స్నానం చేస్తే.. నరకయాతన అనుభవించే వాళ్లు ఉన్నారంటే నమ్ముతారా!. అసలు ఇలాంటి సమస్య కూడా ఉంటుందా? అని అనిపిస్తుంది.కానీ ఇలాంటి చిత్ర విచిత్రమైన అనారోగ్య సమస్యలు ఫేస్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. వాటికి సరైన చికిత్స విధానం, తగ్గించే మందులు లేకపోవడంతో వాళ్లు చెప్పుకోవడానికి కూడా వీల్లేనంత యాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి భాదనే చవిచూస్తోంది యూకేకి చెందిన ఓ మహిళ.
వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్‌లోని సౌత్ కరోలినాకు చెందిన 22 ఏళ్ల మహిళ తీవ్రమైన నీటి అలెర్జీతో బాధపడుతోంది. అందువల్ల ఆమె స్నానం చేయలేని స్థితిని ఎదుర్కొంటుంది. అలాగని స్నానం చేయకుండా ఉండటం అనేది కుదరని పని. తప్పక స్నానం చేసినా.. వెనుటవెంటనే టవల్‌తో తుడిచేసుకోవాల్సిందే. ఒక చుక్క నీరు కూడా శరీరంపై ఉండటానికి వీల్లేదు. ఇది ఎంత దారుణమైన బాధంటే..ఆయా వ్యక్తులు పొరపాటున కూడా నీటిని తాకలేరు, కనీసం వారి స్వేద జలం కూడా వారికి ఇబ్బందే. ఆమె శరీరం పొరపాటున తడికి గురయ్యిన లేదా నీళ్లను తాకినప్పుడు వెంటనే దద్దుర్లు, దురద రావడం జరుగుతుంది.
ఎంతలా అంటే అదేపనిగా దురద వస్తూ ఉండటంతో గోకకుండా ఉండలేనంత విధంగా ఒకటే దురదగా ఉంటుందని వేదనగా చెబుతోందామె. తనకు ఈ పరిస్థితి సుమారు 12 ఏళ్ల వయసు నుంచి మొదలయ్యిందని, ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి మరింత దిగజారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక భరించేలేక డాక్టర్ వద్దకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే వైద్యులు కూడా ఈ అలెర్జీకి చికిత్స లేనందున వీలైయినంతగా స్నానం చేయకపోవడం లేదా స్నానం చేయడానికి దూరంగా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని సూచించినట్లు తెలిపింది.
అయితే ఇలా స్నానం చేయకుండా తడిగుడ్డతో లేదా వైప్స్‌తో తుడుచుకోవడం ఎంత నరకమో తెలుసా? అంటూ కన్నీటి పర్యంతమవుతోంది ఆ మహిళ. తాను ఇలా స్నానం చేయకుండ ఉండలేను స్నానం చేస్తే తట్టుకోలేను అంటూ బాధగా తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. అయితే తనలాంటి వాళ్లు ఎవరైన ఉన్నారా? అని సోషల్ మీడియా ద్వారా సర్చ్ చేసి మరీ తెలుసుకున్నానని, తామంత ఒక కమ్యూనిటిగా ఉండి, తమ సమస్యలను ఒకరికొకరం షేర్ చేసుకుంటామని చెప్పింది. నిజానికి ఇదొక అరుదైన సమస్య. వైద్య చరిత్రలో నీటికి సంబంధించిన అలెర్జీలు 37 రకాలు ఉన్నాయని, ఇప్పటివరకు వాటికి సరైన చికిత్స విధానం లేదని వైద్యులు చెబుతుండటం గమనార్హం.
(చదవండి: చేప చర్మం కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్, అల్సర్లకు కూడా!)
Comments
Please login to add a commentAdd a comment