survived
-
అదృష్టవంతురాలంటే ఈమెనే..
విధి మనిషిని నడిపిస్తుందని అంటుంటారు. విధి చేతిలోనే మనిషి జీవితం ఉందని కూడా అంటారు. దీనిని రుజువు చేసే ఉదాహరణలు మనకు తరచూ ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూసిన వారంతా కంగుతింటున్నారు.పైగా ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళను అత్యంత అదృష్టవంతురాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళుతుండగా పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ పైనుంచి ఒక పెద్ద సింటెక్స్ వాటర్ ట్యాంక్ నేరుగా ఆ మహిళ పైన పడుతుంది. దీనిని చూసిన వెంటనే ఎవరైనా సరే ఆ మహిళ తీవ్రంగా గాయపడి ఉంటుందని అనుకుంటారు. అయితే కొద్ది సేపటికి ఆ మహిళ ట్యాంక్ మధ్య నుంచి లేచి నిలబడుతుంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి, జరిగిన ప్రమాదాన్ని గమనించి, ఆ మహిళతో మాట్లాడతాడు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. An apple a day keeps the doctor away. pic.twitter.com/ugvzXYKDxq— Hemant Batra (@hemantbatra0) October 13, 2024ఇది కూడా చదవండి: హైదరాబాద్: వేడుకగా రావణ దహనం -
ఆరుగంటలకు పైగా మంచులోనే..! బతికే ఛాన్సే లేదు! కానీ..
అద్భుతాలెప్పుడూ అకస్మాత్తుగానే జరుగుతాయి. వాటిని కళ్లారా చూసినవారికి ‘ఔరా!’ అనిపిస్తే... చూడనివారికి, కొన్నాళ్ల తర్వాత ఆ కథ విన్నవారికి.. ‘ఔనా..?’ అనిపిస్తుంది. ఈ రెండిట్లోనూ ‘ఇదెలా సాధ్యం?’ అనే అనుమానం అంతర్లీనంగా ధ్వనిస్తుంది. ఆ అనుమానం తీరిందంటే.. ‘కొత్త ఒక వింత పాత ఒక రోత’ అన్నట్లుగా ఆ ఘటన ఇట్టే మరుగున పడిపోతుంది. అది అస్పష్టంగా మిగిలితే మాత్రం.. హిస్టరీలో మిస్టరీగా నిలిచిపోతుంది. అది 1980 డిసెంబర్ 20, రాత్రి పది దాటింది. అమెరికా, మినెసోటాలోని లెంగ్బి అనే ప్రాంతం గుండా ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ కారులో 19 ఏళ్ల జీన్ హిలీయార్డ్ అనే అమ్మాయి.. తన ఇంటికి చేరుకోవడానికి ఆ చిన్న మార్గాన్నే అడ్డదారిగా ఎంచుకుంది. చుట్టూ నిర్మానుష్యం. అక్కడక్కడా వీథి దీపాలు వెలుగుతున్నా కమ్ముకున్న మంచు ఆ వెలుతురును మసకబార్చే పనిలో పడింది. ఇంకాస్త ముందుకెళ్లేసరికి కారు హెడ్‌లైట్స్ కూడా చీల్చలేనంత చిమ్మచీకటి ముసిరింది. ఉన్నపళంగా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి పక్కనే ఉన్న గుంతవైపు కారు ఒరిగిపోయింది. కారు చక్రాలు మంచు పెళ్లల్లో చిక్కుకోవడంతో.. ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేదు. గడ్డకట్టే ఆ చలికి రాత్రంతా కారులోనే ఉంటే ప్రాణాలకే ప్రమాదమని వెంటనే కారు దిగి.. సమీపంలోని ఏదో ఒక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పటికి ఆమె చేతులకు గ్లౌజులు, ఒంటి మీద పొడవాటి చలి కోటు, కాళ్లకు బూట్లు ఉన్నాయి. అయితే కంగారులో టోపీ కారులోనే మరచిపోయింది. ఆ సమయంలో దాదాపు మైనస్ 22 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌తో మంచు.. వానలా పడుతుంది. అదంతా తనకు తెలిసిన దారే కావడంతో దగ్గర్లోని ఓ ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది. అయితే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. పెరుగుతున్న చలి ఒంట్లో వణుకు పుట్టిస్తోంది. జీన్స్, నెల్సన్(లేటెస్ట్ ఫోటోలు) బుర్ర మొద్దు బారిపోతోంది. ఆ క్షణంలో జీన్ కి.. స్నేహితుడు వాలే నెల్సన్ గుర్తొచ్చాడు. అతడి ఇల్లు అక్కడికి సరిగ్గా రెండు మైళ్ల దూరంలో ఉంటుందని తనకు బాగా తెలుసు. వెంటనే అతడి ఇంటి వైపు నడక సాగించింది. అయితే చీకటి, పొగమంచు కలసి జీన్‌ని తికమక పెడుతున్నాయి. కళ్లు ఆర్పకుండా.. మిణుకు మిణుకుమంటున్న వెలుతురులో తోవ వెతుక్కుంటూ అడుగులు వేస్తున్న జీన్ లో ప్రాణభయం మొదలైంది. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరవుతోంది. తీక్షణంగా చూసుకుంటూ.. తిన్నగా నడుస్తూ.. మొత్తానికి నెల్సన్ ఇంటి సమీపానికి చేరుకుంది. అప్పటికే సత్తువ సన్నగిల్లింది. నరాలు బిగుసుకుని.. శరీరం ఆధీనం కోల్పోయింది. ∙∙ మరునాడు ఉదయం ఏడు దాటింది. నెల్సన్ ఇంటి తలుపు తెరుచుకున్నాయి. గుమ్మానికి కాస్త దూరంలో మంచు పెళ్లల మధ్య.. ఓ వింత ఆకారం నెల్సన్ కంటపడింది. బెరుగ్గానే వెళ్లి చూశాడు. చూసి నివ్వెర పోయాడు. అచ్చం దెయ్యంలాగా కళ్లు పెద్దగా తెరచుకుని.. ఇనుప కడ్డీలా బిగుసుకుపోయి.. మంచులో కూరుకుపోయి ఉంది జీన్ హిలీయార్డ్. ఉలుకూ పలుకూ లేదు. సుమారు ఆరుగంటలకు పైగా.. ఆ మంచు గాలుల్లో ఉండిపోవడంతో ఆమె పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. వెంటనే ఆమెను కాలర్ పట్టుకుని వరండాలోకి లాక్కెళ్లాడు నెల్సన్. ఆమె బోర్డు కంటే గట్టిగా బిగుసుకుపోయుంది. ఆ తీరుకు ఆమె చనిపోయిందనే అనుకున్నాడు. కానీ ఆమె ముక్కు నుంచి కొన్ని బుడగలు రావడం చూశాడు నెల్సన్. వెంటనే ఫోస్టన్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్లు షాక్ అయ్యారు. కనీసం ఇంజెక్షన్ చేయడానికి కూడా ఆమె శరీరం సహకరించలేదు. సూది చర్మంలోకి దిగలేదు. దాంతో వాళ్లు ఆమె చనిపోయిందని అనుకున్నారు. వెంటనే హీటింగ్ ప్యాడ్లతో ఆమెను వేడెక్కించే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలకు ఆ ప్రయత్నం ఫలించింది. ఆమెలో కదలికలు మొదలయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి విషయం తెలుసుకున్న జీన్ తల్లి బెర్నిస్, తండ్రి లెస్టర్లు ఆసుపత్రికి పరుగుతీశారు. కూతురు ప్రాణాలతో తమకు దక్కినందుకు పొంగిపోయారు. జీన్ స్నేహితుడు నెల్సన్ కి వేలవేల కృతజ్ఞతలు తెలిపారు. కొన్నిరోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుంది. అయితే ‘ఆ రాత్రి నెల్సన్ ఇంటి ముందు పడిపోవడం వరకే నాకు గుర్తుంది. ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోయి లేచినట్లుగా అనిపించింది. పడిపోయాక ఏం జరిగిందో నాకు ఏదీ గుర్తు లేదు’ అని జీన్ చెప్పడం ఆశ్చర్యకరం. కళ్లు తెరిచే బిగుసుకుపోయిన జీన్ కి ఏదీ కనిపించకుండా, ఏదీ గుర్తు లేకుండా, తిరిగి ప్రాణాలతో బయటపడటం అందరినీ నివ్వెరపరచింది. వార్తా ప్రతికలన్నీ ఈ అద్భుతాన్ని కథలు కథలుగా ప్రచురించాయి. ఇదే మూలాన్ని అల్లుకుంటూ.. ఎన్నో సినిమాలు, కథలు, డాక్యుమెంటరీలు పుట్టుకొచ్చాయి. నెల్సన్ , జీన్లకి ఎలా పరిచయం అంటే.. నెల్సన్ స్నేహితుడు పాల్.. గర్ల్‌ఫ్రెండే ఈ జీన్. ఘటన జరిగిన ముందు రోజు కూడా జీన్, నెల్సన్ ఇద్దరూ పాల్ సమక్షంలో కలిశారట. ఫోస్టన్ అమెరికన్ లెజియన్‌లో హాటెస్ట్ స్పాట్లో ఓ పార్టీలో కలసి.. ఆటపాటలతో ఎంజాయ్ చేశారట.నెల్సన్ ఇప్పటికీ లెంగ్బీకి ఉత్తరాన ఉన్న క్లియర్బ్రూక్ సమీపంలో మీట్ షాప్ నడుపుకుంటూ నివసిస్తున్నాడు. జీన్ కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కూడా కన్నది. కొన్నేళ్లకు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ప్రస్తుతం కేంబ్రిడ్జ్‌లో ఉంటూ.. వాల్‌మార్ట్‌లో పని చేస్తోంది. ఈ ఘటన గురించి ఎప్పుడు అడిగినా ఆమె మొదటి స్పందన ఏంటో తెలుసా? ‘నేనురాత్రి పూట కారు డ్రైవింగ్ మానేశాను’ అని. ఈ రోజుల్లో, వైద్యరంగం బాగా అభివృద్ధి చెందింది. కానీ 1980లో.. అదీ.. ఒక గ్రామీణ ఆసుపత్రిలో.. కేవలం కొన్ని హీటింగ్ ప్యాడ్లతో.. చావు అంచులకు చేరిన మనిషిని కాపాడటం అనేది నేటికీ మిస్టరీనే. సంహిత నిమ్మన (చదవండి: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..) -
"బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది!అద్భుతం చేసింది!
ఒక్కొసారి నిరాశగా అన్న మాటలు కూడా ఆయుధంగా మారతాయి. అవి వరంగా మారి గెలిచే ఆసక్తిని రేపుతాయి కూడా. బహుశా అందుకేనేమో పెద్దలు విమర్శిస్తున్నారని కూర్చొకు వాటినే ఎదిగేందుకు ఉపయోగపడే మెట్లుగా భావిస్తే విజయం నీ పాదాక్రాతం అని అన్నారు. ఇది జరిగే అవకాశమే లేదు అన్నవి, ఒక్క శాతం కూడా గెలిచే అవకాశం లేనివి కూడా ఏదో ఒక ఊహించని మలుపులో గెలుపు తీరం అందుతుంది, ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. అచ్చం అలాంటి అద్భుత ఘటనే యూఎస్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విషయంలో ఈ అద్భుతం జరిగింది. యూఎస్‌లో అలెగ్జెండర్ అనే వ్యక్తి 1946లో జన్మించాడు. ఆ టైంలో యూఎస్ అంతట పోలియో ప్రబలంగా ఉంది. అతను కూడా ఈ పోలియో బారినే పడ్డాడు. అయితే ఇతని కేసు మాత్రం యూఎస్ చరిత్రలో పిల్లలకు సోకిన 58 వేల పోలియో కేసుల్లో ఘోరమైనది. అలెగ్జెండర్ ఆరేళ్ల ప్రాయంలో ఈ పోలియో బారిన పడ్డాడు. ఎంత ఘోరంగా అంటే.. అతడి వెన్నుపాముని చచ్చుపడేలా చేసి ప్రాణాంతకంగా మారింది. దీని కారణంగా అలెగ్జాండర్ ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నాడు. నిజానికి ఈ పోలీయో వ్యాధి పోలియోన్ లేదా పోలియోమైలిటిస్ అనే పోలియో వైరస్ వల్ల వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడమో లేదా ప్రాణాంతకంగా మారవచ్చు. పోలియో వ్యాక్సిన్‌ని యూఎస్ 1955లోనే ఆమోదించింది. పిల్లలందరికీ అందించింది కూడా. 