kumari
-
Akanksha Kumari: తాను.. రొటీన్ ఐటీ కాదు.. మైనింగ్ మేటి!
‘ద్వారాలు మూసే ఉన్నాయి’ అని వెనక్కి తిరిగేవారు కొందరు. ఆ ద్వారాలను తెరిచి ముందుకు వెళ్లేవారు కొందరు. ఆకాంక్ష కుమారి రెండో కోవకు చెందిన మహిళ. తొలి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఉద్యోగంలో చేరిన రోజు ఎంత ఉత్సాహం, వృత్తి నిబద్ధతతో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ‘నో రిగ్రెట్స్.. ఫీల్ గ్రేట్’ అంటుంది. మైనింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది.ఝార్ఖండ్‌లోని మైనింగ్ప్రాంతంలో పెరిగిన ఆకాంక్ష కుమారి బొగ్గు గనుల్లో ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నది. మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను వినడం కాదు ప్రత్యక్షంగా చూసింది. ‘ఇది పురుషులు మాత్రమే చేసే కఠినమైన ఉద్యోగం అనుకునే వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందన ఇది...‘బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు ఏ మైనింగ్ కంపెనీలో పని చేయకపోయినా వాళ్లకు మైనింగ్ గురించి చాలా విషయాలు తెలుసు. స్కూల్ హాస్టల్లో నా స్నేహితులు పై కప్పు కూలిపోవడం గురించి మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. అదెలా? ఎందుకు?’ అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మైనింగ్‌కు సంబంధించి రకరకాల విషయాలు వినడం వల్ల నాకు తెలియకుండానే ఆ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే కలకు బీజం పడింది’ గతాన్ని గుర్తు చేసుకుంది ఆకాంక్ష.‘పదవ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలి?’ అనుకున్నప్పుడు ఆటల గురించి ఆలోచించింది. తాను జాతీయస్థాయి అథ్లెట్లిక్స్‌లో కూడా పాల్గొంది. ఆటలపై దృష్టి పెట్టాలా, చదువు కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను ఉన్న పరిస్థితిల్లో ఉద్యోగం అనివార్యం కావడంతో చదువుకే ్రపాధాన్యత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తరువాత ‘ఐటీ రంగంలో ఉద్యోగంపై దృష్టి పెట్టు’ అని కొందరు తనకు సలహా ఇచ్చారు. అయితే ‘ఐటీ’ అనేది ఆకాంక్షకు ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాదు. ఆ సమయం లోనే తన మనసులో దాగిన కల బయటికి వచ్చింది. ‘కోల్ మైనింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన తండ్రి, అంగన్వాడీ వర్కర్ అయిన తల్లిని ఒప్పించడం కష్టం కాలేదు.‘మా అమ్మాయి మైనింగ్ జాబ్ చేయాలనుకుంటుంది’ అని ఆకాంక్ష తండ్రి మైనింగ్ కంపెనీలో పనిచేసే తన స్నేహితుడిని సలహా అడిగితే...‘చాలా కష్టం. మధ్యతరగతికి చెందిన ఆడపిల్లలు ఈ రంగంలో పనిచేయలేరు. ఆ పనిభారం తట్టుకోవడం ఆడపిల్లలకు చాలా కష్టం’ అన్నాడు. స్నేహితుడు చెప్పిన విషయాలను కూతురితో పంచుకున్నాడు. అయినా సరే, ఆకాంక్ష వెనక్కి తగ్గలేదు. ఇంజినీరింగ్ కోర్స్ అడ్మిషన్ సమయంలో కౌన్సెలర్ ఆమెకు మైనింగ్ ఇంజినీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాదోపవాదాల తరువాత ఆకాంక్ష కల నెరవేరింది. ఝార్ఖండ్, ధన్‌బాద్‌లోని బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రీలో బీటెక్ పాసైంది. వొకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్ మైన్‌లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.‘ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు? ఇక్కడ మహిళలకు సౌకర్యాలు, సదుపాయాలు లేవన్న విషయం మీ డిపార్ట్మెంట్ హెడ్‌కు తెలియదా?’ అని విసుక్కున్నాడు జనరల్ మేనేజర్. ఆ తరువాత మాత్రం గెస్ట్‌హౌజ్‌లో ఒక రూమ్ కేటాయించారు. అమ్మ, మేనత్తలతో కలిసి ఆ గదిలో ఉండేది ఆకాంక్ష. చదువు పూర్తయిన తరువాత హిందుస్థాన్ జింక్‌లో ఆకాంక్షకు ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు గనులలో పనిచేసింది. ఆ తరువాత సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో పనిచేసింది. కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూగర్భ గనుల్లో గరిష్ఠంగా ఆరు గంటలు పనిచేసింది.2021లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ఆకాంక్ష చేరిన తరువాత ఇప్పటి వరకు మరో ముగ్గురు మహిళలు మాత్రమే పబ్లిక్ విభాగంలో చేరారు. అయినా సరే ఆకాంక్ష కుమారిలో ఆశాభావం తొలగిపోలేదు. మైనింగ్ ఫీల్డ్‌లో రావాలనుకుంటున్నవారికి సలహాలు ఇవ్వడం, దారి చూపడం మానడం లేదు. ‘సౌకర్యాలు లేకపోవచ్చు. శ్రమతో కూడిన ఉద్యోగం కావచ్చు. అయినా సరే చేస్తాను అనే పట్టుదల మీలో ఉంటే మైనింగ్ ఫీల్డ్‌లోకి తప్పకుండా రావచ్చు’ అంటుంది ఆకాంక్ష కుమారి. తొలి అడుగు వేసి మాత్రమే ఊరుకోలేదు. మరిన్ని అడుగుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆకాంక్ష.ఇవి చదవండి: ఈ ప్రాణం ఖరీదెంత? -
బస్టాండ్‌లో మహిళ ప్రసవం
కరీంనగర్ టౌన్: భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండులో ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఆర్టీసీ, 108 సిబ్బంది ఆ మహిళకు పురుడుపోశారు. ఒడిశాకు చెందిన కుమారి– దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో కొద్దిరోజులుగా కూలీలుగా పనిచేస్తున్నారు.నిండు గర్భిణి అయిన కుమారిని తీసుకుని ఆమె భర్త దూల ఆదివారం కుంట–భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు కరీంనగర్ బస్‌స్టేషన్ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుమారికి పురిటినొప్పులు వచ్చాయి. కాసేపటికి ఎక్కువ కావడంతో ఆమె భర్త అక్కడే ఉన్న ఆర్టీసీసిబ్బంది సాయం కోరాడు. వారు వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది పరిస్థితిని గమనించి ప్లాట్‌ఫాం ఎదురుగా ఉన్న చెట్టు కిందకు కుమారిని తీసుకెళ్లారు. చుట్టూ చీరలు అడ్డుగా పెట్టి డెలివరీ చేశారు. అదే సమయంలో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయం అందించారు. పండంటి ఆడబిడ్డ జని్మంచగా.. 108 వాహనంలో తల్లీబిడ్డను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. కాగా తన భార్యకు డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుక బట్టీ యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపుమాపు అంటూ దాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని కుమారి భర్త దూల ఆవేదన వ్యక్తం చేశారు. -
Suman Kumari: స్నైపర్ గురి
800 మీటర్ల దూరం.. అంటే ముప్పావు కిలోమీటరు నుంచి కూడా గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లు స్నైపర్లు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అనే అంటారు. ఇంతకాలం మగవాళ్లే స్నైపర్లుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి అత్యంత కఠినమైన శిక్షణ పొంది మన దేశ తొలి మహిళా స్నైపర్‌గా అర్హతను పొందింది. 1984 ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1988లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో స్వర్ణదేవాలయంలో మిగిలి ఉన్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసే మిలటరీ చర్య జరిగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సమయంలో ఇరువర్గాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువ. కాని ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’లో మిలటరీ సిబ్బంది ప్రాణనష్టం జరక్కుండా సిక్కు వేర్పాటువాదులను అణిచివేయగలిగారు. దీనికి కారణం స్వర్ణ దేవాలయాన్ని మారణాయుధాలతో పై నుంచి కాపలాకాస్తున్న ఐదుగురు వేర్పాటువాదులను చాలా దూరం నుంచి కాల్చి చంపడం. మొదటిసారి ‘స్నైపర్స్’ ఉపయోగం వల్ల కలిగిన ప్రయోజనం అది. స్నైపర్ అంటే శత్రునిర్మూలన ఏదో సినిమాలో ‘నన్ను చూడాలంటే నీ జీవితం సగం తగలడిపోయి ఉండాలి’ అని బ్రహ్మానందం అంటాడు. స్నైపర్ రంగంలో దిగాడంటే శత్రువు జీవితం ముగింపు దశలో ఉందని అర్థం. స్నైపర్లు శత్రువును బంధించడానికి కాదు. నిర్మూలించడానికి. మనదేశంలో ముందు నుంచి కూడా అత్యాధునిక ఆయుధాల పట్ల కాకుండా సంప్రదాయ ఆయుధాల పట్ల మొగ్గు ఉండటం వల్ల స్నైపర్లను ఆదరించింది లేదు. కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకూ కూడా శత్రువును కాల్చి చంపగల స్నైపర్ రైఫిల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియడానికి ఆ కాలంలో మన మిటలరీ యోధులు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది. 1980లలోనే కొద్దిగా స్నైపర్స్ ఉపయోగం తెలిసింది. ఇటీవల సరిహద్దుల వెంబడి వివిధ దేశాల దాడులను ప్రతిఘటించడానికి స్నైపర్లు సమర్థంగా ఉపయోగపడుతున్నాయని వాటిని ఉపయోగించే నిపుణులను తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్– మహౌలోని ‘ఇన్ఫాంట్రీ స్కూల్’లో, ‘ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’ కేంద్రంలో స్నైపర్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకూ మగవాళ్లకే సాగిన ఈ శిక్షణ సుమన్ కుమారి వల్ల స్త్రీలకు కూడా ఇవ్వడం మొదలైంది. పంజాబ్‌లో చూసి హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021లో బి.ఎస్.ఎఫ్.లో ఇన్స్పెక్టర్ హోదాలో చేరింది. పంజాబ్‌లో ఆమెకు విధులు కేటాయించారు. అక్కడ ఉండగా సరిహద్దు దేశాల నుంచి శత్రువులు స్నైపర్లతో మనవారి మీద దాడులు చేయడం సుమన్ గమనించింది. మన వద్ద తగినంత మంది స్నైపర్లు లేరని కూడా అవగాహన చేసుకుంది. అంతే. తనకు తానే స్నైపర్‌గా శిక్షణ తీసుకునేందుకు అనుమతి అడిగింది. ‘సాధారణంగా స్నైపర్‌గా తీసుకునే శిక్షణ కఠినమైనది. మగవారే వెనకాడుతారు. శిక్షణలో సగం మంది వెనుతిరుగుతారు. కాని సుమన్ 8 వారాల పాటు శిక్షణను సమర్థంగా పూర్తి చేసింది. 56 మంది ఉన్న బ్యాచ్‌లో ఆమె మాత్రమే మహిళ. శిక్షణ బాగా పూర్తి చేసిన వారిని ‘ఆల్ఫా’ అని, ‘బ్రేవో’ అని నైపుణ్యాన్ని బట్టి విభజిస్తాం. కాని సుమన్ ప్రతిభ అంతకు మించింది. అందుకే ఆమెకు ఇన్స్ట్రక్టర్ హోదా ఇచ్చాం. దాని అర్థం ఆమె స్నైపర్ మాత్రమే కాదు స్నైపర్ శిక్షకురాలు కూడా’ అని ఒక మిలటరీ అధికారి తెలియచేశారు. ఎప్పుడెప్పుడు హైజాక్‌లు, కిడ్నాప్‌లు, టెర్రరిస్ట్ అటాక్‌లు, ముఖ్య నేతలను బందీలుగా పట్టుకోవడం, సరిహద్దులు దాటి శత్రువులు రావడం వంటి సందర్భాలలో స్నైపర్లు రంగంలో దిగుతారు. పరిసరాలకు తగినట్టుగా పై తొడుగులు (కామూఫ్లాజ్) ధరించి శత్రువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి తూటాతో సమాధానం చెప్పడమే వీరు చేసేపని. సుమన్ సేవలు ఇకపై దేశానికి రక్షణ ఇస్తాయి. ‘నేను స్నైపర్ కావడం స్త్రీలకు స్ఫూర్తినిస్తుందనే అనుకుంటున్నాను. మిలటరీలోకి మరింతమంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను’ అందామె. -
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్
షిమ్లా: సుదూరంగా మాటువేసి గురిచూసి షూట్‌చేసే ‘స్నైపర్’ విధుల్లో చేరి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సుమన్‌కుమారి చరిత్ర సృష్టించనున్నారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో తొలి స్నైపర్‌గా కుమారి పేరు రికార్డులకెక్కనుంది. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(సీఎస్‌డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. దీంతో శిక్షణలో ఆమె ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. బీఎస్ఎఫ్లో స్నైపర్ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. కుమారి 2021లో బీఎస్ఎఫ్లో చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్లది కీలక పాత్ర. -
సోషల్ మీడియాతో కుమారి ఆంటీకి క్రేజ్.. ప్రముఖ ఓటీటీ బిగ్ ప్లాన్!
ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. 'వాడటం మొదలు పెడితే మాకన్న బాగా ఎవరూ వాడలేరు' అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండడం.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్‌తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఆమె హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్‌కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. అయితే అది కాస్తా కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్‌కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకునేస్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికీ మళ్లీ ఆమెను సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్‌కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. -
కుమారి ఆంటీ హోటల్ రీ ఓపెన్
హైదరాబాద్: ఎట్టకేలకు కుమారి ఆంటీ హోటల్ తెరుచుకుంది. ఐటీ కారిడార్‌లో కోహినూర్ హోటల్ ఎదురుగా ట్రాఫిక్‌జాం నెలకొనడంతో కుమారి ఆంటీ హోటల్‌ను ఇటీవల రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ హోటల్ తొలగింపు వైరల్ కావడంతో సీఎం కార్యాలయం స్పందించింది. ఈ హోటల్‌ను అదే స్థలంలో నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించడంతో వివాదానికి తెరపడింది. -
కుమారి ఆంటీ ఎపిసోడ్లో ట్విస్ట్!
Kumari Aunty News: సోషల్ మీడియాతో వచ్చిన పాపులారిటీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనే విషయం దాసరి సాయికుమారి అలియాస్ కుమారి ఆంటీకి బోధపడినట్లు ఉంది. ఫేమ్ కోసమో.. తన వ్యాపారం నడవాలనో.. లేక అమాయకత్వంతోనో అడ్డగోలుగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఎక్కడెక్కడి నుంచో జనం క్యూ కట్టడంతో.. ఆమె దుకాణం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోందని, మరో చోటుకి తరలించాలని ట్రాఫిక్ పోలీసలు ఆదేశించడం వార్తలెక్కింది. అయితే.. ఈ విషయం అదే సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ వ్యాపారానికి ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద ఎక్కడైతే ఆమె స్ట్రీట్‌ఫుడ్ కోర్టు నడుస్తుందో.. అక్కడే నడిపించుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె ఇంతలా పాపులర్ కావడానికి కారణమైన ‘ఎక్స్ట్రా టూ లివర్స్’ కస్టమర్‌తో సహా మళ్లీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈసారి ఆమె తన సంపాదనతో సోషల్ మీడియాలో ఇంకా నానుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు.. త్వరలో ఆమె ఫుడ్‌కోర్టును సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సందర్శిస్తారని ప్రచారం ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టి తెగ ఇబ్బంది పెట్టారు.. పాపం. తనకు ఇవేవీ తెలియవని.. దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే.. వాళ్లలో కొందరు సీఎం రేవంత్ రెడ్డి మీ వద్దకు వచ్చినప్పుడు ఈ దరఖాస్తు ఇవ్వాలంటూ ఆమె చేతికి ఇవ్వబోయారు. ఈ ఘటనతో ఇప్పటికే మీ సమస్యను ఆయన(సీఎం రేవంత్) విని ఉంటారని చెబుతూ ఆమె ఆ దరఖాస్తును స్వీకరించేందుకు ఇష్టపడలేదు. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలని గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాంగ్రెస్ కూడా నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. Unemployed protest at Kumari Aunty's food stall! Unemployed protest that Revanth Reddy said he will come to your food stall, tell him to cancel Jivo 46. #KumariAunty #RevanthReddy pic.twitter.com/NZhG4iVU4L — MD HAJI (@MDHAJI63535465) February 3, 2024 Video Credits: MD HAJI ఇదీ చదవండి: సామాన్యులకు సోషల్ మీడియా వరమా? శాపమా? -
TROLLS పై కుమారి ఆంటీ ఫస్ట్ రియాక్షన్
-
మళ్లీ హోటల్ తెరుస్తాననుకోలేదు: కుమారి ఆంటీ
హైదరాబాద్, సాక్షి: ఫుడ్ స్టాల్‌తో నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో ఫేమస్ అయ్యి.. ఆపై సోషల్ మీడియా ద్వారా ఆ ఫేమ్‌ను మరింత పెంచుకుంది కుమారి ఆంటీ. అయితే ఆ ఫేమ్ వల్లే జనాలు ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర గుమిగూడడం.. అది ట్రాఫిక్ జామ్‌కు దారి తీయడంతో ఆమె స్టాల్‌ను పోలీసులు బలవంతంగా తొలగించాల్సి వచ్చింది. ఈ పరిణామంపై తీవ్ర చర్చ నడవగా.. చివరకు తెలంగాణ సర్కార్ ఆమెకు ఊరట ఇచ్చింది. ఈ పరిణామంపై ఆమె సాక్షితో స్పందించారు. ‘‘గత 13 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నా. ముందు మాకు తొలగించాలని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. నిన్న 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయింది. నా ఫుడ్ కోర్టు బండిని సీజ్ చేశారు. మా కొడుకును పోలీసులు కొట్టారు. మళ్లీ హోటల్ తెరుస్తామని మేం అసలు అనుకోలేదు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించడం గొప్ప విషయం. అందుకు సీఎం రేవంత్‌రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారామె. కుమారి ఆంటీ అసలు పేరు దాసరి సాయి కుమారి. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె కొన్నేళ్లుగా ఫుడ్‌స్టాల్ నడిపిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె గురించి ఎక్కువ చర్చ నడిచింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆమె ఫుడ్ స్టాల్‌కు జనాల రాక మొదలైంది. ఈ క్రమంలో జనం భారీగా గుమిగూడి.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూ వస్తోంది. దీంతో మంగళవారం ఆమె షాప్‌ను సీజ్ చేసి.. మరో చోటుకి తరలించాలని పోలీసులు ఆదేశించారు. అయితే మిగతా వాళ్లను వదిలేసి తననే తొలగించాలని ఆదేశించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కుమారి ఆంటీ అందుకే టార్గెట్ అయ్యిందా? మరోవైపు ఈ పరిణామంపై అదే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వైఖరిని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తప్పు పట్టింది. సీఎం జగన్ తనకు మంచి చేశారని.. ఇళ్లు ఇచ్చారని ఆమె చెప్పడం వల్లే ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించింది. దీంతో వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చక ముందే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె ఫుడ్‌కోర్టును యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్ర డీజీపీతో పాటు ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్లు సీఎంవో తెలిపింది. మరోవైపు ఈ సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఆమె స్టాల్‌కు వెళ్లనున్నారనే ప్రచారం ఒకటి నడుస్తోంది. -
సోషల్ మీడియా సామాన్యులకు వరమా? శాపమా?
ఒకప్పుడూ ఇలాంటి సోషల్ మీడియాలు లేని ఆ కాలం చాలా ప్రశాంతంగ సాగిపోయింది. ఏ రోజూ..ఏం వింటాం అనే ఉత్కంఠ, టెన్షన్ మాత్రం లేనేలేవు. ఏదైనా బిజినెస్ మంచిగా సాగాలన్న పేపర్ ప్రకటనలతోనే కొంతమంది ప్రముఖులతోనే ప్రచారం చేయించుకోవడం జరిగేది. ఆలస్యమైనా నిలదొక్కుకునే వారు. సజావుగా సాగేది. అది వ్యాపారమనే కాదు, ఓ వ్యక్తి ఉన్నతి, లేదా సృజనాత్మకత గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఆ ఫేమ్ అలా నిలబడేది. ఒకవేళ కాలం కలిసిరాక కష్టాలు ఎదురైనా కొద్దిమందికే తెలిసేది. ఒకవేళ పత్రికల్లో రాసినా పాపం అన్నట్లుగా ఆ వ్యక్తి గురించి చెప్పిచెప్పనట్లుగా చెప్పేవారు. అంతే తప్ప! ఊదరగొట్టి, బెదరగొట్టి పడేసేలా మాత్రం రాసేవారు కాదు. ఇక ఎప్పుడైతే ఇంటర్నెట్ ఓ రేంజ్లో అందరికి సుపరిచితమై ట్విట్టర్, ఇన్‌స్టా, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు హవా నడవడం మొదలైందో..అప్పటి నుంచి అసలైన సమస్య వచ్చిందనాలా? లేక టెక్నాజీతో దూసుకుపోతున్నాం అనలా తెలియని గందరగోళంలా మారిపోయింది స్థితి. ఎందుకిలా చెబుతున్నానంటే.. సెకనులో తెచ్చిపెట్టే స్టార్డమ్.. ఈ సోషల్ మీడియా అసామాన్యుడిని ఓవర్‌నైట్ సెలబ్రెటీని చేసేస్తుంది. ఓ సామాన్య వ్యాపార వేత్తని సెకండ్లలో ఫేమస్ చేసేస్తుంది. దీంతో వారంతా తమ రంగంలో ఓ రేంజ్లో దూసుకుపోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. మధ్యలో ఏదో జరిగి దివాలా తీశాడో ఇక అంతే! ఇక ఆ తర్వాత కూడా వద్దు రా! నన్ను వదిలేయండన్న వినకుండా వెంట పడి వాడి గురించి వీడియో తీసి పెట్టేస్తారు. అంతకుముందు ఏదైతే ఆయా వ్యక్తులకు పాపులారిటీ తెచ్చిపెట్టిందో అదే వాళ్ల కష్టాలకూ, కన్నీళ్లకు కారణమవుతోంది. అలా బలైన వాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఈ టిక్‌టాక్‌లు యూట్యూబ్‌లతో పేరుగాంచిన కచ్చా బాదం సింగర్ నుంచి ఇటీవల వంటలతో పేరు సంపాదించుకున్న కుమారి ఆంటీ వరకు అందరూ ఈ సోషల్ మీడియా బాధితులే అనాలి. ఎందుకంటే..? నిజానికి ఈ ఇద్దర్నీ గమనిస్తే అందులో ఒకరు రోడ్డుపై వేరుశనగలు అమ్ముకుంటే మరోకరు పొట్టకూటి కోసం రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుతున్నారు మరొకరు(కుమారీ ఆంటీ). వారిలో ఒకరేమో! ..వేరశనగలు విక్రయించేందుకు పాడిన పాట ఎవరో వీడియో తీసీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యిపోయారు. ఆ ఇమేజ్ అతడి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతను ప్రైవేట్ ఆల్బమ్‌లో పాట పాడే స్థాయికి కూడా వెళ్లిపోయాడు. అయితే అతనికి ఒక్కసారిగా వచ్చిన ఇమేజ్, సంపద నిలుపుకోవడం చేతకాలేదు. మళ్లీ యథాస్థితికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న దాని గురించి కూడా ఈ సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నాం. ఇక్కడొకటి గుర్తించుకోండి కిందపడితే సాయం చేసేందుకు వచ్చే చేతులు కూడా కొన్నే. పైగా ఇది వరకటిలా మనపై వీడియో కాదుకదా మన గోడువినేందుకు కూడా ముందుకు రారు. అతడి పనై పోయింది తెలుసుకునేది ఏముంది అన్నట్లుంటుంది వ్యవహారం. ఇక వంటలతో ఫేమ్ సంపాదించికున్న సాయి కూమారి ఆంటీ దగ్గరకు వస్తే..ఆమె మాదాపుర్‌లో ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఏ హంగు ఆర్భాటం లేకుండా జస్ట్ ఓ డేరా కింద హోటల్ నడుపుకుంటుండేది. అందరి దగ్గర వెజ నాన్‌వెజ్ ఏవో రెండు మూడు రకాలు ఉంటాయి ఈమె దగ్గర వెజ్‌కి సంబంధించిన నాన్‌వెజ్‌కి సంబంధించిన పలురకాలు ఉండటమేగాక కాస్త రుచిగా కూడా ఉండటంతో అనతి కాలంలో మంచి పేరు వచ్చేసింది ఆమెకు. దీనికీ తోడు ఈ సోషల్ మీడియా కూడా తోడవ్వడంతో ఆమె బిజనెస్ కూడా ఓ రేంజ్లో దూసుకుపోవడం మొదలైంది. మంచి లాభలతో ఓ రేంజ్లో సాగింది. ఆ ప్రాంతమంతా ఆమె హోటల్ కారణంగా జాతరలా మారి ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడే స్థాయికి వచ్చేసింది. మాములుగానే మన నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక ఇలాంటి వాటి కారణంగా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడితే అధికారులు ఊరుకుంటారా?. అందులోకి సామాన్యుడి మీదకి లాఠీ ఝళిపించడం చాలా తేలిక. ఇంకేముంది నీ హోటల్ కారణంగానే ట్రాఫిక్ ఏర్పడిందంటూ అధికారులు కూమారీ ఆంటీ హోటల్ని కాస్త మూయించేశారు. నా పొట్టమీద కొట్టొద్దు అంటూ కూమారి ఆంటీ పెడబొబ్బలు పెట్టినా వినిపించుకోలేదు అధికారులు. పార్కింగ్‌కి స్థలం ఇచ్చేంత స్థోమత లేదని ఆమె గోడు వెల్లబోయగా, అదంతా మాకు తెలియదు మీ కారణంగానే ఈ సమస్య అంటూ ఆమెపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ రెండు ఘటనలు చూస్తే సోషల్ మీడియా ఫేమే ఆ ఇద్దరికీ కష్టాలు కూడా తెచ్చి పెట్టిందనలా అంటే..ఓ వ్యక్తిలోని టాలెంట్‌ని అందరికీ సుపరిచితం చేసి అతడికో దారి చూపించడం వరకు ఓకే. ప్రతిక్షణం ఆ వ్యక్తినే ఫోకస్ పెట్టేలా చేస్తే వచ్చే సమస్యలే ఇవి. పైగా ఆయా వ్యక్తుల నేపథ్యాన్ని తెలుసుకుని వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తారు. కనీసం వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనియ్యకుండా బజారున పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్. అక్కడితో ఆగకుండా ఆమె ఇంత సంపాదించేస్తుందంటూ అదేపనిగా ఊదరగొట్టేస్తారు. ఆ తర్వాత ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వాళ్లపై దాడి జరిగితే..మళ్లీ ఇది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. అసలేంటిదీ? మనం ఏం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ మాయలోపడి మనుషులమనే విషయమే మర్చిపోతున్నామా!. లేక అవతల వాళ్ల జీవితాలను ట్రెండ్ చేసి సొమ్ము చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక విద్యార్థి ఫెయిలైతేనే ఆ మాష్టారు ఎంతో హుందాగా దగ్గరకు తీసుకుని ఇంకో అవకాశం ఉంది పాసవ్వచ్చు అని ధైర్యంగా చెబుతారు. అందరి ముందు అతడిని నిలబెట్టేసి ఏడిపించరు కదా!. అలాంటిది ఇక్కడ జీవితాలకు సంబంధించినవి నెట్టింట వైరల్ చేస్తున్నాం. వీటిని ట్రెండ్ చేసి ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్. వాళ్లలో ఉండే సృజనాత్మకతను, టాలెంటన్ని పదిమందికి తెలిసేలా చేసేవరకు చాలు. మరీ లోతుగా వెళ్లిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయకండి. ముఖ్యంగా వాస్తవాలేంటో తెలియకుండా కథలు అల్లేయొద్దు. ఇంతకుమునుపు ఇలాంటి వాటి విషయాల్లో వార్తపత్రికలను, మీడియాను తిట్టిపోసేవారు. కానీ ఇప్పుడవే బెటర్‌గా వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లున్సెర్లు మాత్రం ఎవరు ముందు విషయం షేర్ చేశారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే దిశగా వెనకాముందు చూడకుండా ఏదీపడితే అది పోస్ట్ చేసి జీవితాలు అల్లకల్లోలమయ్యి, నాశనమయ్యేలా చేసేస్తున్నారు. మీలో దాగున్న ఏదో ఒక స్కిల్‌తో సొమ్ము ఆర్జిచండి ఇలా పక్కోళ్ల జీవితాలకు సంబంధించి అన్నింటిని ట్రెండ్ చేసి సోమ్ము చేసుకోకండి. అది ఎవ్వరికీ మంచి కాదు. ముఖ్యంగా టెక్నాలజీని మనకు ప్రయోజనకరంగా చేసుకోకపోయిన పర్లేదు గానీ హాని చేసేలా మాత్రం చెయ్యొద్దు!. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
HYD: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై స్పందించిన సీఎంవో
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారికి షాక్ ఇచ్చిన పోలీసులు.. ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించిన విషయం తెలిసిందే. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో.. అదే ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంవో ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా? -
Hyd: కుమారి ఆంటీకి బిగ్ షాక్
నాన్నా.. నాన్నా.. అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ.. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని సోషల్ మీడియాను షాక్ అయ్యేలా చేసి ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి. అయితే తాజాగా ఆమెకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించగా.. తనకు మాత్రమే బంద్ చేయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో.. అదే ఆమెకు దెబ్బేసింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. వారం పాటు దుకాణం బంద్ చేయాలని.. ఈలోపు జీహెచ్ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్ కోర్టు తెరుచుకోవాలని ఆమెకు సూచించారు. కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ. నగరంలోని మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించింది. మొదట్లో కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందట!. ప్రేమగా వడ్డించే ఆమె విధానంతో పాటు అక్కడి రేట్లు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయారు. This is the reason y police halted #Kumariaunty hotel at ITC kohinoor Mari intha picholu unaru endi ra#hyderbad pic.twitter.com/b4yArC7pQR — Nandeeshwar (@SNandeeshwar) January 30, 2024 ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయటంపై కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తున్నారు. మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి తన ఒక్కరిపట్లే ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని, ఇప్పుడు వారే ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలంటూ తన వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్‌కు కుమారి ఆంటీ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం.. చాలారోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ఆమె స్టాల్ మూలంగానే ఇక్కడ ట్రాఫిక్‌జామ్ అవుతోంది. ఈ విషయంపై ఆమెకు చెబుతూ వస్తున్నా.. ఆమె స్పందించలేదు. ఖాళీ చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తని మరోచోట బిజినెస్ చేస్కోమని ఆమెకు చెబుతున్నాం. పైగా అది ఆమె సొంత స్థలం కాదు. ఆమెనే కాదు.. ప్రస్తుతం నగరంలో ఉన్న చాలా రోడ్‌సైడ్ ఈటరీ స్టాల్స్‌కు అనుమతులు లేవు. ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు ఫర్వాలేదు. కానీ, ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఒకవేళ ఈ అంశంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే గనుక మేం ఏం చేయలేం. ఒకవేళ కోర్టు గనుక తొలగించాల్సిందేనని చెబితే మాత్రం తీసేస్తాం అని రాయ్‌దుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయానంద్ స్పష్టం చేశారు. -
యువరాణికి పట్టం.. డిప్యూటీ సీఎంగా దియాకుమారి
జైపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ.. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అనుహ్యంగా కొత్తవారిని ముఖ్యమంత్రులుగా ప్రకటించి సరికొత్త వ్యూహాన్ని అమలు పరిచింది. అయితే తాజాగా కూడా అదే ఫార్ములా ప్రయోగించింది. రాజస్థాన్‌లో కేవలం మొదటిసారి గెలిచిన భజన్‌లాల్ శర్మను సీఎంగా బీజేపీ ప్రకటించింది. అయితే ఇక్కడ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ప్రేమ్ చంద్ భైరవ, దియా కుమారిలను డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజస్థాన్‌లో రాజ కుంటుబానికి చెందిన దియా కుమారికి.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈసారీ బీజేపీ హైకమాండ్ రాజస్థాన్ సీఎంగా దియా కుమారికి అవకాశం కల్పిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. సీఎం పదవి కోసం వసుంధర రాజే, అర్జున్‌రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి సీనియర్ నేతలతో పోటీపడ్డ దియా కుమారి.. డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంది. ప్రస్తుతంగా ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జైపూర్ మహారాజ కుటుంబంలో ఆమె 1971లో జన్మించారు. తాత మాన్ సింగ్-2 బ్రిటీష్ ఇండియా కాలంలో చివరి జైపూర్ మహారాజు. తండ్రి బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్ మహావీర చక్ర అవార్డు గ్రహిత. ఆయన 1971లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మహారాణి గాయత్రీ దేవి పాఠశాల విద్య, జైపూర్‌లోని మహారాణి కళాశాలలో కాలేజీ చదువును పూర్తి చేసుకున్నారు. నరేంద్ర సింగ్‌ను వివాహం చేసుకున్న దియాకుమారికి.. ముగ్గురు పిల్లలు. ఆమె 2018లో నరేంద్ర సింగ్‌తో విడాకులు తీసుకుంది. రాజకీయం జీవితం.. రాజకీయలపై ఆసక్తితో దియాకుమారి 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో మాధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మొదటిసారి గెలుపొందగానే పలు ప్రాంతాలను అభివృద్ధి చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజసమంద్ నియోజకవర్గం నుంచి పోటీ ఎంపీగా గెలుపోందారు. రాజకీయాలతో పాటు దియా కుమారి అనేక బిజినెస్ వెంచర్లు, రెండు స్కూల్స్, మ్యూజియం, ట్రస్టు, హోటల్, ఎన్జీఓలను నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాల ద్వారా ఆమె స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తారు. పలు ఎన్జీఓ ద్వారా సేవ చేసినందుకు.. ఆమె ఇటీవల జైపూర్‌లోని అమిటీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. 2023 రాజస్థాన్ అసెంబ్లీలో విధ్యాదర్నగర్లో నియోజకవర్గలో పోటీ చేసి 71,368 భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవ ఈ యువరాణి(దియా కుమారి) మహిళలకు భద్రతకు కృషి చేస్తానని, యూవతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల కష్టాలను తీర్చుతానని ప్రచారంలో హామీలు ఇచ్చారు. చదవండి: రాజస్థాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ -
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా..
అనకాపల్లి: అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా.. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా.. అంటూ జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పలకరించారు. మద్యం వ్యసనం మాన్పించేందుకు జేసీ ‘విముక్తి’ అనే ప్రాజెక్టును మునగపాక మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్యం విడిచిపెట్టిన ఇద్దరు వ్యక్తులు పాటిపల్లి గ్రామంలో ఉన్నారు. భూముల రీసర్వే సమీక్ష కోసం మంగళవారం మండలానికి వచ్చిన జేసీ.. పాటిపల్లిలో ఆ ఇద్దరు వ్యక్తుల ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మద్యం మానేశాక వారి ఇంటి పెద్దలో వచ్చిన మార్పు, ఇప్పటికీ అదే పరివర్తన కొనసాగుతోందా.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారింట్లో ఫొటో ఆల్బమ్ చూస్తూ పాత జ్ఞాపకాల గురించి వారితో ముచ్చటించారు. ‘విముక్తి’ పైలట్ ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేసిన ఏఎన్ఎం సుజాతను ఈ సందర్భంగా జేసీ అభినందించారు. ఓ పెద్ద కూతురిలా తమ ఇంటికి వచ్చి అంత పెద్ద ఐఏఎస్ అధికారి తమ మంచి చెడ్డలను వాకబు చేయడంతో ఆ ఇంటివారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. -
రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ
సీనియర్ నటి జయకుమారిని(70) తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ ఆదివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో ఐటెం సాంగ్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది నటి జయకుమారి. ఆ పాటలకు అప్పట్లో అధిక పారితోషికం వస్తుండడంతో తాను శృంగార తారగా మారానని జయ కుమారి ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. 400 పైగా చిత్రాల్లో నటించారు. అయినా ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు రూ. 750కు అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆమె 2 కిడ్నీలు దెబ్బతినడంతో వైద్యం కోసం స్థానిక కీల్పాక్కంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎం.సుబ్రమణియన్ ఆదివారం ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు. ఆమెకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, సొంత ఇంటిని ఏర్పాటు చేసే విషయమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
దీన స్థితిలో సీనియర్ నటి జయకుమారి.. కిడ్నీలు దెబ్బతినడంతో
చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో సీనియర్ నటి జయకుమారి (70) చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చేరారు. వివరాలు.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో నాడోడి చిత్రంతో నటిగా పరిచయం అయిన ఆమె ఎంగిరిందో వందాళ్, గౌరవం, నూట్రుక్కు నూరు, అనాథై ఆనందన్ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. జయకుమారి భర్త పేరు నాగపట్టినం అబ్దుల్లా. ఈయన చాలాకాలం క్రితమే కన్నుమూశారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జైయకుమారి చెన్నై, వేలచ్చేరిలోని అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. కాగా ఈమెకు కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. చదవండి: పుష్ప భామకు మరో భారీ ఆఫర్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే..! -
