ప్రధాని మోదీ ఇంటికి ప్రత్యేక అతిథి.. వీడియో వైరల్‌ | Special Guest Came to PM Modi House | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ ఇంటికి ప్రత్యేక అతిథి.. వీడియో వైరల్‌

Published Sat, Sep 14 2024 1:27 PM | Last Updated on Sat, Sep 14 2024 1:31 PM

Special Guest Came to PM Modi House

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాను ప్రత్యేకంగా ఏమి చేసినా దానిని ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఇవి త్వరగా వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ప్రధాని మోదీ ఇంటికి ఒక చిన్న ప్రత్యేక అతిథి వచ్చింది. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా తెలియజేశారు. ఈ అతిథికి పేరు కూడా పెట్టినట్లు మోదీ పేర్కొన్నారు.
 

ప్రధాని మోదీ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో ‘మన శాస్త్రాల్లో చెప్పినదాని ప్రకారం గోమాత మనకు సర్వసుఖాలను అందిస్తుంది. ప్రధానమంత్రి కుటుంబంలోకి కొత్త సభ్యురాలు  అడుగుపెట్టింది. ప్రధానమంత్రి నివాసంలో గోమాత కొత్త దూడకు జన్మనిచ్చింది. దాని నుదుటిపై జ్యోతి గుర్తు ఉంది. అందుకే దానికి 'దీప్‌జ్యోతి' అని పేరు పెట్టాను’ అని పేర్కొన్నారు.
 

ఆ దూడకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ షేర్‌ చేశారు. అందులో ప్రధాని మోదీ దీప్‌జ్యోతిని ప్రేమగా నిమురుతూ కనిపిస్తున్నారు. మోదీ తన ఇంటిలోని పూజాగదిలో దీప్‌జ్యోతికి  పూలమాల వేసి, తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించడం కనిపిస్తుంది. దీప్‌జ్యోతి కూడా ప్రధానమంత్రికి చాలా సన్నిహితంగా మెలుగుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు.
 

ఇది కూడా చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement