35-Year-Old Missing UP Woman's Body Found In Tank At Lover's Home, Accused In Custody - Sakshi
Sakshi News home page

దృశ్యం సినిమా రేంజ్‌లో హత్య..చివరకు..

Published Sat, Jun 10 2023 11:13 AM | Last Updated on Sat, Jun 10 2023 11:31 AM

35 Year Old Missing UP Womans Body Found In Tank At Lovers Home,  - Sakshi

ఓ వ్యక్తి తెలివిగా ప్రియురాలిని దృశ్యం మూవీ రేంజ్‌లో హతమార్చాడు. గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. కానీ ఆమె ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా పోలీసులకు చిక్కక తప్పలేదు. చివరికి అసలు నిజం బయటపడి కటకటాల పాలయ్యాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ వ్యక్తి ప్రియురాలిని గుట్టు చప్పుడు కాకుండా కడతేర్చాడు. ఆమె మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న తన ఇంటి ట్వాంకులో దాచిపెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె కనపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు ఆమె చివరికాల్‌ డేటా ఆధారంగా అరవింద్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు.

విచారణలో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అరవింద్‌. ట్యాంకు వద్ద దాచిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని 35 ఏళ్ల రాజ్‌ కేసర్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడు అరవింద్‌ దాదాపు 14 రోజుల క్రితమే కేసర్‌ను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

(చదవండి: బీఆర్‌ఎస్‌ మహిళా నేత ఆత్మహత్య.. వివాహ వేడుకలకు హాజరై..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement