- మరికొందరి ప్రమేయంపై మృతుడి బంధువులు, స్థానికుల అనుమానం
- వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు
గూడూరు : గూడూరులో సంచలనం కలిగిం చిన తల్లీకూతుళ్ల హత్య, యువకుడి ఆత్మహ త్య ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తల్లీకూతుళ్లను హ త్య చేసింది ఆత్మహత్య చేసుకున్న వెంకన్నే నా? లేక వేరే వ్యక్తుల ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిసింది. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో సంపతి కుమారి ఇంట్లో ఆమెతోపాటు ఏడాదిన్నర వయస్సుగల కుమార్తె దుర్గాభవాని దారుణహత్యకు గురవగా, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఏలూరు వెంకన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
వెంకన్న, కుమారి కొన్నిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నట్లు కాలనీ వాసులు తెలి పారు. వెంకన్న కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంకన్నే ఈ సంఘటనలో ప్రధాన ముద్దాయిగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుమారి భర్త శ్రీనివాసరావు డ్యూటీలకు వెళ్లిన సమయంలో వెంకన్న ఆ మెతో సన్నిహితంగా ఉంటున్నందున ఘర్షణ పడి హత్య చేసేంత పరిస్థితి ఉండదని మృతుడి తండ్రి, సోదరి అంటున్నారు.
వెంకన్నను, కుమారిని వేరే వారు హత్య చేసి ఉంటారని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు ముందు కుమారిపై లైంగికదాడి జరిపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకన్న ఒక్కడే ఇంతటి దుస్సాహసం చేయలేడని, ఇందులో మరికొందరి పాత్ర ఉంటుందని గ్రామంలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కుమారి ఇంట్లోకి నలుగురు వ్య క్తులు చొరబడి ఉంటారని, తొలుత వెంకన్నను, అనంతరం తల్లీకూతుళ్లను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
నేరాన్ని వెంకన్నపై తోసేందుకు అతడు ఉరి వేసినట్లు శనివారం పుకార్లు షికార్లు చేశాయి. పోలీ సులు విభిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. దీనిగురించి ఎస్సై అడపా ఫణిమోహన్‌ను వివరణ కోరగా, మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిం దన్నారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. ఈ ఘటనకు వెంకన్నే కారకుడని ప్రాధమిక నిర్థారణకు వచ్చామన్నారు.
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
గూడూరులో హత్యలు, ఆత్మహత్య ఘటనలో మూడు మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై ఫణిమోహన్ తెలిపారు. శనివారం ఉదయం ముం దుగా కుమారికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కడుపులోని ఎనిమిది నెలల శిశువును కూ డా బయటకు తీశారు.ఆమె కుమార్తె దుర్గాభవాని మృతదేహానికి కూడా పోస్టుమార్టం నిర్వహించారు.
మూడు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. వెంకన్న మృతదేహానికి కూడా పోస్టుమార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం రెండుగంటల సమయంలో మృతదేహాలను గూడూరులోని వారి వారి స్వగృహాలకు తరలించారు.
ఒక్కగానొక్క కొడుకు వెంకన్నను పోగొట్టుకున్నామంటూ తండ్రి ఉ మామహేశ్వరరావు, తల్లి నాగలక్షి, సోదరి కృష్ణవేణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారి, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలు చూసిన తల్లి సుభద్ర, సోదరుడు సురేష్, పిన్నమ్మ సు మతి గుండెలవిసేలా రోదించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.