అదృష్టవంతురాలంటే ఈమెనే.. | A woman who fell into a water tank survived | Sakshi
Sakshi News home page

అదృష్టవంతురాలంటే ఈమెనే..

Published Mon, Oct 14 2024 10:51 AM | Last Updated on Mon, Oct 14 2024 11:02 AM

A woman who fell into a water tank survived

విధి మనిషిని నడిపిస్తుందని అంటుంటారు. విధి చేతిలోనే మనిషి జీవితం ఉందని కూడా అంటారు. దీనిని రుజువు చేసే ఉదాహరణలు మనకు తరచూ ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోను చూసిన వారంతా కంగుతింటున్నారు.పైగా ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళను అత్యంత అదృష్టవంతురాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళుతుండగా పక్కనే ఉన్న ఒక బిల్డింగ్‌​ పైనుంచి ఒక పెద్ద సింటెక్స్‌ వాటర్‌ ట్యాంక్‌ నేరుగా ఆ మహిళ పైన పడుతుంది. దీనిని చూసిన వెంటనే ఎవరైనా సరే ఆ మహిళ తీవ్రంగా గాయపడి ఉంటుందని అనుకుంటారు. అయితే కొద్ది సేపటికి ఆ మహిళ ట్యాంక్‌ మధ్య నుంచి లేచి నిలబడుతుంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి, జరిగిన ప్రమాదాన్ని గమనించి, ఆ మహిళతో మాట్లాడతాడు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.

 



ఇది కూడా చదవండి: హైదరాబాద్‌: వేడుకగా రావణ దహనం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement