ఎన్నో రకాల అలెర్జీల గురించి విన్నాం. కానీ ఇలాంటి వింతైన ఎలెర్జీ గురించి విని ఉండే అవకాశం లేదు. ఎందుకంటే? ఇది వస్తే అన్ని విధాలుగా కష్టం. మన మనుగడే కష్టమయ్యేలా చేసే భయానక అలెర్జీ.
వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని టెస్సా హాన్సెన్ స్మిత్ అనే మహిళ అత్యంత అరుదైన అలెర్జీకి గురైంది. దీని కారణంగా స్నానం చేయాలన్నా భయం. నీరు తాగాలన్న భయమే. కనీసం దప్పికగా ఉన్న నీరు తాగే అవకాశమే లేదు. పొరపాటున నీటి చుక్కలు తగిలేందుకు కూడా వీల్లేదు. ఎప్పుడైన బయటకు వెళ్లితే సడెన్‌గా వర్షం వచ్చిందంటే ఇక ఆ మహిళ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుంది. ఆమె చిన్నతనంలో అంతా బాగానే ఉంది. అందరిలా హయిగా తుళ్లుతూ ఆడుకుంటుండేది. ఎనిమిదేళ్ల వయసుక వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ భయనక అలెర్జీ వచ్చిందో ఇక ఆ లక్షణాలు ముదిరి ఆమెను కనీసం స్నానం అంటేనే భయపడిపోయేలా చేసింది.
అసలు జీవితంలో ఎన్నటికీ బాత్ చేయలేని నిస్సహాయ స్థితిలోకి పడేసింది. కనీసం నీటి జల్లులు తాకిన ఇక అంతే!.. ఒక్కసారిగా శరీరం అంతా మండిపోతూ దద్దుర్లు వచ్చేస్తాయి. క్రమంగా అది ఏ స్థాయికి వచ్చేసిందంటే.. పొరపాటున దాహంగా ఉందని నీరు తాగిందా.. ఆమె గొంతు మండుతున్నట్లు ఉండి ఇక గిలగిల తన్నుకుపోయేంతలా అయిపోతుంది. ఆమె తల్లి ఎన్నో అరుదైన అనారోగ్యాలు చూసిన గొప్ప వైద్యురాలు. కానీ తన సొంత కుమార్తె అంతకంటే ఘోరమైన ఈ వింత అలెర్జీ బారిన పడటం ఆమెకు అత్యంత కష్టంగా ఉంది.
ఆమెకు నీటి సమస్య ఉందని తెలుసుకుని హుతాశురాలైంది. ఆమె సైతన తన కూతుర్నీ ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడేయాలో తెలియక సతమతమవుతోంది. దీన్ని ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అలెర్జీ అంటారు. అంటే నీళ్లు తగిలినా తాగినా మండుతున్నట్లు దద్దర్లు వచ్చేస్తాయి. అసలు నీళ్లు పడవు ఈ అలెర్జీ బారిన పడినవాళ్లకి. అందువల్లేఆమె అందరిలా ఆనందంగా జీవించగలిగే అవకాశమే లేదు. కనీసం స్నానం చేసే అవకాశం లేదు. పాలు మాత్రమే తీసుకోవాలి అది కూడా వ్యాధినిరోధక శక్తి కోసం. పాలల్లో నీళ్లు ఎక్కువ మోతాదు లేకుండా జాగ్రత్తపడాలి. దీని కారణంగా ఆమె ఆస్పత్రి బిల్లు నెలకు లక్షల్లో ఉంటుంది.
ఈ ఖర్చుని భరించలేక తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో 'గోఫండ్ మీ' అనే వెబ్‌పేజీని ఓపెన్ చేసి తన కూతురు పరిస్థితిని వివరిస్తూ.. డబ్బు అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె గ్రాడ్యేయేషన్ చేస్తుంది. కనీసం స్పీడ్‌గా నడవకూడదు. ఎందుకంటే నడిస్తే చెమటలు పట్టి మళ్లీ ఎలెర్జీ విజృంభిస్తుందనే భయం. అందువల్లో రోజుల్లో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండకతప్పని స్థితి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 నుంచి 250 మందికి మాత్రమే ఆక్వాజెనిక్ ఉర్టికేరియా ఉందని గణాంకాల్లో వెల్లడైంది.
(చదవండి: ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు వస్తాయా?)
Comments
Please login to add a commentAdd a comment