నవ వధువు ఆత్మహత్య
గచ్చిబౌలి: మనస్తాపానికి గురైన నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆర్.శ్రీనివాస్ వివరాల ప్రకారం కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని సుబ్బయ్య అర్చిడ్స్లో నివాసం ఉండే శేష సంతోషి కుమారి (26) భర్త పాండురంగా రావుతో బుధవారం గొడవ పడింది. సాయంత్రం వాకింగ్ చేస్తానని వెళ్లి 6వ అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
మన మట్టిలోనే ఉంది
కుమారి పుట్టింది కేరళలోని రామమంగళం. మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అక్షరం జీవితాన్ని వెలిగిస్తుందని నమ్మారు. పిల్లలిద్దరినీ చదివించి తీరాలనుకున్నారు. కుమారి, ఆమె తమ్ముడు.. ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కుమారి... అమ్మానాన్నల పెద్ద బిడ్డ కావడంతో ఆ ఇద్దరిలో ముందుగా గ్రాడ్యుయేట్ అయ్యారు. అయితే ఆ రికార్డు ఆ ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. ఊరంతటికీ రికార్డే. కేరళ అక్షరాస్యతలో ముందున్నప్పటికీ... అప్పటివరకు ఆ ఊర్లో పట్టభద్రులైన వాళ్లు లేరు. కుమారి ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఆమె ఆ చదువుతో తన కుటుంబ జీవితాన్ని నిర్మించుకుని అక్కడితో గిరిగీసుకుని ఉండి ఉంటే ఆమె గురించి ఇంతగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదేమో. ఆమె తన గ్రామంలో తర్వాతి తరం పిల్లలందరినీ గ్రాడ్యుయేట్లను చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది. అత్తగారి మద్దతు కుమారి పెళ్లి శిబులాల్‌తో జరిగింది. అతడు ఇన్ఫోసిస్‌లో సీఈవో హోదాలో ఉన్నాడు. పెళ్లితో కేరళ వదిలి ముంబయి, ఆ తర్వాత యూఎస్‌కు వెళ్లారు కుమారి. కొన్నేళ్ల తర్వాత 1997లో కుటుంబంతో సహా ఇండియాకి తిరిగి వచ్చారామె. ఆమె చేయదలుచుకున్న విద్యాసేవకు అత్తగారి కుటుంబం సంపూర్ణంగా మద్దతునిచ్చింది. కుమారి 1999లో సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ (ఎస్డీఎఫ్), 2004లో అద్వైత్ ఫౌండేషన్ స్థాపించారు. హైస్కూల్ పూర్తయిన పిల్లలందరూ జూనియర్ కాలేజ్‌లో చేరేలా చూడడం, ఇంటర్ పూర్తయిన తర్వాత విధిగా గ్రాడ్యుయేషన్‌లో చేర్పించడం ఆమె తలకెత్తుకున్న బాధ్యత. పిల్లల వయసుల వారీగా విద్యాదాన్, విద్యారక్షక్, అద్వైత్ ఫౌండేషన్, అంకుర్ ఫౌండేషన్లను స్థాపించి వాటిని సంయుక్తంగా నిర్వహిస్తున్నారామె. అందరికీ తెలియాలి ‘‘పరోపకారంలో భారతదేశ సంస్కృతి మహోన్నతమైనది. అయినప్పటికీ గత ఏడాది 128 దేశాల వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ర్యాంకులో భారతదేశానికి దక్కింది 82 స్థానం. ఇందుకు కారణం భారతదేశంలో, భారతీయుల్లో ఎదుటి వారికి ఇచ్చే గుణం లేదని కాదు. పరోపకారాలు పైకి తెలియకపోవడమే. ఎదుటి వ్యక్తి అవసరంలో ఉన్నట్లు గమనించినప్పుడు తమకు తోచిన సహాయం చేసేస్తారు. అంతేతప్ప ఒకరికి సహాయం చేయడానికి లెక్కలు, రిజిస్టర్లు మెయింటెయిన్ చేయరు. పరోపకారం చేసిన విషయానికి ప్రచారం కల్పించుకోకపోవడం, డాక్యుమెంట్లు తయారు చేసుకోలేకపోవడం, వాటిని ఇలాంటి పోటీలకు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల గణాంకాల ఆధారంగా వచ్చే ర్యాంకులలో పై స్థానాలకు చేరుకోవడం భారతదేశానికి కష్టమవుతోంది. నిజానికి భారతీయుల్లో సహాయం చేసేగుణం మెండు’’ అని చెప్పారు కుమారి. తమ కుటుంబం ఆర్థికంగా వెనుకపడిన కుటుంబాల పిల్లల ఉన్నత చదువుల కోసం చేస్తున్న సహాయాన్ని వివరిస్తూ... ‘‘ఇలాంటి కుటుంబాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చదివిస్తున్నామంటే అది ఆ ఒక్కరికి లేదా ఆ కుటుంబానికి మాత్రమే చేస్తున్న సహాయం కాదు. దేశానికి మనవంతుగా ఇస్తున్న సహకారం’’ అన్నారామె. – మంజీర -
వైజాగ్ యువతి అదృశ్యం
బంజారాహిల్స్: శుభకార్యం కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైజాగ్ అరిలోవా ప్రాంతానికి చెందిన కుమారి(17) డిగ్రీ చదువుతోంది.ఐదు రోజుల క్రితం ఆమె జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో ఉంటున్న తన పెద్దమ్మ రత్నమ్మ ఇంటికి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం గాజులు కొనుక్కునేందుకు వెళుతున్నట్లు చెప్పి బయటికి వచ్చింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన కుమారి అనే దివ్యాంగురాలు
-
తెలంగాణ కుమారి విశాఖలో ఆందోళన..
రావికమతం: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కోదాడ గ్రామానికి చెందిన యువతి కుమారి(22) ఆదివారం విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని గ్రామానికి చెందిన ఆర్లె శివ (23) ఇంటి ముందు బైఠాయించింది. మోసపోయిన తనకు న్యాయం చేయాలంటూ ఆమె డిమాండ్ చేయడంతో రావికమతం ఎస్ఐ రామకృష్ణ ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె శివ ఏడాది క్రితం నల్గొండలో బీటెక్ చదివాడు. అప్పట్లో అక్కడ కోదాడకు చెందిన తనతో పరిచయం ఏర్పడిందని, తనను నమ్మించి మోసం చేశాడని ఆమె పేర్కొంది. దీనిపై ఏడాది క్రితమే కోదాడ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పింది. అయితే శివ కేసు భయంతో ఇక్కడికి వచ్చేశాడని ఆమె వివరించింది. అతని అడ్రస్ తెలుసుకుని ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆమె శివ ఇంటిముందు బైఠాయించింది.దీంతో శివ, అతని కుటుంబసభ్యులను, యువతిని పోలీసుస్టేషన్‌కు రప్పించి విచారించామని ఎస్ఐ తెలిపారు. అయితే శివ మాత్రం తనకేమీ తెలియదని చెబుతున్నాడన్నారు. తెలంగాణలో కేసు నమోదైనందున ఇక్కడ కేసు నమోదు చేయమని చెప్పడంతో అక్కడే పరిష్కరించుకుంటామని ఇరువర్గాలు కోదాడ బయలుదేరి వెళ్లారని ఎస్ఐ తెలిపారు. -
వంచిన తల ఎత్తింది
