కుటుంబ కలహాలతో భార్య హత్య | Family strife wife killed | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో భార్య హత్య

Published Tue, May 27 2014 2:19 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

కుటుంబ కలహాలతో భార్య హత్య - Sakshi

కుటుంబ కలహాలతో భార్య హత్య

  • పెద ఓగిరాలలో దారుణం
  •  గడ్డపారతో కొట్టి చంపిన వైనం
  •  పెదఓగిరాల (ఉయ్యూరు), న్యూస్‌లైన్ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన సంఘటన  మండలంలోని పెద ఓగిరాల గ్రామంలో ఆదివారం రాత్రి కలకలం సృష్టించింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బందెల కృష్ణ, భార్య కుమారి (40) వ్యవసాయ కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు.  కొంతకాలంగా వీరిరువురి మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి.

    ఆర్థికపరమైన విషయంలో తరచూ మనస్పర్థలు  వచ్చేవి. ఈ నేపథ్యంలోనే ఆదివారం భార్యభర్తలు ఇరువురూ గొడవపడ్డారు. మాటామాటా పెరిగి గడ్డపారతో భార్య తలపై కృష్ణ దాడి చేయడంతో కుమారి కుప్పకూలిపోయింది. క్షతగాత్రురాలిని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు.

    దీంతో కుమారిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. కుమార్తె హత్య ఉదంతం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణమ్మ రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కుమారికి ఇద్దరు కుమారులున్నారని తెలిసింది. రూరల్ ఎస్‌ఐ కృష్ణమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కుమారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    సోమవారం ఆస్పత్రిలో మృతదేహాన్ని ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు, సీఐ మురళీరామకృష్ణ పరిశీలించారు. కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. భార్యను హతమార్చిన కృష్ణ పరారీలో ఉన్నాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement