యూపీ : షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్లో షాకింగ్ సంఘటన ఒకటి జరిగింది. గంటకు 110కి.మీ వేగంతో దూసుకుపోతున్న ట్రైన్ నుండి ఒక యువకుడు పొరపాటున జారి పడ్డాడు. కానీ అతడు లేచిన వేళావిశేషం బాగున్నందుకో ఏమో గానీ అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఎటువంటి గాయాలు తగలకుండా తప్పించుకున్నాడు.
రెప్పపాటులో..
యూపీలోని షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్ మీదుగా పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ గంటకు 110 కి.మీ వేగంతో దూసుకుపోతోంది. ప్లాట్ ఫారం మీద జనమంతా రైలు వేగానికి దూరంగా నిలబడి ఉన్నారు. అంతలోనే ఒక యువకుడు ఈ ట్రైన్ నుండి జారిపడ్డాడు. కింద పడ్డ ఆ యువకుడిని ట్రైన్ ఈడ్చుకుంటూ పోవడంతో ఆ స్పీడుకి ప్లాట్ ఫారంపై చాలా దూరం దొర్లుకుంటూ పోయాడు.
ఈ ప్రమాదంలో యువకుడికి చిన్న గాయం కూడా కాలేదు సరికదా.. దొర్లడం ఆగిన తర్వాత రిలాక్స్ గా లేచి నిలబడి చేతులు దులుపుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను లైవ్లో చూసినవారంతా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. ప్లాట్ ఫారం మీదనున్న ఓ ప్రయాణికుడు మాత్రం ఈ సన్నివేశాన్ని తన ఫోన్లో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
బ్రతికి బయటపడటమంటే మనకు తెలుసు కానీ బయటపడి బ్రతకడమంటే ఇదేనేమో..!
On Camera, Man Falls From Speeding Train In UP; Survives https://t.co/NYg3myF4VF pic.twitter.com/znlzXNBRUD
— NDTV (@ndtv) June 21, 2023
ఇది కూడా చదవండి: International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం
Comments
Please login to add a commentAdd a comment