1979 కల్లా దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది కూడా. అప్పటికే అలెగ్జాండర్కి జరగకూడని నష్టం జరిగిపోయింది. శరీరం అంతా చచ్చుబడి శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న అలెగ్జాండర్కి ట్రాకియోటమీ అనే ఇనుప ఊపిరితిత్తులు అమర్చారు. అది అతని మెదడు నుంచి కాలి వరకు కవర్ అయ్యి ఉంటుంది. అది అతన్ని కదలడానికి లేదా దగ్గడానికి అనుమతించదు. నిజం చెప్పలంటే అతను ఎప్పటి వరకు బతుకుతాడనేది కూడా చెప్పలేం. ఏ క్షణమైన చనిపోవచ్చు. ఏదో వైద్యులు అతన్ని కాపాడేందుకు అమర్చిన పరికరమై తప్ప అతని లైఫ్ టైం పెంచేది మాత్రం కాదు. వైద్యులు కూడా అతను బతకడు, బతికే అవకాశం లేదనే భావించారు. కొద్ది రోజుల్లోనే చనిపోతాడనే అన్నారు. అయితే అతడు అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా 70 ఏళ్లు అలానే కదలకుండా ఆ ఇనుప యంత్రంతో బతికాడు. ఐతే అత్యాధునిక యంత్రాలు వచ్చినప్పటికీ అతడి శరీరం ఆ భారి ఇనుమ మెషిన్‌కి అలవాటుపడటంతో ఈ తేలికపాటి ఆధునిక యంత్రాలు అమర్చడం అసాధ్యమయ్యింది. అసలు చెప్పాలంటే అతడు ఉన్న పరిస్థితి తలుచుకుని దిగులుతో చనిపోతారు. కానీ అతడు ఎంతో గుండె నిబ్బరంతో ఆ సమస్యతో పోరాడుతూనే బతికి చూపించాడు. పైగా పాఠశాల విద్యను పూర్తి చేశాడు. న్యాయశాస్త్రంలో పట్టుభద్రుడవ్వడమే గాక చాలా ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశాడు కూడా. కదలేందుకు వీలు లేకపోయినా నిరాశ చెందలేదు. కాలు మెదపకుండా జీవితాంత ఆ బరువైన ఇనుప మెషిన్‌తో అలానే బెడ్‌కి పరిమితమైన కూడా.. "జీవించాలి" అనే ఆశను వదులుకోలేదు. ఎలాగో చనిపోతాడని తెలిసి కూడా ఏదో ఒకటి చేస్తూ.. బతకగడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మొత్తం మిషన్‌తో ఓ డబ్బాలో ఉన్న మొండెలా కనిపిస్తాడు అలెగ్జాండర్. ఏ క్షణంలోనూ కొద్దిపాటి నిరాశకు, నిస్ప్రుహను దరిచేరనివ్వకుండా బతికి చూపడు. అతడి ఈ తెగువే అత్యంత పొడవైనా ఐరన్ ఊపిరితిత్తులు కలిగినా వృద్ధ రోగిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కేలా చేసింది. అతడికి వైద్యం చేసిన వైద్యులే చనిపోయారేమో కానీ అత్యంత దయనీయ స్థితిలో బతకీడుస్తూ కూడా తాను పూర్ణాయుష్కుడినే అని నిరూపించాడు. వైద్యులు సైతం అతడు ఇప్పటి వరకు జీవించి ఉండటం అద్భుతమని చెప్పారు. క్షణికావేశంలో అకృత్యాలకు పాల్పడే యువతకు, అనుకున్నది జరగలేదన్న వ్యథతో బతుకు ముగించుకోవాలన్న వ్యక్తులందరీకి అతడు స్ఫూర్తి. ఓపికతో ఎలా వ్యవహిరించాలి, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా సంయమనంతో ఉండి అందరూ ముక్కున వేలేసుకునేలా ఎలా జీవించాలో అతడు చేసి చూపించాడు. (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
ట్రాక్టర్ మునిగినా.. ఈదుతూ బయటపడిన రైతు..
