రకృతే పెద్ద గురువు. భూమాత పరిరక్షణ అందరి బాధ్యత’’ అన్నారు. -
గుజరాత్ వరదల్లో కొట్టుకుపోయిన వందల సిలిండర్లు
గాంధీనగర్: గుజరాత్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రమంతా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అక్కడ ఇంకా వర్ష ఉధృతి తగ్గకపోవడంతో ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక జునాగఢ్ జిల్లాలో అయితే భారీ సంఖ్యలో పార్కింగ్ కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక గ్యాస్ ఏజెన్సీ గోడౌన్లో నుండి వందలకొద్దీ గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అసలే ఆకాశాన్నంటిన ధర కారణంగా గ్యాస్ సిలిండర్ సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఒకపక్క సామాన్యుడి గోడు ఇలా ఉంటే మరోపక్క గుజరాత్ లో వర్షాల కారణంగా నవసరి పట్టణం జునాతనా ప్రాంతంలో ఉన్న జుమ్రు గ్యాస్ ఏజెన్సీ నుండి వందల కొద్దీ సిలిండర్లు వరదలో కొట్టుకుపోతూ కనిపించాయి. ఈ వీడియోని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనికి విశేష స్పందన లభించింది. మిగతా వారి సంగతెలా ఉన్నా కానీ సామాన్యులు మాత్రం సిలిండర్లు వరద ప్రవాహంలో పోతుంటే వాటి విలువ తెలిస్తే అంత నిర్లక్ష్యంగా వాటిని కొట్టుకుపోనిచ్చేవారు కాదని వాపోతున్నారు. Flood like situation in Navsari city Gas cylinders of Jhumru Gas Agency in Junathana area were also washed away in water#GujaratRain #navsari pic.twitter.com/Uk2gUvAFOg — Ishani Parikh (@ishaniparikh) July 22, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది? -
అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అహ్మదాబాద్: దశాబ్దకాలం నాటి అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 2013లో తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై లైంగికదాడి కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం ఆయన్ను దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నేడు (జనవరి31) అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో 2001 నుంచి 2006 వరకు తనపై గురువు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ ఆశారాం బాపూతో సహా ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేనందున ఆశారాం భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాంకు జీవిత ఖైదు విధించింది. కాగా 81 ఏళ్ల ఆశారం బాపూ ప్రస్తుతం మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలులో శిక్షననుభవిస్తున్నారు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వగా..2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. 2013 నుంచి జోధ్‌పూర్ జైలులోనే ఉన్నారు. ప్రముఖ అధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఆశారం చివరకు ఇలా కటకటాలపాలయ్యారు. చదవండి: చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం' -
హీరాబెన్ అంత్యక్రియలు.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ.. (ఫొటోలు)
-
గాంధీనగర్ లో హీరాబెన్ అంత్యక్రియలు
-
హ్యాట్సాఫ్ .. స్టేటస్
కుషాయిగూడ: తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఓ అధికారి ఫోన్లో పెట్టిన స్టేటస్‌తో కనుగొన్న ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మాలోరి లక్ష్మీరవి, సత్యమూర్తి దంపతులు కాప్రా, గాంధీనగర్ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నారు. వారికి శివ అశ్లేష (7), యామిని (4) ఇద్దరు కూతుళ్లు. అశ్లేష రెండో తరగతి చదువుతుండగా యామిని అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుంది. శుక్రవారం రోజులానే వెళ్లిన ఇద్దరు చిన్నారులు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇల్లు మర్చిపోయి నేరేడ్మెట్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన ఎస్సై వేణుమాధవ్ చిన్నారుల ఫొటోలను తన సెల్‌ఫోన్ స్టేటస్‌లో పెట్టి ఆచూకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. పెట్రోలింగ్ పోలీసుల సాయంతో సుమారు గంట పాటుగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అంతలోనే ఎస్సై స్టేటస్ చూసిన తెలిసిన వ్యక్తి పిల్లలు నేరేడ్మెట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపాడు. వెంటనే అక్కడికెళ్లి పిల్లలను స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై వేణుమాధవ్ సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు. (చదవండి: ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా అవసరం’) -
ఎద్దు ఢీకొని దెబ్బతిన్న వందే భారత్ రైలు.. నెలలో మూడో ఘటన
గాంధీనగర్: ముంబయి- గాంధీనగర్ మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వరుస ప్రమాదాలకు గురవుతోంది. శనివారం ఉదయం ఎద్దును ఢీకొట్టడంతో మందుభాగం ఊడిపోయింది. నెల రోజుల్లోనే ఇలాంటి సంఘటనలు జరగటం ఇది మూడోసారి కావటం గమనార్హం. గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 8.17 గంటలకు రైలును ఎద్దు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ కోచ్ ముందుభాగం ఊడిపోయింది. దానిని బాగు చేసేందుకు 15 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. ఈ రైలు డ్రైవర్ బోగీ నోస్ కోన్ కవర్ ధ్వంసమైందని భారత రైల్వే శాఖ వెల్లడించింది. గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ సెమీ-హైస్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. పశువులు ఢీ కొట్టే ఘటనలను తప్పించలేమని, రైలు డిజైనింగ్ సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఇదీ చదవండి: మొరాయించిన ‘వందే భారత్’ ట్రైన్.. వరుసగా మూడో రోజూ సమస్య..! -
గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే..
ముంబై: గేదెలు ఢీకొట్టిన ప్రమాదంలో దెబ్బతిన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు బాగుచేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే రైలుకు మరమత్తులు నిర్వహించారు. దెబ్బతిన్న రైలు ముందు భాగంలోని మెటల్ ప్లేట్‌ను ముంబై సెంట్రల్‌లోని కోచ్ కేర్ సెంటర్లో మార్చారు. దీనిని ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్(ఎఫ్ఆర్పీ)తో తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అధికారులు ట్విటర్లో షేర్ చేశారు. కాగా ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం అహ్మదాబాద్ సమీపంలో పట్టాలపై వెళ్తుండగా గేదెలను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోయినా రైలు ముందు భాగం ధ్వంసమైంది. ఏకంగా ఇంజిన్ ముందు భాగం ఊడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు గంటకు 100 కి.మీ. వేగంతో ఉంది. అయితే రైలు ప్యానెల్ లేకుండానే గాంధీనగర్ స్టేషన్, తిరిగి ముంబై సెంట్రల్‌కు సకాలంలో ప్రయాణించింది. గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను 2022, సెప్టెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ట్రైన్ స్పీడును గరిష్ఠంగా 160 కిలోమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. అయితే రైలు ప్రమాదానికి గురికావడంతో విపక్షాలు మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రారంభించిన 6 రోజుల్లోనే బర్రెలు ఢీకొడితేనే రైలు పార్టులు ఊడిపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఇదెక్కడి గొడవరా బాబూ.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు -
వారం కూడా కాలేదు.. ‘వందే భారత్’కు త్రుటిలో తప్పిన ప్రమాదం!
అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ముంబై సెంట్రల్- గాంధీనగర్ క్యాపిటల్ మధ్య ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం రైలు పట్టాలపైకి గేదేలు రావటంతో వాటిని ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్ ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నది. బట్వా, మనినగర్ స్టేషన్ల మధ్య గురువారం ఉదయం 11.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ట్రైన్‌ను బాగు చేసి గమ్యానికి చేర్చినట్లు పశ్చిమ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. అనుకున్న సమయానికే గాంధీనగర్ క్యాపిటల్ నుంచి ముంబై సెంట్రల్ స్టేషన్‌కి చేరుకున్నట్లు చెప్పారు. గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను 2022, సెప్టెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ట్రైన్ స్పీడును గరిష్ఠంగా 160 కిలోమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Ravan Dahan: బెడిసి కొట్టిన రావణ దహనం.. ఆపై ఎద్దు వీరంగం.. వీడియో వైరల్ -
దేశ భవితను తీర్చిదిద్దేది నగరాలే
అహ్మదాబాద్: భారత్ భవిష్యత్‌ను నగరాలే తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చడానికి నగరాలే కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వాణిజ్య డిమాండ్‌కి అనుగుణంగా కొత్త నగరాలను దేశంలో నిర్మిస్తున్నామని చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి మహారాష్ట్రలో ముంబై మధ్య నడిచే సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్, అహ్మాదాబాద్ మెట్రో రైలు ఫేజ్–1ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం అక్కడికి వచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గాంధీనగర్–అహ్మదాబాద్ జంట నగరాలుగా మారి అద్భుతమైన అభివృద్ధిని సాధించాయన్నారు. ‘‘మారుతున్న కాలానికి తగ్గట్టుగా నగరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని నగరాల్లో అధికంగా దృష్టి సారించి పెట్టుబడులు భారీగా పెడుతున్నాము. వచ్చే 25 ఏళ్లలో ఈ నగరాలే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుపుతాయి’’ అని మోదీ అన్నారు. నగరాల అభివృద్ధితో పాటు ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా రూపురేఖలు మార్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గాంధీ నగర్లో ఉదయం 10.30 గంటలకి మోదీ పచ్చ జెండా ఊపి వందేభారత్ రైలుని ప్రారంభించారు. ఆ తర్వాత అదే రైల్లో నగరంలోని ఆహ్మదాబాద్‌లోని కాలూపూర్ రైల్వేస్టేషన్ వరకు మోదీ ప్రయాణించారు. ‘‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాని మోదీ ప్రయాణించారు. రైల్వే సిబ్బంది కుటుంబసభ్యులు, మహిళా వ్యాపారవేత్తలు, యువతీయువకులు ఆయన తోటి ప్రయాణికులుగా ఉన్నారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశంలో ఇది మూడో వందేభారత్ రైలు. 2019లో మొట్టమొదటి రైలు న్యూఢిల్లీ–వారణాసి మధ్య ప్రారంభం కాగా, రెండో రైలు న్యూఢిల్లీ–శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా మార్గంలో ప్రారంభమైంది. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో ఒక అంబులెన్స్‌కి దారి ఇవ్వడానికి ఆయన కాన్వాయ్‌ని నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవచ్ టెక్నాలజీతో భద్రతా వ్యవస్థ వందేభారత్ రైలులో రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదాన్ని నివారించడానికి దేశీయ కవచ్ టెక్నాలజీని వినియోగించారు. పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయంతో పాటు ఆటోమేటిక్ తలుపులు, ప్రతీ సీటు దగ్గర మొబైల్ చార్జింగ్ పాయింట్లు,అటెండెంట్‌ను పిలవడానికి కాల్ బటన్, బయో టాయిలెట్లు, సీసీ కెమెరాలున్నాయి. గంటకి 160 కి.మీ. గరిష్ట వేగంతో రైలు ప్రయాణించగలదు. శుక్రవారం ఈ రైలు అయిదున్నర గంటల్లో ముంబైకి చేరింది. -
వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు
గాంధీనగర్: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్‌ను అందజేసిన భారత్‌ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్‌పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్‌లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్–2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్లో వాదించారని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బిహార్‌లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు. వివిధ రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాక ప్రజలు క్యూల్లో నిల్చోవాల్సిన బాధ తప్పిందన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోనట్లయితే ఇప్పటికీ వెనుబడి ఉండేదన్నారు. ‘పదేళ్ల క్రితం ప్రజలు బర్త్ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాల కోసం క్యూల్లో నిలబడేవారు. ఇప్పుడు అన్ని సేవలను ఆన్లైన్ చేసి క్యూలు లేకుండా చేశాం’ అని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థను అరికట్టగలిగినట్లు చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 80 కోట్ల మంది పేదలకు సులువుగా ఉచిత రేషన్ అందించామన్నారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ.1,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంవో తెలిపింది. -
యూత్ వింగ్ లీడర్ హల్చల్.. వీడియో వైరల్
గాంధీనగర్: పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం నేరం కింద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్ అయ్యాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. వివరాల ప్రకారం.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసి, కానిస్టేబుల్‌ను తన కారు బానెట్‌పైకి లాగినందుకు గుజరాత్ ఆప్ యువజన విభాగం నాయకుడు యువరాజ్‌సింగ్ జడేజాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, మంగళవారం కొందరు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం గాంధీనగర్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద నిరసనలకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు జడేజా అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుంచే వెళ్లిపోయే క్రమంలో జడేజా.. వేగంగా తన కారు నడుపుతూ పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు ఓ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లగా.. అతను కారు బ్యానెట్‌పైకి ఎక్కి జాగ్రత్తపడ్డాడు. అనంతరం జడేజా అక్కడి నుంచే పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులపై హత్యాయత్నం కింద ఆప్ నేతపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ జనరల్ (గాంధీనగర్ రేంజ్) అభయ్ తెలిపారు. Gujarat AAP youth wing leader Yuvrajsinh Jadeja held for attacking cops, dragging constable on his car's bonnet.#AAP #Gujarat #Politics pic.twitter.com/ap5INyGybd — My Vadodara (@MyVadodara) April 6, 2022 జడేజా అరెస్ట్‌పై ఆప్ నేత ప్రవీణ్ రామ్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తమను(ఆప్) చూసి భయపడుతోందని ఆరోపించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలను బయటపెట్టిన తర్వాత జడేజాను సర్కార్ టార్గెట్ చేసిందన్నారు. ఫారెస్ట్ గార్డుల రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం కూడా లీక్ అయిందని జడేజా ఇటీవల పేర్కొన్నాడు. -
అదిరిపోయిన తొలి 3డీ గృహం.. 28 రోజుల్లోనే నిర్మాణం..!
ఇండియన్ ఆర్మీకి చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఎంఈఎస్) 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి రెండు ఇళ్లను నిర్మించింది. అవును! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల మాదిరిగానే 3డీ గృహాలు నిర్మించింది. 3డీ రాపిడ్ కనస్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఇళ్లను నిర్మించినట్లు తన అధికారిక ప్రకటనలో తెలిపింది. గాంధీనగర్‌లోని నైరుతి ఎయిర్ కమాండ్ ఈ 3డీ గృహాలను దేశంలో మొట్టమొదటి సారిగా నిర్మించింది. ఈ గృహాలను నాలుగు వారాల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఏఎన్ఐ మీడియా ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఈ భారత సాయుధ దళాల పెరుగుతున్న వసతి అవసరాలను వేగంగా తీర్చడానికి ఈ 3డీ గృహాలను నిర్మించాల్సి వస్తుంది అని రక్షణ దళాలు పేర్కొన్నాయి. చెన్నైకి చెందిన స్టార్టప్ త్వాస్తా సహకారంతో ఈ ఇళ్లను నిర్మించారు. ప్రతి ఇల్లు సుమారు 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గృహాలను భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు ఎంఈఎస్ భారతదేశంలోని మొదటి 3డీ ప్రింటెడ్ శానిటరీ బ్లాక్‌లను జైసల్మేర్ వద్ద సుమారు 600 చదరపు అడుగుల స్థలంలో నిర్మించింది. #WATCH how the Indian Army’s Military Engineering Services constructed two houses within four weeks using the 3D Printing Technology in construction. (Source: Indian Army) pic.twitter.com/bMf3G3aO01 — ANI (@ANI) March 14, 2022 (చదవండి: బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!) -
పోలీసులంటే ఇంకా భయమే
గాంధీనగర్: అంతర్గత భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు స్వాతంత్య్రానంతరం పెద్దగా ప్రయత్నాలే జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ హయాంలో జనాలను భయభ్రాంతులను చేయడమే అంతర్గత భద్రతా వ్యవస్థ లక్ష్యంగా ఉండేది. ఇప్పటికీ ఈ విషయంలో పెద్దగా మార్పు రాలేదు. పోలీసులంటే ప్రజల్లో భయం, వారికి దూరంగా ఉండాలన్న భావనే కన్పిస్తున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణం సంస్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. ఆయన శనివారం గాంధీనగర్‌లోని రాష్ట్రీ య రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్యూ) తొలి స్నాతకోత్సవంలో ప్రసంగించారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచితే చాలదని, టెక్నాలజీ, జనం సైకాలజీ, యువతరం భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యమున్న శిక్షితులైన అధికారులు తక్షణావసరమని అన్నారు. ‘‘పోలీసులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించగలగాలి. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి వారిలో స్నేహభావన, నమ్మకం పెంపొందించాలి. అంటే శిక్షణ పద్ధతుల్లోనే మార్పు రావాలి’’ అని అన్నారు. విపరీతమైన పనిభారం పోలీసు సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పని భారంతో సతమతం అవుతున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఆసరాగా నిలిచే ఉమ్మడి కుటుంబాల వంటి సంప్రదాయ వ్యవస్థలు క్షీణించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పైగా నేటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉంటే చాలదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఎందుకంటే శారీరక వైకల్యమున్నా మానసికంగా దృఢంగా సిబ్బంది భద్రతా వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడగలరు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారికి యోగ శిక్షణ, నిపుణుల మద్దతు వంటివి తప్పనిసరి’’ అని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ, సంబంధిత స్టార్టప్‌ల విస్తరణను కూడా ప్రస్తావించారు. ఆర్ఆర్యూ విద్యార్థులు వాటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భద్రత, రక్షణ తదితర రంగాల్లో మహిళల రాక పెరుగుతుండటం శుభ పరిణామమన్నారు. 1,090 మంది ఆర్ఆర్యూ విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, నేర న్యాయ వ్యవస్థల్లో సుశిక్షిత సిబ్బందిని అందించేందుకు 2020లో ఆర్ఆర్యూ స్థాపన జరిగింది. రెండు రోడ్ షోలు వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రధాని మోదీ శనివారం మరో రెండు రోడ్ షోలు చేశారు. ఉదయం గాంధీనగర్ జిల్లాలో దేగం నుంచి లవద్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ దాకా 12 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. సాయంత్రం అహ్మదాబాద్‌లో ఇందిరా బ్రిడ్జి నుంచి సర్దార్ పటేల్ స్టేడియం దాకా 3.5 కిలోమీటర్ల మేర మామూలు జీప్‌లో రోడ్ షో చేశారు. అయితే పలుచోట్ల వాహనం దిగి, ‘మోదీ, మోదీ’ అని నినదిస్తున్న జనాన్ని పలకరిస్తూ సాగారు. గుజరాత్లో 1988 నుంచీ బీజేపీయే అధికారంలో ఉంది. -
ఆ పెళ్లి పత్రిక బరువు ఎంతో తెలుసా?
గాంధీనగర్: సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలనుకుంటారు. ఈ వివాహ కార్యక్రమాల కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరనే విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ షో నుంచి ప్రతివేడుక ప్రత్యేకంగా ఉండాలనుకొని ప్లాన్లు వేస్తుంటారు. పెళ్లి వేడుకలకు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన పెళ్లి వేడుక ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి నిలిచింది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మౌలేష్బాయ్ ఉకానీ కుమారుడి వివాహం, సోనాల్బేన్ అనే యువతితో నిశ్చయమైంది. తాను.. బిజినెస్‌మ్యాన్ కావడంతో తన కొడుకు వివాహ వేడుక గ్రాండ్‌గా చేయాలనుకున్నాడు. తన కుమారుడి పెళ్లి కోసం జోధ్‌పూర్‌లోని ఉమెద్ భవన్ ప్యాలెస్‌ను బుక్ చేసుకున్నాడు. ఆ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటి. అక్కడ వేడుకలకు గాను.. ఒక రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు చార్జ్ చేస్తారు. ఆ కల్యాణ మండపంలో ప్లేట్ మీల్స్ ఖరీదు 18 వేల రూపాయలు. అయితే, మౌలేష్ బాయ్ తన కుమారుడి వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా ముద్రించాడు. అది నాలుగు కేజీల బరువును కలిగి ఒక పెద్ద బాక్సు మాదిరిగా ఉంది. దానిలో పెళ్లి పత్రికతోపాటు.. పెళ్లి వేడుకలో జరిగే కార్యక్రమాలు ముద్రించారు. దానిపై కృష్ణుడి ప్రతీమను కూడా ప్రత్యేకంగా ఉండేలా చూశారు. ఆ పెళ్లి పత్రికలో ప్రత్యేకంగా కొన్ని బాక్సులను ఏర్పాటు చేశారు. దానిలో అతిథుల కోసం ప్రత్యేకంగా, డ్రైఫ్రూట్స్, చాక్లెట్లు, స్వీట్లను ఏర్పాటు చేశారు. ఆ కార్డు ధర ఏడు వేల రూపాయలు, దాన్ని ప్రత్యేకంగా పింక్ కలర్లో ముద్రించారు. దీంతో ఆ పెళ్లి బాక్సు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కాగా, వివాహ వేడుక బంధువులు, స్నేహితుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. గత నెలలోనే పెళ్లి జరిగిపోయినప్పటికీ ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
తల్లి లొంగలేదని కూతురిని బలిగొన్న కామాంధుడు
సూర్యాపేట రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని తీసుకొచ్చిన తల్లిపై కన్నేశాడు. తన కోరిక తీర్చడానికి ఆమె అంగీకరించలేదన్న అక్కసుతో బిడ్డకు పసరు తాగించి పొట్టన పెట్టుకున్నాడు. సూర్యాపేట పట్టణ శివారులోని దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన పల్లపు దుర్గయ్య, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలను చదివిస్తున్నారు. చిన్న కుమార్తె శ్రావణి(18) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. అయినా నయం కాకపోవడంతో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు సోమవారం ఉదయం సూర్యాపేట మండలం గాంధీనగర్‌లోని దర్గా వద్ద నాటు వైద్యం చేసే జక్కిలి భిక్షపతి వద్దకు తీసుకొచ్చారు. భిక్షపతి శ్రావణిని చూసి.. ఆరోగ్యం నయం చేస్తానని, రెండు రోజులు అక్కడే ఉండాలని సూచించాడు. దీంతో వారు దర్గా వద్దే ఉండిపోయారు. సోమవారం అర్ధరాత్రి భిక్షపతి పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడు. మంగళవారం ఉదయం ఎంత లేపినా శ్రావణి లేవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. చదవండి: మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి.. కోరిక తీర్చనందుకే.. భిక్షపతి తన కోరిక తీర్చాలని.. లేదంటే శ్రావణిని కాటికి పంపిస్తానని సోమవారం రాత్రి బెదిరించాడని యువతి తల్లి రాజేశ్వరి తెలిపింది. దీనికి నిరాకరించడంతో భిక్షపతి కోపంతో పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడంది. అప్పటిదాకా బాగానే ఉన్న శ్రావణి పాలు తాగిన తర్వాతే మరణించిందని ఆమె బోరున విలపించింది. ఆదివారం రాత్రే ఇంటికి వెళ్తామని చెప్పినా.. వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడని విలపించింది. శ్రావణి (ఫైల్) భిక్షపతి విషయం తెలుసుకున్న దురాజ్‌పల్లి గ్రామస్తులు మంగళవారం దర్గా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రావణి మృతికి కారణమైన భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భిక్షపతిని రూరల్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, భిక్షపతి కొన్నేళ్లుగా గాంధీనగర్ గ్రామ సమీపంలో దర్గా ఏర్పా టు చేసుకుని నాటు వైద్యం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒంట్లో బాగోలేక తన వద్దకు వచ్చిన వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిపారు. చదవండి: రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ? -
పాక్‌కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్ అరెస్టు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు భారత్ భద్రత పరమైన విషయాలను చేరవేస్తున్న ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్)పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, జమ్ముకశ్మీర్ రాజౌరీకి చెందిన మహమ్మద్ సజ్జద్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భారత్ భద్రతపర రహస్యాలను ఫోన్ మెసెజ్ ద్వారా పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు బీఎస్ఎఫ్లో చేరక ముందు 46 రోజులు పాక్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను డబ్బుల కోసం భారత్ సున్నిత అంశాలను దాయాది పాక్‌కు చేరవేస్తున్నాడని ఏటీఎస్ డిప్యూటి ఎస్పీ చవ్దా తెలిపారు. Gujarat: BSF constable Mohammad Sajjad held from Gandhinagar for allegedly passing sensitive information to Pakistan "A resident of J&K's Rajouri, he went to Pakistan& stayed there for 46 days before joining BSF. He used to send information on WhatsApp," says ATS Dy SP BM Chavda pic.twitter.com/3sUQIoVoNy — ANI (@ANI) October 25, 2021 చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచి మత్తుమందు కలిపి..
అహ్మదాబాద్: ఇది ఇంటర్నెట్ యుగం. ప్రపంచంలోని అనేక విషయాలు అర చేతిలోని ఫోన్లో ఇట్టే తెలుసుకోవచ్చు. సోషల్ మీడియా పుణ్యమా అని ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన కొన్ని స్నేహాలు మోసాలకు దారితీస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పరిచయమైన ట్రెయినీ ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు కలిపిన పానీయం తాగించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: తీహార్ జైల్లో కర్రలతో కొట్టి గ్యాంగ్‌స్టర్ గుజ్జర్ హత్య పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం వేజల్పూర్ ప్రాంతానికి చెందిన త్రివేది (22)కి ఏడు నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి (22) పరిచయమైంది. అనంతరం వారిద్దరూ తరచూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో తమ ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. కొన్నాళ్లకు వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో త్రివేది తన ఇంటికి ఆ యువతిని పిలిచాడు. ఇంటికొచ్చిన అమ్మాయిపై మోజు పెరిగింది. దీంతో ఆమెపై కోరిక తీర్చుకోవాలని భావించి పానీయంతో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ తప్పింది. అనంతరం అతడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా నిందితుడు ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసి వాటిని చూపించి ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ వీడియోలతో భయపడుతూ ఆమెపై తరచూ బలత్కారం చేస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఆ యువతి ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అజిత్ త్రివేదిని వేజల్పూర్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: ఏడాదిన్నర క్రితం వివాహం, మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను.. -
నెల క్రితం భార్య హత్య.. చిక్కననుకున్నాడు.. కానీ..!
గాంధీనగర్: గుజరాత్‌లోని ఆంకలేశ్వర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దాంపత్య జీవితంలో గొడవల కారణంగా సైనైడ్ ఇంజెక్ట్ చేసి భార్యను హత్య చేశాడు. అయితే దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులకు లభించిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘జిగ్నేష్ పటేల్ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల క్రితం ఊర్మిళ వాసవ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో సంసారంలో గొడవలు మొదలయ్యాయి. కాగా దాదాపు నెల క్రితం జూలై 8న అతడి భార్యకు ఛాతి నొప్పి వచ్చింది. దీంతో గుజరాత్‌లోని ఆంకలేశ్వర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు చికిత్స పొందుతున్నప్పుడు, నిందితుడు దొంగతనంగా సైనైడ్ టాబ్లెట్‌తో ఓ ద్రావణాన్ని తయారు చేశాడు. తర్వాత వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది లేనప్పుడు సిరంజిని ఉపయోగించి ఆమెకు జత చేసిన డ్రిప్ బాటిల్లోకి ఆ ద్రావణాన్ని ఇంజెక్ట్ చేశాడు. అది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే బాధితురాలు మరణించింది. ఆపై పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. కానీ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం వాసవ శరీరంలోకి సైనైడ్ ఇంజెక్ట్ చేయడంతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిని ఆమె భర్త జిగ్నేశ్ పటేల్ ఆంక్లేశ్వరంలోని ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేశాడు.’’ అని పోలీసు అధికారి తెలిపారు. -
అమానవీయం: మహిళకు లిఫ్ట్ ఇచ్చినందుకు.. ఎంత పనిచేశారు..
గాంధీనగర్: గుజరాత్లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. తెలిసిన వ్యక్తి.. మోటర్ బైక్ ఎక్కినందుకు ఆ మహిళను సదరు గ్రామస్థులు సూటిపోటి మాటలతో వేధించారు. అంతటితో ఆగకుండా.. ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కూడా అంటగట్టారు. ఈ సంఘటన సబర్కాంత జిల్లాలోని సాంచేరీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హిమ్మత్ నగర్ పట్టణానికి సమీపంలోని సాంచేరీ గ్రామంలో 30 ఏళ్ల మహిళ జీవిస్తోంది. ఆమెకు నలుగురు పిల్లలు. కాగా, ఆమె భర్త అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తుంది. ఈ క్రమంలో ఆమె.. గత నెల జులై 30న హిమ్మత్‌నగర్ పట్టణానికి బ్యాంక్ పని మీద వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం తన గ్రామానికి వెళ్తుంది. ఆ సమయంలో ఆమెకు తెలిసిన ఒక వ్యక్తి.. తన మోటర్ బైక్ ఎక్కాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె తెలిసిన వ్యక్తి అని ఎక్కింది. కాగా, వారిద్దరు కలిసి సాంచేరీ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో కొంత మంది వారిద్దరిని చూసి దూశించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. పాపం.. భర్త చనిపోయిన మహిళ అని కూడా జాలీలేకుండా విచక్షణ రహితంగా అవమానించారు. దీంతో బాధిత మహిళ తీవ్రంగా కుమిలిపోయింది. ఆరోపణలు చేసిన వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంది. దీంతో ఆమె గ్రామంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అకారణంగా తనకు వివాహేతర సంబంధం అంటగట్టినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో, స్థానిక పోలీసులు.. వేదాంశి చౌహన్, రాజుజీ చౌహన్, కలుసిన్హ్ చౌహన్, రాకేంన్షి చౌహన్, సురేఖ చౌహన్, సోనాల్ చౌహన్ లను అదుపులోనికి తీసుకున్నారు. నిందితులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కోరిక తీర్చమన్నారు.. విషయం సీఎంకు చేరింది!
