running train
-
సెల్‌ఫోన్ కోసం గొడవ.. యువతిని రైలు నుంచి తోసేయడంతో
సాక్షి, చెన్నై: చైన్నె కందన్చావడి, తిరువిక వీధికి చెందిన శశి కుమార్ కుమార్తె ప్రీతి(22).. కొట్టూరుపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె ఈనెల 2వ తేదీ సాయంత్రం, పని ముగించుకుని, సబర్బన్ రైలులో ప్రయాణించింది. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతి వద్ద సెల్‌ఫోన్ లాక్కోవడానికి యత్నించారు. ఈ సమయంలో వారితో గొడవపడింది. రైలు ఇందిరా నగర్ స్టేషన్ సమీపంలోకి రాగానే కోపోద్రిక్తులైన ఇద్దరు వ్యక్తులు ప్రీతీని కిందకు నెట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి ప్రయాణికులు, రైల్వే పోలీసులు ఆమెను రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతి చెందింది. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో తిరువాన్ముయూర్ రైల్వే పోలీసులు ఇందిరా నగర్ రైల్వేస్టేషన్ సహా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పట్టి నపాక్కంకు చెందిన విఘ్నేష్ (27), అడియార్కు చెందిన మణిమారన్ (26) నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్ శాంటానా మూడు రోజుల పాప కథ.. -
యాదాద్రి: ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం
సాక్షి, హన్మకొండ: విధి ఎంత విచిత్రమైందో.. సంతోషాన్ని క్షణాల్లోనే ఆవిరి చేసేస్తోంది. శ్రీకాంత్(25) అనే యువకుడిని జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోయింది. సెల్‌ఫోన్‌ను రక్షించుకోవాలనే తాపత్రయంతో రన్నింగ్ ట్రైన్ నుంచి పడి ప్రాణం కోల్పోయాడా యువకుడు. శాతావాహన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం బీబీనగర్(యాదాద్రి భువనగిరి) సమీపంలో ఈ విషాదం జరిగింది. కమలాపూర్ మండలం నేరెళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముప్పు శ్రీకాంత్ అనే యువకుడు బీబీనగర్ సమీపంలో శాతావాహన్ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి మృతి చెందాడు. శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. తొలిఏకాదశి, బక్రీద్ సెలవు దినం సందర్భంగా.. ఇంటికి వెళ్లేందుకు బుధవారం సాయంత్రం శాతవాహన ఎక్స్ ప్రెస్‌లో వరంగల్ బయల్దేరాడు. అయితే.. జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నాడు శ్రీకాంత్. మార్గం మధ్యలో బీబీ నగర్ వద్ద కర్రతో కొట్టి సెల్ ఫోన్ చోరీ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే సెల్‌ఫోన్‌ను కాపాడుకునే తాపత్రంలో శ్రీకాంత్ పట్టుజారి రైలు నుండి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగకు ఇంటికి కొడుకు వస్తాడని సంతోషంగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు.. కొడుకు శవం ఎదురు రావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదీ చదవండి: తండ్రి చేతిలో హతం.. ప్రియురాలు లేని జీవితం ఎందుకనుకుని.. -
రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడి.. వీడియో వైరల్
యూపీ : షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్లో షాకింగ్ సంఘటన ఒకటి జరిగింది. గంటకు 110కి.మీ వేగంతో దూసుకుపోతున్న ట్రైన్ నుండి ఒక యువకుడు పొరపాటున జారి పడ్డాడు. కానీ అతడు లేచిన వేళావిశేషం బాగున్నందుకో ఏమో గానీ అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఎటువంటి గాయాలు తగలకుండా తప్పించుకున్నాడు. రెప్పపాటులో.. యూపీలోని షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్ మీదుగా పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ గంటకు 110 కి.మీ వేగంతో దూసుకుపోతోంది. ప్లాట్ ఫారం మీద జనమంతా రైలు వేగానికి దూరంగా నిలబడి ఉన్నారు. అంతలోనే ఒక యువకుడు ఈ ట్రైన్ నుండి జారిపడ్డాడు. కింద పడ్డ ఆ యువకుడిని ట్రైన్ ఈడ్చుకుంటూ పోవడంతో ఆ స్పీడుకి ప్లాట్ ఫారంపై చాలా దూరం దొర్లుకుంటూ పోయాడు. ఈ ప్రమాదంలో యువకుడికి చిన్న గాయం కూడా కాలేదు సరికదా.. దొర్లడం ఆగిన తర్వాత రిలాక్స్ గా లేచి నిలబడి చేతులు దులుపుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను లైవ్‌లో చూసినవారంతా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. ప్లాట్ ఫారం మీదనున్న ఓ ప్రయాణికుడు మాత్రం ఈ సన్నివేశాన్ని తన ఫోన్లో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. బ్రతికి బయటపడటమంటే మనకు తెలుసు కానీ బయటపడి బ్రతకడమంటే ఇదేనేమో..! On Camera, Man Falls From Speeding Train In UP; Survives https://t.co/NYg3myF4VF pic.twitter.com/znlzXNBRUD — NDTV (@ndtv) June 21, 2023 ఇది కూడా చదవండి: International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం -
షాకింగ్ ఘటన: దొంగతనం చేశాడని..కదులుతున్న రైలు నుంచి తోసేసి..
దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్ నుంచి తోసేశారు. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఒక గుర్తు తెలియని 20 ఏళ్ల వ్యక్తి షాజహాన్‌పూర్‌లోని తిల్హర్ రైల్వే స్టేషన్ పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. సదరు వ్యక్తి రైల్వే పట్టాల వద్ద ఉండే ఓవర్‌హెడ్ లైన్ పోల్కి తల ఢీకొట్టడంతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఐతే మృతుడికి సబంధించిన ఒక వైరల్ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఆ వీడియోలో ఒక జనరల్ కంపార్ట్మెంట్ బోగిలో 40 ఏళ్ల నరేంద్ర దూబే అనే వ్యక్తి బాధితుడిని ఫోన్ దొంగలించినందుకు క్రూరంగా కొడుతున్నట్లు కనిపించింది. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత బాధితుడిని పనిష్మెంట్ కింద కదులుతున్న ట్రైయిన్ నుంచి తోసేస్తున్నట్లు..సదరు బాధితుడు భయంతో అరుస్తున్న కేకలు ఆ వీడియోలో వినిపించాయి. దీంతో పోలీసులు సదరు ప్రయాణికుడు నరేంద్ర దూబేని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక మహిళన తన మొబైల్ ఫోన్ షాజహాన్‌పూర్ రైల్వేస్టేషన్లో పోయిందని ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. వాస్తవానికి బాధితుడు ఫోన్ దొంగలించి లక్నోలో ట్రైయిన్ ఎక్కినట్లు తేలింది. అయితే అక్కడ జనరల్ కంపార్ట్మెంట్లోని ఒక సముహం అతని వద్ద ఈ ఫోన్‌ని గుర్తించి దాడి చేసి రైలులోంచి తోసేశారని పోలీసలు చెబుతున్నారు. దొంగలించిన అరగంటలోనే బాధితుడు రైల్వే పట్టాలపై విగతజీవిగా పడిఉన్నట్లు తెలిపారు. A man suspected to have stolen a mobile phone in Ayodhya Delhi express was thrashed mercilessly and thrown off the running train. He died after his head hit against a pole near Tilhar railway station in Shahjahanpur Uttar Pradesh. pic.twitter.com/bCrREOD51o — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) December 18, 2022 (చదవండి: మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి) -
కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో..
ముంబై: ప్లాట్‌ఫాంపై కదులుతున్న రైలు ఎక్కబోయి తల్లీకూతురు కిందపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు, ఓ ప్యాసెంజర్ వీళ్లిద్దరిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ముంబైలోని వాసాయ్ రోడ్ రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. Prompt action by #RPF Constable Tejaram saved a mother-daughter duo from a major accident in nick of time at Vasai Road railway station while they tried to board a moving train. Your safety is our greatest concern.#MissionJeewanRaksha #BeResponsie #BeSafe @rpfwr1 @rpfwrbct pic.twitter.com/lTUhu2rNOX — RPF INDIA (@RPF_INDIA) December 13, 2022 తల్లీకూతురును రక్షించిన కానిస్టేబుల్ తేజారామ్‌ను ఆర్పీఎఫ్ ప్రశంసించింది. ఈ ఘటనలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. తమ ప్రాణాలు కాపాడినందుకు రైల్వే కానిస్టేబుల్ తేజారామ్‌కు తల్లీకూతురు కృతజ్ఞతలు చెప్పారు. చదవండి: పెళ్లి రద్దు.. రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి.. -
రన్నింగ్ రైలు నుంచి నెట్టివేత.. విషమంగా సైనికుడి పరిస్థితి
క్రైమ్: టికెట్ విషయంలో ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. అయితే కోపంతో వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు నెట్టేయడంతో.. భారత సైన్యంలో పని చేసే ఆ వ్యక్తి తన కాలును కోల్పోయాడు. అంతేకాదు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోనూ అనే సైనికుడు.. దిబ్రుఘడ్-కొత్త ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో టీటీఈ సుపాన్ బోర్ అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన టికెట్ విషయంలో ఏదో గొడవ జరిగింది. వాగ్వాదం జరుగుతున్న టైంలో కోపం కట్టలు తెంచుకున్న సుపాన్.. సోనూని ఒక్కసారిగా రైలు బయటకు నెట్టేశాడు. దీంతో రైలు కిందకు వెళ్లిపోయి తీవ్రంగా గాయపడ్డాడు సోనూ. అది గమనించిన స్థానికులు రైలును ఆపేసి.. టీటీఈని చితకబాదారు. దీంతో సుపాన్ బోర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సోనూని మిలిటరీ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతని కాలిని తొలగించినట్లు తెలుస్తోంది. సోను పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మర్డర్ అటెంప్ట్ నేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సుపాన్ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఏం జరిగిందో పరిశీలిస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. -
నువ్వు తోపు బ్రదర్.. డెలివరీ బాయ్ సాహసానికి మహిళా కస్టమర్ ఫిదా!
ఓ వ్యక్తి తన పని మీద ఉన్న డెడికేషన్ చూపించాడు. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. కదులుతున్న రైలును సైతం చేజ్ చేసి ఓ కస్టమర్‌కు వస్తువును డెలివరీ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. వివిధ రకాల వస్తువులను హోమ్ డెలివరీ అందించే డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న రైలు వెంట పరుగెత్తి మరీ తన కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను అందించాడు. కాగా, సదరు మహిళా కస్టమర్.. ఆ ఏజెంట్ అందించిన వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, ఈ ఘటన ముంబైలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో డంజో డెలివరీ బాయ్ స్టేషన్లో పరుగెత్తుకుంటూ కనిపిస్తాడు. రైల్వే ఫ్లాట్‌ఫాంపై రైలు నెమ్మదిగా కదులుతోంది. క్రమంగా రైలు వేగం పెరిగింది. ఇంతలోనే డంజో డెలివరీ బాయ్ ఓ సంచితో పరుగెత్తుకుంటూ ఫ్లాట్ ఫాంపైకి వచ్చాడు. రైలులో డోర్ వద్ద నిలబడిన ఓ మహిళ.. డంజో డెలివరీ బాయ్‌ను ఫాస్ట్.. ఫాస్ట్ అంటూ చేతులతో సైగలు చేసింది. దీంతో, అతను రైలు వెంట వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలోని ఆర్డర్‌ను సదరు మహిళకు అందించాడు. ఆమె దానిని చూపుతూ సంతోషం వ్యక్తం చేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడికి ప్రమోషన్ ఇవ్వాలని ఒకరు.. అతడికి 10 టైమ్స్ టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు అని మరొకరు కామెంట్స్ చేశారు. Just Came Across This Viral Video. His Dedication Is Really Amazing! #DDLJ #TrendingReels #SRK #Dunzo @DunzoIt @iamsrk @itsKajolD pic.twitter.com/GfGp0zmQLF — Prathamesh Avachare (@onlyprathamesh) September 15, 2022 -
అమ్మ బాబోయ్.. రైల్వే బ్రిడ్జిపై షాక్ తిన్న ప్యాసింజర్
రైల్వే బ్రిడ్జిపై రైలు ముందుకెళ్తోంది. వాటర్ వ్యూను ఆస్వాదించే ఉద్దేశంతో ప్రయాణికులు డోర్లు, కిటికీల దగ్గరకు వచ్చి చేరారు. ఇద్దరు యువకుల్లో ఒకడు.. తన జేబు నుంచి మొబైల్ తీసి దృశ్యాన్ని షూట్ చేస్తున్నాడు. ఉన్నట్లుండి ఆ ప్రయాణికుడికి ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. రెయిలింగ్‌కు వేలాడుతున్న ఓ వ్యక్తి.. ప్యాసింజర్ చేతిలో ఫోన్‌ను రెప్పపాటులో లాగేసుకున్నాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ.. బీహార్ బెగుసారాయ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెయిలింగ్‌కు కట్టేసుకుని.. ముఖానికి ముసుగు దొంగకు ముద్దుగా స్పైడర్‌మ్యాన్ అని పేరు పెట్టారు నెటిజన్స్. -
కదులుతున్న రైలులో దారుణం.. వంటగదిలో సీటు ఉందని నమ్మించి..
భోపాల్ : ఇటీవలి కాలంలో దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలు, బాలికలు అనే బేధం లేకుండా కొందరు మృగాళ్లు వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోనే ఓ వ్యక్తి యువతి (21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు యశ్వంత్ పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తుండగా ఓ యువతి రైలు ఎక్కింది. అయితే, సదరు యువతికి సీటు దొరక్కపోవడంతో ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి వంట చేసే గదిలో ఖాళీ స్థలం ఉందని నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలిని అతడు అక్కడికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె నిద్రిస్తున్న సమయంలో సదరు వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (చదవండి: యూపీ పీఠానికి అదే దారి?) ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో హుటాహుటిన వారు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వంట చేసే బోగీ డోర్ తెరచి చూడగా బాధితురాలు అపస్మాకర స్థితిలో పడి ఉంది. దీంతో వారు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందించిన తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న 15 మంది చిరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. (చదవండి: భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..?) -
Viral Video: రెప్పపాటు ఘటన.. కొంచెం ఆలస్యం అయితే యువకుడి ప్రాణం పోయేది..
సాక్షి, వరంగల్: రన్నింగ్ రైలులో నుంచి దిగుతూ కిందపడిపోయిన ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం 1లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ టీఎస్ఆర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం జహనాబాద్‌కు చెందిన ప్రధూమ్‌కుమార్(22) వరంగల్‌లోని బాలాజీ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వరంగల్ నుంచి సూరత్ వెళ్లుటకు టికెట్ తీసుకుని నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్లాట్‌ఫాం నంబర్ 1లో వేచియున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం 6.30 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం 1నకు వచ్చింది. హడావిడిగా అది ఏ రైలో తెలుసుకోకుండా ప్రధూమ్‌కుమార్ శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అది కదిలి స్పీడుగా వెళ్తున్న క్రమంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కాదని తెలుసుకుని వెంటనే దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్లాట్‌ఫాం, రైలు బోగీల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశంలో పడబోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వరంగల్ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎంవీ రావు, హోంగార్డు ఆమిరిశెట్టి మహేష్‌లు గమనించి వెంటనే అప్రమత్తమై ప్రధూమ్‌కుమార్‌ను పట్టుకుని బయటకు లాగారు. దాంతో ఆయన ప్రాణాలతో బయట పడ్డాడు. ఇదంతా రెప్పపాటు సమయంలో జరిగింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రయాణికులు, అధికారులు అభినందించారు. Today, on 08.02.2022, Sri M.V.Rao, ASI/RPF/WL and homeguard rescued a man who was falling from a running train at Warangal Railway station. Great job sir, Jaihind... pic.twitter.com/FtIZdGX2T7 — Rebal Ravi (@RebalRavi4) February 8, 2022 -
రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ కింద పడిపోయిన మహిళ.. వీడియో వైరల్
ముంబై: రన్నింగ్‌లో ఉన్న బస్సులు, రైళ్లు ఎక్కడం ప్రమాదమని అందరికి తెలుసు. అయినా కొంతమంది పట్టించుకోకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. ఇలా చేయడం కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే మహరాష్టలో చోటుచేసుకుంది. ముంబైలోని రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ఓ మహిళ ఒక్కసారిగా జారీ పడిపోయింది. ఆమె కాళ్లు ప్లాట్‌ఫాం లోపలికి వెళ్లాయి. దీనిని గమనించిన ఫ్లాట్‌ఫాంమీద ఉన్న ప్రయాణికులు, స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను కాపాడారు. ప్రమాదం జరగడంతో వేగంగా వెళ్తున్న రైలు కూడా ఆగిపోయిది. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీడియోను చూస్తే మహిళకు తీవ్రంగానే గాయాలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఘటన భయానకంగా ఉందని, ఎవరూ ఇలా చేయోద్దంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఛీ ఛీ.. నాలుకతో ఎంగిలి చేస్తూ, కాళ్లతో తొక్కుతూ.. వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం #WATCH | Maharashtra: Passengers saved a woman from falling under a moving train at Vasai Road Railway Station, yesterday. (Source: CCTV at the railway station) pic.twitter.com/SBvmCWWAeU — ANI (@ANI) September 19, 2021 -
ఏపీ వెళ్లే రైలు కాదని దూకేశారు.. ఒకరు మృతి
లక్నో: ఒక రైలు ఎక్కబోయి మరో రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోరఖ్‌పూర్‌లోని దేవ్‌కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (35)గా రైల్వే పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ తన అంకుల్ జగ్మోహన్, సోదరుడు విజయ్, తన స్నేహితులు సందీప్, సంజయ్‌లతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ వెళ్లేందుకు బుధవారం రాత్రి ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. రాత్రి 12:30 గంటల సమయంలో ఏపీ రైలు అనుకుని వీరంతా ఢిల్లీ వైపు వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు కదిలిన కాసేపటికి ఢిల్లీ వెళ్తుందని తెలియడంతో కంగారు పడి ఏం ఆలోచించకుండా కదులుతున్న రైలు నుంచి దూకేశారు. అజయ్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. చదవండి: కోట్లు విలువ చేసే పదార్థం అమ్మే ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్ -
పెళ్లైన రెండోరోజే పారిపోయి.. రైలులో ప్రేమించిన వాడితో పెళ్లి!
బెంగళూరు/పట్నా: ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు.. కారణం అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్లైన రెండోరోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది. ఆ తర్వాత ఆ యువతి తాను ప్రేమించిన యువకుడిని రైల్వే స్టేషన్లో కలిసి బెంగళూరు వెళ్తున్న రైలు ఎక్కింది. కదులుతున్న రైళ్లోనే ఆ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. అలా ఆ ప్రేమజంట ఒక్కటయ్యింది. వివరాలు.. బిహార్‌కు చెందిన అను కుమారి, అషుకుమార్‌లు కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇది నచ్చని అనుకుమారి తల్లిదండ్రులు ఆమెకు రెండు నెలల క్రితం కిరణ్‌పూర్ గ్రామానికి చెందిన యువకుడితో బలవంతంగా పెళ్లి జరిపించారు. కానీ అను ఆ యువకుడిని భర్తగా ఒప్పుకోలేక పెళ్లైన రెండోరోజే అత్తవారింటి నుంచి పారిపోయివచ్చింది. అనంతరం అషు కుమార్‌ను సుల్తాన్‌గంజ్ రైల్వేస్టేషన్లో కలిసింది. వారిద్దరు కలిసి బెంగళూరు వెళ్తున్న రైలు ఎక్కారు. నీకోసం .. తాను కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చానని.. మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అను అషుకుమార్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో చేసేదేం లేక కదులుతున్న రైలులోనే ఆమెకు నుదుట సింధూరం దిద్దాడు. ఇది జరిగి రెండు నెలల కావొస్తున్న తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగుచూడడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: పాపం.. ఆ కోడలి సాహసం వృథా! భారత్‌లో 121 ఏళ్ల తర్వాత ఇది రెండోసారి.. -
మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
సికింద్రాబాద్: కదులుతున్న రైలు నుంచి కిందపడబోయిన మహిళను ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సైఫుద్దీన్ అప్రమత్తతకు మెచ్చిన ఉన్నతాధికారులు శనివారం అభినందించారు. ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతుండగా అందులోంచి ఒక మహిళ దిగేందుకు ప్రయత్నించింది. రైలులో తమ బంధువులను ఎక్కించి తిరిగి సదరు మహిళ దిగే క్రమంలో రైలు వేగం పుంజుకుంది. ఫుట్‌పాత్ మీద కాలువేయబోయిన మహిళ బోగీ నుంచి జారి బోగీ, ప్లాట్‌ఫామ్ మధ్యన పడబోయింది. అదే ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మహిళ జారిపడుతున్న బోగీ వద్దకు పరుగున వెళ్లి ఆమెను పట్టుకుని ప్లాట్‌ఫామ్ మీదకు లాక్కొచ్చాడు. దీంతో రైలుబోగీ, ప్లాట్‌ఫామ్ అంచున నలిగిపోవాల్సిన మహిళ సురక్షితంగా బయటపడింది. సీసీ పుటేజీల ద్వారా సైఫుద్దీన్ అప్రమత్తతను గుర్తించిన అధికా రులు అతన్ని అభినందించారు. -
యువతి మొబైల్ చోరి చేసి ట్రైన్ నుంచి దూకబోయి..
-
రన్నింగ్ ట్రైన్‌తో ఆటలు..
ఓ యువకుడు సరదాకు చేసిన స్టంట్ ప్రాణాల మీదకు తెచ్చింది. నాందేడ్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో 26 ఏళ్ల యువకుడు చేతులతో రైలు కిటికీ రాడ్డులను పట్టుకొని ఫుట్ బోర్డుపై స్టంట్ చేశాడు. చేతులతో పట్టుకుని కాళ్లు కిందకు చాచి వేలాడాడు. కొద్దిసేపటి తర్వాత కాళ్లు కింద రాళ్లను తగలడంతో చేతులు జారి కిందపడిపోయాడు. వేగంగా వెళ్లే రైలులోంచి యువకుడు రాళ్ల మీద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్‌ఇంట్లో హల్చల్ చేస్తోంది. అయితే యువకుడి విన్యాసాలను చూస్తున్న ప్రయాణికులు రైలు చైన్‌ను లాగి, అతన్ని హెచ్చరించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండకపోయేదని నెటిజన్లు స్పందిస్తున్నారు. మొబైల్లో వీడియోను షూట్ చేసిన ట్రైన్లోనే ఉన్న మరో యువకుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాజికి మాధ్యమాల్లో లైకులు, షేర్ల కోసం యువకులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్టంట్లు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. -
రన్నింగ్ ట్రైన్‌తో సరదా స్టంట్ ఆపై..
-
అతివేగంతో ఉన్న రైలును అందుకోలేక...
సాక్షి, ప్రకాశం : చీరాల రైల్వే స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. అతి వేగంతో ఉన్న రైలు ను ఎక్కేందుకు యత్నించిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడిని దర్శి మండలం సామంతపూడికి చెందిన కడకలుపు వెంకట శివ (18)గా గుర్తించారు. ఆ వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. శివ బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ విభాగంలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అక్కడ హాస్టల్లోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి చెన్త్నెలో జరిగే ఎడ్యుకేషన్ సెమినార్లో పాల్గొనేందుకు బాపట్ల నుంచి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. అయితే మంచినీటి కోసం దిగిన అతను.. రైలు కదులుతుండటం గమనించిన రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలు వేగం ఎక్కువగా ఉండటంతో అతడి కాలు జారడంతో బోగి.. ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో శివ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వెంటనే స్పందించిన స్నేహితులు క్షతగాత్రుడిని చికిత్సకు తరలించేందుకు చీరాల 108 సిబ్బందికి ఫోన్ చేశారు. అప్పటికే వాహనం మరో ప్రాంతానికి వెళ్లి ఉండటంతో చేసేది లేక ఆటోలో చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్.. క్షతగాత్రుడు వెంకట శివను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీఆర్పీ ఎస్ఐ రామిరెడ్డి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు వెంకటాద్రి, సత్యవతితో పాటు తోటి విద్యార్థులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. శోకంలో సన్నిహితులు... ప్రైవేట్ స్కూలు టీచర్‌గా పనిచేసే వెంకటాద్రికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు. వెంకట శివ చివరివాడు. కుటుంబ సభ్యులంతా గారాబంగా చూసుకునేవారు. అతడు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. చదువులో కూడా వెంకట శివ అందరికంటే ముందుండేవాడు. చలాకీగా అందరితో కలసిమెలసి తిరిగేవాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన ఆ కుటుంబానికి కుమారుడి మరణం తీరని లోటు మిగిల్చింది. -
రన్నింగ్ ట్రైన్ నుంచి దిగడానికి ప్రయత్నించి..
-
మెరుపు వేగంతో ప్రాణాలు కాపాడాడు
సాక్షి, ముంబై : మెరుపు వేగంతో, సాహసం ప్రదర్శించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఓ బాలుడి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు. రన్నింగ్ ట్రెయిన్ నుంచి కింద పడిపోయిన బాలుడిని పట్టాల మధ్య పడిపోకుండా రక్షించాడు. ముంబైలోని నైగావ్ రైల్వే స్టేషన్లో ఫ్రిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. అంతలో రైలు కదలగా.. తల్లి ఎక్కేసింది. అయితే తల్లిని అనుసరించే క్రమంలో పిల్లాడు కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య అతను ఇరక్కుపోగా.. అది గమనించిన సునీల్ నాపా అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ చాకచక్యంగా అతన్ని పక్కకు లాగాడు. ఆ బాలుడిని గమనించి ముందు కంపార్ట్మెంట్లో ఉన్న మరో వ్యక్తి సైతం కింద పడటం వీడియోలో గమనించవచ్చు. స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి మరీ బాలుడి ప్రాణాలు కాపాడిన సునీల్ నాపాపై అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మెరుపు వేగంతో వెళ్లి బాలుడి ప్రాణాలు కాపాడాడు
-
కదులుతున్న రైళ్లోనుంచి తోసేశారు
మహబూబాబాద్: కదులుతున్న రైళ్లో నుంచి తోసేయడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌లో శనివారం వెలుగు చూసింది. త్రిపురకి చెందిన సుభుకలోజ్ అనే వ్యక్తి త్రిపుర నుంచి గోహాటి ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు రైళ్లో నుంచి తోసేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. -
అద్భుతం.. అమ్మాయి బతికిపోయింది!
అది ఓ చిన్న రైల్వే స్టేషన్. స్టేషన్లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడ ఓ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉండగా గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. దిక్కుతోచని ఆ బాలిక ట్రాక్‌పై రెండు పట్టాల మధ్య పడుకుండిపోయింది. ఈ హఠాత్పరిణామానికి స్టేషన్లో ఉన్న ప్రయాణికులు షాకయ్యారు. ట్రాక్‌పై ఉన్న బాలిక పరిస్థితి ఏంటని అందరూ కన్నురెప్ప వేయకుండా అటువైపు వెళ్లి చూడసాగారు. గూడ్సు రైలు వెళ్లగానే అక్కడ అద్భుతం జరిగింది. ట్రాక్ మధ్యలో ఉన్న అమ్మాయి లేచి నిల్చుంది. ఏలాంటి గాయం కాలేదు. క్షేమంగా ఉంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు దిగి ఆ అమ్మాయిని ప్లాట్ ఫామ్‌పైకి చేర్చారు. కాగా ఈ అమ్మాయి ఎవరు? ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి కారణమేమి వంటి వివరాలు తెలియరాలేదు. అక్కడున్న ప్రత్యక్షి సాక్షి ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేయగా యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
వెళ్తున్న రైల్లో నుంచి ప్రయాణికుడి తోసివేత
కటిహార్: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడనే కారణంతో వెళ్తున్న రైల్లో నుంచి టీటీఈ (టికెట్ ఎగ్జామినర్) ఓ ప్రయాణికుడిని బయటకు తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిహార్‌లోని కటిహార్ జిల్లా సుదాని రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. గాయపడిన ప్రయాణికుడిని కటిహార్ జిల్లాకు చెందిన అనిల్ నునియాగా గుర్తించారు. నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్న నునియా సుదాని స్టేషన్లో దిగి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు. టీటీఈ టికెట్ చూపించమని అడగ్గా, టికెట్ తన భార్య దగ్గర ఉందని, ఆమె రైల్లో ఉందని నునియా చెప్పాడు. రైల్వే అధికారి వినిపించుకోకుండా వెళ్తున్న రైల్లో నుంచి నునియాను బయటకు తోసేశాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని సంబంధిత టీటీఈని గుర్తించేందుకు విచారిస్తున్నారు. -
కదులుతున్న రైలు ఎక్కబోతూ..
వరంగల్ : కదులుతున్న రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు దాని కిందపడి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో గురువారం చోటుచేసుకుంది. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన మహిళ తన కూతురితో కలిసి వరంగల్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించింది. రైలు వేగం అందుకోవడంతో.. ప్రమాదవశాత్తు దానికింద పడిపోయింది. చివరి నిముషంలో తన చేతిలో ఉన్న చిన్నారిని విసిరేయడంతో.. గాయాలపాలైన చిన్నారి ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.