మహబూబాబాద్: మానుకోటి జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు బంగారుగూడెం జీపీ పరిధిలోని చౌళ్ల తండా వద్ద పొలాలు దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ మున్నేరువాగు వరద నీటిలో గురువారం మునిగిపోయింది. బంచరాయి తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ లచ్చిరాం చౌళ్ల తండాకు చెందిన పొలాలను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఈక్రమంలో మున్నేరు వాగు ప్రవాహం పెరిగింది. రెండువైపులా నీరు వచ్చి చేరుతుండడంతో నీటిలో ట్రాక్టర్ మునిగిపోయింది. దీంతో లచ్చిరాం ట్రాక్టర్‌ను అక్కడే వదిలి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. నీటిలో ట్రాక్టర్ మునిగిపోయిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. -
అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు. ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ -
రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడి.. వీడియో వైరల్
యూపీ : షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్లో షాకింగ్ సంఘటన ఒకటి జరిగింది. గంటకు 110కి.మీ వేగంతో దూసుకుపోతున్న ట్రైన్ నుండి ఒక యువకుడు పొరపాటున జారి పడ్డాడు. కానీ అతడు లేచిన వేళావిశేషం బాగున్నందుకో ఏమో గానీ అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఎటువంటి గాయాలు తగలకుండా తప్పించుకున్నాడు. రెప్పపాటులో.. యూపీలోని షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్ మీదుగా పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ గంటకు 110 కి.మీ వేగంతో దూసుకుపోతోంది. ప్లాట్ ఫారం మీద జనమంతా రైలు వేగానికి దూరంగా నిలబడి ఉన్నారు. అంతలోనే ఒక యువకుడు ఈ ట్రైన్ నుండి జారిపడ్డాడు. కింద పడ్డ ఆ యువకుడిని ట్రైన్ ఈడ్చుకుంటూ పోవడంతో ఆ స్పీడుకి ప్లాట్ ఫారంపై చాలా దూరం దొర్లుకుంటూ పోయాడు. ఈ ప్రమాదంలో యువకుడికి చిన్న గాయం కూడా కాలేదు సరికదా.. దొర్లడం ఆగిన తర్వాత రిలాక్స్ గా లేచి నిలబడి చేతులు దులుపుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను లైవ్‌లో చూసినవారంతా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. ప్లాట్ ఫారం మీదనున్న ఓ ప్రయాణికుడు మాత్రం ఈ సన్నివేశాన్ని తన ఫోన్లో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. బ్రతికి బయటపడటమంటే మనకు తెలుసు కానీ బయటపడి బ్రతకడమంటే ఇదేనేమో..! On Camera, Man Falls From Speeding Train In UP; Survives https://t.co/NYg3myF4VF pic.twitter.com/znlzXNBRUD — NDTV (@ndtv) June 21, 2023 ఇది కూడా చదవండి: International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం -
అతను చనిపోయాడనుకున్నారు.. తండ్రి నమ్మకమే బ్రతికించింది!
కోల్కత్తా: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణీకులు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదంలో మృతదేహాలను తరలించే క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మృతదేహాలు ఉన్న గదిలో నుంచి ఓ వ్యక్తి ఒక్కసారిగా కదలడంతో అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. అనంతరం, అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. బెంగాల్‌కు చెందిన బిస్వజిత్ మాలిక్(24) ప్రమాదం జరిగిన రోజున కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బోగీల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ క్రమంలో ఎంతో కష్టపడి బయటకు వచ్చాడు. కాగా, బయటపడగానే నీరసించిపోయి ఉండటంతో పట్టాలపై కుప్పుకూలిపోయాడు. ఇదే సమయంలో అక్కడున్న సిబ్బంది మాలిక్ చనిపోయాడనుకుని మృతదేహాలను తరలిస్తున్న ట్రక్కులో అతడిని పడేశారు. అనంతరం, బాహానగలో ఉన్న హైస్కూల్‌కు అతడి బాడీని తరలించారు. అయితే, తన తండ్రి నమ్మకమే అతడిని బ్రతికించింది. చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బిస్వజిత్‌కు అతని తండ్రి హేలారామ్ మాలిక్ ఫోన్ చేశాడు. కాగా, మాలిక్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు. దీంతో, బిస్వజిత్ బ్రతికే ఉన్నాడని తండ్రి మాలిక్ నిర్ధారించుకున్నాడు. అనంతరం, ప్రమాద స్థలానికి అంబులెన్స్‌ను తీసుకుని వెళ్లాడు. ఆరోజు రాత్రి 230 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి వెళ్లాడు. అన్ని ఆసుపత్రులు వెతికినప్పటికీ తన కొడుకు కనిపించలేదు. దీంతో, తాత్కాలిక శవాగారమైన బాహానగ హైస్కూల్‌కు వెళ్లారు. అక్కడ బిస్వజిత్‌ను గుర్తించామని, అతని కుడి చేయి కాస్త కదులుతున్నట్లుగా కనిపించిందని చెప్పాడు. అతను స్పృహలో ఉన్నాడని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పుకొచ్చాడు. తాము వెంటనే అతనిని అంబులెన్స్‌లో బాలాసోర్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ కొన్ని ఇంజెక్షన్స్, మందులు ఇచ్చారని, ఆ తర్వాత కటక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారని చెప్పాడు. అక్కడి నుండి కోల్‌కత్తాలోని ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. అతని చేయి విరిగిపోయిందని, కాలికి కూడా గాయమైందని చెప్పారు. ప్రస్తుతం వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఒడిశా ప్రమాదం: సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం! -
ఎత్తైన భవనం నుంచి దూకిన పిల్లి.. అయినా ఏం కాలేదంటే నమ్మండి!
బ్యాంకాక్‌లో 8.5 కేజీల బరువున్న ఓ పిల్లి పొరపాటున ఆరో అంతస్తు నుండి కిందికి దూకింది. అంతెత్తు నుండి పడిపోయినా కూడా ఆ పిల్లికి చిన్న గాయమైనా కాలేదు. ఇది చూసి ఆ యజమానే కాదు డాక్టర్ కూడా ఆశ్చర్య పోయాడు. అయితే ఈ పిల్లి నేరుగా పార్కింగ్ చేసి ఉన్న ఒక కార్ మీద పడటంతో దాని బరువుకు కారు వెనుక అద్దం మాత్రం పగిలింది. మృత్యుంజయురాలు... బ్యాంకాక్ కు చెందిన అపివాత్ టొయోతక అనే మహిళ తాను ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి షిఫుని ఇంట్లో వదిలి బయటకు వెళ్ళింది. వెళ్లేముందు కిటికీ తలుపు వేయడం మరిచిపోయింది. ఇంకేముంది షిఫు స్వేచ్ఛగా బయటకు వెళ్లి షికారు చేయాలనుకుందో ఏమో.. కిటికీలోనుంచి అమాంతం దూకేసింది. అదృష్టవశాత్తు షిఫు కింద పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు అద్దం మీద పడటంతో అద్దాన్ని పగలగొట్టుకుని కార్ సీటు మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. కారు అద్దానికి ఎలాగూ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇక షిఫుని డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లగా అక్కడక్కడా కారు అద్దం గీసుకున్న గాయాలు తప్ప దాని ఒంటి మీద వేరే గాయాలు లేకపోవడం చూసి షాకయ్యాడు. మృత్యుంజయురాలైన షిఫు చేసిన ఈ స్టంటును టొయోతక తన ట్విట్టర్లో పోస్ట్ చేసి గొప్పగా వివరించింది. చదవండి:మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్ -
ఖమ్మం: తాతా.. ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయే!
ఖమ్మం: చావు అంచుల దాకా వెళ్లొచ్చిన.. ఓ తాతను చూసి అదృష్టవంతుడని అంతా అనుకుంటున్నారంతా. జిల్లాలోని ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు నిర్లక్ష్యం ప్రదర్శించాడు. గూడ్స్ రైలు కింద నుంచి అవతలి ప్లాట్‌ఫామ్‌కు చేరే యత్నం చేశాడు. ఆ సమయంలో ఆ గూడ్స్ ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆ తాత రైలు కిందపడిపోయాడు. అయితే.. అయితే తాత సమయస్ఫూర్తితో పట్టాల మధ్యే పడుకుండి పోయాడు. ఆ సమయంలో పక్కనే పట్టాల మధ్య ఓ వృద్ధురాలు(బహుశా ఆయన తాలుకానేమో) ఆయనకి ఏమవుతుందో ఏమోఅనుకుంటూ.. రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు.. గూడ్స్ డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ఆయన రైలును ఆపేశాడు. ఆ వెంటనే పట్టాల మధ్య బొక్కబోర్లా పడుకున్న తాతను బయటకు లాగేశారు ప్రయాణికులు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడికి చిన్న చిన్న గాయాలైనట్లు సమాచారం. -
ప్రమాదం నుంచి బయటపడిన నేచురల్ స్టార్ నాని!
Natural Star Nani Escaped From Accident In Dasara Movie Shooting: తనదైన నటనా శైలితో ప్రేక్షకులు అతి దగ్గరయ్యాడు నేచురల్ స్టార్ నాని. ఓ పక్కింటి కుర్రాడిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగలేని ముద్ర వేసుకున్నాడు. ఇటీవల అంటే సుందరానికీ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించిన నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దసరా'. ఈ మధ్య కొంత విరామం తీసుకున్న నాని మళ్లీ దసరా షూటింగ్లో పాల్లొన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో స్వల్ప అపశృతి చోటుచేసుకున్నట్లు సమాచారం. దసరా సినిమా కథ బొగ్గు గనుల చుట్టూ తిరుగుతుందని పోస్టర్లు, టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ గోదావరి ఖనిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లో భాగంగా బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో బొగ్గంతా అతడిపై పడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు నానికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో చిత్రీకరణకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. నాని తిరిగి కోలుకున్నాక చిత్రీకరణ మళ్లీ పునఃప్రారంభమైంది. కాగా కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కోసం నాని సుమారు 7 కేజీల బరువు తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. -
చక్రాల కింద ఇరుక్కుని.. చావుని తప్పించుకుని..
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. చౌటుప్పల్ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ విఘ్నేశాచారి (73) ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చౌటుప్పల్‌కు వచ్చాడు. ద్విచక్ర వాహనంతో లారీ కింద ఇరుక్కున్న విఘ్నేశాచారి పని ముగించుకుని స్థానిక అంగడి ప్రాంతం నుంచి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో యూటర్న్ తీసుకునేందుకు బస్టాండ్ వద్దకి వెళ్లాడు. అక్కడ నెమ్మదిగా యూటర్న్ చేస్తుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న రెడీమిక్స్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విఘ్నేశాచారితో పాటు ద్విచక్ర వాహనం లారీ ముందు చక్రాల కింద ఇరుక్కుంది. ఇది గమనించని లారీడ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో పాటు స్థానికులు గట్టిగా కేకలు వేయగా లారీడ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన వెళ్లి ద్విచక్ర వాహనాన్ని, విఘ్నేశాచారిని లారీ కింద నుంచి బయటకు తీశారు. కాలికి చిన్నపాటి గాయం తప్పితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ నెమ్మదిగా వెళ్తుండటం, స్థానికుల కేకలతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రాణాపాయం తప్పింది. -
రెండేళ్ల బాలుడిపై నుంచి వెళ్లిన రైలు.. అయినా!
చండీగఢ్ : చావు అంచుల వరకు వెళ్లిన ఓ బాలుడు తిరిగి ప్రాణాలతో బయట పడ్డాడు. రైల్వే పట్టాలపై ఉన్న రెండేళ్ల బాలుడిపై రైలు వెళ్లినప్పటికీ దెబ్బలు తగలకుండా క్షేమంగా బతికాడు. ఈ అద్భుత ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఫరీదాబాద్ సమీపంలోని బల్లాబ్గర్ రైల్వే స్టేషన్ ట్రాక్‌పై ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటున్నారు. ఆట మధ్యలో పెద్దవాడు రెండేళ్ల పిల్లవాడైన తమ్ముడిని ట్రాక్ మీదకు నెట్టి వేయడంతో అతడు పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో ట్రాక్‌పై గూడ్స్ రైలు వేగంగా వస్తోంది. (25న షట్డౌన్కు రైతు సంఘాల పిలుపు) అయితే ట్రాక్‌పై పిల్లవాడిని గమనించిన రైలు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకు వేశాడు. కాగా అప్పటికే బాలుడి మీదగా ఇంజిన్ వెళ్లింది. ఇంతలో ఏం జరిగిందోనని భయంతో డ్రైవర్ అతని సహాయకుడు రైలు దిగి వచ్చి చూడగా అక్కడ జరిగిన సన్నివేశాన్ని చూసి షాక్ గురయ్యారు. ఇంజన్ కింద చిక్కుకున్న పిల్లవాడుఎలాంటి దెబ్బలు తగలకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అతన్ని డ్రైవర్ బయటకు తీసి తన తల్లికి అప్పగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు డ్రైవర్ సమయస్పూర్తిని ప్రశంసిస్తున్నారు. అంతేగాక స్థానిక డివిజనల్ రైల్వే మేనేజర్ లోకో పైలట్లకు రివార్డ్ ప్రకటించినట్లు రైల్వే అధికారి తెలిపారు. (బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి; అనేక మంది..) -
పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి
-
లైఫ్ ఆఫ్ జోస్