
రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఆనందీబెన్
గాంధీనగర్: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్(73) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజరాత్ బీజేపీ శాసనసభపక్ష నాయకురాలిగా ఆమె ఎన్నికయ్యారు. సీఎం పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేసిన వెంటనే ఆమెను బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకున్నారు.
గుజరాత్లో నరేంద్ర మోడీ సాధించిన ప్రగతిని కొనసాగిస్తానని ఆనందీబెన్ పటేల్ ఈ సందర్భంగా హామీయిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మధ్యలో ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆనందీబెన్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. గుజరాత్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనందీ బెన్ ఒక్కరే కావడం విశేషం.