came
-
బహ్రాయిచ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గామాత విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో ఒక యువకుడు మృతి చెందిన దరిమిలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐదు వేల మంది స్థానికులు మహసీ తహసీల్ కార్యాలయం ముందు ఆ యువకుని మృతదేహాన్ని ఉంచి, నిరసనకు దిగారు.బహ్రాయిచ్ జిల్లాలోని మహరాజ్‌గంజ్ మార్కెట్లో ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీనిలో ఒక యువకుడు మృతిచెందాడు. రామ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహువా మన్సూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బహ్రాయిచ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న దరిమిలా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటువైపుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.రెహువా మసూర్ గ్రామస్తులు దుర్గామాత విగ్రహంతో నిమజ్జనానికి వెళుతూ, డీజేను ప్లే చేశారు.దీంతో ఆగ్రహంచిన మరోవర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మరోవర్గం జరిపిన కాల్పుల్లో రామ్ గోపాల్ మిశ్రా(22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. యువకుని మృతితో ఉద్రిక్తతలు మరింగా పెరిగాయి. వేలాది మంది గ్రామస్తులు నిరసనకు దిగారు. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి, షోరూంకు నిప్పు పెట్టారు. పలు ఇళ్లకు కార్లకు కూడా నిప్పు పెట్టారు.నిరసనకు దిగిన వారితో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి లేదు. అయితే ఈ కేసులో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదిపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
ప్రధాని మోదీ ఇంటికి ప్రత్యేక అతిథి.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాను ప్రత్యేకంగా ఏమి చేసినా దానిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇవి త్వరగా వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ప్రధాని మోదీ ఇంటికి ఒక చిన్న ప్రత్యేక అతిథి వచ్చింది. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా తెలియజేశారు. ఈ అతిథికి పేరు కూడా పెట్టినట్లు మోదీ పేర్కొన్నారు. हमारे शास्त्रों में कहा गया है - गाव: सर्वसुख प्रदा:'। लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है। प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है। इसलिए, मैंने इसका नाम 'दीपज्योति'… pic.twitter.com/NhAJ4DDq8K— Narendra Modi (@narendramodi) September 14, 2024ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ‘మన శాస్త్రాల్లో చెప్పినదాని ప్రకారం గోమాత మనకు సర్వసుఖాలను అందిస్తుంది. ప్రధానమంత్రి కుటుంబంలోకి కొత్త సభ్యురాలు అడుగుపెట్టింది. ప్రధానమంత్రి నివాసంలో గోమాత కొత్త దూడకు జన్మనిచ్చింది. దాని నుదుటిపై జ్యోతి గుర్తు ఉంది. అందుకే దానికి 'దీప్జ్యోతి' అని పేరు పెట్టాను’ అని పేర్కొన్నారు. ఆ దూడకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ షేర్ చేశారు. అందులో ప్రధాని మోదీ దీప్జ్యోతిని ప్రేమగా నిమురుతూ కనిపిస్తున్నారు. మోదీ తన ఇంటిలోని పూజాగదిలో దీప్జ్యోతికి పూలమాల వేసి, తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించడం కనిపిస్తుంది. దీప్జ్యోతి కూడా ప్రధానమంత్రికి చాలా సన్నిహితంగా మెలుగుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు. A new member at 7, Lok Kalyan Marg! Deepjyoti is truly adorable. pic.twitter.com/vBqPYCbbw4— Narendra Modi (@narendramodi) September 14, 2024ఇది కూడా చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది -
మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..!
ఈ భూమి మీద నూకలున్నంత వరకూ ప్రాణం ఎలాగైనా నిలబడుతుందంటారు. ఇది 38 ఏళ్ల మహిళ విషయంలో నిరూపితమయ్యింది. ఒక భారీ మెసలి ఆమెపై దాడి చేసింది. నీటిలోతుల్లోకి లాక్కుపోయింది. గంట పాటు ఆ మహిళను మొసలి నోటిలో చిక్కుకుని విలవిలలాడిపోయింది. అయితే అప్పుడే అద్భుతం జరిగింది. ఆమె ప్రాణాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ఆమె కథ విపరీతంగా వైరల్ అవుతోంది. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం 38 ఏళ్ల ఫమ్లిరా.. పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. ఇటీవల ఆమె ఒక నదిలో నీటిని పాత్రలో పట్టుకుంటోంది. ఆ నదిలో మొసళ్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదు. ఇంతలో ఒక మొసలి క్షణాల్లో ఆమెను నీటిలోనికి లాక్కుపోయింది. ఫ్లమిరా బాధతో తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు పనిచేసే కూలీలు ఆమెను కాపాడేందుకు పరుగులు పెట్టారు. వారు ఆ మొసలిని కర్రలతో కొట్టాసాగారు. దీంతో బాధితురాలు ఆ మెసలి నోటి బారి నుంచి ఎలాగోలా బయటపడింది. అయితే ఆమెను కాపాడేందుకు కూలీలు గంటకుపైగా శ్రమించారు. ఈ సమయంలో ఫల్మిరా కూడా మొసలి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. అటు కూలీల దాడి, ఇటు బాధితురాలి పెనుగులాట మధ్య ఆ మొసలి ఆమెను తన నోటి నుంచి విడిచిపెట్టింది. బాధితురాలిని మొసలి బారి నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కొందరు గాయాలపాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఫమ్లిరా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మొసలి నోటికి చిక్కిన తాను దాని బారి నుంచి బయటపడుతాననుకోలేదన్నారు. ఇప్పటికీ తన కళ్ల ముందు మొసలి ఉన్నట్లుందన్నారు. కాగా మొసలి దాడిలో ఫల్మిరా పాదాలకు, ఉదర భాగానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు? -
సారొచ్చారొచ్చారు
- నూతన కలెక్టర్ కాకినాడకు రాక - పాత కలెక్టర్ అరుణ్ కుమార్ సాదర స్వాగతం సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొత్త సారథి వచ్చేశారు. ఆయన రాకతో రెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న పాత సారథికి వీడ్కోలు పలికారు. ఇదంతా బుధవారం రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగింది. రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేటు కారులో కాకినాడ కలెక్టర్ బంగ్లాకు రాత్రి 7.30 గంటలకు వచ్చారు. బంగ్లాలో ప్రస్తుత కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్‌తో సుమారు గంట సేపు భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. జిల్లా పాలనా వ్యవహారాలు, భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై సుమారు గంటపాటు ఇద్దరూ చర్చించుకున్నారు. అనంతరం ప్రస్తుత కలెక్టర్ అరుణ్‌కుమార్ విధుల నుంచి రిలీవ్ అవుతున్నట్టు రికార్డుల్లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం ఆర్డీఓలు రఘుబాబు, విశ్వేశ్వరరావు, కొమ్ముల సుబ్బారావు, సమాచార శాఖ డీడీ ఫ్రాన్సిస్ తదితర అధికారులు బంగ్లాలో కొత్త కలెక్టర్ కార్తికేయను కలిసి స్వాగతం పలికారు. కొత్త కలెక్టర్‌ను పరిచయం చేసుకున్నాక రామచంద్రపురం, పెద్దాపురం ఆర్డీఓలను తమ, తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని చెప్పిన కొత్త కలెక్టర్ మిశ్రా కాకినాడ ఆర్డీఓ రఘుబాబుకు మాత్రం ఉదయం రావాలని సూచించారు. కలెక్టర్ బంగ్లా నుంచి రాత్రి 8.30 గంటలకు కార్తికేయ కలెక్టరేట్ ఆవరణలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుని అక్కడే బస చేశారు. అరుణ్‌కుమార్ రిలీవ్ కావడంతో కొత్త కలెక్టర్ మిశ్రా బాధ్యతలు తీసుకోవడం ఇక లాంఛనమేనంటున్నారు. మిశ్రా గురువారం ఉదయం 10 గంటల తరువాత మిశ్రా జిల్లా 145 కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ మిశ్రా ఇంతవరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూ తొలిసారి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన మిశ్రా ఇంత పెద్ద జిల్లా పాలనను ఎలా నిర్వహిస్తారా అని అటు జిల్లా యంత్రాంగం, ఇటు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండేళ్లపాటు ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి రిలీవ్ అయిన అరుణ్‌కుమార్ స్త్రీ, శిశుసంక్షేమశాఖ కమిషనర్‌గా వెళ్లనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పదోన్నతిపై కర్నూలు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జేసీగా ఎవరు వస్తారనేది ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది. జేసీ పోస్టు కోసం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు, కాకినాడ పోర్టు డైరెక్టర్ ప్రసన్నవెంకటేష్ ప్రయత్నాల్లో ఉన్నారని అధికారవర్గాల ద్వారా తెలియవచ్చింది. -
అప్పుడు అదృశ్యం...ఇప్పుడు ప్రత్యక్షం
20 ఏళ్ల క్రిందట అదృశ్యమైన తమ్ముడు ఆకస్మికంగా ప్యత్యక్షం ... ఆ కుటుంబాల్లో ఆనందం ఇరవై ఏళ్ల కిందట ... పదిహేనేళ్ల వయసులో ఇంట్లో అలిగి పారిపోయాడు. కడుపు మాడితే వాడే వస్తాడులే అనుకున్నారు. ఒకటి, రెండు రోజులు ఎదురు చూశారు. అప్పటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఒక్కటై వెదికారు. ఫలితం కనిపించలేదు. ఆశలు వదులుకున్నారు. ఈ ఘటన 1997 మే నెలలో జరిగింది. 20017 ఏప్రిల్ నెల ... సరిగ్గా 20 ఏళ్ల తర్వాత నాడు అదృశ్యమైన కుర్రాడు ఓ కేసు విచారణలో ఊరు పేరు బయటపడడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి తన కుటుంబ సభ్యులను పిలిపించడంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకున్నాయి. - అమలాపురం టౌన్ 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామానికి చెందిన శిరగం బాలకృష్ణ అన్నదమ్ములు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించే వారు. ఆ అన్నదమ్ముల్లో చివరి వాడైన శిరగం రాంబాబు (15) తన అన్నల వ్యాపారంలో తన వంతు సాయపడేవాడు. వీరి తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించారు. దీంతో రాంబాబు తన ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు దగ్గరే పెరిగాడు. ఓ రోజు ఇంట్లో కోపగించి హైదరాబాద్ వెళ్లిపోయాడు. కొన్నాళ్లు రాంబాబు కోసం బంధువులు, స్నేహితులు ఇళ్ల వద్ద గాలించినా ప్రయోజనం లేదు. ఈ లోపు అక్కలకు పెళ్లిళ్లు కావడం, అన్నయ్యలు పండ్ల వ్యాపారాలతో వేరే గ్రామాల్లో స్థిరపడ్డారు. ఎక్కడెక్కడ పనిచేశాడు.. రాంబాబు ఇంట్లోంచి 15వ ఏట వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడే ఇరవై ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ షామియానా షాపులో కూలీగా పదేళ్లు పనిచేశాడు. బోయినపల్లిలో ఓ పంక్షన్ హాలులో మరో పదేళ్లు కూలీగా పనిచేశాడు. అయితే మూడు నెలల క్రితం అమలాపురం వచ్చి పట్టణంలోని ఓ పాత ఇనుము, ప్లాస్టిక్ సామాన్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. పోలీసు స్టేషన్‌కు వచ్చిందిలా.. పట్టణంలో మంగళవారం సాయంత్రం రోడ్డుపై రాంబాబు, మరో వ్యక్తి ఓ విషయమై గొడవ పడ్డారు. అవతలి వ్యక్తి ఫిర్యాదుతో రాంబాబును స్టేషన్ క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు స్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారించారు. అసలు నీది ఏ ఊరు?, నీ వాళ్లు ఎవరు? అని ఆరా తీశారు. రాంబాబు మాది సాకుర్రు గ్రామమని, గతంలో ఇళ్లు విడిచి వెళ్లిపోయానని... ఇప్పుడు మా వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని బదులిచ్చాడు. దీంతో పోలీసులు సాకుర్రులోని రాంబాబు బంధువులను రప్పించి సమాచారం చెప్పారు. అంబాజీపేటలో ఉంటున్న రాంబాబు అన్నయ్య బాలకృష్ణకు, సాకుర్రులో ఉంటున్న అక్క నల్లా ఆదిలక్ష్మి కుటుంబాలకు బంధువులు సమాచారం అందించి బుధవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌కు రప్పించారు. 20 ఏళ్ల తర్వాత రాంబాబును చూసి అన్నయ్య, అక్క కుటుంబాల వారు ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు వారి ఆనందానికి అవుధుల్లేవు. మొత్తానికి కథ కంచికి.. రాంబాబు ఇంటికి చేరాడు. -
అన్నీ ఇచ్చి.. ఆదరణ కరువై...
కుమారుడు పట్టించుకోవడం లేదని ఆర్డీఓ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు పాల్వంచ రూరల్: నవమాసాలు మోసి.. అష్టకష్టాలు పడి కనిపెంచిన కొడుకు... మలిదశలో ఆదుకోవాల్సిందిపోయి వేధిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధ తల్లిదండ్రులు ఆర్డీఓ కోర్టును ఆశ్రయించారు. పాల్వంచలోని ఆర్డీఓ కోర్టుకు ఆ వృద్ధ దంపతులు మంగâýæవారం హాజరయ్యారు. ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామానికి చెందిన నున్నా సూరయ్య (85), నున్నా రమణమ్మ (80) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సూరయ్యకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత భూమిని కూతుâýæ్లకు ఇవ్వగా, మిగిలిన కొంత కుమారుడు నున్నా నర్సింహారావుకు ఇచ్చారు. కొంతకాలం తన దగ్గర ఉంచుకుని, ఇటీవల తల్లిదండ్రులను కుమారుడు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉన్న కూతుళ్ల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేయడంతో తానే సంరక్షిస్తానని అంగీకరించిన కుమారుడు తిరిగి పట్టించుకోవడం లేదు. దీంతో వృద్ధ దంపతులు ఎ¯ŒSజీఓ మహిళా సాధికారత సంస్థ ఉమె¯ŒS ఎంపవర్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు మందపల్లి ఉమను ఆశ్రయించారు. కుమారుడు నర్సింహారావు తీరుపై మూడు వారాల క్రితం పాల్వంచ ఆర్డీఓ కోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మంగâýæవారం ఆర్డీఓ కోర్టు ఎదుట తల్లిదండ్రులు, కుమారుడు హాజరయ్యారు. ఆర్డీఓ విచారణ నిర్వహిన్నారు. -
అమాయక పౌరుల్ని చంపేందుకే వచ్చా..!
శ్రీనగర్ః భద్రతా బలగాలకు సజీవంగా చిక్కిన పాకిస్తానీ టెర్రరిస్ట్ బహదూర్ అలి.. తాను అమాయక పౌరుల్ని చంపేందుకే పాకిస్తాన్ నుంచీ కశ్మీర్ కు వచ్చినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముందు తెలిపాడు. కశ్మీర్ లో భద్రతా బలగాలు అరెస్టు తర్వాత.. అతనిని విచారించిన ఎన్ఐఏ ముందు ఈ విచిత్ర ప్రకటన చేశాడు. శ్రీనగర్ లో భద్రతాబలగాలకు చిక్కిన ఉగ్రవాది బహదూర్ అలి ఎన్ఐఏ విచారణ సందర్భంలో అశ్చర్యకర నిజాలను వెల్లడించాడు. బహదూర్ అలి.. అలియాస్ సైఫుల్లా తాను కశ్మీర్ కు సాధారణ, అమాయక ప్రజలను చంపేందుకే పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు ఎన్ఐఏ విచారణలో తెలిపాడు. అంతేకాదు తాను గెరిల్లా వార్ ఫేర్ లోని లష్కరే తోయిబాలో (ఎల్ఈటీ) శిక్షణ పొందినట్లు చెప్పడంతోపాటు, జమాత్ ఉద్ దవా (జుద్) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను కూడా రెండుసార్లు కలిసినట్లు ఆ 22 ఏళ్ళ టెర్రరిస్ట్ ఎన్ఐఏకు తెలిపాడు. దీనికితోడు తాను పాక్ లో ఏర్పాటైన కంట్రోల్ రూమ్ తో నిత్యం సంప్రదింపులు కూడా జరిపినట్లు చెప్పాడు. దీంతో బహదూర్ అలి లాహోర్ నగరానికి చెందిన పాకిస్తాన్ జాతీయుడని విచారణలో హోం మంత్రిత్వశాఖ నిర్థారించింది. అలాగే కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ అహిర్ కూడా అతడి గుర్తింపును ధ్రువీకరించారు. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టర్ సమీపంలో భద్రతాబలగాల కాల్పుల్లో మరో నలుగురు ఎల్ఈటీ ఉగ్రవాదులు చనిపోగా బహదూర్ అలి మాత్రం సజీవంగా పట్టుబడ్డాడు. అతనివద్ద నుంచీ మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులు, 23 వేల రూపాయలు కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత రెండు నెలల కాలంలో సరిహద్దు జిల్లాల్లో పాకిస్తానీ టెర్రరిస్టును సజీవంగా పట్టుకోవడం ఇది రెండోసారి కాగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ టీట్వాల్ ప్రాంతంనుంచీ తీవ్రవాదులు లోయలోకి ప్రవేశించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. ముందుగా టాంగ్ధర్ సెక్టర్ లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు.. అక్కడినుంచీ లీపా లోయలోకి వెళ్ళి అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన అడవీప్రాంతంలో దాక్కున్నట్లు హోంశాఖ వెల్లడించింది. -
తల్లీ ఆచూకి కోసం..
-
మృత్యుంజయుడు
-
వచ్చింది పాకిస్థాన్ నుంచేనా?
-
నిందితుడు వెంకన్నేనా?
మరికొందరి ప్రమేయంపై మృతుడి బంధువులు, స్థానికుల అనుమానం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు గూడూరు : గూడూరులో సంచలనం కలిగిం చిన తల్లీకూతుళ్ల హత్య, యువకుడి ఆత్మహ త్య ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తల్లీకూతుళ్లను హ త్య చేసింది ఆత్మహత్య చేసుకున్న వెంకన్నే నా? లేక వేరే వ్యక్తుల ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిసింది. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో సంపతి కుమారి ఇంట్లో ఆమెతోపాటు ఏడాదిన్నర వయస్సుగల కుమార్తె దుర్గాభవాని దారుణహత్యకు గురవగా, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఏలూరు వెంకన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వెంకన్న, కుమారి కొన్నిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నట్లు కాలనీ వాసులు తెలి పారు. వెంకన్న కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంకన్నే ఈ సంఘటనలో ప్రధాన ముద్దాయిగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుమారి భర్త శ్రీనివాసరావు డ్యూటీలకు వెళ్లిన సమయంలో వెంకన్న ఆ మెతో సన్నిహితంగా ఉంటున్నందున ఘర్షణ పడి హత్య చేసేంత పరిస్థితి ఉండదని మృతుడి తండ్రి, సోదరి అంటున్నారు. వెంకన్నను, కుమారిని వేరే వారు హత్య చేసి ఉంటారని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు ముందు కుమారిపై లైంగికదాడి జరిపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకన్న ఒక్కడే ఇంతటి దుస్సాహసం చేయలేడని, ఇందులో మరికొందరి పాత్ర ఉంటుందని గ్రామంలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కుమారి ఇంట్లోకి నలుగురు వ్య క్తులు చొరబడి ఉంటారని, తొలుత వెంకన్నను, అనంతరం తల్లీకూతుళ్లను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. నేరాన్ని వెంకన్నపై తోసేందుకు అతడు ఉరి వేసినట్లు శనివారం పుకార్లు షికార్లు చేశాయి. పోలీ సులు విభిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. దీనిగురించి ఎస్సై అడపా ఫణిమోహన్ను వివరణ కోరగా, మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిం దన్నారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. ఈ ఘటనకు వెంకన్నే కారకుడని ప్రాధమిక నిర్థారణకు వచ్చామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి గూడూరులో హత్యలు, ఆత్మహత్య ఘటనలో మూడు మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై ఫణిమోహన్ తెలిపారు. శనివారం ఉదయం ముం దుగా కుమారికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కడుపులోని ఎనిమిది నెలల శిశువును కూ డా బయటకు తీశారు.ఆమె కుమార్తె దుర్గాభవాని మృతదేహానికి కూడా పోస్టుమార్టం నిర్వహించారు. మూడు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. వెంకన్న మృతదేహానికి కూడా పోస్టుమార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం రెండుగంటల సమయంలో మృతదేహాలను గూడూరులోని వారి వారి స్వగృహాలకు తరలించారు. ఒక్కగానొక్క కొడుకు వెంకన్నను పోగొట్టుకున్నామంటూ తండ్రి ఉ మామహేశ్వరరావు, తల్లి నాగలక్షి, సోదరి కృష్ణవేణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారి, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలు చూసిన తల్లి సుభద్ర, సోదరుడు సురేష్, పిన్నమ్మ సు మతి గుండెలవిసేలా రోదించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉన్మాదం
గర్భిణీ, ఆమె కుమార్తెను చంపిన ఉన్మాది ఆపై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య ఉలిక్కిపడిన గూడూరు గూడూరు/మచిలీపట్నం : ఉన్మాది పేట్రేగి పోయాడు. గర్భిణి, ఆమె ఏడాదిన్నర వయసు గల కుమార్తెను బలితీసుకున్నాడు. కొద్దిరోజుల్లో ఈ లోకంలోకి రావాల్సిన పసిగుడ్డును తల్లికడుపులోనే అంతంచేశాడు. చివరికి తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఒకే గదిలో ముగ్గురి మృతదేహాలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గూడూరు గ్రామానికి చెందిన ఏలూరు వెంకన్న (28) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతను అదే గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సంపతి కుమారి(24)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కుమారి భర్త శ్రీనివాసరావు టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతను ఐదు రోజుల క్రితమే విజయవాడ వెళ్లాడు. అప్పటి నుంచి కుమారి ఇంట్లోనే వెంకన్న ఉంటున్నాడు. కొద్దికాలంగా కుమారి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వెంకన్న ఆమెతో వాగ్వాదానికి దిగాడు. గది తలుపునకు గొళ్లెం పెట్టిన వెంకన్న తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో ఎనిమిది నెలల గర్భిణీ అయిన కుమారి, ఆమె కుమార్తె దుర్గాభవానీ (18నెలలు) పీకలు కోసి చంపేశాడు. అనంతరం అతను అదే గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నం! కుమారి, అమె కుమార్తెలను హత్య చేసిన అనంతరం వెంకన్న తన చేతులకు అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకున్నట్లు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఇంట్లో మరకలను కడిగేందుకు నీళ్లు పోసినట్లు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. కుమారి, ఆమె కుమార్తె నుంచి రక్తం అధికంగా కారటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం బయటకు పొక్కుతుందనే భయంతో చివరకు వెంకన్న కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వెలుగుచూసిందిలా... టాక్సీ డ్రైవర్ అయిన కుమారి భర్త శ్రీనివాసరావు ఐదు రోజులుగా విజయవాడలోనే ఉంటున్నాడు. గురువారం రాత్రి తొమ్మిది గంటలకు కుమారి సమీపంలోని తన తల్లి సుభద్ర ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తన కుమార్తె దుర్గాభవానీ కోసం పాలు తెచ్చుకుంది. ఇంటికి వెళ్లిన అనంతరం తాను భోజనం చేశానని, దుర్గాభవానీ నిద్రిస్తోందని, మీరు పడుకోండని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తోడుగా తాను ఇంటికి వస్తానని తల్లి చెప్పినా కుమారి వద్దని వారించింది. అప్పటికే కుమారితోపాటు వెంకన్న ఇంట్లోనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం కుమారి కుమార్తెకు టిఫిన్ ఇచ్చిరావాలని సుభద్ర తన సోదరి కుమార్తె దేవిని పంపారు. కుమారి నివసిస్తున్న ఇంటికి వచ్చిన దేవి తలుపులు కొట్టగా ఎవరూ మాట్లాడలేదు. కిటికీలో నుంచి చూడగా కుమారి, ఆమె కుమార్తె దుర్గాభవానీ రక్తపు మడుగులో మృతిచెంది ఉన్నారు. వెంకన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు. పోలీసుల విచారణలోఆసక్తికర విషయాలు.. గూడూరు ఇందిర మ్మకాలనీలోని ఘటనాస్థలాన్ని బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఐదు రోజులుగా వెంకన్న కుమారితో పాటు ఇంట్లోనే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. కుమారి హత్యకు గురైందనే తెలిసి గూడూరు వచ్చిన ఆమె భర్త శ్రీనివాసరావు, తల్లి సుభద్ర, స్థానికుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. కుమారికి వెంకన్నతోపాటు మరి కొందరితోనూ వివాహేతర సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వెంకన్న తన సెల్‌ఫోన్ నుంచి కుమారితో వివాహేతర సంబంధం ఉన్న వారికి ఫోన్ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని వెంకన్న తండ్రి పోలీసుల వద్ద ప్రస్తావిం చాడు. వెంకన్న పదేపదే వేరే వ్యక్తులకు ఫోన్ చేయటం, ఈ విషయం నచ్చని కుమారి అతనితో గొడవకు దిగడం వల్లే హత్యలు చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రూరల్ సీఐ ఎస్వీఎస్ మూర్తి, గూడూరు ఎస్ఐ అడపా ఫణిమోహన్, పెడన ఎస్ఐలు దుర్గాప్రసాద్, మణికుమార్ ఘటనాస్థలానికి వచ్చారు. వెంకన్న ఒక్కడే ఈ ఘతుకానికి పాల్పడ్డాడా.. లేక మరెవరైనా పాలుపంచుకున్నారా.. అనే విషయంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేయగా.. పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. క్లూస్‌టీమ్ సిబ్బంది ఘటనాస్థలంలో వివరాలు సేకరించారు. కుమారి సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.