బహ్ని కుమారి తెలంగ...అస్సాం అమ్మాయి. ఈ ఏడాది యు.పి.ఎస్.సి. (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షల్లో 661వ ర్యాంకు సాధించింది. దేశంలో ఎందరో అమ్మాయిలు సివిల్స్ రాస్తున్నారు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ తదితర సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు చేస్తున్నారు. పోనీ ఈశాన్య రాష్ట్రాల అమ్మాయి అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామా అంటే... ఈ ఒక్క ఏడాదిలోనే ఈశాన్య రాష్ట్రాల నుంచి ఏకంగా పాతిక మంది అమ్మాయిలు ఈ పరీక్షను పూర్తి చేశారు. మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. అయినప్పటికీ బహ్ని కుమారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఉంది. దృశ్యం మారింది: అస్సాం రాష్ట్రంలో టీ తోటల్లో పని చేసే కుటుంబాల నుంచి యూపీఎస్సీ లో ర్యాంకు సాధించిన తొలి మహిళ బహ్ని. అస్సాం అంటేనే టీ తోటలు గుర్తుకొస్తాయి. వీపుకు వెదురు బుట్ట కట్టుకుని మునివేళ్లతో తేయాకు తెంపుతున్న మహిళలే గుర్తుకు వస్తారు. అస్సాంకు ప్రతీకగా చూపించే దృశ్యం కూడా అదే. అయితే గతంలో ఈ కుటుంబాలలో మహిళల విద్య, ఉద్యోగం వంటివి ఆలోచనకు కూడా అందేవి కాదు. తేయాకు కోసే గిరిజన తెగల్లో ఆడపిల్ల చేయాల్సిన పని అంటే అక్కడ ఇంటి పనులు చేసుకుని, తోటల్లో టీ కోసే కూలికి వెళ్లడమే. అలాంటి గిరిజన కుటుంబంలో పెరిగిన యువతి ఇప్పుడు తల వంచుకుని తేయాకు తెంపడానికే పరిమితం కాకుండా ఒక పనిని సమర్థంగా ప్రణాళికా బద్ధంగా నిర్వర్తించే పెద్ద ఉద్యోగంలో చేరుతున్నందుకు ఆ తెగ మొత్తం బహ్నిని చూసి సంతోషిస్తోంది. ఉద్యోగాన్ని వదిలేసింది: అస్సాం రాజధాని గువహటి నగరంలోని సెయింట్ మేరీస్ స్కూల్, కాటన్ కాలేజ్‌లలో చదివింది బహ్ని. దుర్గాపూర్ ఎన్ఐటీలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేసింది. తర్వాత విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఉద్యోగం చేస్తూనే రెండుసార్లు యు.పి.ఎస్.సి. పరీక్షలు రాసింది. ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఉద్యోగం మానేసి మరీ మూడవసారి తీవ్రంగా ప్రయత్నించింది. ర్యాంకు సాధించింది. పుత్రికోత్సాహం ‘మా అమ్మాయి సాధించిన ర్యాంకు ఆమె ఉన్నతమైన కెరీర్‌కి చక్కటి సోపానమే. తండ్రిగా గర్వపడుతున్నాను. అయితే ఇది ఆమెకు మాత్రమే కాదు. మా తెగ మొత్తం అందుకున్న ఒక ఘనత. అస్సాంలో తేయాకు కోసే మా తెగ గిరిజనులు కొల్లలు. వారి జీవనస్థితిగతులు అంతంతమాత్రమే. ఈ తెగలో పుట్టి యు.పి.ఎస్.సి. సాధించిన తొలి మహిళ బహ్ని. అయితే ఆమె ఈ రికార్డును కిరీటంగా ఆస్వాదించడం కాదు, రాష్ట్రంలో మా గిరిజన తెగల మహిళల కోసం తన వంతుగా పని చేయాలి కూడా’ అంటున్నారు బహ్ని తండ్రి బర్కి ప్రసాద్ తెలంగా. ఆయన మాజీ మంత్రి కూడా. అస్సాంలోని థౌరా నియోజకవర్గం నుంచి 1985లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన బర్కీ ప్రసాద్ అస్సాం గణపరిషత్ ప్రభుత్వంలో చేరారు. అస్సాం రాష్ట్రానికి శ్రామిక మంత్రిగా పని చేశారు. -
కన్న కూతురిని.. కత్తితో..
చిత్తూరుః మానవత్వం మంట కలిసిపోయింది. కన్నకూతుర్ని కత్తితో పొడిచి చంపింది ఓ కసాయి తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కుర్చివేడు గ్రామంలో నివాసముంటున్న యోగ మూర్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. ఏడేళ్ల కిందట కుమారి అనే మహిళతో ఆయనకు వివాహమైంది. వీరికి లాస్య(6) కుమార్తె ఉంది. చిత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఇటీవల జమ్ము-కశ్మీర్ నుంచి యోగా మూర్తి 50 రోజుల సెలవుపై ఇంటికి వచ్చాడు. మంగళవారం తమిళనాడులోని ఓ ఆలయానికి దేవుని దర్శనం కోసం వెళ్లాడు. అయితే, 11 గంటల ప్రాంతంలో లాస్యకు ఆరోగ్యం సరిగాలేదని కుమారి మూర్తికి ఫోన్ చేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తాను బయలుదేరుతున్నారని బదులిచ్చాడు భర్త. మరో రెండు గంటల అనంతరం తిరిగి భర్తకు ఫోన్ చేసిన కుమారి.. లాస్య చనిపోయిందని చెప్పింది. దీంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్నాడు. ఈ లోగా మూర్తికి ఫోన్ చేసిన గ్రామస్తులు లాస్య మరణం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. ఇంటికి చేరుకున్న మూర్తి బిడ్డను కత్తితో పొడిచి చంపేశారని నిర్ధారించుకున్నాడు. ఇంత కిరాతకమైన పని ఎవరు చేశారని భార్యను ప్రశ్నించాడు. కుమారి మిన్నకుండటంతో చుట్టుపక్కల వాళ్లు కూడా ఆమెను ప్రశ్నించారు. ఈ లోగా పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకోవడంతో కుమారి పోలీసులకు లొంగిపోయింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, లాస్యను చంపడానికి వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ కోణంలోనే నిందితురాలిని ప్రశ్నిస్తున్నారు. లాస్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
‘స్పీకర్ కోడెల క్షమాపణలు చెప్పాలి’
గూంటూరు: గోళ్లపాడు సర్పంచ్ కుమారి విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ విషయంపై స్పీకర్ కోడెల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సర్పంచ్ కుమారి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆమె హెచ్చరించారు. ప్రశ్నించే ప్రజాప్రతినిధులను నిర్బంధించడం హేయం అని ఆమె అన్నారు. రాష్ట్రంలో అటవిక పాలన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత సభ జరిగిన చోటే ఎస్టీ సర్పంచ్‌ను అవమానించారని అన్నారు. మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అధికార పార్టీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కూడా తమ గొంతునొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.