బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గామాత విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో ఒక యువకుడు మృతి చెందిన దరిమిలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐదు వేల మంది స్థానికులు మహసీ తహసీల్ కార్యాలయం ముందు ఆ యువకుని మృతదేహాన్ని ఉంచి, నిరసనకు దిగారు.
బహ్రాయిచ్ జిల్లాలోని మహరాజ్‌గంజ్ మార్కెట్‌లో ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీనిలో ఒక యువకుడు మృతిచెందాడు. రామ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహువా మన్సూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బహ్రాయిచ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న దరిమిలా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటువైపుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
రెహువా మసూర్ గ్రామస్తులు దుర్గామాత విగ్రహంతో నిమజ్జనానికి వెళుతూ, డీజేను ప్లే చేశారు.దీంతో ఆగ్రహంచిన మరోవర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మరోవర్గం జరిపిన కాల్పుల్లో రామ్ గోపాల్ మిశ్రా(22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. యువకుని మృతితో ఉద్రిక్తతలు మరింగా పెరిగాయి. వేలాది మంది గ్రామస్తులు నిరసనకు దిగారు. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి, షోరూంకు నిప్పు పెట్టారు. పలు ఇళ్లకు కార్లకు కూడా నిప్పు పెట్టారు.
నిరసనకు దిగిన వారితో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి లేదు. అయితే ఈ కేసులో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదిపరి చర్యలకు ఉపక్రమించారు.
ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి
Comments
Please login to add a commentAdd a comment