గాంధీనగర్: ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ‘పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం’ లబ్ధిదారులతో ఆయన సంభాషించారు. అలాగే ‘గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీటింగ్ అండ్ ఎగ్జిబిషన్’ (రీ-ఇన్వెస్ట్ 2024) నాలుగో ఎడిషన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూడవ సారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేశామన్నారు. ప్రతి రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించామన్నారు. యూపీలోని అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.
భారతదేశంలో కనిపించే వైవిధ్యం, సామర్థ్యం, పనితీరు అన్నీ ప్రత్యేకమైనవేనని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ‘ఇండియన్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ అప్లికేషన్స్’ అని అంటున్నానని, దీనిని ప్రపంచం కూడా అర్థం చేసుకుంటుందన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ అగ్రగామిగా నిలిచిందని, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన విధానం, గ్రీన్ హైడ్రోజన్ విధానం హరిత భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయన్నారు. గుజరాత్‌లో పునరుత్పాదక శక్తి స్థాపిత సామర్థ్యం 50 వేల మెగావాట్లను దాటింది. సోలార్ ఎనర్జీ ఇన్‌స్టాలేషన్‌లో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పటేల్ అన్నారు.
ఇది కూడా చదవండి: కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే!
Comments
Please login to add a commentAdd a comment