ఈ భూమి మీద నూకలున్నంత వరకూ ప్రాణం ఎలాగైనా నిలబడుతుందంటారు. ఇది 38 ఏళ్ల మహిళ విషయంలో నిరూపితమయ్యింది. ఒక భారీ మెసలి ఆమెపై దాడి చేసింది. నీటిలోతుల్లోకి లాక్కుపోయింది. గంట పాటు ఆ మహిళను మొసలి నోటిలో చిక్కుకుని విలవిలలాడిపోయింది. అయితే అప్పుడే అద్భుతం జరిగింది. ఆమె ప్రాణాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ఆమె కథ విపరీతంగా వైరల్ అవుతోంది.
మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం 38 ఏళ్ల ఫమ్లిరా.. పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. ఇటీవల ఆమె ఒక నదిలో నీటిని పాత్రలో పట్టుకుంటోంది. ఆ నదిలో మొసళ్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదు. ఇంతలో ఒక మొసలి క్షణాల్లో ఆమెను నీటిలోనికి లాక్కుపోయింది. ఫ్లమిరా బాధతో తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది.
ఆమెతో పాటు పనిచేసే కూలీలు ఆమెను కాపాడేందుకు పరుగులు పెట్టారు. వారు ఆ మొసలిని కర్రలతో కొట్టాసాగారు. దీంతో బాధితురాలు ఆ మెసలి నోటి బారి నుంచి ఎలాగోలా బయటపడింది. అయితే ఆమెను కాపాడేందుకు కూలీలు గంటకుపైగా శ్రమించారు. ఈ సమయంలో ఫల్మిరా కూడా మొసలి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది.
అటు కూలీల దాడి, ఇటు బాధితురాలి పెనుగులాట మధ్య ఆ మొసలి ఆమెను తన నోటి నుంచి విడిచిపెట్టింది. బాధితురాలిని మొసలి బారి నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కొందరు గాయాలపాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఫమ్లిరా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మొసలి నోటికి చిక్కిన తాను దాని బారి నుంచి బయటపడుతాననుకోలేదన్నారు. ఇప్పటికీ తన కళ్ల ముందు మొసలి ఉన్నట్లుందన్నారు. కాగా మొసలి దాడిలో ఫల్మిరా పాదాలకు, ఉదర భాగానికి తీవ్రమైన గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు?
Comments
Please login to add a commentAdd a comment