జామ్‌నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఆర్ మేనేజర్, సూపర్వైజర్ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహిళా అటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ నితేశ్ పాండే తెలిపారు. ఈ విషయం తెలిసిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. కొంతమంది కాంట్రాక్టు మహిళా అటెండెంట్లు తమపై కొందరు ఉన్నతాధికారులు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వారి కోరికను తిరస్కరించిన కొందరు మహిళా అటెండెంట్లను జూన్ 16న విధుల నుంచి తొలిగించినట్లు పేర్కొన్నారు. వార్డ్ బాయ్స్ ద్వారా తమకు ఈ ప్రతిపాదనలు చేయిస్తున్నారని అన్నారు. వారి కోరికను తిరస్కరించిన వారికి మూడు నెలలుగా జీతం చెల్లించకుండా తొలగించారని వివరించారు. కాగా దీనిపై జామ్ నగర్ బి డివిజన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 354, 354-ఎ, 354-బి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు జరుగుతోందని అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ నితీశ్ పాండే అన్నారు. ఇక ఈ ఆరోపణలపై సమగ్ర నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర మహిళా కమిషన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌ను కోరింది. చదవండి: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు -
పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ/గాంధీనగర్: పర్యావరణానికి హాని కలగని రీతిలో సుస్థిర, సంతులిత అభివృద్ధి సాధించడం భారత్ అవలంబిస్తున్న విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియల్ లోపే ఉండాలన్న పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని అమలు చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు. వన్య వలస జాతుల పరిరక్షణపై గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న 13వ ‘‘కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(సీఓపీ–13) ఆఫ్ ద కన్వెన్షన్ ఆన్ ది కన్సర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్(సీఎంఎస్)’’ని ఉద్దేశించి ప్రధాని మోదీ సోమవారం వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, సమతుల్య జీవన విధానం, గ్రీన్ డెవలప్మెంట్.. తదితర విలువలతో కూడిన కార్యాచరణతో వాతావరణ మార్పుపై భారత్ పోరాడుతోందని మోదీ తెలిపారు. ‘సంతులిత అభివృద్ధిని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. పర్యావరణానికి హాని చేయకుండానే అభివృద్ధి సాధ్యమని మేం నిరూపిస్తున్నాం’ అన్నారు. ‘వలస జాతులు ఈ భూగ్రహాన్ని అనుసంధానిస్తాయి. మనం ఉమ్మడిగా వాటికి ఆహ్వానం పలుకుదాం’ అని సీఓపీ–13కి స్లోగన్ థీమ్‌గా పెట్టారు. కన్వెన్షన్ అధ్యక్ష బాధ్యతలను వచ్చే మూడేళ్లు భారత్ నిర్వహించనుందని ప్రధాని వెల్లడించారు. వలస పక్షుల పరిరక్షణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పర్యావరణ మంత్రి జవదేకర్ అన్నారు. జనాభా తగ్గుతోంది అంతరించే ప్రమాదంలో ఉన్న వన్య వలస జాతుల్లో అత్యధిక శాతం జాతుల జనాభా గణనీయంగా తగ్గుతోందని ‘13వ సీఎంఎస్ సీఓపీ’ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రాథమిక అంచనాయేనని, పూర్తిగా నిర్ధారణ చేసేందుకు సహకారంఅవసరమని సీఎంఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి అమీ ఫ్రేంకెల్ పేర్కొన్నారు. -
‘మోదీ, షా’ విజన్ ఎంతో గొప్పది : రతన్ టాటా
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గొప్ప విజన్ కలిగిన నాయకులంటూ కొనియాడారు. బుధవారం గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్(ఐఐఎస్) పారిశ్రామికవేత్త రతన్ టాటా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోదీ, అమిత్ షా దూరదృష్టి గల నాయకులని ప్రశంసించారు. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి మోదీ, షా ఎన్నో దూరదృష్టి గల నిర్ణయాలను తీసుకున్నారన్నారు. విజన్ కలిగిన నాయకులకు మద్దతిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మోదీ, షా నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొనడం విశేషం. సింగపూర్ ఐటీఈఎస్ నమూనాలో ప్రారంభమయ్యే ఈ సంస్థలు నేషనల్ స్కిల్ డెవలప్మంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీఎస్) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తాయి. గాంధీనగర్‌లో ప్రారంభమయ్యే సంస్థలో రక్షణ, ఏరోస్పేస్, చమురు తదితర అంశాలలో శిక్షణ ఇస్తారు. మానవ వనరులను సమృద్దిగా ఉపయోగించడమే ఈ సంస్థలు లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా గ్రూప్ ఐఐఎస్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ఐఐఎస్‌ను ప్రారంభించింది. కాన్పూర్, మొంబైలలో ఐఐఎస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుని.. ఇరుక్కుపోయింది..
-
ఆమెకు.. దెబ్బకు దేవుడు కనిపించాడు: వైరల్
గాంధీనగర్ : ఫొటో సరదా ఓ భక్తురాలికి చుక్కలు చూపించింది. ఫొటో కోసం ఏనుగు బొమ్మకింద దూరటం ఆమెను ఇబ్బందుల పాలుచేసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం ఓ గుడికి వెళ్లింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుందామె. అయితే అందరిలాగా ఫొటో దిగితే ఏం వెరైటీ అనుకుందో ఏమో! ఏనుగు బొమ్మ కిందకు అతికష్టం మీద దూరింది. అనంతరం తన స్టైల్లో ఫొటోకు ఫోజిచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది! తర్వాతే అసలు కథ మొదలైంది. ఎంత ప్రయత్నించినా ఆ ఏనుగు కిందనుంచి బయటకు రావటం ఆమె వల్ల కాలేదు. ‘ఎరక్కపోయి దూరాను.. ఇరుక్కుపోయాను కదరా దేవుడా!’ అనుకుంటూ అల్లాడిపోయింది. ఆమెతో పాటు వచ్చిన కొందరు మహిళలు కాస్త గట్టిగానే ప్రయత్నించి ఆమెను బయటకు లాగారు. దీంతో బయటపడ్డ సదరు మహిళ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తూ.. ఆ భక్తురాలికి.. దెబ్బకు దేవుడు కనిపించాడు.. ఎరక్కపోయి దూరింది.. ఇరుక్కుపోయింది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
బీజేపీ లేకుంటే నేను జీరో
అహ్మదాబాద్/గాంధీనగర్: తన రాజకీయ ప్రస్థానం 1982లో బీజేపీ నుంచి ప్రారంభమైందని.. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి వరకు ఎదిగానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. తన జీవితం నుంచి బీజేపీని తీసేస్తే మిగిలేది శూన్యమేనని వ్యాఖ్యానించారు. జీవితంలో తాను సాధించింది, నేర్చుకున్నది, దేశానికి ఇచ్చింది అంతా బీజేపీ ప్రసాదించిందేనని, బీజేపీ లేకుండా తాను జీరోనే అని అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానానికి శనివారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు జరిగిన రోడ్‌షో, ర్యాలీల్లో అమిత్‌షా పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని నరేన్‌పుర వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం నుంచి ఈ రోడ్‌షో ప్రారంభమైంది. దాదాపు 4 కి.మీ. మేర సాగిన రోడ్‌షోకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. మూడు రెట్లు పెరిగిన అమిత్‌షా ఆస్తులు గత ఏడేళ్లలో తన ఆస్తులు మూడు రెట్లు పెరిగి రూ.38.81 కోట్లకు చేరినట్లు అమిత్ షా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన, తన భార్య పేరిట రూ.23.45 కోట్ల మేర స్థిర, చర ఆస్తులున్నట్లు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో తన చేతిలో రూ. 20,633 కోట్లు, భార్య వద్ద రూ.72,578 ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరు దంపతుల పేరిట బ్యాంకులో సేవింగ్స్ రూపంలో రూ.27.80 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.9.80 లక్షలున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. రాజ్యసభ ఎంపీగా ఉండటంతో పాటు, అద్దెలు, వ్యవసాయం ద్వారా తనకు ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ టోపీ వద్దు! అమిత్ నామినేషన్ పత్రాలు వేయడానికి వెళ్లినపుడు సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి షా వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. తన మనవరాలిని చేతిలోకి తీసుకున్న షా ఆమె ధరించిన టోపీని తీసేసి బీజేపీ టోపీ పెట్టగా ఆ చిన్నారి తనకు ఇష్టం లేదన్నట్లు వెంటనే తీసిపడేసింది. ఇలా మూడుసార్లు ప్రయత్నించి ఇక చేసేదేమీ లేక షా చివరకు ఆమె టోపీనే తిరిగి తొడిగి ముద్దాడారు. -
పోటీ పరీక్ష: దీక్ష విరమణకు నీళ్లిచ్చిందెవరు?
అహ్మదాబాద్: ఓ పోటీ పరీక్షలో అడిగిన ప్రశ్న ఆ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్లో రైతులకు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్ నిరహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలో ఇటీవల దీక్షలో ఉన్న హార్ధిక్‌కు నీరు అందజేసి మద్దతు తెలిపింది ఎవరనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నకు నాలుగు ఐచ్ఛికాలు.. శరద్ యాదవ్, శతృజ్ఞ సిన్హా, లాలూ ప్రసాద్‌యాదవ్, విజయ్ రూపానీ కూడా ఇచ్చారు. అందులో సరైన సమాధానం మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్. ఈ సంగతి అటు ఉంచితే.. పరీక్షలో ఈ రకమైన ప్రశ్న రావడం గుజరాత్లో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 25న నిరహార దీక్ష చేపట్టిన హార్ధిక్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మంచి నీళ్లు కూడా తీసుకోవడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. సెప్టెంబర్ 7వ తేదీన ఆస్పత్రికి తరలించారు. ఆ మరుసటి రోజు హాస్పిటల్లో హార్ధిక్‌ను పరామర్శించిన శరద్ యాదవ్ అతనికి నీరు అందజేశారు. కాగా హార్ధిక్ సెప్టెంబర్ 12వ తేదీన దీక్షను విరమించారు. పోటీ పరీక్షలో ఈ ప్రశ్న రావడంపై గాంధీనగర్ మేయర్‌ను ప్రశ్నించగా.. దీనిపై తనకు సమాచారం లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నిక కాబడిన ప్రతినిధులు ఎవరు ఈ పరీక్షల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. -
అమ్మకు అండగా నిలవండి..
-
అమ్మకు అండగా నిలవండి..
- కేటీఆర్‌ను కదిలించిన కమలమ్మ దీనగాథ - మంత్రి ట్విట్టర్లో ‘సాక్షి’ కథనం సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ(85) దీన గాథపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కమలమ్మకు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. నిలువ నీడలేక.. కుమారుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ సంఘటనపై ‘అమ్మను గెంటేశారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి కె. తారక రామారావు స్పందించారు. ‘సాక్షి’ కథనాన్ని తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆమెకు అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఫోన్ చేసి ఆదేశించారు. డీఆర్వో జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ వెంటనే కమలమ్మతో మాట్లాడి ఆమెతో ఫిర్యాదు స్వీకరించారు. అమ్మను గెంటేశారు.. ఆమె కుమారులు ఐదుగురికీ సోమవారం నోటీసులు జారీ చేశారు. కమలమ్మతో జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) సరస్వతి మాట్లాడారు. మూడో కుమారుడు శ్రీనివాస్ వద్ద కమలమ్మ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్ఐ రాజేంద్రప్రసాద్ కమలమ్మ ఇంటికి వెళ్లి పండ్లు అందించారు. భీవండిలో ఉండే కుమారుడు రమేశ్‌తో రెవెన్యూ అధికారులు ఫోన్లో మాట్లాడా రు. బుధవారం సిరిసిల్లకు వచ్చేందుకు రమేశ్ అంగీకరించాడు. జిల్లా అధికారుల సమక్షంలో కమలమ్మ కొడుకులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. ఆమెకు నీడ కల్పించేలా చర్యలు తీసుకుంటామని డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్ తెలిపారు. కన్నతల్లిని పోషించకుంటే కొడుకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా, ఐదుగురు కొడుకులతోపాటు తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని, ఎవరూ సాదకున్నా సచ్చేంత వరకు తానే వండుకుని తింటానని కమలమ్మ తెలిపింది. -
అమ్మను గెంటేశారు..
సిరిసిల్ల: ‘నా వాటాలో ఏన్నాళ్లుంటావ్’ అంటూ ఓ కొడుకు కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసి.. తాళం వేసుకొని వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా చెట్టు కింద బతికిన 86 ఏళ్ల ఆ తల్లిని మరో కొడుకు చేర దీసినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. కుల పెద్దలను ఆశ్రయించినా.. ఆ కొడుకులు వినకపోవడంతో ప్రస్తుతం ఆరుబయట జీవనం సాగిస్తోందా తల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ, సిద్ధిరాములు దంపతులు. వీరికి కుమారులు మీనయ్య, శ్రీనివాస్, రమేశ్, సురేశ్, లక్ష్మీనారాయణ, కూతుళ్లు వసంత, వశ్చల ఉన్నారు. నేత కార్మికుడైన సిద్ధిరాములు మంచి ఇల్లు కట్టుకుని.. పిల్లల పెళ్లిళ్లు చేశాడు. 12 ఏళ్ల కిందట ఆయన అనారోగ్యంతో మరణిం చాడు. అప్పట్నుంచి కమలమ్మ కొడుకులు, కూతుళ్లు ఉన్నా వాళ్ల వద్ద ఉండలేక ఒంటరిగా జీవిస్తుంది. చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ ఆసరా పింఛన్, రేషన్ బియ్యంతో బతుకు సాగిస్తోంది. కాగా, తల్లిదండ్రులు సంపాదించిన సుమారు రూ.30 లక్షల విలువైన ఇంటిని కొడుకులు పంచుకున్నారు. మూడో కుమారుడు రమేశ్ భివండిలో ఉంటున్నాడు. అతడి వాటాగా వచ్చిన ఇంట్లోనే కమలమ్మ ఉంటోంది. నాలుగు రోజుల క్రితం రమేశ్ వచ్చి కమలమ్మ సామగ్రి బయట పడేసి, ఇంటికి తాళం వేసి భివండి వెళ్లిపోయాడు. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. మిగతా కొడుకుల వద్దకు వెళ్లి.. ‘నేను ఎక్కడ ఉండాలే.. నాకు ఇంత నీడ చూపుండ్రి’ అని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కుల పెద్దలు జోక్యం చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. తలదాచుకునేందుకు నీడలేక రోడ్డు పక్కన వంట చేసుకుంటూ కనిపించగా.. స్థానికులు జోక్యం చేసుకోవడంతో రెండో కుమారుడు శ్రీనివాస్ వచ్చి తల్లిని తీసుకెళ్లినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. దీంతో ఆరుబయటనే ఆమె ఉంటోంది. ‘నా కొడుకులు యాడుంటవని అంటున్నరు.. కాళ్లు కాలుతున్నయి.. గాలి వత్తలేదు.. నాలుగు రోజులు బతికే ముసలిదాన్ని.. ఎవరూ పట్టించుకుంటలేరు.. ఇప్పుడు వాళ్లకు తల్లి వద్దు.. పెళ్లాలే కావాలే.. ఆ దేవునింట్ల మన్నువొయ్య.. నన్ను తీసుకపోతలేడు.. సావన్నా వత్తలేదు.. ఒంటరిగా వంట చేసుకుంటూ బతుక బుద్ధిగావట్లేదు’అని కమలమ్మ రోదించడం కలచివేసింది. -
యోగా మానేసి అమ్మ వద్దకు ప్రధాని
గాంధీనగర్: సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రతిరోజు చేసే యోగాను నేటి ఉదయం మాత్రం స్కిప్ చేశానని మోదీ ట్వీట్ చేశారు. తన తల్లి హీరాబెన్‌ను కలుసుకునేందుకు వెళ్లానని, ఆమెతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశానని ట్వీట్లో పేర్కొన్నారు. తల్లితో కలిసి సమయాన్ని గడపడంపై ఆయన ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. గత డిసెంబర్లో చివరిసారిగా గుజరాత్‌లోని దీసాలో ర్యాలీ, పార్టీ సమావేశాల్లో పాల్గొన్న సందర్బంగా తల్లిని కలుసుకున్న విషయం తెలిసిందే. మోదీ తల్లి హీరాబెన్ ప్రస్తుతం గాంధీనగర్ శివారులో ఆయన సోదరుడు పంకజ్ మోదీ ఇంట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా తనకు వీలు చిక్కడంతో సోదరుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో పాటు తల్లి హీరాబెన్‌ను ఆప్యాయంగా పలకరించారు. తల్లితో కలిసి విలువైన సమయాన్ని గడిపానని మోదీ చెప్పారు. కాగా, నేటి నుంచి మూడు రోజులపాటు గాంధీనగర్‌లో జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సును మోదీ ప్రారంభించనున్నారు. ఈ భారీ సదస్సుకు దాదాపు 500 సంస్థల సీఈవోలు హాజరు అవుతారు. సోమవారం గాంధీనగర్ రైల్వేస్టేషన్లో రూ.250 కోట్లతో పునర్నిర్మాణ పనులకు మోదీ సోమవారం శంకుస్థాపన చేసిన మోదీ నేడు పలు కార్యక్రమాలకు హాజరై ప్రసంగించనున్నారు. Skipped Yoga & went to meet mother. Before dawn had breakfast with her. Was great spending time together. — Narendra Modi (@narendramodi) 10 January 2017 -
మోదీ సడెన్‌గా దారి ఎందుకు మళ్లించారు?
గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోదీ నేడు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల భేటీకి వెళ్లిన సంగతి తెలిసిందే. పార్టీ నేతల భేటీకి వెళ్లిన ఆయన, అకస్మాతుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే తన దారిని మరలించారు. తన తల్లి హీరాబెన్‌ను చూడటానికి, ఆమె ఆశీర్వాదాలు స్వీకరించడానికి మీటింగ్ వెళ్లే దారిని మరలించి, తన తమ్ముడు పంకజ్ మోదీ ఇంటికి వెళ్లారు. అక్కడే 20 నిమిషాల పాటు మోదీ గడిపినట్టు తెలిసింది. 2 గంటలకు గాంధీనగర్‌లో దిగిన ప్రధాని మోదీ, అనంతరం వెంటనే తన పర్యటన మార్గాన్ని మార్చుకుని పార్టీ ప్రధాన కార్యాలయ ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైసాన్ గ్రామానికి వెళ్లినట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. తల్లి దగ్గరకు వెళ్లిన మోదీ, అక్కడే 20 నిమిషాల పాటు తన సమయాన్ని గడిపారని, అనంతరం తల్లి ఆశీర్వాదం తీసుకుని పార్టీ కార్యకర్తల సమావేశానికి వచ్చినట్టు పేర్కొన్నారు. తన 66వ జన్మదిన సందర్భంగా గతసారి సెప్టెంబర్ 17న తన తల్లి దగ్గరికి మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కొడుకు నిర్ణయాన్ని సమర్థిస్తూ హీరాబెన్ బ్యాంకు వద్దకు వెళ్లి మరి తన పాత నోట్లను మార్చుకుని వచ్చారు. -
తమ్ముడు, మరదలిని ఇంటిపై నుంచి తోసేసింది
-
తమ్ముడు, మరదలిని ఇంటిపై నుంచి తోసేసిన అక్క
► భార్య మృతి, భర్త పరిస్థితి విషమం హైదరాబాద్: ఆస్తి కోసం అక్కాతమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఐడీహెచ్ కాలనీలోని ఓ డబుల్ బెడ్రూం ఇంటిలో భార్యభర్తలైన చందు, జయశ్రీలు నివసిస్తున్నారు. వీరికి మాధురి, సుదీప్ పిల్లలు. ఉమ్మడి ఆస్తి అయిన డబుల్ బెడ్రూం ఇంటి కోసం చందు, తన సోదరి మీరాబాయిల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నారుు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మీరాబాయి తన కుటుంబసభ్యులతో కలసి చందు ఇంటికి వచ్చింది. మరోమారు ఇరువురి మధ్య రేగిన వివాదం తారాస్థారుుకి చేరుకుంది. దీంతో ఆవేశం పట్టలేని మీరాబారుు, కుమారుడు చింటు, కుమార్తె కీర్తి, అల్లుడు బబ్లూ కలసి చందు, జయశ్రీలను బలవంతంగా రెండో అంతస్తు నుంచి కిందికి తోసేశారు. పెద్దశబ్దం వినిపించడంతో కాలనీవాసులు వెళ్లి చూడగా తీవ్రగాయాలతో చందు, జయశ్రీ కిందపడి ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయశ్రీ మృతిచెందగా, చందు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
కో ఆప్టెక్స్ ఎగ్జిబిషన్ సేల్ ప్రారంభం
విజయవాడ(గాంధీనగర్): చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జి జిల్లా పౌరసంబంధాల అధికారి ఎస్వీ మోహన్‌రావు చెప్పారు. స్థానిక ఫిలిం చాంబర్ హాలులో కో ఆప్టెక్స్ దీపావళి ప్రత్యేక ఎగ్జిబిషన్ సేల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత ఉత్పత్తులకు సహాయ, సహకారాలు అందిస్తున్నాయన్నారు. దీపావళిని పురస్కరించుకుని తమిళనాడు హ్యాండ్లూమ్ వీవర్స్ చేనేత కార్మికులు రూపొందించిన ఉత్పత్తులను 30 శాతం ప్రత్యేక రిబేట్‌పై అందిస్తున్నామన్నారు. రీజినల్ మేనేజర్ ఎల్ శేఖర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సేల్‌ను ఈనెల 27వరకు నిర్వహిస్తామన్నారు. కాంచీపురం ఫ్యూర్ సిల్క్, ఆర్నీ, సాఫ్ట్ సిల్క్, తక్కువ ధరల్లో నాణ్యమైన సిల్కు చీరలు అందిస్తున్నట్లు చెప్పారు. కోయంబత్తూరు, సేలం, మధురై, కేరళ కొట్టాయంలకు చెందిన కాటన్ చీరలు, కోర శారీస్, దుప్పట్లు, టవల్స్, లుంగీలు, దోతీలు, డ్రెస్‌మెటీరియల్, డోర్‌మ్యాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. డిస్కౌంట్ అన్ని కో ఆప్టెక్స్ షాపులలో జనవరి 31 వరకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మేనేజర్ ఎం.జగన్నాథన్, డీఆర్ఎం కె.చంద్రశేఖర్, మార్కెటింగ్ మేనేజర్ కె.యువరాజ్, డి రమణ, ఎ.రాజేశ్వర్ పాల్గొన్నారు. -
అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
సిద్దవటం : పెద్దపల్లె పంచాయతీలోని గాంధీనగర్‌కు చెందిన బాలికను కిడ్నాప్, అత్యాచారం చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన టోకించి గోపిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. సిద్దవటం పోలీస్‌స్టేషన్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. 9వ తరగతి చదువుతున్న తమ కుమార్తె కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. మాధవరం–1 గ్రామంలోని శ్రీకోదండరామస్వామి ఆలయం వద్ద నిందితుడిని అరెస్టు చేశామని చెప్పారు. మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ అరుణ్‌రెడ్డి, ఏఎస్ఐ చెన్నయ్య పాల్గొన్నారు. -
రోగులపై వైద్యుల అత్యాచారం
న్యూఢిల్లీ: రెండు వేర్వేరు చోట్ల రోగులపై వైద్యులు రేప్‌లకు పాల్పడ్డారు. రాజధాని ఢిల్లీలో లజపత్‌నగర్‌లోని క్లినిక్‌లో రోగిపై అత్యాచారం జరిపిన 55 ఏళ్ల వైద్యుడు అరెస్టయ్యాడు. సుశీల్ ముంజల్ అనే వైద్యుడు ఈ నెల 2న సొంత క్లినిక్‌లో 24 ఏళ్ల యువతిపై లైంగిక దాడిచేశాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఛాతీ సమస్యతో అక్కడ చికిత్స పొందుతోంది. చెకప్‌కు వచ్చిన సమయంలో డాక్టర్ తన చాంబర్లోకి పిలిచి రేప్ చేశాడని యువతి ఆరోపించింది. వైద్య పరీక్షల్లో ఆమెపై రేప్ జరిగినట్లు నిర్ధరణ అయ్యింది. డెంగీ రోగిపై డాక్టర్ అత్యాచారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో భాట్ ప్రాంతంలోని అపోలో ఆసుపత్రిలో వైద్యుడు అత్యాచారం చేశాడని డెంగీకి చికిత్స పొందుతున్న మహిళ ఆరోపించింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 2 మధ్య చికిత్స చేస్తున్న డాక్టర్ రేప్ చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో విచారణ ప్రారంభమైందని ఇంకా ఎలాంటి అరెస్టులు చేయలేదని పోలీసులు తెలిపారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. -
హార్ధిక్ కు స్వర నమూనా పరీక్ష
అహ్మదాబాద్: దేశ ద్రోహం కేసులో అరెస్టైన హార్ధిక్ పటేల్ కు బుధవారం స్వర నమూనా పరీక్ష నిర్వహించారు. గాంధీనగర్ లోని ఫోరెన్సెనిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ ఎల్)లో హార్థిక్ కు 'వాయిస్ స్పెక్ట్రోగ్రఫీ' పరీక్ష నిర్వహించినట్టు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కేఎన్ పటేల్ తెలిపారు. హార్థిక్ అనుమతితోనే ఈ పరీక్ష చేసినట్టు చెప్పారు. ఫోన్ సంభాషణల ఆధారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. ఫోన్ లో మాట్లాడింది హార్దిక్ అవునో, కాదో తెలుసుకునేందుకు స్వర నమూనా పరీక్ష నిర్వహించారు. ఈ కేసులో హార్థిక్ తో పాటు పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకులు చిరాగ్ పటేల్, దినేశ్ పటేల్, కేతన్ పటేల్, అల్పేశ్ కాతిరియా, అమ్రిశ్ పటేల్ లను కూడా అరెస్ట్ చేశారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతున్న హార్థిక్ పటేల్ పై నమోదైన రెండో రాజద్రోహం కేసు ఇది. అంతకుముందు సూరత్ పోలీసులు ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు. -
సెంచరీ దొంగ మళ్లీ చిక్కాడు...
బన్సీలాల్‌పేట్: వృద్ధులకు మాయమాటలు చెప్పి బంగారు నగలు ఎత్తుకెళ్తున్న ఓ పాతనేరస్తుడ్ని గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.4 లక్షల విలువ చేసే 14 తులాల బంగారు వస్తువులు, ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి కథనం ప్రకారం...రహమత్‌నగర్‌కి చెందిన పల్లి బాబూరావు(51) పాతనేరస్తుడు. మహంకాళి పోలీసులు 1995లో 110 చోరీ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు. సుమారు నాలుగేళ్లు జైలు శిక్షను అనుభవించిన బాబూరావు బయటకు వచ్చాక మళ్లీ చోరీ చేస్తున్నాడు. వృద్ధులు, మహిళలు టార్గెట్... ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న వృద్ధులు, మహిళలను కలిసి అనాథ పిల్లలకు డొనేషన్లు ఇవ్వాలని, రుణాలు ఇప్పిస్తానని చెప్పి మాటల్లోకి దించుతాడు. తర్వాత ఈ ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారని, మెడలోని బంగారు నగలు తీసి దాచుకోమని చెప్తాడు. పట్టుబట్టి మరీ బాధితులతో నగలు తీయిస్తాడు. వాటిని కాగితంలో చుట్టి బ్యాగ్‌లో పడుతున్నట్టు నటించి కాజేస్తాడు. నిందితుడు బాబూరావు బోయిన్పల్లి, అంబర్‌పేట, చిలకలగూడ, కాచిగూడ, హయాత్‌నగర్, గాంధీనగర్ ఠాణాల పరిధిలో ఇలా చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిపై 420, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అడిషినల్ డీసీపీ రామ్మోహన్రావు, చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య పర్యవేక్షణలో గాంధీనగర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి , ఎస్ఐ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ డీలర్ల నిరాహారదీక్ష
గాంధీనగర్ : అధికారులు డీలర్ల మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నారని రేషన్ డీలర్లు మండిపడ్డారు. గాంధీనగర్‌లోని ఏఎస్వో కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు రిలే నిరాహార దీక్షలు బుధవారం చేపట్టారు. దీక్షను సంఘం నాయకుడు గాదె సుబ్బారెడ్డి ప్రారంభించారు. పలువురు డీలర్లు మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చాలీచాలని కమీషన్‌తో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయాన్నారు. చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్షుడు ఎం వెంకట్రావు మాట్లాడుతూ ఈ పోస్తో డీలర్ల నెలకు రూ.5 వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ పోస్ విధానంతో ఆర్థికంగా నష్టపోతున్న డీలర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రావడం లేదని ఆదేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా జీతాలు అందచేయాలని కోరారు. దుకాణాల పనివేళలకు మించి డీలర్లతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. 24వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే 25నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జె శ్రీనివాసరావు, పి శివప్రసాద్, ఐ కిషోర్, ఎం ప్రభాకర్, భోగాల శివప్రసాద్, ఎన్ వెంకటేశ్వరరావు, డి.పి. సీతారామరాజు, పి రామకృష్ణ, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
బాలానగర్ లో అగ్నిప్రమాదం
-
బాలానగర్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలో మరోసారి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాయి. ఈ సంఘటన నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాలానగర్ పారిశ్రామికవాడలో హర్ష ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగడంతో భవనం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. పై అంతస్థు ఇప్పటికే కూలిపోయిందని కూడా తెలుస్తోంది. గత 3 గంటలుగా 8 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ పరిశ్రమలోని మిషన్లు బాగా వేడెక్కడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం. దీంతో పరిశ్రమలో పని చేసే కార్మికులందరూ అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. పరిశ్రమలో అగ్నిప్రమాదంతో భారీగా మంటలు చేలరేగాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
వాణిజ్యం ఎంతో సులభం
గాంధీనగర్: సుస్థిరమైన పన్ను విధానం, పారదర్శకమైన, న్యాయబద్ధమైన విధాన వాతావరణం కల్పించడం ద్వారా.. ప్రపంచ సమాజం వాణిజ్యం చేయడానికి భారతదేశాన్ని అత్యంత సులువైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అన్ని రంగాలు, ప్రాంతాలను అపరిమితంగా అభివృద్ధి చేస్తామని కూడా మాట ఇచ్చారు. రెండేళ్లకు ఒకసారి జరిగే వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సు ఆదివారమిక్కడ ప్రారంభమైంది. మూడు రోజుల సదస్సులో తొలిరోజు.. గుజరాత్లో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులపై వివిధ దేశీయ, విదేశీ కంపెనీలు 31 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏడోసారి జరుగుతున్న ఈ శిఖరాగ్ర సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్‌లతో పాటు అంతర్జాతీయ, దేశీయ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. మోదీ ప్రసంగిస్తూ.. ‘‘నిరాశ, అస్థిరత వాతావరణం ఏడు నెలల కాలంలోనే వెళ్లిపోయాయి. మీకు ఎప్పుడవసరమైనా ప్రభుత్వం చేయూతనిస్తుంది. మీరు ఓ అడుగు ముందుకు వేస్తే.. మీ కోసం మా ప్రభుత్వం రెండడుగులు వేస్తుంది’’ అని అన్నారు. భారతదేశం రూపాంతరం చెందుతోందని, విధాన చోదక పాలనను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అభివృద్ధిని పెంపొందించేందుకు, ఉద్యోగసృష్టిని ప్రోత్సహించేందుకు తయారీపరిశ్రమకు ఊతమివ్వాలని అన్నారు. దీనికోసం ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వేగవంతమైన, సమీకృత అభివృద్ధికి కృషి గత ఐదేళ్లలో ఆర్థికాభివృద్ధి మందగించిందని.. ఇప్పుడు తన ప్రభుత్వం వేగవంతమైన, సమీకృతమైన అభివృద్ధిని సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల చక్రాన్ని వేగంగా పూర్తిచేయటానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ - ప్రయివేటు పెట్టుబడుల ద్వారా ప్రధానంగా.. రహదారులు, గ్యాస్ గ్రిడ్లు, విద్యుత్, నీటి వ్యవస్థలు, సాగునీటి పారుదల, నదుల ప్రక్షాళన వంటి మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామని వివరించారు. ప్రాథమిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు గత ఏడాది వృద్ధి రేటుకన్నా ఒక్క శాతం పెరిగిందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండోదేశంగా ఉంటుందని ఐఎంఎఫ్ జోస్యం చెప్పిందని ఉటంకించారు. గాంధీ చూపిన మార్గంలో నడవాలి... మహాత్మా గాంధీ సూచించిన మార్గంలో నడవాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘చిట్టచివరి మనిషి గురించి మహాత్మా గాంధీ సరిగ్గా చెప్పారు. గాంధీజీ సందేశం మనకు మార్గాన్ని చూపగలదు. ఈ కార్యక్రమం ఇచ్చే ఉత్తమ ఫలితం.. మనం శ్రద్ధ పెట్టాల్సిన, అభివృద్ధి చేయాల్సిన ప్రజా సమూహాలను చేర్చుకోవటం, వారికి స్థానమివ్వటం కావాలి’’ అని పేర్కొన్నారు. సదస్సులో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. రక్షణ రంగ తయారీ, కొనుగోళ్లకు సంబంధించి రెండు మూడు నెలల్లో పారిశ్రామిక అనుకూలమైన విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఉగ్ర నిరోధంలో సహకారంపై చర్చలు ఉగ్రవాద వ్యతిరేక సహకారం, మరింతగా ఆర్థిక సంబంధాలు తదితర అంశాలపై ప్రధాని మోదీ ఆదివారం నాడు అమెరికా, కెనడా దేశాల సీనియర్ నాయకులతో చర్చించారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు హాజరైన అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీతో సమావేశమైన మోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరలో చేపట్టనున్న భారత పర్యటన అంశంపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక సహకారం, ఆర్థిక అంశాలు, ప్రాంతీయ అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చాయని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. కెనడా పౌరసత్వ, వలస విభాగం మంత్రి క్రిస్ అలెగ్జాండర్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనూ ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలకాంశంగా చర్చకు వచ్చింది. కెనడా పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడిని మోదీ ఖండించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదని ఉద్ఘాటించారు. అలాగే.. తాను కెనడా పర్యటనకు వెళ్లే అంశంపైనా మోదీ చర్చించారు. ఇజ్రాయెల్ వ్యవసాయ మంత్రి యాయిర్ షమీర్తోనూ మోదీ సమావేశమయ్యారు. వ్యవసాయ రంగంలో ఆ దేశం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు. ఇరాన్ అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుడైన అక్బర్ టోర్కాన్తోనూ మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో చాబాహార్ పోర్ట్ ప్రాజెక్టు అమలు ప్రగతిపై సమీక్షించారు. ఐరాససెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జియ్యాంగ్కిమ్లతో వేర్వేరుగా భేటీ అయిన మోదీ.. వాతావరణ మార్పులు, కాలుష్య రహిత ఇంధనశక్తి అంశాలపై చర్చించారు. మాసిడోనియా ప్రధానమంత్రితో మోదీ భేటీలో.. వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలను పెంపొందించుకోవాలని ఇరుపక్షాలూ అంగీకరించాయి. రష్యాలోని ఆస్ట్రాకాన్ గవర్నర్ ల్కిన్తో భేటీ సందర్భంగా.. భారత్ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అన్ని రంగాలు, ప్రాంతాలను అపరిమితంగా అభివృద్ధి చేస్తాం -
మోదీ విజన్‌కు కెర్రీ ఫిదా!
ప్రధాని కార్యక్రమాలపై అమెరికా విదేశాంగ మంత్రి ప్రశంసల జల్లు గాంధీనగర్: ప్రధాని మోదీ విజన్‌పై అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మేకిన్ ఇండియా’, ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ కార్యక్రమాలు అద్భుతమన్నారు. సమ్మిళిత వృద్ధిని కాంక్షించే ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ నినాదం విశ్వవ్యాప్తం కావాలని అభిలషించారు. ఆదివారమిక్కడ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కెర్రీ ప్రసంగించారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఇంతకుమించిన మంచి తరుణం దొరకదని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి మేకిన్ ఇండియా నినాదం ‘గెలువు-గెలిపించు’ స్ఫూర్తిగా నిలవాలన్నారు. రైళ్లలో టీ అమ్ముకున్న ఒక వ్యక్తి భారత అత్యున్నత పీఠంపై కూర్చున్నారంటూ మోదీని అభినందించారు. ‘ఈరోజు సరికొత్త భారత నిర్మాణానికి జరుగుతున్న ఈ కార్యక్రమంలో సంతోషంగా భాగస్వాములం అవుతున్నాం. ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం నన్నెంతో ఆకట్టుకుంది’ అని అన్నారు. మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకారం అందిస్తామన్నారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు తమ అధ్యక్షుడు ఒబామా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. భారత్‌తో వాణిజ్య బంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని కెర్రీ పేర్కొన్నారు. ‘వస్తువులు, సేవలకు సంబంధించిన వాణిజ్యం ఇరుదేశాల మధ్య 2000 సంవత్సరంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడులు 30 బిలి యన్ డాలర్లకు చేరాయి. ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరగాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగా మేం కూడా చర్యలు చేపడతాం. ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్యమే నెరవేరుస్తుందని నిరూపించే ఉమ్మడి బాధ్యత రెండు దేశాలపైనా ఉంది’ అని వ్యాఖ్యానించారు. అనంతరం కెర్రీ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆయన ఇక్కడి గాంధీ ఆశ్రమా న్ని కూడా సందర్శించి మహిళలతో ముచ్చటించారు. ఆయన వెంట అహ్మదాబాద్‌కు చెందిన నిషా బిస్వాల్ ఉన్నారు. ఆమె ప్రస్తు తం అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖకు ఉపమంత్రిగా ఉన్నారు. -
భారత్‌లోనే కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి
-
బెజవాడ శైలజా థియేటర్లో అగ్నిప్రమాదం
-
బెజవాడ శైలజా థియేటర్లో అగ్నిప్రమాదం
విజయవాడ: విజయవాడ గాంధీనగర్‌లోని శైలజా సినిమా థియేటర్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ విషయాన్ని గమనించిన భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఆ థియేటర్ యాజమాన్యం థియేటర్‌కు చేరుకున్నారు. సీలింగ్ లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామని వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అయినా థియేటర్ యాజమాన్యం మాత్రం స్పందించలేదని తెలిపారు. ఇటువంటి థియేటర్స్పై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సినిమా ప్రదర్శన జరుగుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఉంటే భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. థియేటర్ యాజమాన్యానికి నోటీలసు జారీ చేస్తామని చెప్పారు. -
సొంత ఇల్లు ఉన్నా టెంటు నీడన..
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సంగని సాయిబాబా ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాకు కుటుంబం సహా వెళ్లారు. ఇక్కడ ఉన్న ఆయన నివాస గృహాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చారు. సర్వే కోసం సోమవారం స్వగ్రామానికి వచ్చారు. అద్దెకు ఉన్నవారు ఇంటికి తాళం వేసుకుని తమ ప్రాంతానికి సర్వే కోసం వెళ్లిపోయారు. దీంతో సాయిబాబా ఇంటి ఎదుట ఒక టెంటును ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపి సర్వేలో వివరాలను నమోదు చేయించుకున్నారు. -
గుజరాత్ నూతన గవర్నర్‌గా ఓపీ కోహ్లీ
గాంధీనగర్: గుజరాత్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ ఓపీ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. కోహ్లీని గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారని అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరిష్ సిన్హా లేఖ చదివి వినిపించారు. 78 ఏళ్ల ఓపీ కోహ్లీ గుజరాత్ కు 24వ గవర్నర్ కావడం గమనార్హం. డాక్టర్ కమలా బెనీవాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బెనీవాల్ (87) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నప్పటికీ కేంద్రం ఆమెపై బదిలీ వేటు వేసింది. ఆమెను మిజోరం గవర్నర్‌గా నియమించింది. -
మోడీ సర్కార్ తొలి చట్టం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బిల్లు ఆమోదం న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) సంస్థ జాతీయ ప్రాముఖ్యం గల సంస్థగా రూపుదాల్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు బుధవారం పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీనితో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తొలి చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినట్టయింది. గత సోమవారం రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. బిల్లు ఆమోదంతో, వివిధ కోర్సులలో విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసేందుకు ఎన్‌ఐడీకి అధికారం లభించింది. దీంతో ఎన్ఐడీ జాతీయ స్థాయి సంస్థగా రూపుదాల్చుతుందని, విద్యార్థులకు పీజీ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలను అందిస్తుందని కేంద్రవాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఎన్ఐడి: నర్సయ్య గౌడ్ అంతకు ముందు బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొంటూ, ఎన్ఐడీని హైదరాబాద్‌లో కూడా నెలకొల్పాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. హైదరాబాద్‌కు మంజూరైన ఎన్ఐడీని విజయవాడకు తరలిస్తున్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించిందన్నారు. విజయవాడకు ఎన్ఐడీని తరలించినప్పటికీ.. హైదరాబాద్‌లో కూడా మరో ఎన్ఐడీని ఏర్పాటుచేయాలని కోరారు. -
రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఆనందీబెన్
-
రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఆనందీబెన్
గాంధీనగర్: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్(73) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజరాత్ బీజేపీ శాసనసభపక్ష నాయకురాలిగా ఆమె ఎన్నికయ్యారు. సీఎం పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేసిన వెంటనే ఆమెను బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకున్నారు. గుజరాత్లో నరేంద్ర మోడీ సాధించిన ప్రగతిని కొనసాగిస్తానని ఆనందీబెన్ పటేల్ ఈ సందర్భంగా హామీయిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మధ్యలో ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆనందీబెన్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. గుజరాత్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనందీ బెన్ ఒక్కరే కావడం విశేషం. -
అక్షరధామ్‌పై దాడి నిందితుల విడుదల
స్వాగతించిన ముంబై న్యాయవాదులు ముంబై: గాంధీనగర్‌లోని అక్షరధామ్ దేవాలయంపై ఉగ్రవాదుల దాడికేసులో ఆరుగురు నిందితులను సుప్రీం కోర్టు విడుదల చేయడాన్ని ముంబై న్యాయవాదులు స్వాగతించారు. ప్రభుత్వ న్యాయవాది నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో ఆరుగురు నిందితులను విడుదల చేశారని జమాయత్ ఉలేమా ఇ మహారాష్ట్ర (జేయూఈఎమ్)న్యాయవాది గుల్జార్ అజ్మీ తెలిపారు. ఆ సంస్థ నిందితుల తరపున ఉచితంగా వాదించింది. పోటా చట్టం కింద తప్పుడు కేసులు బనాయిస్తూ, ఆ తరువాత గుజరాత్ కోర్టు శిక్షకు గురవుతున్న అమాయక ముస్లిం యువత కేసులు వాదించడం కోసం జేయూఈఎమ్ పనిచేస్తోంది. ఇందులో పలువురు ప్రముఖ క్రిమినల్ న్యాయవాదులతోపాటు మాజీ సొలిసిటర్ జనరల్ అమ్రిందర్ శరణ్ కూడా ఉన్నారు. ప్రధానిగా నరేంద్రమోడీ ఎన్నికవ్వడం గుజరాత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని అన్నారు. శిక్షకు వ్యతిరేకంగా నిందితుల అభ్యర్థనను స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సహేతుక సందే హం కింద... వారిమీద ఎలాంటి నేరారోపణ చేయలేకపోవడంతో ఆరుగురిని విడుదల చేసింది. ఆరుగురు నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల కారాగార శిక్ష పడిన సంగతి విదితమే. -
ఓటు హక్కును వినియోగించుకున్న మోడీ
-
మోడీతో అమెరికా రాయబారి భేటీ
గాంధీనగర్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ సమావేశమయ్యారు. ఈ ఉదయం గాంధీనగర్‌లోని మోడీ నివాసానికి చేరుకుని ఆయనతో నాన్సీ పావెల్ భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల కిందట మోడీపై విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన మోడీ సారథ్యంలో ఎన్డీఏ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడించడంతో మోడీతో సంబంధాలు పునరుద్ధరించాలని అమెరికా భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మోడీపై తమ వైఖరి మారలేదని అమెరికా నిన్న స్పష్టం చేసింది. 2002 నాటి గోధ్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్లను కారణంగా చూపి 2005లో మోడీకి దౌత్య వీసా ఇచ్చేందుకు నిరాకరించడంతోపాటు టూరిస్ట్, బిజినెస్ వీసాలను అమెరికా ఉపసంహరించింది. -
‘సాక్షి’ కథనం నిజమైంది
పలమనేరు, న్యూస్‌లైన్: పలమనేరులో జరిగిన పోలీసు జంట హత్యలు కేవలం పది నిమిషాల వ్యవధిలో జరిగాయని ఆదివారం పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని ‘సాక్షి’ అప్పట్లోనే ప్రచురించింది. కానిస్టేబుళ్ల హత్య కేసులో కొత్తకోణం, ప్రేమ జంటను బెదిరిస్తే డబ్బులే డబ్బులు అనే శీర్షికల్లో కథనాలు వెలువడ్డాయి. ఆ పదినిమిషాల్లో ఏం జరిగిందంటే... గత ఏడాది డిసెంబర్ 1న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గాంధీనగర్ అటవీ ప్రాంతం నుంచి బాల వినాయగర్ స్థానిక స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ మహేష్‌కు అటవీ ప్రాంతంలో ఓ యువతితో పాటు ఆటోలో ఓ వ్యక్తి వెళ్తున్నట్లు సమాచారమిచ్చాడు. సాయంత్రం 5.08 నిమిషాలకు కానిస్టేబుల్ మహేష్ ఈ విషయాన్ని బ్లూకోల్ట్ సిబ్బంది జవహర్లాల్ నాయక్‌కు ఫోన్లో చెప్పాడు. నాయక్‌తో పాటు హోమ్‌గార్డు దేవేంద్రకుమార్ బైక్‌లో గాంధీనగర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. 5.15 నిమిషాలకు ఇక్కడెవరూ లేరని నాయక్ కాల్ చేశాడు. దీంతో మహేష్ బాలవినాయగర్కు ఫోన్ చేశాడు. ఆపై నాయక్‌కు ఫోన్ చేసి ఇంకొంచెం ముందుకెళ్లాలని సూచించాడు. ఆ తర్వాత 5.21 నిమిషాలకు మరోసారి నాయక్‌కు రింగ్ చేయగా అతను పిక్ చేయలేదు. ఆపై 5.27 నిమిషాలకు మహేష్ మరోమారు నాయక్ ఫోన్‌కు రింగ్ చేసినా అతను తీయలేదు. దీంతో దేవేంద్ర సెల్‌కు ఫోన్ చేసినా అతనూ తీయలేదు. ఆపై వీరిద్దరి మొబైళ్లకు చాలా కాల్స్ వచ్చినా ఎవరూ పిక్ చేయలేదు. దీన్నిబట్టి 5.21 నుంచి 5.30లోపే ఈ హత్యలు జరిగాయి. వీరిరువురూ అటవీ ప్రాంతంలోకెళ్లగానే ఓ పల్సర్ వాహనం కనిపించింది. ఆ వాహన నంబర్‌ను హోమ్‌గార్డు దేవేం ద్ర తన చేతిపై రాసుకున్నాడు. అక్కడి నుంచి కొంత ముందుకెళ్లగానే అప్పటికే అక్కడ ప్రేమ జంటల కోసం కాపుగాచి ఉన్న వెల్లియప్పన్, కాశీలు వీరికి ఎదురుగా వచ్చారు. ఎవరు మీరు..ఇక్కడేం చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. తాము సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో కూలిపని చేసుకుంటామని నమ్మబలికారు. వారు కొంతదూరం వెళ్లగానే అనుమానం వచ్చి పోలీసులు వెంబడించారు. తొలుత దేవేంద్ర వెల్లియప్పన్ను పట్టుకోగా అతను ముళ్లపొదల్లో దాక్కునేందుకు ప్రయత్నించాడు. భారీకాయుడైన వెల్లియప్పన్ను దేవేంద్ర పైకి లేపే క్రమంలో తన ఆటోమెటిక్ కత్తితో దేవేంద్ర కిడ్నీ వద్ద పొడిచాడు. ఆపై తలపై కాళ్లతో తొక్కి ఊపిరాడకుండా చంపేశాడు. మరోవైపు కాశీని వెంబ డించిన జవహర్లాల్ నాయక్ అతన్ని పట్టుకొనే లోపే వెల్లియప్పన్ అక్కడికెళ్లి ఆ కానిస్టేబుల్‌నూ కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై హంతకులిద్దరూ మెయిన్ రోడ్డు వైపు వచ్చి పల్సర్ వాహనంలో బంగారుపాళ్యం వైపు వెళ్లిపోయారు. సంఘటనా స్థలంలో దొరికిన పౌచ్ నిందితులదే హోమ్‌గార్డు దేవేంద్రను హతమార్చిన చోటే హంతకుడు వెల్లియప్పన్ తన పౌచ్‌ను వదిలిపెట్టాడు. ఈ పౌచ్‌ను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక దేవేంద్ర చేతిపై రాసుకున్న నంబర్ హంతకులు చోరీ చేసి వాడిన పల్సర్ నంబర్‌గా బయటపడింది. నేడు పలమనేరు కోర్టుకు హంతకులు హంతక ముఠాను సోమవారం పలమనేరు కోర్టులో హాజరు పరచనున్నారు. పోలీసులు ప్రత్యేక వాహనాల్లో ఎనిమిది మంది నిందితులను ఆదివారం రాత్రి పలమనేరుకు తీసుకొచ్చారు. వీరిలో వెల్లియప్పన్ అలియాస్ సంపత్, కాశీలతో పాటు ఇతర నేరాలకు సంబంధించిన ప్రేమ్, స్థానికులు రామిరెడ్డి, రాజేంద్రలను స్థానిక స్టేషన్లో ఉంచారు. మిగిలిన ముగ్గురినీ కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏడాదిగా పలమనేరులోనే హంతకుల మకాం పలమనేరు పోలీసులను పొట్టన పెట్టుకున్న కరుడుగట్టిన అంతర్రాష్ట్ర ముఠా ఏడాదిగా పలమనేరులోనే ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తమిళనాడు రాష్ర్టం సేలం సమీపంలోని సంఘగిరికి చెందిన వెల్లియప్పన్(28), మురుగన్ అలియాస్ కాశీ (25)లు తమిళనాడు, కర్ణాటకతో పాటు జిల్లాలోని పలుచోట్ల హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, చోరీలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ గ్యాంగ్‌కు సురక్షితమైన ప్రాంతంగా పలమనేరును ఎంచుకొన్నారు. పట్ట ణ సమీపంలోని డిగ్రీ కళాశాల వెనుక వైపు ఓ అద్దె ఇంట్లో కొన్నాళ్లుగా ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా పట్టణ సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద నాలుగు నెలల పాటు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ సమయంలో ఈ గ్యాంగ్ నక్కపల్లెకు చెందిన రామిరెడ్డి, కేటిల్ఫామ్కు చెందిన విజయకుమార్‌లు సహాయ సహకారాలు అందించారు. దీంతో పాటే ఆ గ్యాంగ్‌తో కలసి పలు నేరాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్‌కు చెందిన బొమ్మి అనే యువతిని కేటిల్ఫామ్లోనే తమతో పాటు ఈ ముఠా ఉంచుకున్నట్లు తేలింది. దీంతో పాటు బెరైడ్డిపల్లె మండలం కడతట్లపల్లెకు చెందిన రాజేంద్ర, తవణంపల్లె మండలం కృష్ణాపురానికి చెందిన ప్రతాప్‌లు వీరికి పరిచయమై, అవసరమైన సాయం చేసేవారు. వీరితో పాటు సేలంకు చెందిన ప్రేమ్, రాఘవన్, మిలటరీ ఉద్యోగి గోవిందస్వామి, కాలప్ప, గోవిందప్పలు ఈ ముఠాలో కీలకమైన వారు. వీరందరికీ పలమనేరు ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఈ క్రమంలోనే వెల్లియప్పన్, కాశీలు డిసెంబర్ 1న గాంధీనగర్ అటవీ ప్రాంతంలో ప్రేమ జంటల కోసం కాపుగాచి ఉండగా ఈ హత్యలు జరిగాయి.